
సర్కారు వారి పాటతో పాటు మరో మూడు సినిమాలకు కమిట్‌మెంట్ ఇచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. వీటిలో రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు కూడా ఉన్నాయి. నవంబర్ నాటికి సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు మహేష్. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సూపర్ స్టార్ మరో సినిమా కూడా కమిటైనట్లు తెలుస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా మహేష్ బాబు సినిమా ఉండబోతుందని తాజా సమాచారం. సరిలేరు నీకెవ్వరుతో మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాతగా మహేష్ బాబు సినిమా అంటే కచ్చితంగా అంచనాలు మరోలా ఉంటాయి. అయితే ఈ ప్రాజక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment