హీరోయిన్లు.. ఏ భాషలో అవకాశం వస్తే అక్కడ నటించేస్తారు. అలా ఒక్క తమిళ సినిమానే తీసుకుంటే హిందీ, మలయాళ, తెలుగు, గుజరాత్, కన్నడ, మరాఠీ భాషలకు చెందిన హీరోయిన్లు ఇక్కడ కథానాయికలుగా నటించేస్తున్నారు. కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా ఇతర భాష(కన్నడ)కు చెందిన నటే అన్నది గమనార్హం. మరో బ్యూటీ ప్రియాంక మోహన్.. మాతృభాష కన్నడలో నటించిన తరువాత తెలుగులో గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
కోలీవుడ్ నుంచి పిలుపు
ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా, కోలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ శివకార్తికేయన్ సరసన డాక్టర్, డాన్ చిత్రాల్లో వరుసగా నటించి విజయాలను అందుకున్నారు. అలాగే ఎదర్కుం తునిందవన్ చిత్రం ద్వారా సూర్యతో జత కట్టే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం నిరాశపరిచినా, ఈ మధ్య ధనుష్‌తో కలిసి నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న ప్రియాంక మోహన్ ఓ ఇంటర్వ్యూలో తాను ఇంజినీరింగ్ విద్యార్థిని అని చెప్పారు.
సినీరంగంలో ఎంట్రీ
చదువు పూర్తయిన తరువాత ఒక మంచి ఉద్యోగంలో చేరాలన్నదే తన కల అన్నారు. తాను సినీరంగంలోకి ప్రవేశించాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అందుకోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పారు. నటిని కాకుంటే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్నని తెలిపారు. ఇకపోతే తనకు నచ్చిన నటుడు రజనీకాంత్ అని చెప్పారు. ఆయన నటనతో పాటు తన సింప్లిసిటీ చాలా నచ్చుతుందన్నారు. ఏదో ఒక రోజు ఆయన్ని కలిసే అవకాశం రాకపోతుందా? అని ఎదురు చూస్తున్నానని నటి ప్రియాంక మోహన్ పేర్కొన్నారు.
చదవండి: ఈ సినిమాతో టాలీవుడ్ నాకు మెట్టినిల్లు అయిపోయింది: జ్యోతి రాయ్
Comments
Please login to add a commentAdd a comment