గోల్డెన్ స్పారో | Nilavukku En Mel Ennadi Kobam first single titled Golden Sparrow | Sakshi
Sakshi News home page

గోల్డెన్ స్పారో

Published Tue, Aug 27 2024 12:02 AM | Last Updated on Tue, Aug 27 2024 12:07 AM

Nilavukku En Mel Ennadi Kobam first single titled Golden Sparrow

నటుడు, దర్శక–నిర్మాత ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్  మేల్‌ ఎన్నడి కోబమ్‌’. ఈ రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్‌ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్‌ మీనన్ , రమ్య రంగనాథన్  లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 

కాగా ఈ చిత్రంలో హీరోయిన్  ప్రియాంకా అరుల్‌ మోహన్, ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ‘గోల్డెన్  స్పారో’ అనే పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 30న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ పాటలోనే ప్రియాంక, జీవీ ప్రకాష్‌ అతిథులుగా కనిపించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. ‘నిలువుక్కు ఎన్  మేల్‌ ఎన్నడి కోబమ్‌’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement