దేశంలో చిత్రపరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకటి రెండు పెద్ద సినిమాలు మినహా.. ఇతర చిత్రాలేవి పెట్టిన బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకోలేకపోతున్నాయి. బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లను ఈజీగా రాబట్టిన బాలీవుడ్ హీరోలు.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నారు. ఇక టాలీవుడ్‌లో సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నప్పటికీ.. టికెట్ల రేట్లు థియేటర్లకి దూరం చేస్తున్నాయి. అలాగే కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు దూరం కావడానికి ఒక్క కారణమని చెప్పొచ్చు.
(చదవండి: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా ?)
సూపర్ హిట్ చిత్రాలను సైతం నాలుగు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తుండడంతో.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేర్స్‌కి వెళ్లడమే మానేశారు. కొద్ది రోజులు ఆగితే ఓటీటీలో సినిమా చూడొచ్చులే అనే భావన వారిలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు థియేటర్స్ రప్పించడం కోసం నిర్మాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ మధ్యే ఎఫ్3 చిత్రానికి టికెట్లను రేట్లను పెంచకుండా.. ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించే ప్రయత్నం చేశాడు దిల్ రాజు. ఆయన బాటలోనే పలువురు నిర్మాతలు నడిచేందుకు సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే... తాజా పరిస్థితులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడం కోసం సినిమా హీరోలు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం పక్కా కమర్షియల్. తాజాగా ఈచిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లడం గోపిచంద్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. కాస్త సిగ్గు కూడా ఎక్కువే. ఈ మీడియా సమావేశానికి గోపిచంద్‌ని కచ్చింతంగా రప్పించండి అని నేను చెప్పాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగాలేదు. సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు కూడా రావాలి. ఈ మధ్య కాలంలో ఓ పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అలా చేసువాల్సిన పరిస్థతి ఏర్పడింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత హీరోలపైన కూడా ఉంది. ఈ మధ్య ఓటీటీలో చాలా కంటెంట్ దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను ధియేటర్స్‌కు రావాలంటే.. హీరో, హీరోయిన్లు ప్రచారంలో పాల్గొనాలి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా హీరో, హీరోయిన్లు వచ్చి తమ సినిమాను ప్రచారం చేసుకోవాలి. మమల్ని(నిర్మాతలను) చూసి ప్రేక్షకులను థియేటర్స్‌కు రారు. హీరో హీరోయిన్లను చూసే వస్తారు’అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ మీట్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కర్నూలులో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్ తొలిసారిగా స్టేజ్‌పై స్టెప్పులేసి ఫ్యాన్స్ అలరించాడు. అల్లు అరవింద్ పరోక్షంగానే మహేశ్‌బాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment