రజనీకాంత్ 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఒకరకంగా జైలర్ విజయం కోలీవుడ్ పరిశ్రమకు మంచి బూస్ట్‌ను తెచ్చిందనే చెప్పవచ్చు. అక్కడ రజనీకాంత్ స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదని జైలర్ సక్సెస్ నిరూపించింది. విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ఆయన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా గురించి తాజాగ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
రజనీ నిజ జీవితంలో జైలర్ క్లైమాక్స్ సీన్
జైలర్ సినిమాలో తన కుటుంబ సన్నివేశాల్లో వచ్చే చాలా డైలాగులు రజనీ నిజ జీవితానికి సంబంధించినవని ఆయన అన్నారు. క్లైమాక్స్ సీన్‌లో ఏదైనా చెప్పాలని ఉందా..? అంటూ తన కుమారుడిని పదేపదే రజనీ అడిగే సన్నివేశం ఉంటుంది. అందులో అతని నిజ జీవితంలోని నొప్పిని చూపిస్తుంది. ఇది కేవలం డైలాగ్ కాదు. అది వారి జీవితం. డైలాగ్ మాట్లాడేటప్పుడు అతను ధనుష్, అతని కుమార్తె ఐశ్వర్య గురించి ఆలోచించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.
ధనుష్ దంపతుల మధ్య ఏదో జరుగుతోందని రజనీకి ముందే అనిపించివుండవచ్చు.. విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఈ విషయం గురించి తన కూతురిని రజనీ నేరుగా అడగలేరు. అందుకే ఆయన నిజ జీవితంలో కూడా 'ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అని ఆమెను చాలాసార్లు అడిగారు.' అని ప్రవీణ్ గాంధీ తెలిపాడు. ఆ సినిమాలో రజనీ నవ్వుతున్న టాప్ యాంగిల్ షాట్ ఉంటుంది. అందులో చాలా ఎమోషన్ కనిపిస్తుంది. ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు ఆ సీన్ చాలా దగ్గరగా ఉంటుందని ఆయన తెలిపాడు.
(ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా?)
ఆ సమయంలో చాలాసార్లు కన్నీళ్లు పెట్టాడు
రజనీకాంత్‌కు ఇద్దరు కూతుళ్లు. ఒక తండ్రిగా, అతను తన కుమార్తెలను చాలా అమితంగా ప్రేమిస్తాడు. వారిని ఆయన చాలా క్రమశిక్షణతోనే పెంచారు. కానీ దేవుడి రాతను ఎవరూ మార్చలేరని ఆయన చెప్పారు. రజనీకి తన ఇద్దరు కూతుళ్ల ప్రాణాలే ముఖ్యం. కానీ వారి జీవితంలో జరిగిన సంఘటనలకు ఇద్దరూ బాధపడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఆ షాట్‌లోనే కనిపిస్తాయని ప్రవీణ్ గాంధీ స్పష్టం చేశారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య గతేడాది ధనుష్ నుంచి విడిపోయింది. వారి పిల్లల యాత్ర, లింగ ఇద్దరూ ధనుష్ వద్దే ఉంటారు.
అప్పడప్పుడు రజనీకాంత్ వద్దకు వెళ్తుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ పిల్లలిద్దరినీ చూడగానే చాలా సందర్భాల్లో రజనీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని ఆయన గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా వారి విడాకులు ఇరువురి కుటుంబాలను తీవ్రంగా కలవరపరిచాయని చెప్పుకొచ్చాడు. గతంలో రజనీకాంత్ కూడా వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించారని తెలిసింది అది ఫలించలేదన్నాడు.
సౌందర్య జీవితంలో కూడా ఇబ్బందులే
రజనీ చిన్న కూతురు సౌందర్య కూడా మొదటి వివాహం విఫలమైంది. గ్రాఫిక్ డిజైనర్‌గా ఉన్న సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. 2015లో వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత విబేదాలు రావడంతో 2017లో ఇద్దరూ విడిపోయారు. 2019లో నటుడు, వ్యాపారవేత్త విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకుంది. గతేడాది ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడని ఆయన పేర్కొన్నాడు. జైలర్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే చాలా సన్నివేశాలు రజనీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని ప్రవీణ్ గాంధీ తెలుపుతూ ఆ ఇంటర్వ్యూను ముగించారు.
(ఇదీ చదవండి: బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్)
Comments
Please login to add a commentAdd a comment