రాజకీయాల్లోకి మరో నటిమణి | actress Priya Hassan to contest BBMP Elections | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి మరో నటిమణి

Published Thu, Jun 4 2015 8:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాజకీయాల్లోకి మరో నటిమణి - Sakshi

రాజకీయాల్లోకి మరో నటిమణి

బెంగళూరు : మరో సినీనటి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనుంది. ప్రముఖ శాండల్వుడ్ నటి ప్రియా హాసన్ త్వరలో రాజకీయాల్లోకి రానుంది. యాక్షన్ చిత్రాల ద్వారా శాండల్వుడ్లో తనదైన ముద్ర వేసిన ప్రియా హాసన్...బిందాస్ హుడుగి, జంభద హుడుగి చిత్రాల ద్వారా ఆమె కన్నడ ప్రేక్షకులకు చేరువైంది. కాగా ప్రియా హాసన్ నటించిన 'స్మగ్లర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె సన్నద్ధం అవుతోంది.

కాగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియా హాసన్  బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు రమ్య, పూజాగాంధీ, రక్షిత తదితరులు రాజకీయాల్లో  ఉన్న విషయం తెలిసిందే. వీరంతా గత ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేసి పరాజయం పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement