'ట్రైలర్ చూడగానే షాకయ్యా'.. కన్నడ చిత్రంపై అమిర్ ఖాన్ ప్రశంసలు! | Aamir Khan Praises Kannada actor Upendra upcoming film Ui The Movie | Sakshi
Sakshi News home page

Aamir Khan: 'ఈ సినిమా సూపర్‌హిట్‌ ఖాయం'.. కన్నడ చిత్రంపై అమిర్ ఖాన్ ప్రశంసలు!

Dec 12 2024 2:24 PM | Updated on Dec 12 2024 2:24 PM

Aamir Khan Praises Kannada actor Upendra upcoming film Ui The Movie

కన్నడ స్టార్‌ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తోన్న  చిత్రం ‘యుఐ: ది మూవీ’. ఈ మూవీని ఇంతకు ముందెన్నడు రాని డిఫరెంట్ ‍కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత ఉపేంద్ర నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన బాలీవుడ్ స్టార్ ‍హీరో అమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్‌ చూడగానే షాకయ్యానని తెలిపారు. అద్భుతంగా ఉందని.. కచ్చితంగా సూపర్‌హిట్‌గా నిలుస్తుందని కొనియాడారు. హిందీ ఆడియన్స్‌ను సైతం ఈ సినిమా మెప్పిస్తుందని అమిర్ ఖాన్ కొనియాడారు. అమిర్ మాట్లాడిన వీడియోను ఉపేంద్ర తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు.

కాగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర ప్రస్తుతం జైపూర్‌ చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో వీరిద్దరు కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. కాగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement