'యానిమల్‌'కు మహేశ్‌ సెట్‌ అవుతాడు, తనతో సినిమా..: దర్శకుడు | Sandeep Reddy Vanga About His Movie with Mahesh Babu | Sakshi
Sakshi News home page

Sandeep Reddy Vanga: యానిమల్‌ కథ మహేశ్‌కు చెప్పలేదు.. కానీ అంతకన్నా వయలెంట్‌ కథ..

Published Mon, Nov 27 2023 6:00 PM | Last Updated on Mon, Nov 27 2023 6:20 PM

Sandeep Reddy Vanga About His Movie with Mahesh Babu - Sakshi

సందీప్‌ రెడ్డి వంగా.. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఈ పేరొక ప్రభంజనం. ఆయన ఇప్పటివరకు చేసింది రెండు సినిమాలే అయినా ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. 2017లో విజయ్‌ దేవరకొండను హీరోగా పెట్టి అర్జున్‌ రెడ్డి సినిమా తీశాడు సందీప్‌. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇదే చిత్రాన్ని హిందీలో 'కబీర్‌ సింగ్‌'గా రీమేక్‌ చేశాడు. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. మళ్లీ ఎప్పటిలాగే గ్యాప్‌ తీసుకున్నాడు. సుమారు నాలుగేళ్ల తర్వాత యానిమల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ చిత్రానికి దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగానూ వ్యవహరించాడు. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. డిసెంబర్‌ 1న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో దుమ్ము దులిపేసింది. తాజాగా ఓ కార్యక్రమంలో దర్శకుడు సందీప్‌ రెడ్డికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

యానిమల్‌ మూవీని తెలుగులో చేయాల్సి వస్తే ఏ హీరోను సెలక్ట్‌ చేసుకుంటారు? అని ఓ విలేఖరి అడిగాడు. దీనికి సందీప్‌ స్పందిస్తూ.. మహేశ్‌బాబు అని చెప్పారు. 'మహేశ్‌బాబుకు నేను డెవిల్‌ సినిమా స్క్రిప్ట్‌ చెప్పాను. అది ఇంకా ఎక్కువ వయలెంట్‌గా ఉంటుంది. కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్‌ కుదరలేదు' అని దర్శకుడు పేర్కొన్నాడు.

చదవండి: నా కూతురు సహజీవనం చేస్తానంటే బలవంతంగా మొదటి పెళ్లి చేశా.. నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement