BBMP Elections
-
మేయర్ ఎన్నికలో ఎన్నెన్ని ట్విస్టులో!
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు సినిమా ట్విస్టులను తలపిస్తున్నాయి. కార్పొరేషన్లో మెజారిటీ ఉన్నా.. తమ అభ్యర్థిని మేయర్‌గా గెలిపించుకోలేక బీజేపీ చతికిలబడింది. సొంత బలం లేకపోయినా, ఎమ్మెల్యేలు.. ఇతరుల బలంతో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకునే పరిస్థితికి వచ్చింది. కానీ.. హైకోర్టు తుదితీర్పును బట్టే ఈ ఎన్నిక ఆధారపడి ఉంటుంది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాల మేరకు నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఎన్ మంజునాథ రెడ్డి మేయర్గాను, జేడీ(ఎస్)కు చెందిన హేమలతా గోపాలయ్య డిప్యూటీ మేయర్గాను ఎన్నికయ్యారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. ఇక్కడ మొత్తం 198 వార్డులు ఉండగా వాటిలో 100 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 76, జేడీ (ఎస్)కు 14 స్థానాలు దక్కగా ఇతరులు 8 చోట్ల గెలిచారు. ఎమ్మెల్యేలు, ఇతరుల బలంతో కలిపి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి మంజునాథరెడ్డికి 131 ఓట్లు వచ్చాయి. అయితే.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించిన తుది నిర్ణయం కర్ణాటక హైకోర్టు నుంచి వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని సవాలు చేస్తూ ఐదుగురు బీజేపీ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్లారు. మేయర్, డిప్యూటీమేయర్లుగా ఎన్నుకోవాలంటే 131 మంది సభ్యులు కావల్సి ఉంటుంది. బీబీఎంపీ మండలిలో మొత్తం 260 మందికి ఓటుహక్కు ఉంది. వాళ్లలో 62 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఉన్నారు. ఈ ఓట్లు కలిపితేనే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. దాంతో మేయర్‌గా తమ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోగలిగింది. అయితే, ఇలా ఎమ్మెల్యేలు తదితరులకు ఓటుహక్కు కల్పించే సెక్షన్ 7, 10లను సవాలుచేస్తూ బీజేపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. మేయర్ ఎన్నికను శుక్రవారం నిర్వహించుకోవచ్చిన హైకోర్టు చెప్పినా.. తుది నిర్ణయం మాత్రం తన రూలింగ్‌కు లోబడి ఉండాలని తెలిపింది. కార్పొరేటర్లు కానివాళ్లు కూడా మేయర్ ఎన్నికల్లో పాల్గొనడంపై రాజ్యాంగం ఏమంటోందన్న విషయాన్ని చూడాల్సి ఉందని జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్ తెలిపారు. -
'మౌనంగా' ఉండమని శాసించారు
బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో జేడీఎస్ తీవ్ర పరాభవంపై మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. తాము బెంగళూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని భావిస్తే ఓటర్లు మాత్రం అందుకు స్పందించలేదని అన్నారు. ఓటమి అనంతరం ఆయన 'బీబీఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే విషయం కంటే బెంగళూరు నగరానికి మరోసారి అపాయం ఎదురవుతోందని మాత్రం చెప్పవచ్చు. ఈ ఫలితాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడరాదు, చెరువులు, భూములను కబ్జా చేసిన వారిపై పోరాటం చేయకూడదు. ఇంకా వీలైతే ఇలాంటి వాళ్లతో మీరూ (జేడీఎస్) కలిసిపోండి, అది చేతకాకపోతే మౌనంగా ఉండిపోండి' అని ప్రజలు తమ తీర్పులో స్పష్టంగా చెప్పారు' అని కుమారస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఓటర్లలో చైతన్యం పెంచే దిశగా...
జాగృతి కార్యక్రమాలను {పారంభించిన బీబీఎంపీ బెంగళూరు : బీబీఎంపీ ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పని సరిగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా బీబీఎంపీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఓటు హక్కు వినియోగం పై ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా వీధి నాటికలు తదితర కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ వీధి నాటికల కార్యక్రమాన్ని బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ బుధవారమిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోనీ బీబీఎంపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు బీబీఎంపీ ఎన్నికల్లో 50శాతానికి మించి పోలింగ్ జరగలేదని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పంచేందుకు గాను వీధి నాటికలు వంటి అనేక జాగృ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈనెల 22న జరగనున్న ఎన్నికలో 60శాతానికి పైగా పోలింగ్‌ను సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కుమార్ నాయక్ వెల్లడించారు. ఇక ఓటర్లలో జాగృని పెంపొందించే దిశగా ఏర్పాటు చేసిన ఈ వీధి నాటికల బృదాలు నగరంలో ఆరు రోజుల పాటు వీధి నాటికలు ప్రదర్శించనున్నాయని చెప్పారు. అంతేకాక ఓటర్లలో చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఇప్పటికే వాహనాలతో మొబైల్ ప్రచారాన్ని సైతం చేపట్టిన విషయాన్ని కుమార్ నాయక్ గుర్తు చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియ ఇప్పటికి సగం వరకు పూర్తైదని అన్నారు. నామినేషన్ల ఉప సంహరణకు గురువారం చివరి రోజు కాగా, శుక్రవారం నుంచి నగరంలో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కాగా, ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. నగరంలోని ప్రజలందరూ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తులని, వారంతా తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుంటారని కుమార్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎనిమిది వారాలు గడువు
పాలికె ఎన్నికల నిర్వహణపై సుప్రీం తీర్పు బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికల నిర్వహణకు మరో ఎనిమిది వారాల పాటు గడువునిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో ఈనెల 28న జరగాల్సిన బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వెనక్కు వెళ్లనుంది. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పు ప్రతి తమకు అందినతర్వాతే ఈ విషయంపై మాట్లాడగలనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచార్ తెలిపారు. వివరాలు... ఆగస్టు 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న సుప్రీం తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించడమే కాకుండా ప్రభుత్వానికి రూ.10వేల అపరాధ రుసుం విధించిన విషయం విషయం తెలిసిందే. అయితే హైకోర్టును తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈకేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. వాదనల్లో భాగంగా బీబీఎంపీ వార్డులను పునఃవిభజన చేయడంతో పాటు నూతనంగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల ఎన్నికల నిర్వహణకు కనీసం మరో మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరపున వాదనలు వినిపించిన ఫణీంద్ర....‘ప్రస్తుత తరుణంలో వార్డుల పునఃవిభజ చేయడం వల్ల ఓటర్ల జాబితాను మార్చాల్సి వస్తుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా వార్డుల రిజర్వేషన్ల జాబితా అధికారికంగా ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. అందువల్ల రిజర్వేషన్ జాబితా మార్చడానికి కాని, ఎన్నికల వాయిదా వేయడం కాని సరికాదు.’ అని వివరించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయపీఠం బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను ముగించడానికి మరో ఎనిమిది వారాల పాటు గడువు ఇస్తూ తీర్పు చెప్పింది. కాగా, ఈ విషయమై ఫణీంద్ర మాట్లాడుతూ...తాజా తీర్పు వల్ల వార్డుల పునఃవిభజనకు అవకాశం కలగదు. అంతేకాకుండా రిజర్వేషన్ల జాబితాలో ఎటువంటి మార్పు ఉండదన్నారు.అయితే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎనిమిది వారాలు వెనక్కు వెళ్లేఅవకాశం ఉందన్నారు. ఈ ఎనిమిది వారాల వాయిదా నేటి (శుక్రవారం) నుంచి అన్వయిస్తుందా లేదా ఆగస్టు 5 నుంచి అన్వయిస్తుందా అనే విషయంపై తీర్పు ప్రతి అందిన తర్వాత స్పష్టత వస్తుంది.’ అని వివరించారు. ఇదిలా ఉండగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ శ్రీనివాచార్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత పరిశీలించి న్యాయనిపుణులతో చర్చించి నూతన ఎన్నికల షెడ్యూల్ వెళ్లడించడం పై అధికారిక ప్రకటన చేస్తానన్నారు. ఇదిలా ఉండగా సుప్రీం తీర్పు వల్ల గతంలో వలే ఆగస్టు 5 లోపు కాకుండా అక్టోబర్ 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
మోగిన నగారా
సాక్షి, బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)కు ఎన్నికలు నిర్వహించడానికి ముహూర్తం కుదిరింది. జులై 28న ఒకే దశలో బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఓట్ల లెక్కింపు సైతం అదే నెల 31న జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ శ్రీనివాసాచార్ గురువారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. - బీబీఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ జులై 8న అధికారికంగా వెలువడనుంది. ఇక ఆ రోజు నుంచి 15 వరకూ నామినేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. 16న నామినేషన్ల పరిశీల న ఉంటుంది. నామినేషన్ల ఉప సంహరణకు 20 వరకూ అవకాశం ఉంది. - బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును రూ.5 లక్షలుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ విషయమై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వడానికి వీలుగా వివిధ హోదాల్లో మొత్తం 98 మంది అధికారులను నియమించనున్నారు. - జులై 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అవసరమైన చోట్ల 30న రీ పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఓట్ల లెక్కింపును జులై 31న చేపట్టనున్నారు. మొత్తంగా ఆగస్టు 1లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేయనుంది. ఇక గురువారం నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఆగస్టు 1 వరకూ కొనసాగనుంది. - బీబీఎంపీ పరిధిలో మొత్తం 198 వార్డులు ఉండగా అందులో 71,22,165 ఓటర్లు (ఈనెల 15 వరకూ) ఉన్నారు. అందులో పురుషులు 37,38,808, మహిళలు 33,82,231 మహిళలు కాగా 1,126 ఇతరులు. - ఈసారి బీబీఎంపీ ఎన్నికల కోసం మొత్తం 6,733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేయనుంది. అంత కంటే ఎక్కువ మంది ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఆక్సిలరీ పోలింగ్ బూత్‌లను కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయనుంది. - ఈ సారి ఓటింగ్ కోసం మొత్తం 11,635 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను వినియోగించనున్నారు. - నామినేషన్ వేయడానికి చివరి రోజు(జులై 15) వరకూ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. - బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి అనుమానాలు ఉంటే 080-22374740, 080-22224748, 080-22221188 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
రాజకీయాల్లోకి మరో నటిమణి
బెంగళూరు : మరో సినీనటి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనుంది. ప్రముఖ శాండల్‌వుడ్ నటి ప్రియా హాసన్ త్వరలో రాజకీయాల్లోకి రానుంది. యాక్షన్ చిత్రాల ద్వారా శాండల్‌వుడ్‌లో తనదైన ముద్ర వేసిన ప్రియా హాసన్...బిందాస్ హుడుగి, జంభద హుడుగి చిత్రాల ద్వారా ఆమె కన్నడ ప్రేక్షకులకు చేరువైంది. కాగా ప్రియా హాసన్ నటించిన 'స్మగ్లర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె సన్నద్ధం అవుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియా హాసన్ బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు రమ్య, పూజాగాంధీ, రక్షిత తదితరులు రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. వీరంతా గత ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేసి పరాజయం పొందారు. -
ఎన్నికల్లేవు !
- బీబీఎంపీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు - ఏకసభ్య పీఠం ఉత్తర్వులను రద్దు చేసిన చీఫ్ జస్టిస్ సాక్షి, బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుతానికి కాస్తంత మద్దతునిచ్చేలా హైకోర్టు తీర్పు లభించింది. మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య పీఠం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రభుత్వానికి కాస్తంత ఊరట లభించినట్లైంది. వివరాలు....బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలు హైకోర్టును సైతం ఆశ్రయించాయి. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.వి.నాగరత్న నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లైంది. ఎలాగైనా సరే ఈ ఆదేశాలను అడ్డుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేయాల్సి ఉందని, భౌగోళిక అసమానతలను నివారించడంతో పాటు బీబీఎంపీలో జరిగిన అనేక అక్రమాల పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉందని, అందువల్ల హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించేందుకు 6నెలల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీలులో కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలు పై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి డి.హెచ్.వఘేలా, న్యాయమూర్తి రామమోహన్ రెడ్డిలతో కూడిన డివిజనల్ బెంచ్ శుక్రవారం తన తీర్పును వెల్లడించింది. హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఎన్ని రోజుల్లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంపై ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరిన గడువు 6 నెలలు కాబట్టి మరో ఆరు నెలల వరకు బీబీఎంపీ ఎన్నికల నిర్వహణ గండం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఎన్నికల్లేవు !
బీబీఎంపీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఏకసభ్య పీఠం ఉత్తర్వులను రద్దు చేసిన చీఫ్ జస్టిస్ సాక్షి, బెంగళూరు : బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుతానికి కాస్తంత మద్దతునిచ్చేలా హైకోర్టు తీర్పు లభించింది. మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య పీఠం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రభుత్వానికి కాస్తంత ఊరట లభించినట్లైంది. వివరాలు....బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలు హైకోర్టును సైతం ఆశ్రయించాయి. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.వి.నాగరత్న నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లైంది. ఎలాగైనా సరే ఈ ఆదేశాలను అడ్డుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేయాల్సి ఉందని, భౌగోళిక అసమానతలను నివారించడంతో పాటు బీబీఎంపీలో జరిగిన అనేక అక్రమాల పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉందని, అందువల్ల హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించేందుకు 6నెలల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీలులో కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలు పై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి డి.హెచ్.వఘేలా, న్యాయమూర్తి రామమోహన్ రెడ్డిలతో కూడిన డివిజనల్ బెంచ్ శుక్రవారం తన తీర్పును వెల్లడించింది. హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఎన్ని రోజుల్లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంపై ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరిన గడువు 6 నెలలు కాబట్టి మరో ఆరు నెలల వరకు బీబీఎంపీ ఎన్నికల నిర్వహణ గండం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.