
రియాలిటీ షోలో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన నటి సానియా అయ్యప్పన్ (Saniya Iyappan).. తర్వాత సినిమా హీరోయిన్ అయింది. లేటెస్ట్ గా రిలీజైన మోహన్ లాల్ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇవన్నీ పక్కనబెడితే చెల్లి పెళ్లిని దగ్గరుండి చేస్తోంది.
(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ)
2014 నుంచి సినిమాలు చేస్తున్న సానియా అయ్యప్పన్.. సొంత భాష మలయాళంలోనే హీరోయిన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొచ్చిలో ఈమె సోదరి సాదికా అయ్యప్పన్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు సంగీత్ జరగ్గా సానియా మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
చెల్లి సంగీత్ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలని సానియా పోస్ట్ చేయడంతో పెళ్లి గురించి తెలిసింది. ప్రస్తుతం ఈమె నటి కాబట్టి లేటుగా మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉందేమో. అందుకే ముందే చెల్లి పెళ్లి చేసేస్తున్నట్లుంది.
(ఇదీ చదవండి: టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్)


