ఐశ్వర్యతో వెంకట్‌ రహస్య వివాహం | Hucha Venkat Marriage With Actress Aiswarya | Sakshi
Sakshi News home page

ఇంటివాడైన హుచ్చ వెంకట్‌

May 14 2018 9:18 AM | Updated on May 14 2018 9:32 AM

Hucha Venkat Marriage With Actress Aiswarya - Sakshi

ఐశ్వర్య తల్లి రూప , హుచ్చ వెంకట్‌–ఐశ్వర్య జంట

బెంగళూరు: సినిమా హీరో, హీరోయిన్ల పెళ్లి అంటే ఆకాశమంత పందిరి, భారీగా మేళతాళాలు, వీఐపీ అతిథులతో ఊరంతా సందడిగా ఉంటుంది. కానీ ఈ నటుడు మాత్రం వధువు మెడలో పసుపు కొమ్ము కట్టేసి ముగించాడు. వినూత్న నటన, హావభావాలతో అభిమానులను సంపాదించుకున్న శాండల్‌వుడ్‌ నటుడు హుచ్చ వెంకట్‌కు కళ్యాణ భాగ్యం కలిసి వచ్చింది. డిక్టేటర్‌ హుచ్చ వెంకట్‌ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకున్నాడు. గత వారం తలకావేరిలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. నిరాడంబరంగా పసువుకొమ్ము కట్టి దంపతులయ్యారు. ఇద్దరిదీ ప్రేమ పెళ్లి కావడం విశేషం. ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పగా, వారు పెళ్లికి నిరాకరించారు, దీంతో తలకావేరిలో గుట్టుగా వివాహం చేసుకున్నట్లు వెంకట్‌ తెలిపారు.  కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా, తమను క్షమించి అందరిలో ఒక్కడిగా చూడాలని హుచ్చ వెంకట్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రకటించాడు.

వెంకట్‌ పెళ్లిపై ఐశ్వర్య తల్లి ఆగ్రహం
నటుడు హుచ్చ వెంకట్‌ విహవాంపై ఐశ్వర్య తల్లి రూప ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ‘ఎవరిని అడిగి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. నేను ఈ పెళ్లిని ఒప్పుకోవటం లేదు. మూడు రోజుల నుండి ఐశ్వర్య ఫోన్‌లో దొరకటంలేదు. వెంకట్‌ ఐశ్వర్య చెన్నైలో ఉన్నట్లు  తెలిసింది. పెళ్లి చేసుకున్న విషయం తెలిసినప్పుటి నుండి వెంకట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా నాకు భయంగా ఉంది’ అని ఆమె అన్నారు. తనను హుచ్చ వెంకట్‌ హత్య చేస్తాడనే భయం ఉందని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వెంకట్‌ ఫేస్‌బుక్‌లో లైవ్‌లో చేప్పేవరకూ వారిద్దరికి వివాహం అయినట్లు తమకు తెలియదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement