aiswarya
-
సంక్రాంతికి వస్తున్నాం.. బ్యాట్ పట్టి, స్టెప్పులేసిన వెంకీమామ (ఫోటోలు)
-
కూతురి డ్రీమ్ కోసం అర్జున్ కీలక నిర్ణయం
ఫామ్‌కు, ఫేమ్‌కు నిలయం సినిమా. అందుకే ఈ రంగుల ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఆశ పడుతుంటారు. ఇందులో లోతు తెలిసేది దిగిన తరువాతనే. కొందరు సక్సెస్ అవుతారు. మరికొందరు అందుకోసం మొక్కవోని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో నటి ఐశ్వర్య అర్జున్ ఒకరని చెప్పవచ్చు. ఈమె యాక్షన్ కింగ్ అర్జున్ వారసురాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన పెద్ద కూతురు అయిన ఐశ్వర్య అర్జున్‌కు కథానాయకిగా రాణించాలన్న ఆశ చాలానే ఉంది. అలా గత 10 ఏళ్ల క్రితమే నటుడు విశాల్‌కు జంటగా 'పట్టత్తుయానై' చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అందువల్ల మరో అవకాశం రాలేదు. దీంతో నటుడు అర్జున్ తన కూతురి డ్రీమ్‌ను నిజం చేయడానికి తనే మెగాఫోన్ పట్టి 'సొల్లిడవా' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆయన ప్రయత్నం సఫలం కాలేదు. ఆ తరువాత తెలుగులో కూతురిని కథానాయకిగా పరిచయం చేయాలని ప్రయత్నించారు. అందులో టాలీవుడ్ నటుడు 'విశ్వక్ సేన్'ను హీరోగా ఎంపిక చేశారు. అయితే ఆయనతో విబేధాల కారణంగా ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. కాగా ఇటీవల ఐశ్వర్య అర్జున్ నటుడు ఉమాపతి తంబిరామయ్యను ప్రేమించడంతో ఆయనతోనే ఇటీవల పెళ్లి చేశారు. అయినప్పటికీ తన కూతుర్ని హీరోయిన్గా సక్సెస్ చేయడానికి తాజాగా మరోసారి ప్రయత్నం చేస్తున్నారు అర్జున్. ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ఐశ్వర్య అర్జున్ను హీరోయిన్గా 'సీత పయనం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర బంధువు నిరంజన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం అయినా నటి ఐశ్వర్య అర్జున్‌కు మంచి రీ ఎంట్రీ అవుతుందేమో చూడాలి. -
స్టాలిన్‌కు శుభలేఖ అందించిన అర్జున్
యాక్షన్‌కింగ్‌గా అభిమానులను అలరించిన హీరో అర్జున్.. ఆయన కూతురు నటి ఐశ్వర్య వివాహబంధంలో అడుగుపెట్టబోతుంది. సినీ దర్శకుడు, నటుడు తంబిరామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో ఆమె వివాహం జరగనుంది. ఈ వేడుక జూన్‌లో చెన్నైలో జరగనుంది. వీరి వివాహ నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన జరిగింది. కాగా ఉమాపతి, ఐశ్వర్యల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడానికి అర్జున్, తంబిరామయ్య కుంటుంబాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వివాహ వేడుకను జూన్ 10న చెన్నై, గిరకంబాక్కంలో నటుడు అర్జున్‌కు చెందిన తోటలో నిర్విహించ తలపెట్టినట్లు సమాచారం. ఈ వివాహా వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే పనిలో అర్జున్, తంబిరామయ్య కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా తాజాగా వీరి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆహ్వన పత్రికను అందించారు. పెద్ద పెట్టెలా ఉన్న ఈ ఆహ్వన పత్రిక అందరినీ ఆకర్షిస్తోంది. -
డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా
రజనీకాంత్ పేరు ఇప్పుడు సినీ ప్రపంచంలో దద్దరిల్లిపోతోంది. కారణం ఆయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడమే. కాగా తదుపరి 'లాల్‌సలామ్' చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో రజనీకాంత్ మొయిదీన్ బాబాగా అతిథిపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం విశేషం. (ఇదీ చదవండి: ఏళ్ల తరబడి షూటింగ్.. సుజితకు అరకొర పారితోషికం?!) లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి కొన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ముందుగా రజనీకాంత్ గెస్ట్‌గా నటిస్తున్నారన్న ప్రచారం జరగ్గా తాజాగా ఆయనది ఈ చిత్రంలో ఎక్సెంట్ క్యామియో పాత్ర అని తెలిసింది. ఇంతకు ముందు రజనీకాంత్ భాషాలో పోషించిన పాత్రకు 10 రెట్లు పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈయన పాత్ర చిత్రం విలువ భాగంలో ఫుల్లుగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జైలర్ చిత్రం తరువాత విడుదలవుతున్న లాల్‌సలామ్ చిత్రంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్
రజనీకాంత్ 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఒకరకంగా జైలర్ విజయం కోలీవుడ్ పరిశ్రమకు మంచి బూస్ట్‌ను తెచ్చిందనే చెప్పవచ్చు. అక్కడ రజనీకాంత్ స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదని జైలర్ సక్సెస్ నిరూపించింది. విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ఆయన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా గురించి తాజాగ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రజనీ నిజ జీవితంలో జైలర్ క్లైమాక్స్ సీన్ జైలర్ సినిమాలో తన కుటుంబ సన్నివేశాల్లో వచ్చే చాలా డైలాగులు రజనీ నిజ జీవితానికి సంబంధించినవని ఆయన అన్నారు. క్లైమాక్స్ సీన్లో ఏదైనా చెప్పాలని ఉందా..? అంటూ తన కుమారుడిని పదేపదే రజనీ అడిగే సన్నివేశం ఉంటుంది. అందులో అతని నిజ జీవితంలోని నొప్పిని చూపిస్తుంది. ఇది కేవలం డైలాగ్ కాదు. అది వారి జీవితం. డైలాగ్ మాట్లాడేటప్పుడు అతను ధనుష్, అతని కుమార్తె ఐశ్వర్య గురించి ఆలోచించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. ధనుష్ దంపతుల మధ్య ఏదో జరుగుతోందని రజనీకి ముందే అనిపించివుండవచ్చు.. విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఈ విషయం గురించి తన కూతురిని రజనీ నేరుగా అడగలేరు. అందుకే ఆయన నిజ జీవితంలో కూడా 'ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అని ఆమెను చాలాసార్లు అడిగారు.' అని ప్రవీణ్ గాంధీ తెలిపాడు. ఆ సినిమాలో రజనీ నవ్వుతున్న టాప్ యాంగిల్ షాట్ ఉంటుంది. అందులో చాలా ఎమోషన్ కనిపిస్తుంది. ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు ఆ సీన్ చాలా దగ్గరగా ఉంటుందని ఆయన తెలిపాడు. (ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా?) ఆ సమయంలో చాలాసార్లు కన్నీళ్లు పెట్టాడు రజనీకాంత్‌కు ఇద్దరు కూతుళ్లు. ఒక తండ్రిగా, అతను తన కుమార్తెలను చాలా అమితంగా ప్రేమిస్తాడు. వారిని ఆయన చాలా క్రమశిక్షణతోనే పెంచారు. కానీ దేవుడి రాతను ఎవరూ మార్చలేరని ఆయన చెప్పారు. రజనీకి తన ఇద్దరు కూతుళ్ల ప్రాణాలే ముఖ్యం. కానీ వారి జీవితంలో జరిగిన సంఘటనలకు ఇద్దరూ బాధపడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఆ షాట్‌లోనే కనిపిస్తాయని ప్రవీణ్ గాంధీ స్పష్టం చేశారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య గతేడాది ధనుష్ నుంచి విడిపోయింది. వారి పిల్లల యాత్ర, లింగ ఇద్దరూ ధనుష్ వద్దే ఉంటారు. అప్పడప్పుడు రజనీకాంత్ వద్దకు వెళ్తుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ పిల్లలిద్దరినీ చూడగానే చాలా సందర్భాల్లో రజనీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని ఆయన గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా వారి విడాకులు ఇరువురి కుటుంబాలను తీవ్రంగా కలవరపరిచాయని చెప్పుకొచ్చాడు. గతంలో రజనీకాంత్ కూడా వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించారని తెలిసింది అది ఫలించలేదన్నాడు. సౌందర్య జీవితంలో కూడా ఇబ్బందులే రజనీ చిన్న కూతురు సౌందర్య కూడా మొదటి వివాహం విఫలమైంది. గ్రాఫిక్ డిజైనర్‌గా ఉన్న సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. 2015లో వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత విబేదాలు రావడంతో 2017లో ఇద్దరూ విడిపోయారు. 2019లో నటుడు, వ్యాపారవేత్త విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకుంది. గతేడాది ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడని ఆయన పేర్కొన్నాడు. జైలర్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే చాలా సన్నివేశాలు రజనీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని ప్రవీణ్ గాంధీ తెలుపుతూ ఆ ఇంటర్వ్యూను ముగించారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) -
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య..?!
నటి ఐశ్వర్య రాజేశ్‌కు భారీ అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇటీవల సెక్క సివంద వానం, కనా వంటి చిత్రాల సక్సెస్ ఈమె కెరీర్‌కు బాగా ఉపయోగపడ్డాయి. అంతే కాదు కాక్కాముట్టై చిత్రంతోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఐశ్వర్యరాజేశ్ పదహారణాల తెలుగమ్మాయి అని తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో కామ్రేడ్ అనే చిత్రంలో విజయ్‌దేవరకొండకు జంటగా నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కావడానికి ముస్తాబవుతోంది. ఇదేకాక మరో రెండు తెలుగు చిత్రాలు, తమిళంలో ఇదు వేదాళం సొల్లుం కథై, కర్పూరనగరం, దర్శకుడు మణిరత్నం నిర్మాణంలో విక్రమ్‌ప్రభుకు జంటగా నటించే చిత్రంతో కలిపి ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. తాజాగా కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ధనుష్‌కు జంటగా వడచెన్నై–2లో నటించనున్న ఐశ్వర్యరాజేశ్‌కు తాజాగా నటుడు శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం దక్కినట్లు తెలిసింది. ప్రస్తుతం మిస్టర్ లోకల్ చిత్రాన్ని పూర్తి చేసి రవికుమార్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న శివ కార్తికేయన్ తాజాగా హీరో అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ స్టార్ నటుడు మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. సుశీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో శివ కార్తికేయన్‌కు జంటగా ఐశ్వర్య రాజేశ్‌ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే శివ కార్తికేయన్ నిర్మించిన కనా చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాజేశ్ ఇప్పుడు ఏకంగా ఆయన పక్కనే హీరోయిన్గా కనిపించనుంది. -
ఐశ్వర్యతో పెళ్లి కాలేదు: వెంకట్
యశవంతపుర : నటి ఐశ్వర్యను తాను వివాహం చేసుకున్నట్లు ఫేస్బుక్ లైవ్‌లో చేప్పిన శాండల్‌వుడ్ నటుడు హుచ్చ వెంకట్ మూడు రోజుల తరువాత మాట మార్చాడు. తాను ఐశ్వర్యను వివాహం చేసుకోలేదంటూ బుధవారం మరో వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ‘డిక్టేటర్ హుచ్చ వెంకట్’ అనే సినిమాలో హిరోయిన్‌గా ఐశ్వర్య నటిస్తోందని, సినిమా చిత్రీకరణలో భాగంగా జరిగిన వివాహ దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసినట్లు తెలిపారు. -
ఐశ్వర్యతో వెంకట్ రహస్య వివాహం
బెంగళూరు: సినిమా హీరో, హీరోయిన్ల పెళ్లి అంటే ఆకాశమంత పందిరి, భారీగా మేళతాళాలు, వీఐపీ అతిథులతో ఊరంతా సందడిగా ఉంటుంది. కానీ ఈ నటుడు మాత్రం వధువు మెడలో పసుపు కొమ్ము కట్టేసి ముగించాడు. వినూత్న నటన, హావభావాలతో అభిమానులను సంపాదించుకున్న శాండల్‌వుడ్ నటుడు హుచ్చ వెంకట్‌కు కళ్యాణ భాగ్యం కలిసి వచ్చింది. డిక్టేటర్ హుచ్చ వెంకట్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకున్నాడు. గత వారం తలకావేరిలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. నిరాడంబరంగా పసువుకొమ్ము కట్టి దంపతులయ్యారు. ఇద్దరిదీ ప్రేమ పెళ్లి కావడం విశేషం. ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పగా, వారు పెళ్లికి నిరాకరించారు, దీంతో తలకావేరిలో గుట్టుగా వివాహం చేసుకున్నట్లు వెంకట్ తెలిపారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా, తమను క్షమించి అందరిలో ఒక్కడిగా చూడాలని హుచ్చ వెంకట్ ఫేస్బుక్ లైవ్‌లో ప్రకటించాడు. వెంకట్ పెళ్లిపై ఐశ్వర్య తల్లి ఆగ్రహం నటుడు హుచ్చ వెంకట్ విహవాంపై ఐశ్వర్య తల్లి రూప ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ‘ఎవరిని అడిగి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. నేను ఈ పెళ్లిని ఒప్పుకోవటం లేదు. మూడు రోజుల నుండి ఐశ్వర్య ఫోన్లో దొరకటంలేదు. వెంకట్ ఐశ్వర్య చెన్నైలో ఉన్నట్లు తెలిసింది. పెళ్లి చేసుకున్న విషయం తెలిసినప్పుటి నుండి వెంకట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా నాకు భయంగా ఉంది’ అని ఆమె అన్నారు. తనను హుచ్చ వెంకట్ హత్య చేస్తాడనే భయం ఉందని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వెంకట్ ఫేస్బుక్లో లైవ్‌లో చేప్పేవరకూ వారిద్దరికి వివాహం అయినట్లు తమకు తెలియదన్నారు. -
నేత్ర ఎవరు?
గోపీచరణ్, ఐశ్వర్య జంటగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తున్న సినిమా ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్... అనేది ఉపశీర్షిక. ‘‘ఈ నెలలో ఆడియో, నవంబర్‌లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘లవ్ అండ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్. ‘నేత్ర’ ఎవరు? ఆమె ఎవర్ని ప్రేమించింది? ఆ తర్వాత ఏమైంది? అనేది ఆసక్తికరం. స్టార్ మేకర్ సత్యానంద్, వాళ్లబ్బాయి కలసి నటించిన మొదటి చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు.