Is Priyanka Arul Mohan Not Joins In Rajinikanth Jailer Movie, Here Is Why - Sakshi
Sakshi News home page

Priyanka Mohan: రజనీ చిత్రం నుంచి తప్పుకున్న హీరోయిన్‌! డైరెక్టర్‌తో మనస్పర్థలే కారణమా?

Published Mon, Sep 19 2022 8:55 AM | Last Updated on Mon, Sep 19 2022 9:35 AM

Is Priyanka Arul Mohan Not Joins In Rajinikanth Jailer, Here is Why - Sakshi

కథానాయకిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ప్రియాంక మోహన్‌. తెలుగు, మలయాళం చిత్రాలలో నటించిన ఈమె ఆ తరువాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నటించిన తొలి చిత్రం డాక్టర్‌. ఈ చిత్రం ఆమెకు సక్సెస్‌తో స్వాగతం పలికింది. ఆ తరువాత అదే హీరోతో రొమాన్స్‌ చేసిన డాన్‌ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనే ముద్ర వేసుకుంది. అయితే హీరో సూర్యకు జంటగా నటించిన ఎదుర్కుమ్‌ తుణిందవన్‌ చిత్రం ఈ అమ్మడిని నిరాశ పరిచిందనే చెప్పాలి.

చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్‌ లుక్‌ వైరల్‌

అయినా ఆమెకు వరుసగా అవకాశాలు ప్రియాంక వస్తున్నాయి. వాటిలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జైలర్‌ చిత్రం కూడా ఒకటి. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’, ‘బీస్ట్‌’ చిత్రాల దర్శకుడు నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. కాగా ఈ చిత్రం నుంచి నటి ప్రియాంక మోహన్‌ వైదొలగినట్లు తాజా సమాచారం. దీని గురించి ఈ భామపై రకరకాల వదంతులు వస్తున్నాయి.

చదవండి: అలనాటి హీరోయిన్ల మధ్య మీనా బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఫోటోలు వైరల్‌

డాక్టర్‌ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు నెల్సన్‌తో మనస్పర్థలే చిత్రాన్ని ఆమె వదులుకోవడానికి కారణమనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఇకపోతే ప్రియాంక మోహన్‌ వదులుకున్న పాత్రలోనే నటి తమన్నా నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక మోహన్‌ కూడా ఈ విషయమై స్పందించలేదు. ప్రస్తుతం ఆమె రాజేష్‌ దర్శకత్వం,  జయం రవి కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రంలో ఆమె  నటిస్తోంది.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement