sandelwood
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా
మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించిన ఈ కన్నడ మూవీని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో తీశారు. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోగా చేసిన దీక్షిత్ తెలుగులోనూ పలు సినిమాలు చేయడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా)'దసరా'లో నాని ఫ్రెండ్‌గా చేసిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి.. 'దియా' మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తెలుగు ఇటు కన్నడ సినిమాల్లో చేస్తున్నాడు. ఇతడు హీరోగా చేసిన 'బ్లింక్' అనే మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. తొలుత 50 కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ బాగుండటంతో ఆ నంబర్ పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.ఇక 'బ్లింక్' కథ విషయానికొస్తే.. పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి). తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనుకుంటాడు. అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్) -
ప్రకాశ్ రాజ్ నుంచి అవార్డ్ విన్నింగ్ మూవీ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!
ప్రకాశ్ రాజ్ పేరు చెప్పగానే విలక్షణమైన పాత్రలే గుర్తొస్తాయి. హీరో, విలన్, తండ్రి, బాబాయ్.. ఇలా అన్ని రకాలు పాత్రలు చేశాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించాడు. అయితే గతంతో పోలిస్తే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాడు. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అలరించాడు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఓ అవార్డ్ విన్నింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కన్నడలో తీసిన 'ఫొటో' అనే సినిమాని కొత్త దర్శకుడు ఉత్సవ్ గోన్వర్ తీశాడు. గతేడాది దిల్లీలో జరిగిన హ్యాబిటట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తోపాటు బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ రెండు చోట్ల కూడా 'ఫొటో' చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం విశేషం. అయితే ఈ సినిమా చూసిన ప్రకాశ్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 15న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'ఫొటో' సినిమా కథ విషయానికొస్తే.. బెంగళూరులో ఓ వ్యక్తి, వలస కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అయితే ప్రభుత్వం అనుకోని పరిస్థితుల్లో లాక్డౌన్ విధిస్తుంది. దీంతో తమ సొంతూరు అయిన రాయచూర్‌కి నడక మార్గంలోనే వెళ్తారు. అసలు ఇంటికి వెళ్లారా అనేది పాయింట్. అలానే ఇదే కథలో ఆ పిల్లాడికి బెంగళూరులోని విధానసౌధ(కర్ణాటక శాసనసభ) ముందు నిలబడి ఫొటో తీసుకోవాలనే కోరిక ఉంటుంది. మరి లాక్డౌన్ కష్టాల మధ్య దాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే 'ఫొటో' సినిమా స్టోరీ. కథ పరంగా బాగానే ఉంది. వలస కూలీల కష్టాలు ప్రతిబింబించేలా ఉంది. పలు అవార్డ్ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే సినిమా నచ్చి.. సొంతంగా రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ని జనాలు చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) -
ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ మూవీ.. ఆ భాషలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది ఓటీటీలోకి మూవీ లవర్స్‌ని నవ్వించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎలాంటి హడావుడి లేకుండా ఇచ్చేశారు. దీంతో ఓటీటీ ప్రేమికులు అలెర్ట్ అయిపోయారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? ఓటీటీల హవా పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు కన్నడ హిట్ మూవీ 'బ్యాచిలర్ పార్టీ' ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయింది. జనవరి 26న థియేటర్లకి వచ్చిన ఈ చిత్రం.. సోమవారం నుంచి అంటే మార్చి 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.అంటే ఈ రోజు అర్థరాత్రే. అలానే ఓటీటీలో రిలీజ్ విషయాన్ని కూడా కొన్ని గంటల ముందు మాత్రమే చెప్పారు. అంటే సడన్ స్ట్రీమింగ్ అన్నట్లే. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) మరోవైపు ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంది. భార్య-భర్త మధ్య ఉండే చిన్న సమస్యలతో కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అలానే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బ్యాంకాక్‌లో చేసిన సందడి కూడా బాగానే ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. 'బ్యాచిలర్ పార్టీ' కథ విషయానికొస్తే.. సంతోష్ (దిగంత్ మైకేల్) సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. పెళ్లి కూడా అయ్యింటుంది. కానీ భార్య సంధ్య(సిరి రవికుమార్) వల్ల జీవితంలో సంతోషం అనేదే ఉండదు. పార్టీలు కూడా చేసుకోనివ్వకుండా ఆఫీస్ తర్వాత నేరుగా ఇంటికొచ్చేయాలనే టైప్. అలాంటి సంతోష్ అనుకోకుండా ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో తన పాత ఫ్రెండ్ మ్యాడీ (యోగా), పీటీ సర్ (అచ్యుత్ కుమార్)ని కలుస్తాడు. ఆ తర్వాత వీళ్లు ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్తారు. చివరకు ఏమైంది? ఈ జర్నీలో ఏం తెలుసుకున్నారు? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?
'సలార్' రిలీజ్ టైంలో ఓ కన్నడ స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాకు భయపడేది లేదని అన్నాడు. దీంతో ఇతడు ఎవరబ్బా అని తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. రీసెంట్గా ఇతడు హీరోగా నటించిన 'కాటేరా' సినిమా హిట్ అయింది. ఇప్పుడు ఈ స్టార్ హీరో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. అది కూడా ఓ హీరోయిన్ వల్ల. ఒక్క వీడియోనే దీనికి కారణమని అంటున్నారు. అసలేం జరిగింది? కన్నడలో స్టార్ హీరో దర్శన్. ఇతడిని అభిమానులు ముద్దుగా డి-బాస్ అని పిలుస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఓ అనవసరమైన కామెంట్స్ చేస్తూ వివాదాల్లో ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి సంసారంలో చిచ్చు రేగినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా పవిత్ర గౌడ అనే హీరోయిన్.. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేయడంతో వచ్చింది. '10 ఏళ్ల రిలేషన్షిప్ ఇది. ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ దర్శన్' అని వీడియో దిగువన క్యాప్షన్ పెట్టింది. (ఇదీ చదవండి: 'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?) స్టార్ హీరో భార్య వార్నింగ్ అయితే చాన్నాళ్ల నుంచి దర్శన్-పవిత్ర గౌడ మధ్య ఏదో ఉందని కన్నడ ఇండస్ట్రీలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో హీరో దర్శన్‌తో పవిత్ర గౌడ.. సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ఇక దర్శన్ భార్య విజయలక్ష్మి మరింత సీరియస్ అయిందట. ఏకంగా సెట్‌కి వెళ్లి మరీ పవిత్ర గౌడకు వార్నింగ్ ఇచ్చిందట. ఇకపై దర్శన్‌తో కనిపించొద్దని పవిత్ర గౌడకు గట్టిగానే విజయలక్ష్మి చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విషయం మీద అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని పవిత్రని దర్శన్ భార్య హెచ్చరించిందట. ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: మాజీ భార్యతో డేటింగ్.. నేను మారిపోయా: నటుడు) View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithra_gowda_7) -
ఒకేసారి ఐదు పాన్ ఇండియా మూవీస్.. ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి
కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్స్ సరసన ఆర్సీ స్టూడియోస్ కూడా ఉంటుంది. ఈ మధ్యే వీళ్లు తీసిన మొదటి ప్రాజెక్ట్ 'కబ్జా' మిగతా చోట్ల అంతగా ఆడలేదు కానీ కన్నడలో మాత్రం హిట్ అయింది. ఆర్.చంద్రు కొత్త వెంచర్ ఆర్సీ స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని పాన్ ఇండియా మూవీస్ తీసేందుకు రెడీ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) ఆర్సీ స్టూడియోస్ నిర్మాణంలో ఒకేసారి 5 సినిమాలు తీయబోతున్నారు. మంగళవారం(జనవరి 23) సాయంత్రం బెంగళూరులో జరిగే ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు, నిర్మాతలు హాజరు కానున్నారు. హీరో ఉపేంద్ర కూడా రాబోతున్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్టులని ఆర్సీ స్టూడియోస్.. సింగపూర్‌కు చెందిన మిస్టర్ అలంకార్ పాండియన్, వ్యాపారవేత్త శ్రీ సీకల్ రామచంద్ర గౌడతో కలిసి నిర్మించనుంది. (ఇదీ చదవండి: Sitara Income: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) -
స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!
తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చితే చాలు నెత్తిన పెట్టేసుకుంటారు. అందులోని నటీనటుల్ని కూడా అభిమానిస్తారు. అలా ఈ మధ్య కాలంలో కన్నడ హీరోలు కూడా మనవాళ్లకు బాగా దగ్గరయ్యారు. వాళ్లలో హీరో రక్షిత్ శెట్టి కూడా ఒకడు. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అని చాలామందికి తెలుసు. కానీ 'చార్లి 777' మూవీతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ హీరోకి రష్మిక మాత్రమే అంతకుముందు కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందట. రష్మికతో బ్రేకప్ కన్నడలో రక్షిత్ శెట్టి పేరు తెలియని వాళ్లుండరు. నటుడు-దర్శకుడు-రచయిత-నిర్మాత.. ఇలా మనోడి దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. గతంలో 'కిరిక్ పార్టీ' అనే సినిమాలో రక్షిత్ హీరోగా నటిస్తే, రష్మిక హీరోయిన్గా చేసింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు వీళ్లు ప్రేమలో పడ్డారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కారణం ఏంటే తెలీదు గానీ ఈ జంట విడిపోయింది. అయితే ఇదే కాదు రక్షిత్ కి మరో లవ్‌స్టోరీ కూడా ఉంది. అక్కడ క్లోజ్ ఫ్రెండే మోసం చేశాడట. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) రక్షిత్ ఏం చెప్పాడు? 'నా ఇంజినీరింగ్ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశా. తనకి లవ్ లెటర్ ఇవ్వమని మా ఫ్రెండ్‌కి రోజూ లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ అమ్మాయి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఇచ్చిన లెటర్స్‌ని నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యభర్తలు' అని హీరో రక్షిత్ శెట్టి తనకు జరిగిన మోసం గురించి చెప్పుకొచ్చాడు. 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన కాలేజీ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాడు. అయితే రక్షిత్ జీవితంలోని ఈ రెండు స్టోరీలు చూసిన ఎవరికైనా సరే.. ఈ హీరో ప్రేమ అనేది అస్సలు కలిసి రావడం లేదా అనే సందేహం వస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
ఆ సినిమా షూటింగ్లో దౌర్జన్యం.. కత్తులు తెచ్చి నటితో అలా!
హీరోహీరోయిన్లతో పాటు నటీనటులకు చాలామంది అభిమానులు ఉంటారు. కొన్నిసార్లు ఇలా ఫ్యాన్స్ అని చెప్పుకొనే కొందరు సదరు యాక్టర్స్‌తో మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తాజాగా ఓ మూవీ షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటన మాత్రం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) ఇంతకీ ఏం జరిగింది? కర్ణాటకలోని చిక్కమగళూరులోని ఓ ప్రాంతంలో 'కొరగజ్జ' అనే సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది. నటి శుభం పూంజా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య సెట్లో ఉన్నారు. సడన్‌గా బైకుపై కొందరు దుండగులు కత్తులతో అక్కడికి వచ్చారు. నటి శుభంతో అసభ్యంగా ప్రవర్తించారు. కత్తులతో ఆమె బెదిరించి, చేయిపట్టుకుని లాగారని అంటున్నారు. దీంతో షూటింగ్ నిలిచిపోయిందట. పోలీసు కేసు పెట్టకుండా ఇకపోతే ఈ సంఘటన కుద్రేముఖ పోలీస్ స్టేషన్ ఫరిధిలో జరిగినప్పటికీ.. దీనిపై పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయలేదట. మరోవైపు మీడియాతో మాట్లాడిన దర్శకుడు సుధీర్.. 'లక్షలు ఖర్చుపెట్టి సెట్ వేసి, అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో షూటింగ్ అంతా ఆపేయాల్సి వచ్చింది' అని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీనికి కారణాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో) -
డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లకు షాక్
బెంగుళూరు: సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలకు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వీరిద్దరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా స్పెషల్‌కోర్టు వీరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక వేరు వేరు ప్రాంతాల నుంచి డ్రగ్స్ సేకరించి వాటిని ఫైవ్ స్టార్ హోటలల్లో, క్లబ్స్‌లో, పబ్‌లలో సంజన టీం అమ్మేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మొదట తయారు చేసిన ఎఫ్ఐఆర్లో సంజనా పేరు లేదని ఆమె తరుపు న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. కేవలం డ్రగ్స్ అమ్మే వారి పేర్లనే రిపోర్టులో ఉంచారని తెలిపారు. ఇక రాగిని ద్వివేదిని రిమాండ్‌లోకి తీసుకొని 24 రోజులు అవుతుండగా ఇప్పుడు ఆమె తరుపు న్యాయవాది కల్యాణ్‌కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక మరోవైపు కర్ణాటకలో డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమనే కాకుండా, బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, విచారించారు. సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ సుశాంత్ మరణానంతరం డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే లాంటి ప్రముఖ కథనాయకుల పేర్లే కాకుండా ఇంకా మరికొంత మంది పేర్లు ఆ డ్రగ్స్ కేసు వ్యవహారంలో బయటకు వస్తున్నాయి. చదవండి: రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే -
లాక్డౌన్లో నటి జాలీ రైడ్, గాయాలు
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో కన్నడ నటి తన స్నేహితుడితో ఖరీదైన కారులో జాలీరైడ్‌కు వెళ్లి ప్రమాదానికి గురైంది. కారు వంతెన పిల్లర్‌కు ఢీకొంది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ నటి షర్మిలా మాండ్రే ఆమె స్నేహితుడి లోకేష్ వసంత్‌తో కలిసి శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన జాగ్వర్ కారులో జాలీ రైడ్‌కు బయలుదేరారు. వసంతనగర్‌లో కారును అతి వేగంతో నడపడంతో అదుపుతప్పి అండర్‌పాస్ పిల్లర్‌ను ఢీకొన్నారు. దీంతో షర్మిల ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్నేహితుడికి కాలు విరిగింది. ప్రమాదం నుంచి బయటపడి తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. దీంతో పోర్టిస్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. (ఫోన్ సిగ్నల్స్ ద్వారా కరోనా?) కాగా లాక్డౌన్ సమయంలో బాధ్యతను విస్మరించిన షర్మిల చర్యలను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘సీట్ బెల్ట్ వేసుకోని కారణంగా ఎయిర్ బ్యాగ్ తెరుచుకోలేదు. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించి ఇంటి నుండి బయట రావటమే తప్పు. ఆస్పత్రి నుండి పరారీ కావటం మరో తప్పు’ అని విమర్శిస్తున్నారు. కాగా షర్మిల, ఆమె స్నేహితుడు తాగి డ్రైవింగ్ చేశారా లేక వేగంగా వెళ్లి ఢీకొన్నారా?. ప్రమాద సమయంలో ఎవరు డ్రైవింగ్ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైగ్రౌండ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. మరోవైపు షర్మిలపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసు జాయింట్ పోలీస్ కమిషనర్ రవికాంతెగౌడ తెలిపారు. (జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా) -
ఐశ్వర్యతో వెంకట్ రహస్య వివాహం
బెంగళూరు: సినిమా హీరో, హీరోయిన్ల పెళ్లి అంటే ఆకాశమంత పందిరి, భారీగా మేళతాళాలు, వీఐపీ అతిథులతో ఊరంతా సందడిగా ఉంటుంది. కానీ ఈ నటుడు మాత్రం వధువు మెడలో పసుపు కొమ్ము కట్టేసి ముగించాడు. వినూత్న నటన, హావభావాలతో అభిమానులను సంపాదించుకున్న శాండల్‌వుడ్ నటుడు హుచ్చ వెంకట్‌కు కళ్యాణ భాగ్యం కలిసి వచ్చింది. డిక్టేటర్ హుచ్చ వెంకట్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకున్నాడు. గత వారం తలకావేరిలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. నిరాడంబరంగా పసువుకొమ్ము కట్టి దంపతులయ్యారు. ఇద్దరిదీ ప్రేమ పెళ్లి కావడం విశేషం. ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పగా, వారు పెళ్లికి నిరాకరించారు, దీంతో తలకావేరిలో గుట్టుగా వివాహం చేసుకున్నట్లు వెంకట్ తెలిపారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా, తమను క్షమించి అందరిలో ఒక్కడిగా చూడాలని హుచ్చ వెంకట్ ఫేస్బుక్ లైవ్‌లో ప్రకటించాడు. వెంకట్ పెళ్లిపై ఐశ్వర్య తల్లి ఆగ్రహం నటుడు హుచ్చ వెంకట్ విహవాంపై ఐశ్వర్య తల్లి రూప ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ‘ఎవరిని అడిగి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. నేను ఈ పెళ్లిని ఒప్పుకోవటం లేదు. మూడు రోజుల నుండి ఐశ్వర్య ఫోన్లో దొరకటంలేదు. వెంకట్ ఐశ్వర్య చెన్నైలో ఉన్నట్లు తెలిసింది. పెళ్లి చేసుకున్న విషయం తెలిసినప్పుటి నుండి వెంకట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా నాకు భయంగా ఉంది’ అని ఆమె అన్నారు. తనను హుచ్చ వెంకట్ హత్య చేస్తాడనే భయం ఉందని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వెంకట్ ఫేస్బుక్లో లైవ్‌లో చేప్పేవరకూ వారిద్దరికి వివాహం అయినట్లు తమకు తెలియదన్నారు. -
మే 2న చిరంజీవి సర్జా –మేఘనా వివాహం
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనా రాజ్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు మే 2న బెంగళూరు ప్యాలెస్ మైదానం వైట్పెటల్స్లో పెళ్లి జరుగుతుందని పెళ్లి పత్రిక సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతోంది. దీంతో వీరి అభిమానుల్లో సందడి నెలకొంది. సినీనటులు ప్రేమించి పెళ్లిచేసుకోవడం పరిశ్రమలో కొత్తేం కాదు. ఇటీవలే టాలీవుడ్లో నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకోగా తాజగా శాండల్‌వుడ్ సినీ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇందుకోసం ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. సుందర్రాజ్, ప్రమీలా జోసాయి దంపతుల కుమార్తె మేఘనారాజ్. ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా అల్లుడు చిరంజీవి సర్జా ఇద్దరు ‘ఆటగార’ సినిమాలో జంటగా నటించారు. అదే జోడీ ఇప్పుడు వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు. చిరంజీవి సర్జా 2009లో కన్నడలో వాయుపుత్ర సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించగా, మేఘానారాజ్ తెలుగుతోపాటు దక్షిణాది భాషా సినిమాల్లో నటించారు. ఈ జంట గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ విషయం అందరికీ తెలిసింది. -
రాజకీయాల్లోకి మరో నటిమణి
బెంగళూరు : మరో సినీనటి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనుంది. ప్రముఖ శాండల్‌వుడ్ నటి ప్రియా హాసన్ త్వరలో రాజకీయాల్లోకి రానుంది. యాక్షన్ చిత్రాల ద్వారా శాండల్‌వుడ్‌లో తనదైన ముద్ర వేసిన ప్రియా హాసన్...బిందాస్ హుడుగి, జంభద హుడుగి చిత్రాల ద్వారా ఆమె కన్నడ ప్రేక్షకులకు చేరువైంది. కాగా ప్రియా హాసన్ నటించిన 'స్మగ్లర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె సన్నద్ధం అవుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియా హాసన్ బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు రమ్య, పూజాగాంధీ, రక్షిత తదితరులు రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. వీరంతా గత ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేసి పరాజయం పొందారు. -
నటుడు రఘువీర్ గుండెపోటుతో మృతి
బెంగళూరు : కన్నడ సినీ రంగంలో 22ఏళ్ల పాటు ప్రయాణాన్ని సాగించిన నటుడు రఘువీర్ (46) మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అజయ్-విజయ్ చిత్రంతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రఘువీర్ అసలు పేరు దినేష్. చైత్రద ప్రేమాంజలి సినిమా ఆయనకు మంచి నటుడిగా పేరు తెచ్చింది. 'శృంగార కావ్య' సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ సింధును రఘువీర్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం రఘువీర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో కుటుంబానికి ఆయన దూరమయ్యారు. వివాహం అయిన కొన్ని సంవత్సరాలకు అనారోగ్య కారణంగా భార్య సింధు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన రఘువీర్ చాలాకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కొన్ని చిత్రాల్లో నటించినా అవి ఆయనకు నిరాశనే మిగిల్చాయి. గురువారం రాత్రి తన స్నేహితులు, పిల్లలతో కలిసి ఎస్టేట్‌కి వెళుతున్న సమయంలో ఉన్నపళంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తక్షణమే ఆయనను బీటీఎం లేఅవుట్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. -
ప్రజలు తప్ప మరెవరూ ‘బ్యాన్’ చేయలేరు
* కళాకారుల సంఘానికి లేఖ రాస్తామన్న నిర్మాతల మండలి * ప్రజలు తప్ప మరెవరూ తనను ‘బ్యాన్’ చేయలేరన్న దునియా విజయ్ బెంగళూరు : శాండల్‌వుడ్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నటుడు దునియా విజయ్‌పై ‘నిషేధం’ విధించాలని నిర్మాతల మండలి కోరుతుంటే.. ప్రజలు తప్ప మరెవరూ తనపై ‘నిషేధాన్ని’ విధించలేరని దునియా విజయ్ చెబుతున్నారు. ఇక ఈ వివాదానికి దారి తీసిన అంశాలను పరిశీలిస్తే... ఈనెల 1న మేడే సందర్భాన్ని పురస్కరించుకొని సినీ రంగ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దునియా విజయ్ మాట్లాడుతూ....‘సినీ రంగ కార్మికులు, సినిమా రంగంలోని మహిళలపై దౌర్జన్యాలకు నిర్మాతలను ఊరికే వదిలేది లేదు. అలాంటి వారిని కిరోసిన్ పోసి తగలబెట్టినా తప్పులేదు’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దునియా విజయ్ చేసిన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న నిర్మాతలు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. నిర్మాతలను అగౌరవ పరిచేలా దునియా విజయ్ వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని నిర్మాతల మండలి అధ్యక్షుడు మునిరత్న ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సినీ రంగానికి మూలస్తంభం లాంటి వాడైన నిర్మాతల పట్ల దురుసుగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ఈ విషయమై నిర్మాతలకు దునియా విజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లే ని పక్షంలో అతనిపై నిషేధం విధించాల్సిందిగా కళాకారుల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. కాగా, తన నివాసంలో తనను కలిసిన విలేకరులతో దునియా విజయ్ మాట్లాడుతూ...కార్మికుల పట్ల అన్యాయంగా వ్యవహరించే నిర్మాతల గురించి తాను ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప నిర్మాతలందరినీ అనలేదని అన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను రౌడీ అంటూ కొందరు నిర్మాతలు పేర్కొనడం సరికాదని అన్నారు. తనపై ఎవరూ నిషేధాన్ని విధించలేరని, కేవలం ప్రజలకు మాత్రమే తనను నిషేధించగల శక్తి సామర్థ్యాలున్నాయని అన్నారు. ఎక్కడో నాలుగు గోడల మధ్య కాకుండా తన ఎదురుగా వచ్చి మాట్లాడితే అన్ని విషయాలపై వివరణ ఇస్తానని దునియా విజయ్ పేర్కొన్నారు. -
'మిస్సమ్మ'ను కోల్పోయిన ప్రియమణి
తాను చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాఫిస్ దగ్గర విజయం సాధించేసి, కాస్తంత పాపులారిటీ వచ్చేస్తే చాలు నిర్మాతల దగ్గర చాంతాడంత గొంతెమ్మ కోరికల చిట్టా విప్పే నటీనటులకు ప్రస్తుత కాలంలో కొదవేలేదు. ఇలాంటివారి జాబితాలో నటి ప్రియమణి మినహాయింపేమీ కాదండోయ్. అయితే నిర్మాత బడ్జెట్‌ను తెలుసుకోకుండా ఖరీదూన తన కోరికల చిట్టాను డిమాండ్ చేసినందుకు ప్రియమణి ఓ సినిమానే వదులుకోవాల్సి వచ్చింది. ఇందుకు సబంధించిన వివరాలపూ ఓ లుక్ వేస్తే...శివాజీ, లయ, భూమిక ప్రధాన పాత్రధారులుగా నీలకంఠ దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన 'మిస్సమ్మ' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'నమస్తే మేడమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శివాజీ పాత్రలో శ్రీనగర కిట్టి, లయ పాత్రలో నిఖీషా పటేల్ (పులి ఫేమ్), భూమిక పాత్రలో ప్రియమణిలను మొదటగా ఎంపిక చేశారు. అయితే తన సినిమాలో ధరించబోయే యాక్ససరీస్‌తో పాటు నగలను కూడా తాను చెప్పిన డిజైనర్ దగ్గరే డిజైన్ చేయించాలని, తాను వాడబోయే ప్రతి వస్తువు తనకు నచ్చినట్లుగానే ఉండాలని ప్రియమణి షరతులు విధించడం మొదలుపెట్టిందట. ఇందుకు సదరు ఆ సినిమా నిర్మాత దుస్తుల వరకు అయితే ఓకేగానీ నగల కోసం కూడా ప్రత్యేకంగా డిజైనర్లను ఆశ్రయించాలంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని ప్రియమణికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. కానీ ప్రియమణి వింటేనా, దీంతో ఆ సినిమా నుండే ప్రియమణిని నిర్మాత తప్పించినట్లు శాండల్ వుడ్ వర్గాల సమాచారం. ఇక ప్రియమణి స్థానంలో శాండల్‌వుడ్‌లో ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ప్రియమణిని ప్రశ్నిస్తే మాత్రం...'నిర్మాత నన్ను సినిమా నుంచి తప్పించడం ఏంటి, కథ, కథలోని కొన్ని అంశాలు నచ్చక నేనే సినిమాను వదులుకున్నాను' అని చెప్పుకోవటం విశేషం.