
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. డిఫరెంట్ హీరోయిజాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇతడు.. పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ సృష్టించాడు. అయితే ఇతడి లేటెస్ట్ మూవీ 'యానిమల్'ని ఎంతలా బాగుందని మెచ్చుకున్నారో అంతే ఘోరంగా విమర్శించారు. మరీ ముఖ్యంగా తమిళ సెలబ్రిటీలు అందరూ 'యానిమల్' చిత్రాన్ని, సందీప్ రెడ్డి వంగాపై దారుణమైన కామెంట్స్ చేశారు. స్టార్ హీరో శివ కార్తికేయన్ మాత్రం తాజాగా ఓ కార్యక్రమంలో వీళ్లందరితో పోలిస్తే భిన్నంగా మాట్లాడాడు.
(ఇదీ చదవండి: సెట్‌లో ఎవరు అలా చేసిన బాలకృష్ణ తట్టుకోలేడు: ప్రముఖ తమిళ దర్శకుడు)
రెండే సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పలు ఈవెంట్స్‌కి అతిథిగా హాజరవుతూ బిజీగా ఉన్నాడు. ఇలానే తమిళనాడులో తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. వీటిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడింది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
'సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ నాకా చాలా నచ్చుతుంది. సినిమాలో ఆయన మ్యూజిక్‌ని ఉపయోగించుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. 'యానిమల్' చూసేటప్పుడు నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆయన సినిమాల కంటే ఆయనిచ్చే ఇంటర్వ్యూలకే నేను అభిమానిని. సమాధానాలు చెప్పే విషయంలో చాలా ముక్కుసూటిగా ఉంటారు' అని శివకార్తికేయన్ స్టేజీపైనే చెప్పుకొచ్చాడు. దీంతో సందీప్‌పై విమర్శలు చేస్తున్న తమిళ సెలబ్రిటీలు అందరికీ చెప్పుతో కొట్టినట్లయింది.
(ఇదీ చదవండి: పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు)
#Sivakarthikeyan: Tamil actor Siva Karthikeyan expressed his love for Sandeep Reddy Vanga's work and music. Probably, the first actor outside telugu states to come front and appreciate the film, if I'm not wrong !pic.twitter.com/sycq7JxWwJ
— Movies4u (@Movies4uOfficl) March 5, 2024