Priyanka Arul Mohan
-
దుల్కర్ సల్మాన్‌కు జోడీగా ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ బ్యూటీ
సినిమాకు హద్దులు చెరిగి చాలా కాలమే అయ్యింది. భాషాభేదం చూడకుండా టాలెంట్ ఉంటే భారతీయ సినిమాలోనే కాదు ప్రపంచ సినిమలోనూ ఎవరైనా నటించవచ్చు. ఇక ఇటీవల శాండిల్‌వుడ్ తారల విస్తరణ బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. పలువురు కన్నడ బ్యూటీలు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి స్టార్స్‌గా వెలిగిపోతున్నారు. కాగా ఇప్పుడు నటి ప్రియాంక మోహన్ కూడా దక్షిణాది స్టార్‌గా ముద్ర వేసుకుంటున్నారు. ఈ కన్నడ భామ 2019 కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. మాతృభాషలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ నటిస్తూ ఐదేళ్లలోనే తన కంటూ ఒక స్థానాన్ని సంపాందించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో నాని గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చి సరిపోదా శనివారం చిత్రంతో హిట్ అందుకున్నారు. ఇక తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. అలాగే డాన్ చిత్రంలో శివకార్తికేయన్‌తో రెండో సారి జత కట్టి మరో విజయాన్ని అందుకున్నారు. ఆ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించిన ప్రశంసలు అందుకున్న ప్రియాంక మోహన్ తాజాగా ధనుష్ దర్శకత్వం వహించిన నిలావుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యేక పాటలో మెరిశారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా ఇటీవల నటుడు జయంరవితో జత కట్టిన బ్రదర్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ప్రియాంక మోహన్‌కు అవకాశాలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీకి నటుడు దుల్కర్సల్మాన్ చాన్స్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఇటీవల లక్కీ భాస్కర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఈయన మాతృభాషలో కథానాయకుడిగా నటిస్తూ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి ఆర్డీఎక్స్ చిత్రం ఫేమ్ నకాశ్ హిదాయత్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందులో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటి ప్రియాంక మోహన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే కోలీవుడ్ వెర్సస్టైల్ యాక్టర్ ఎస్జే.సూర్య కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించనున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇందులో నటి ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తే ఇదే ఈమె తొలి మలయాళ చిత్రం అవుతుంది. -
నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్.. తమిళంలోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేస్తోంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ 'బ్రదర్'. జయం రవి హీరో. కొన్నిరోజుల క్రితం తమిళ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎలాంటి హడావుడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ 'బ్రదర్' సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?అక్కా తమ్ముళ్ల ఫ్యామిలీ డ్రామా స్టోరీలతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ మూవీనే 'బ్రదర్'. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే.. రూ.5 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కంటెంట్ మరీ రొటీన్‌గా ఉండటమే దీనికి కారణం. స్టార్ యాక్టర్స్ బోలెడంతమంది ఉన్నాసరే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)దీన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తమిళ రిజల్ట్ చూసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. జీ5లో ప్రస్తుతం తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టముంటే దీనిపై లుక్కేయొచ్చు.'బ్రదర్' విషయానికొస్తే.. అన్యాయాన్ని తట్టుకోలేని కార్తి (జయం రవి), తనతో పాటు కుటుంబాన్ని కూడా తలనొప్పిగా మారతాడు. న్యాయం కావాలని గొడవలు పడే ఇతడితో.. లా డిగ్రీ చేయిస్తే అయినా సరే బాగుపడతాడేమోనని తండ్రి భావిస్తాడు. కానీ అక్కడా నిరాశే. కనీసం అక్క ఆనంది(భూమిక) దగ్గరకు పంపిస్తే బాగుపడతాడేమోనని ఆశపడతారు. కానీ కార్తి వల్ల వాళ్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. చివరకు వీటిని కార్తి ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
యాక్టింగ్ రాదని ట్రోల్స్.. కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్.. లక్కీ హీరోయిన్ (ఫొటోలు)
-
ముత్యం లాంటి నవ్వుతో ప్రియాంక మోహన్.. చూస్తే ఫిదానే! (ఫొటోలు)
-
స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ఏమందంటే?
కొన్నిరోజుల క్రితం తమిళ హీరో జయం రవి విడాకులు తీసుకున్నాడు. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిపోయిందని ఇతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చారు. ఇదలా ఉంచితే జయం రవి.. హీరోయిన్ ప్రియాంక మోహన్ని నిశ్చితార్థం చేసుకున్నాడనే రూమర్‌తో పాటు దండలతో ఉన్న ఫొటో కూడా వైరల్ అయింది. దీంతో అందరూ అది నిజమే అనుకున్నారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)అయితే అది 'బ్రదర్' సినిమాలోనిది అని తేలింది. జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ తమిళ మూవీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియాంక.. ఎంగేజ్మెంట్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.'జయం రవి, నేను కలిసి 'బ్రదర్' సినిమా చేశాం. ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. అందులో మేమిద్దరం మెడలో దండలు వేసుకుని ఉంటాం. దీంతో వెంటనే వైరల్ అయిపోయింది. అది చూసి మేం నిజంగానే నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది అనుకున్నారు. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఇది నా దృష్టికి రాలేదు. ఆ ఫొటో నిజమే అనుకుని టాలీవుడ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు విషయం తెలిసి అది సినిమాలో స్టిల్ అని క్లారిటీ ఇచ్చా. రిలీజ్ చేయడానికి వేరే ఫొటో ఏం దొరకలేదా అని మూవీ టీమ్‌ని తిట్టుకున్నా' అని ప్రియాంక మోహన్ చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రియాంక చెప్పింది. అయితే జయం రవి విడాకుల చర్చ ఓ వైపు నడుస్తుండగానే ఈ ఫొటో వైరల్ అవడం దీనికి కారణమైంది. ఏదైతేనేం మూవీ ప్రమోషన్‌కి ఇది కాస్తోకూస్తో పనికొచ్చినట్లు ఉంది. (ఇదీ చదవండి: నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్) -
ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్
నటి ప్రియాంక మోహన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంది. ఈ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోగా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.రీసెంట్గా సరిపోదా శనివారం చిత్రంతో ప్రియాంక మోహన్‌కు మరింత పాపులారిటీ పెరిగింది. అయితే, తొర్రూరులో రీసెంట్గా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు ఆమె వెల్లింది. అయితే, ఆమె స్టేజీ మీదకు చేరుకోగానే చాలామంది ఒక్కసారిగా అక్కడకు చేరిపోయారు. దీంతో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది. అయితే, ఈ ప్రమాదం నుంచి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడింది.ఇదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హానుమండ్ల ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరబాద్‌కు తరలించినట్లుగా తెలుస్తుంది. గాయపడిన ఝాన్సి రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినికి అత్త అవుతారనే విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి ప్రియాంకా మోహన్ స్పందించింది. తాను స్వల్ప గాయాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ఘటనలో గాయిపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. Actress #PriyankaMohan narrowly escapes harm as the stage collapses during the Kasam Shopping Mall inauguration in Thorrur town Palakurthy mla @YJR_INC injured 🤕 pic.twitter.com/CpPct7EqA3— 000009 Aarathi (@ui000009) October 3, 2024 -
అభిమాని అయితే ఇలా ప్రవర్తిస్తాడా: ప్రియాంక మోహన్
