సెలబ్రిటీలపై ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కొందరు చూసీ చూడనట్లు ఉంటారు. కొందరేమో అగ్గి మీద గుగ్గిలమవుతారు. మరికొందరేమో కోపమొచ్చినా, బాధేసినా మనసులోనే దాచుకుంటారు. అలా ఒకప్పటి పాపులర్ హీరో మోహన్ మీద అప్పట్లో పెద్ద తప్పుడు ప్రచారం జరిగింది. అతడికి ఎయిడ్స్ ఉందని ఎవరో వదంతులు సృష్టించారు. ఇంకేముంది.. ఇది నిజమేనని చాలామంది వార్తలు రాసేశారు. దశాబ్దాల తర్వాత ఆ తప్పుడు వార్తలపై స్పందించాడు.
ఎయిడ్స్ ఉందని ప్రచారం..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. '90'స్‌లో సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు నాకు ఎయిడ్స్ అని ప్రచారం చేశారు. ఇది విని నా అభిమానులు ఆందోళన చెందారు. కుటుంబం సైతం ఇబ్బందిపడింది. కానీ ఆ సమయంలో నాకు ఎంతో అండగా నిలిచింది. నాకు ఎయిడ్స్ లేదని మీడియాకు క్లారిటీ ఇవ్వమని ఓ జర్నలిస్టు సలహా ఇచ్చాడు. నేనందుకు ఒప్పుకోలేదు.
స్పందించేందుకు ఇష్టపడని హీరో
ఈ పుకారు సృష్టించేదే మీడియా.. కాబట్టి వాళ్లంతట వాళ్లే ఇది తప్పని చెప్పాలని మొండిగా వ్యవహరించాను. ఏ సంబంధమూ లేని నన్ను బలి చేసినప్పుడు పనికి మాలిన పుకారు గురించి స్పందించాల్సిన అవసరం నాకేంటని సైలెంట్‌గా ఉన్నాను. అప్పుడు నా భార్య, కుటుంబం నాకెంతో అండగా నిలబడింది' అని చెప్పుకొచ్చాడు.
రెండో సినిమాకే బ్రహ్మరథం
కాగా మోహన్.. 1980వ సంవత్సరంలో మూడు పని అనే తమిళ చిత్రంతో వెండితెరపై ప్రయాణం ఆరంభించాడు. తన రెండో సినిమా నేంజతై కిల్లతే ఏడాదిపాటు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఆడటంతో పాటు మూడు జాతీయ అవార్డులు అందుకుంది. అక్కడి నుంచి మోహన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
సిల్వర్ జూబ్లీ హీరో
ఆయన సినిమాలు ఏడాదిపాటు సక్సెస్‌ఫుల్‌గా ఆడటం సర్వసాధారణం కావడంతో తనను సిల్వర్ జూబ్లీ హీరో అని పిలిచేవారు. ఈయన తెలుగులో తూర్పు వెళ్లే రైలు, శ్రవంతి, అనంత రాగాలు, ఆలాపన, చూపులు కలిసిన శుభవేళ, అబ్బాయితో అమ్మాయి వంటి చిత్రాల్లో నటించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన జూన్ 7న విడుదలైన హర (తమిళ) చిత్రంతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: హీరోయిన్ కాకపోయుంటే ఏం చేసేదాన్నంటే?: ప్రియాంక మోహన్
Comments
Please login to add a commentAdd a comment