హీరోహీరోయిన్లతో పాటు నటీనటులకు చాలామంది అభిమానులు ఉంటారు. కొన్నిసార్లు ఇలా ఫ్యాన్స్ అని చెప్పుకొనే కొందరు సదరు యాక్టర్స్‌తో మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తాజాగా ఓ మూవీ షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటన మాత్రం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.
(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్)
ఇంతకీ ఏం జరిగింది?
కర్ణాటకలోని చిక్కమగళూరులోని ఓ ప్రాంతంలో 'కొరగజ్జ' అనే సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది. నటి శుభం పూంజా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య సెట్‌లో ఉన్నారు. సడన్‌గా బైకుపై కొందరు దుండగులు కత్తులతో అక్కడికి వచ్చారు. నటి శుభంతో అసభ్యంగా ప్రవర్తించారు. కత్తులతో ఆమె బెదిరించి, చేయిపట్టుకుని లాగారని అంటున్నారు. దీంతో షూటింగ్ నిలిచిపోయిందట.
పోలీసు కేసు పెట్టకుండా
ఇకపోతే ఈ సంఘటన కుద్రేముఖ పోలీస్ స్టేషన్ ఫరిధిలో జరిగినప్పటికీ.. దీనిపై పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయలేదట. మరోవైపు మీడియాతో మాట్లాడిన దర్శకుడు సుధీర్.. 'లక్షలు ఖర్చుపెట్టి సెట్ వేసి, అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో షూటింగ్ అంతా ఆపేయాల్సి వచ్చింది' అని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో)
Comments
Please login to add a commentAdd a comment