సినీ నటీమణుల జీవితం అద్దాల మేడ లాంటిది అంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు కూడబెట్టిన ప్రముఖ నటీమణులు కూడా అప్పుడప్పుడు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వీరిని అభిమానించే ఆరాధించే అభిమానులతో కూడా అవస్థలు ఎదురవుతుంటాయి. రీసెంట్గా నానితో సరిపోదా శనివారం చిత్రంతో ఈ బ్యూటికి మంచి గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలో ఎదుగుతున్న ప్రియాంక మోహన్.. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఈ కన్నడ భామ మొదట్లో గ్లామరస్ పాత్రలోనూ నటించారు. అలా ఆమె వెండి తెరపై అందాలను ఆరబోసిన చిత్రం టిక్ టాక్. ఆమె లక్కు ఏమిటంటే తమిళంలో టిక్ టాక్ తొలి చిత్రం అయినా, మొదట విడుదలైన చిత్రం శివకార్తికేయన్‌తో జత కట్టిన డాక్టర్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం అలా శివకార్తీకేయన్ సరసన డాన్ అనే మరో చిత్రంలో నటించి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సూర్యకు జంటగా ఎదర్కుమ్ తునిందన్ (ఈటీ), ధనుష్‌తో కలిసి కెప్టెన్ మిల్లర్ చిత్రాలు నటించారు. ఇటీవల తెలుగులో నటించిన సరిపోదా శనివారం చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. కాగా తాజాగా జయం రవితో జతకట్టిన బ్రదర్ చిత్రం దీపావళికి విడుదలకు కానుంది. మరికొన్ని చిత్రాలు చేతిలో ఉన్న ప్రియాంక మోహన్ తాజాగా మరోసారి చర్చలోకి ఎక్కారు. 'బ్రదర్' అనే తమిళ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక మోహన్.. సెల్ఫీ కోసం యత్నించిన ఒక అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన అక్కడ పెద్ద కలకలానికి దారి తీసింది. ఈ వ్యవహారం గురించి నటి శరణ్యతో ప్రియాంక మోహన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఆమె పేర్కొంటూ అతను చాలా రోజులుగా తనను ఇంటి వరకు ఫాలో అవుతూ వచ్చేవాడిని చెప్పారు. బ్రదర్ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం రోజున కూడా అతను తన గ్రూప్‌తో స్థానిక వెలచ్చేరిలోని ఫినిక్స్ మాల్ నుంచి తనను ఫాలో అవుతూ వచ్చేవాడిని చెప్పారు. అభిమాని అయితే ఇలా ప్రవర్తిస్తాడా అంటూ మండిపడ్డారు. -
చీరలో మీనాక్షి అందం.. ఐదేళ్లయినా మర్చిపోని ప్రియాంక!
అందాల నిధి అగర్వాల్.. చూపు తిప్పడం కష్టమేభర్తతో కలిసి హీరోయిన్ కీర్తి పాండియన్ స్మైలీ పోజులు'గ్యాంగ్ లీడర్' మూవీకి ఐదేళ్లు.. ప్రియాంక థ్యాంక్యూ పోస్ట్హాట్నెస్ పెంచేసిన తెలుగు బ్యూటీ అషూరెడ్డికోహ్లీతో ఫొటో.. తెగ ఆనందపడిపోతున్న నటి రాధికచీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న మీనాక్షి చౌదరినడుము అందాలు చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Keerthi Pandiyan (@keerthipandian) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
‘సరిపోదా శనివారం’ మూవీ థాంక్స్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సితార బర్త్ డే విషెస్.. డ్యాన్స్ ఇరగదీసిన తెలుగు సింగర్
అన్న గౌతమ్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన సితారవరలక్ష్మి వ్రతం చేసిన బిగ్ బాస్ స్రవంతిపీరియడ్స్ టైంలో ఆకలి గురించి అనసూయ పోస్ట్చీరలో అందాలతో మత్తెక్కించేలా ప్రియాంక మోహన్డ్యాన్స్ ఇరగదీసిన సింగర్ శ్రావణ భార్గవిసెల్ఫీలతో మెంటలెక్కించేస్తున్న థిన్ బ్యూటీ మిథిలా పాల్కర్ముద్దొచ్చేలా సెల్ఫీలు తీసి పోస్ట్ చేసిన సుప్రీత View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) View this post on Instagram A post shared by avantika (@avantika) View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) View this post on Instagram A post shared by Sangeerthana (@sangeerthana__vipin) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Kavya Manohar Shetty (@kavyashettyofficial) View this post on Instagram A post shared by VB🤍 (@vedikabhandari) -
రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!
టైటిల్: 'సరిపోదా శనివారం' నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులునిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరిరచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మురళి జిఎడిటర్: కార్తీక శ్రీనివాస్విడుదల తేది: ఆగస్ట్ 29, 2024కథేంటంటే.. సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా ఆరు రోజులు ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ.. తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ల భరతం పడతాడు. కట్ చేస్తే.. దయానంద్ అలియాస్ దయా(ఎస్జే సూర్య) క్రూరమైన పోలిస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు.. సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. దయా చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత(ప్రియాంక అరుల్ మోహన్). తన పైఅధికారి కావడంతో అతన్ని ఏమి చేయలేక.. సోకులపాలెం ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు సూర్య కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోకులపాలెం ప్రజలను దయా నుంచి విముక్తి కల్పించేందుకు సూర్య, చారులత కలిసి వేసిన ప్లాన్ ఏంటి? శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య.. క్రూరమైన సీఐ దయాను ఎలా ఎదిరించాడు? దయాకు సోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు? చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్య మరదలు కల్యాణికి చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు సోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని విలన్ పట్టి పీడిస్తుంటాడు. అతను చేసే అన్యాయాలను ఎదిరించి, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి హీరో వస్తాడు. తనకు సంబంధం లేకున్నా.. వారికి అండగా నిలిచి చివరకు విలన్ నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.. ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కథ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుండా.. కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కొట్టడం ఈ సినిమా స్పెషల్. అంతకు మించి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్లోనే కథ ఏంటో చెప్పి ముందే ఆడియెన్స్ మైండ్ సెట్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పేందుకు ప్రయత్నం చేయలేదు కానీ.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్మూలతో పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్లో కథనాన్ని నడిపించాడు. మొదలు.. మలుపు... దాగుడు మూతలు.. ముగింపు అంటూ కథను విడదీసి చెప్పాడు. నాని, ఎస్జే సూర్యల నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా(174 నిమిషాలు) ఉండడం, ఊహకందేలా కథనం సాగడం ఉండడం సినిమాకు మైనస్. హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణం సినిమా ప్రారంభంలోనే చూపించి.. ఆడియన్స్ మైండ్‌ని సెట్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు సూర్యకు, మరోవైపు సీఐ దయాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ..వీరిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో మొత్తం నాని-సూర్యల చుట్టే కథనం సాగుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగినా..నాని, సూర్యలు తమ నటనతో బోర్ కొట్టకుండా చేశారు. కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా ఓ డిఫరెంట్ పాత్ర చేశాడు. వారం మొత్తం ప్రశాంతంగా ఉండి.. ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శించే యువకుడు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రం బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐ దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. సూర్య పాత్రను మలచిన తీరు..అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర గుర్తిండిపోతుంది. ఇక కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక అరుళ్ మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సాయి కుమార్, కార్పెరేటర్ కుర్మానంద్గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాని ‘సరిపోదా శనివారం’ మూవీ స్టిల్స్
-
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫోటోలు)
-
గోల్డెన్ స్పారో
నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్, ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ‘గోల్డెన్ స్పారో’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలోనే ప్రియాంక, జీవీ ప్రకాష్ అతిథులుగా కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు: హీరో నాని
‘‘ఈ మధ్య కొన్ని చోట్ల గమనించాను. ఏంటి సార్... కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమాలకు రావడం లేదంటున్నారు. మంచి సినిమాలు ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు సార్. వస్తూనే ఉంటారు. మనమే అప్పుడప్పుడు మిస్ అవుతుంటాం. ఈసారి మిస్ అయ్యేదే లేదు. డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కు ఏదైనా మాట చెప్పాల్సి వస్తే మనదో సామెత ఉంది. ‘కలిసొచ్చే కాలం వస్తే... నడిచొచ్చే సినిమా వస్తుంది’’ అంటారు కదా. సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు... థియేటర్స్‌కు పోతారు’’ అని నాని అన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘దయా పాత్రను మేం ఊహించినదానికన్నా ఎక్కువగా చేశారు ఏస్జే సూర్యగారు. దానయ్యగారు పాజిటివ్ పర్సన్ . అందుకే మంచి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిర్మాత కల్యాణ్‌కు ఈ సినిమా ట్రైనింగ్ గ్రౌండ్ అనుకోవచ్చు. వివేక్ ఆత్రేయ శివతాండవం ఏంటో థియేటర్స్‌లో చూస్తారు. ఈ సినిమా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ!’ సినిమా రిలీజ్ డే రోజు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కొందరు ల్యాగ్ అన్నారు. మరికొందరు బాగుంది అన్నారు. అయితే నానీగారు నాకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. చాన్స్ అన్నది చాలా చిన్న పదం. నానీగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు’’ అని తెలిపారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘కథల ఎంపికలో నానీగారు నంబర్ వన్ . కథ నచ్చితే కొత్త దర్శకులకూ అవకాశం ఇస్తారు. నానీగారితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. సాధారణంగా నేను ఏ సినిమా వేదికపైనా ఇంత మాట్లాడలేదు. సినిమా మాట్లాడిస్తుంది. ‘సరిపోదా శనివారం’ సినిమా చూశాను. పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ ఓ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు’’ అని చెప్పారు. ‘‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పాను. తెలుగు ప్రేక్షకుల కోసం సొంత డబ్బింగ్ చెప్పాను’’ అని వెల్లడించారు ఎస్జే సూర్య. ‘‘సూర్య (నాని పాత్ర), చారులత (ప్రియాంక పాత్ర)లను గుర్తు పెట్టుకుంటారు’’ అని తెలిపారు ప్రియాంకా అరుళ్. ‘‘నాని కష్టపడి స్టార్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై మన ఖ్యాతి చాటారు డీవీవీ దానయ్య, రాజమౌళిగార్లు’’ అని పేర్కొన్నారు నటుడు అలీ. అతిథులుగా పాల్గొన్న దర్శకులు దేవా కట్టా ప్రశాంత్ వర్మ , శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. నాని తండ్రి రాంబాబు, సంగీత దర్శకుడు జేక్స్, కెమెరామేన్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని
టాలీవుడ్ హీరో నాని.. కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఇతడి కూడా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఉంది. వీళ్లిద్దరూ జంటగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శ్రీవారిని దర్శించుకున్నారు.(ఇదీ చదవండి: విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?)శుక్రవారం రాత్రి తిరుపతి చేరుకున్న నాని కుటుంబం.. అలిపిరి మెట్ల మార్గాన తిరుమల చేరుకున్నారు. కొండపైన రాత్రి బస చేసి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొక్కులు కూడా చెల్లించుకున్నారు. దర్శనానంతరం బయటకు రాగా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్) -
హీరో నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది: నాని
‘‘హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. ఈ థియేటర్లో మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) కలసి ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ లాంచ్ వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది. మీ ప్రేమను నాపై ఇలానే చూపిస్తూ ఉంటే వంద శాతం కష్టపడి మరిన్ని మంచి చిత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని హీరో నాని అన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘29న థియేటర్స్‌లో ‘సరిపోదా శనివారం’ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘చాలా మంచి కంటెంట్ ఉన్న చిత్రం ఇది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘గ్యాంగ్ లీడర్’ సినిమా తర్వాత నానీగారితో ‘సరిపోదా శనివారం’ చేశాను. అందరూ కుటుంబంతో వెళ్లి మా సినిమా చూడండి’’ అని ప్రియాంకా అరుళ్ మోహన్ చెప్పారు. ‘‘మా సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది’’ అన్నారు డీవీవీ దానయ్య. -
కార్తీతో.. ముగ్గురు భామలు?
దక్షిణాది స్టార్స్‌లో నటుడు కార్తీ ఒకరు. ఇప్పటికి 25 చిత్రాలను పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. వాటిలో మెయ్యళగన్ చిత్రం, వా వాద్ధియార్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సర్ధార్– 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈయన ఇంతకు ముందు నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన సర్ధార్ చిత్రానికి సీక్వెల్. సర్ధార్ చిత్రం 2022లో విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. కాగా కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రంలో నటి రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగానూ నటి లైలా ముఖ్య పాత్రలోనూ నటించారు.ఆ చిత్ర దర్శకుడు పీఎస్.మిత్రన్‌నే సర్ధార్– 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సర్ధార్ చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్.లక్ష్మణన్‌నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా పోతే ఇందులో సర్ధార్ చిత్రంలో నటించిన రాశీఖన్నా, గానీ, రజీషా విజయన్ గానీ,లైలా గానీ నటించడం లేదు. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్రల కోసం నటి ప్రియాంక మోహన్, మాళవిక మోహన్, ఆషికా రఘునాథ్‌ను నటింపజేయడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, జార్జ్ సీ.విలియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో సర్ధార్ చిత్రం కంటే మరింత భారీగా సర్ధార్– 2 రూపొందుతోందన్నమాట. కాగా నటుడు కార్తీ ఈ మూడు చిత్రాల్లోనూ ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యభరిత కథా పాత్రల్లో కనిపిస్తుండడం గమనార్హం. -
Priyanka Arul Mohan: కైపెక్కించే చూపులతో కుర్రాళ్లను ఆగం చేస్తున్న ప్రియాంక మోహన్ (ఫోటోలు)
-
ముంగురులతో హీరోయిన్ ప్రియాంక మోహన్.. క్యూట్‌నెస్ వేరే లెవల్ (ఫొటోలు)
-
Priyanka Arul Mohan: సీతాకోకచిలుకలా మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
-
హీరోయిన్ కాకపోయుంటే ఏం చేసేదాన్నంటే?: ప్రియాంక మోహన్
హీరోయిన్లు.. ఏ భాషలో అవకాశం వస్తే అక్కడ నటించేస్తారు. అలా ఒక్క తమిళ సినిమానే తీసుకుంటే హిందీ, మలయాళ, తెలుగు, గుజరాత్, కన్నడ, మరాఠీ భాషలకు చెందిన హీరోయిన్లు ఇక్కడ కథానాయికలుగా నటించేస్తున్నారు. కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా ఇతర భాష(కన్నడ)కు చెందిన నటే అన్నది గమనార్హం. మరో బ్యూటీ ప్రియాంక మోహన్.. మాతృభాష కన్నడలో నటించిన తరువాత తెలుగులో గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కోలీవుడ్ నుంచి పిలుపుఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా, కోలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ శివకార్తికేయన్ సరసన డాక్టర్, డాన్ చిత్రాల్లో వరుసగా నటించి విజయాలను అందుకున్నారు. అలాగే ఎదర్కుం తునిందవన్ చిత్రం ద్వారా సూర్యతో జత కట్టే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం నిరాశపరిచినా, ఈ మధ్య ధనుష్‌తో కలిసి నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న ప్రియాంక మోహన్ ఓ ఇంటర్వ్యూలో తాను ఇంజినీరింగ్ విద్యార్థిని అని చెప్పారు.సినీరంగంలో ఎంట్రీచదువు పూర్తయిన తరువాత ఒక మంచి ఉద్యోగంలో చేరాలన్నదే తన కల అన్నారు. తాను సినీరంగంలోకి ప్రవేశించాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అందుకోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పారు. నటిని కాకుంటే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్నని తెలిపారు. ఇకపోతే తనకు నచ్చిన నటుడు రజనీకాంత్ అని చెప్పారు. ఆయన నటనతో పాటు తన సింప్లిసిటీ చాలా నచ్చుతుందన్నారు. ఏదో ఒక రోజు ఆయన్ని కలిసే అవకాశం రాకపోతుందా? అని ఎదురు చూస్తున్నానని నటి ప్రియాంక మోహన్ పేర్కొన్నారు.చదవండి: ఈ సినిమాతో టాలీవుడ్ నాకు మెట్టినిల్లు అయిపోయింది: జ్యోతి రాయ్ -
సమ్మర్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక మోహన్
సమ్మర్ వచ్చిందంటే సినీ తారల్లో చాలా మంది విదేశీ ట్రిప్‌కు రెడీ అయిపోతారు. అలాంటి ట్రిప్‌ను నటి ప్రియాంక మోహన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషతోపాటు, తెలుగు, తమిళం భాషల్లోనూ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. తెలుగులో 'నాని' సరసన 'గ్యాంగ్‌లీడర్' చిత్రంలో నటించిన ఈమె ఆ తరువాత తమిళంలో శివకార్తీకేయన్‌కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్ కావడంతో ఈ వెంటనే నటుడు సూర్యకు జంటగా ఎదుర్కు తుణిందవన్ (ET) చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రియాంక మోహన్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తొలి రోజుల్లో పక్కింటి అయ్యాయి ఇమేజ్ను తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు గ్లామరస్ ఫొటోలతో హల్చల్ చేస్తూ అలాంటి పాత్రలకు రెడీ అనే సిగ్నల్‌ను పంపుతున్నారు. కాగా ప్రస్తుతం మరోసారి తెలుగులో నాని సరసన సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో యువ నటుడు కవిన్‌తో జత కట్టే అవకాశం తలుపు తట్టింది. ఇలా నటిగా బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ ప్రస్తుతం సమ్మర్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏ దేశంలో ఉన్నారో గానీ అక్కడ దిగిన ఫొటోలను సామాజక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
Priyanka Arul Mohan Photos: ఈ గ్లామర్ సరిపోదా అంటూ ఊపేస్తున్న హీరోయిన్ (ఫోటోలు)