మెగా బ్యానర్‌లో మహేష్! | Mahesh Babu Movie With Geetha Arts Banner | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 13 2018 2:30 PM | Last Updated on Thu, Dec 13 2018 2:30 PM

Mahesh Babu Movie With Geetha Arts Banner - Sakshi

సూపర్‌ స్టార్‌మహేష్ బాబుతో సినిమా నిర్మించేందుకు స్టార్‌ ప్రొడ్యూసర్‌లు కూడా క్యూలో ఉంటారు. అందుకే త్వరలో మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ కూడా మహేష్‌ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో ఉన్న మహేష్ తరువాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పారు. ఆ సినిమా తరువాత అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు.

అయితే సందీప్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను అల్లు అరవింద్‌ నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. తరుచూ సందీప్‌, మహేష్‌లు కలిసి కనిపిస్తుండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే ఉంటుందన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ను మెగా బ్యానర్‌లో నిర్మిస్తే మరింత హైప్‌ క్రియేట్‌ అవుతుందంటున్నారు ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement