Kannada Film
-
'ట్రైలర్ చూడగానే షాకయ్యా'.. కన్నడ చిత్రంపై అమిర్ ఖాన్ ప్రశంసలు!
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘యుఐ: ది మూవీ’. ఈ మూవీని ఇంతకు ముందెన్నడు రాని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత ఉపేంద్ర నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చూడగానే షాకయ్యానని తెలిపారు. అద్భుతంగా ఉందని.. కచ్చితంగా సూపర్‌హిట్‌గా నిలుస్తుందని కొనియాడారు. హిందీ ఆడియన్స్‌ను సైతం ఈ సినిమా మెప్పిస్తుందని అమిర్ ఖాన్ కొనియాడారు. అమిర్ మాట్లాడిన వీడియోను ఉపేంద్ర తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.కాగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర ప్రస్తుతం జైపూర్ చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో వీరిద్దరు కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. కాగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.Dear Aamir sir, it was a dream come true moment to meet and seek your blessings for UI The Warner Movie 🙏thanks for your love and support ❤️#UiTheMovieOnDEC20th#Aamirkhan#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth… pic.twitter.com/EcPcIVgS8z— Upendra (@nimmaupendra) December 11, 2024 -
క్రిస్మస్ బరిలో పాన్ ఇండియా చిత్రం.. రాబిన్‌హుడ్‌కు పోటీ తప్పదా?
రాజమౌళి ఈగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోణ తర్వాత సుదీప్ చేస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేశారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. డిసెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుదీప్ తన ట్వీట్లో రాస్తూ..' నిరీక్షణ ఇంకా ఉంది. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మీ ప్రోత్సాహానికి, సహనానికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. అయితే అదే రోజున టాలీవుడ్ మూవీ రాబిన్‌హుడ్ కూడా రిలీజవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నితిన్‌తో పోటీ పడనున్నాడు కిచ్చా సుదీప్.కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు.It's been quite a wait. Finally happy to announce the release date.Thanks for the unlimited patience shown by all you friends out there and the consistent encouragement.🤗❤️#MaxTheMovie hits the theaters this Dec 25th.https://t.co/car6H2hmEb— Kichcha Sudeepa (@KicchaSudeep) November 27, 2024 -
మూడు వారాల్లోనే ఓటీటీకి భారీ బడ్జెట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. డాక్టర్. సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఫుల్ యాక్షన్ మూవీగా వచ్చి బఘీరా ఓటీటీ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే. Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024 -
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్.. గ్లింప్స్ అదిరిపోయింది!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన చిత్రం కాంతార. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. కాంతార: చాప్టర్-1 పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీఎత్తున నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దాదాపు కాంతార రిలీజైన రెండేళ్ల తర్వాత ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాంతార పార్ట్-1 రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Step into the sacred echoes of the past 🔥#KantaraChapter1 - Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.Watch the First Look Teaser ▶️ https://t.co/8cGsjMKXA7#KantaraChapter1onOct2 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/vBctAk2Zgs— Hombale Films (@hombalefilms) November 18, 2024 -
తెలుగులో రిలీజ్ కాబోతున్న మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ!
ఈ మధ్యకాలంలో కన్నడ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అయితే కొన్ని అక్కడ రిలీజ్ అయిన రోజే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని మాత్రం అక్కడ సూపర్ హిట్ అయితేనే కొంత సమయం తీసుకొని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కూడా తెలుగులో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. అదే భైరతి రణగల్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం కర్ణాటకలో రిలీజ్ అయి హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సూపర్ హిట్ మూవీ "మఫ్తీ"కి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ భైరతి రణగల్ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంతోషంలో శివరాజ్ కుమార్ అభిమానులు సినిమాలోని ఆయన మేకోవర్ తో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. "భైరతి రణగల్" చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగి బాబు, దేవరాజ్ నటించారు. -
అస్కార్ బరిలో ఇండియన్ షార్ట్ ఫిలిం
‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ అనే ఇండియన్ షార్ట్ ఫిలిం 2025 ఆస్కార్‌కు అర్హత సాధించింది. చిదానంద S నాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ రేసుకు అర్హత దక్కించుకుందని తాజాగా చిత్ర నిర్మాత తెలిపారు. పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడిన ఈ చిత్రం ఆస్కార్ బరిలో ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లైవ్ యాక్షన్ విభాగంలో తమకు అవకాశం దక్కినట్లు నిర్మాత పేర్కొన్నారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ చిత్రం అవార్డ్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు. ఓ వృద్ధురాలి కోడిని కొందరు దొంగలించడంతో కథ ప్రారంభం అవుతుంది. ఎలాగైనా సరే దానిని కనుగొని ఆ కోడిని తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమెపడే తపనను ఇందులో దర్శకుడు చూపారు. ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సత్తా చాటిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ చిత్రం.. ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకుంటుందని ఆశిస్తున్నారు.మైసూర్‌కు చెందిన నాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే MBBS పూర్తి చేసిన ఆయన సినిమా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తున్నారు. ఆయన నిర్మించిన సినిమా ఆస్కార్‌కు అర్హత సాధించడంతో తన సొంత ఊరు అయిన శివమొగ్గలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత్ నుంచి 'లాపతా లేడీస్' అస్కార్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమిర్‌ఖాన్ మాజీ సతీమణి కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. -
ఓటీటీకి సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'శాకాహారి'. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈనెల 24 నుంచి ఆహా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు గొప్పరాజు రమణ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఓటీటీ ప్రియులను మెప్పించేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. Crime, emotions, and unexpected turns - #Shakhahaari has it all! Premiering on aha on Aug 24. pic.twitter.com/oortLZG2nH— ahavideoin (@ahavideoIN) August 21, 2024 -
సడన్‌గా ఓటీటీకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక కొత్త కొత్త సినిమాలు చూసేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను ఓటీటీలు అందిస్తున్నాయి. ఏ భాష సినిమా అయిన డబ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గతంలో కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి రెండు పార్టులుగా వచ్చి సక్సెస్ సాధించింది. ప్రేమకథగా వచ్చిన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి ఆదరణ దక్కించుకుంది తాజాగా మరో కన్నడ ప్రేమకథ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కథగా తెరకెక్కించిన ఒండ్రు సరళ ప్రేమ కథె చిత్రం సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వినయ్ రాజ్‌కుమార్, మల్లికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 8న రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను తెలుగు డబ్బింగ్లో తీసుకోస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్వస్తిష్ట, రాజేశ్ నటరంగ, అరుణ్ బలరాజ్, సాధు కోకిల, కార్తిక్ మహేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రామ్ మూవీస్ పతాకంపై మైసూర్ రమేశ్ నిర్మించగా.. వీర్ సామ్రాట్ సంగీతం అందించారు. -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ఆ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ’. హేమంత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ రావడంతో సీక్వెల్‌గా సప్త సాగరాలు దాటి - సైడ్ బి తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 17న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై రక్షిత్ శెట్టి తాజాగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. కథేంటంటే..? డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ. -
నెల రోజుల్లోపే ఓటీటీ వచ్చేస్తోన్న స్టార్ హీరో మూవీ!
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత జంటగా నటించిన చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్-ఏ. ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాగా సూపర్ హిట్ టాక్ అందుకుంది. దీంతో వెంటనే 'సప్త సాగరాలు దాటి సైడ్- బి' మూవీని తెరకెక్కించారు మేకర్స్. హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను మెప్పించలేకపోయింది. దీంతో అప్పుడే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'యానిమల్' వైబ్‌లోనే ఆర్జీవీ.. డైరెక్టర్ గురించి అలాంటి ట్వీట్) ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీపై క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ లవ్ స్టోరీ డిసెంబర్ 15న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన రాలేదు. ఈనెల 15న స్ట్రీమింగ్ అయితే నెల రోజుల్లోపే ఓటీటీలో చూస్తే ఛాన్స్ దక్కనుంది. (ఇది చదవండి: రోడ్డుపై తాగి వీరంగం సృష్టించిన బాలీవుడ్ స్టార్? వీడియో వైరల్) -
ఓటీటీలు అలా చేయడం మంచిది కాదు: రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్
కన్నడ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం కాంతార సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా ఆయన గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్ఎఫ్డీసీ ఫిల్మ్ బజార్‌లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతే కన్నడ చిత్రాలకు రెవెన్యూ వచ్చేదని.. కొవిడ్ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరగడంతో ఆ పరిస్థితి లేదని అన్నారు. అలాగే కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా సక్సెస్ కాకపోతే ఓటీటీ సంస్థలు తిరస్కరించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. తనకు కన్నడ చిత్ర పరిశ్రమను వీడే ఉద్దేశం లేదని తెలిపారు. రిషబ్ మాట్లాడుతూ..' కాంతార సూపర్ హిట్ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిని నేను తిరస్కరించా. కన్నడ ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం కాంతార ఏ లెజెండ్: చాప్టర్ 1 పైనే దృష్టి సారించాం. కాంతార తీసే సమయంలోనే ప్రీక్వెల్ ఆలోచన వచ్చింది. మూవీ హిట్ కావడంతో ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు. కాగా.. ఇఫి వేడుకల్లో కాంతారకు సిల్వర్ పీకాక్(స్పెషల్ జ్యూరీ అవార్డ్) దక్కింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 -
ఆ సినిమా షూటింగ్లో దౌర్జన్యం.. కత్తులు తెచ్చి నటితో అలా!
హీరోహీరోయిన్లతో పాటు నటీనటులకు చాలామంది అభిమానులు ఉంటారు. కొన్నిసార్లు ఇలా ఫ్యాన్స్ అని చెప్పుకొనే కొందరు సదరు యాక్టర్స్‌తో మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తాజాగా ఓ మూవీ షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటన మాత్రం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) ఇంతకీ ఏం జరిగింది? కర్ణాటకలోని చిక్కమగళూరులోని ఓ ప్రాంతంలో 'కొరగజ్జ' అనే సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది. నటి శుభం పూంజా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య సెట్లో ఉన్నారు. సడన్‌గా బైకుపై కొందరు దుండగులు కత్తులతో అక్కడికి వచ్చారు. నటి శుభంతో అసభ్యంగా ప్రవర్తించారు. కత్తులతో ఆమె బెదిరించి, చేయిపట్టుకుని లాగారని అంటున్నారు. దీంతో షూటింగ్ నిలిచిపోయిందట. పోలీసు కేసు పెట్టకుండా ఇకపోతే ఈ సంఘటన కుద్రేముఖ పోలీస్ స్టేషన్ ఫరిధిలో జరిగినప్పటికీ.. దీనిపై పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయలేదట. మరోవైపు మీడియాతో మాట్లాడిన దర్శకుడు సుధీర్.. 'లక్షలు ఖర్చుపెట్టి సెట్ వేసి, అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో షూటింగ్ అంతా ఆపేయాల్సి వచ్చింది' అని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీనికి కారణాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో) -
తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్‌జెండర్.. హీరోగా ఎవరంటే?
ఏ సినీ పరిశ్రమ అయినా సరే ఎప్పుడు కొత్తదనం ఉండాల్సిందే. అది కంటెంట్ అయినా.. నటీనటులైనా సరే. కాన్సెప్ట్ కొత్తగా ఉంటేనే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా కొత్తవారితో ప్రయోగాలు కొత్త ప్రయత్నాలతో కొత్త కాన్సెప్ట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఏ ఇండస్ట్రీలో సినిమా హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటూ వస్తున్నారు. ఇటీవల హీరో, హీరోయిన్ల విషయంలో కొత్తవారితోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈసారి కన్నడ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త, ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. తొలిసారిగా ఓ సినిమాలో ట్రాన్స్‌జెండర్ హీరోయిన్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: అక్కడేమో క్రేజ్ లేదు.. ఇక్కడ చూస్తే ఫ్లాప్.. మిగిలింది ఆ సినిమా ఒక్కటే!) హీరోయిన్గా అవకాశం అయితే ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో తెరకెక్కుతోన్న చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ. ఈ సినిమా కోసం ఏకంగా ఆరుగురు హీరోయిన్లకు ఎంపిక చేశారు. వారిలో ట్రాన్స్‌జెండర్ వైశాలి కూడా ఒకరు. దీంతో తొలిసారిగా ఓ హీరోయిన్గా నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది వైశాలి. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన వైశాలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వైశాలి మాట్లాడుతూ..'మేం ఎందుకు అడుక్కోవాలి. మాకు కూడా ఒక జీవితం ఉంది. అందుకే నటించాలని కలలు కన్నా. అందుకు తగ్గట్టుగానే మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఫేస్బుక్ ద్వారా తనకు ఈ సినిమా అవకాశం వచ్చింది' అని వెల్లడించింది. అంతే కాకుండా ట్రాన్స్జెండర్లను ప్రజలు చూసే తీరుపై అసహనం వ్యక్తం చేసింది వైశాలి. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కూర్చోవడానికి జనం సంకోచిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి పరిస్థితుల్లో సినిమా అవకాశం కోసం నేరుగా గోవాలోని ఓ క్లబ్లో డాన్సర్‌గా చేరానని వైశాలి పేర్కొంది. గోవాలో ఉద్యోగం మానేసి ఈ సినిమాలో నటించినట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సుబ్రమణి హీరోగా నటించారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అసలు ఎవరీ వైశాలి? వైశాలికి మొదట్నుంచీ నటనపై ఆసక్తి ఎక్కువ. అందువల్లనే వైశాలికి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం హీరోయిన్గా కనిపించనున్న వైశాలి గతంలో గోవాలోని నైట్ క్లబ్‌లలో డ్యాన్సర్‌గా పనిచేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో బెంగళూరుకు వచ్చేసింది. కామెడీ ఖిలాడీ సీజన్- 2 కోసం జరిగిన ఆడిషన్స్‌లో కూడా వైశాలి పాల్గొంది. -
‘కాంతారా’ తరహాలో ‘కలివీరుడు’
కేజీయఫ్ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ ‘కాంతారా’తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. ‘కలివీర’ పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధిస్తూ... రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు ‘కలివీరుడు’గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని... "మినిమం గ్యారంటీ మూవీస్’పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘అవి’ దర్శకత్వంలో... రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. "కాంతారా" కోవలో "కలివీరుడు" తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అచ్చిబాబు నమ్మకం వ్యక్తం చేశారు. -
'కాంతార'కు భారీ ఊరట.. వారికి ఊహించని షాక్.!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కాంతార' ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈనెల 24 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. (చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు) తాజాగా కాంతార చిత్రబృందానికి భారీ ఊరట లభించింది. వరాహరూపం పాటపై మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. దీనిపై విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ కోర్టు వారి పిటిషన్ కొట్టివేసింది. వరాహ రూపం పాట ప్రదర్శనపై మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. కాగా.. తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని వాళ్లు ఆరోపిస్తున్నారు. అందువల్లనే ఓటీటీలోనూ ఆ పాటను ప్రదర్శించలేదు. ఈ పాట కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అడ్డంకులు తొలగిపోవడంతో ఓటీటీ ప్రేక్షకులకు ఆ పాట అందుబాటులోకి రానుంది. కాంతార మూవీ క్లైమాక్స్‌లో ‘వరాహరూపం’ పాట, రిషబ్‌శెట్టి నటన ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేని పరిస్థితి. కానీ ఇటీవలే మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. ఇవాళ కోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడింది. -
మరో భాషలో వస్తున్న ‘కాంతార’.. రిలీజ్ ఎప్పుడంటే?
కేవలం మౌత్‌టాక్‌తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సినిమా 'కాంతార'. ప్రస్తుతం ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచిన వరాహరూపం పాటను తొలగించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే దాదాపు భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తాజాగా మరో భాషలో రిలీజ్ కానుంది. (చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు) కర్ణాటకలోని తులునాడు సంస్కృతి, సంప్రదాయల నేపథ్యంలో రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన తులు భాషలో అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా తులు భాషలో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయనుంది. ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్గా నటించారు. ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, కిశోర్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మరో పాత్రలో కనిపించిన షానిల్ గురు తులు వర్షన్ డబ్బింగ్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం వెల్లడించింది. -
ఓటీటీకి 'కాంతార ' మూవీ.. అప్పటిదాకా ఆగాల్సిందేనా?
కన్నడ చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా థియేటర్లను ఊపేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలైన ‘కాంతార’ అతి తక్కువ సమయంలోనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కేవలం మౌత్ టాక్‌తోనే పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార’ అదరగొట్టింది. (చదవండి: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా?) రిషబ్‌శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడమే అసలు కారణం. ఇప్పటికే ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదట నవంబర్ 4న ఓటీటీకి వస్తోందని వార్తలొచ్చాయి. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు. దీంతో అందరి నోటా కాంతార ఓటీటీకి ఎప్పుడు వస్తోందని చర్చించుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారిక ప్రకటన చేస్తారా? అని ఆశిస్తున్నారు. (చదవండి: ‘కాంతార’కు కాసుల పంట.. ఒక్క తెలుగులోనే రూ.50 కోట్లు వసూళ్లు) అసలు కారణం ఇదే: అక్టోబరు 15న టాలీవుడ్లో ‘కాంతార’ విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్న థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. హిందీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్లైమాక్స్, రిషబ్‌శెట్టి నటనను చూసేందుకు చాలా మంది రెండోసారి సినిమా చూసేందుకు వస్తున్నారు. కలెక్షన్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘కాంతార మూవీని ప్రస్తుతం ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చిత్రబృందానికి లేనట్లు తెలుస్తోంది. పైగా రాబోయే రోజుల్లో ‘హోంబలే ఫిల్మ్స్’ నుంచి మరిన్నీ క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీంతో అమెజాన్ ప్రైమ్ కూడా కాంతారను ఓటీటీకి తెచ్చే విషయంలో తొందరపడటం లేదని సమాచారం. అన్నీ కుదిరితే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన తర్వాతే ఓటీటీకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. మరీ అప్పటి దాకా ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే. -
ఇది అసలు ఊహించలేదు.. కాంతార హీరో రిషబ్ శెట్టి
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేశారు. టాలీవుడ్లో మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్రారంభించింది. నేడు తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న థియేటర్లను కాంతారా చిత్రబృందం సందర్శించింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: ‘కాంతార’కి బిగ్ షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు!) హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ... 'ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. కేవలం రెండు వారాల్లో ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. ఇంతలా ఆదరించినందుకు టాలీవుడ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పటికి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...' సినిమాకు భాష ముఖ్యం కాదు.. కేవలం ఎమోషన్ ఒకటే ఉంటుంది అని కాంతార నిరూపించింది. ఈ సినిమాను కన్నడలో చూసి బన్ని వాసు నాతో చెప్పాడు. ఆ తర్వాత సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేశాం'. అని చెప్పారు. -
కన్నడ చిత్రసీమ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం!
ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయిన కన్నడ చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్–2, విక్రాంత్ రోణా, చార్లీ 777 కాంతార తదితర చిత్రాలు ఇతర పరిశ్రమలను కన్నడం వైపు తిరిగి చూసేలా చేశాయి. 2022లో ఈ 5 చిత్రాలు కలిపి రూ.1,851 కోట్ల వసూళ్ల దాటి వసూలు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేశాయి. కాగా తాజాగా కలల చిత్ర ప్రసాద్ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతుంది. దీని పేరు కేడీ ది డెవిల్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ కేడీఎం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న నాలుగవ చిత్రం ఇది. అదేవిధంగా కర్ణాటక నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ధృవ సర్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందన్నారు. ఉదాహరణకు రాముడు ఉన్న కాలంలోనే రావణుడు ఉన్నాడని పేర్కొన్నారు. యాక్షన్, సెంటిమెంట్, వినోదం వంటి జనరంజకమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం కేడీ ది డెవిల్ అని తెలిపారు. కాగా కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల బెంగుళూరులో భారీఎత్తున నిర్వహించినట్లు నిర్మాత తెలిపారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు తెలిపారు. చదవండి: Kiran Abbavaram Tweet: కిరణ్ అబ్బవరం ట్వీట్.. దారుణంగా నెటిజన్స్ ట్రోల్స్ -
ఇంకా అరువేనా.. ‘కాంతార’ కథలు లేవా?
‘కాంతార’.. ఇప్పుడు ఈ కన్నడ చిత్రం గురించి యావత్ సీనీ ప్రపంచం చర్చిస్తోంది. ఇందులో స్టార్ హీరోలు లేరు. పాన్ ఇండియా కంటెంట్ కాదు. కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమా కథ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘అబ్బా.. ఏం తీశాడురా’ అని రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే రిషబ్ శెట్టి మాత్రం పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాసుకోలేదు. కేవలం కన్నడ ఆడియన్స్ మెప్పు పొందడానికే ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ అది పాన్ ఇండియా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. ఇదే కాదు కన్నడకు చెందిన చాలా సినిమాలు.. ఈ మధ్య పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. పరభాష అభిమానుల మనసును దోచుకుంటున్నాయి. ఆ మధ్య విడుదలైన ఛార్లీ 777 మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాలను గెలుచుకుంది. ఓ కుక్కకి, మనిషికి ఉన్న బంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఆయన కన్నడలో ఫేమస్ కానీ.. పాన్ ఇండియా ప్రేక్షకులను పెద్దగా తెలియదు. అయినా ఆయన చిత్రాన్ని అందరూ ఆదరించారు. కారణం కథే. రాజ్ బీ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కన్నడ మూవీ ‘గరుడ గమన వృషభ వాహన’ గతేడాది విడుదలై దాదాపు అన్ని భాషల ఇండస్ట్రీలను షేక్ చేసింది. దీనికి కారణం కథే. ఇవేకాదు.. గతంలోనూ యూటర్న్, నాతిచరామి, కావలుదారి, లవ్ మాక్ టెయిల్, దియా లాంటి కన్నడ చిత్రాలు అన్ని భాషల ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేశాయి. (చదవండి: కాంతార మూవీ రివ్యూ) ఇక ఒక్కసారి మన టాలీవుడ్‌ని పరిశీలిస్తే.. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి బడా చిత్రాలతో పాటు కార్తికేయ-2 లాంటి చిన్న సినిమా కూడా ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. యావత్ సినీ ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేశాయి. కానీ ఇది మా తెలుగు చిత్రం అని తెలుగువారు గొప్పగా చెప్పుకునే చిత్రాలు మాత్రం రావడం లేదు. మన ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రాదాలయను దేశానికి చూపించే ప్రయత్నం టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలు చేయడం లేదనిపిస్తోంది మన సినిమా గురించి అందరూ మాట్లాడుకోవాలంటే పాన్ ఇండియా ప్రాజెక్టే అయ్యుండాలా? తెలుగులో కొత్త కథలు లేవా? ఇప్పటికీ పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా? మీడియం బడ్జెట్లో ‘కాంతార’లాంటి సినిమాను మనం తెరకెక్కించలేమా? దర్శకనిర్మాతలు అటువైపు ఎందుకు ఆలోచించడం లేదు? పోనీ బడా హీరోలు అయినా ఒక్క అడుగు ముందుకేసి ప్రయోగాలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటికీ రీమేకులనే నమ్ముకుంటున్నారు. మరోవైపు.. ఇతర భాషల్లో సంచనాలు సృష్టిస్తున్న సినిమాల్ని ఇక్కడ డబ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కన్నడ, మలయాళ, తమిళ మాదిరి టాలీవుడ్లో కూడా ప్రయోగాత్మక చిత్రాలు రావాలి. భారీ బడ్జెట్‌తో గ్రాండియర్ గా, విజువల్ ఎఫెక్ట్స్ తో తీస్తేనే భారీ వసూళ్లు వస్తాయన్న అపనమ్మకాల్ని పోగొట్టాలి. కొత్త కథలను ఎంకరేజ్ చేస్తే టాలీవుడ్ రేంజ్ మరోస్థాయికి పెరగడం ఖాయం. -
ఆకట్టుకుంటున్న అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా ‘పుష్పరాజ్’ ట్రైలర్
కన్నడ హీరో ధ్రువ సర్జా, రచిత రామ్, హరిప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పరాజ్ ది సోల్జర్’. ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం నేడు ఈ మూవీ ఆడియో, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్లో చేతులు మీదుగా చిత్ర ట్రైలర్ విడుదల చేయించింది. చదవండి: క్రేజీ ఆఫర్.. మహేశ్-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు? ఇక ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘పుష్పరాజ్’ టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కమర్సియల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.ఇదే హీరో తెలుగులో చేసిన పొగరు సినిమా కూడా బాగా ఆడింది.హీరో ధ్రువ సర్జా ను చూస్తుంటే అర్జున్ గారు వయసులో ఉన్నప్పుడు మా పల్లెలో గోపాలుడు టైమ్ లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆలాగే ఉన్నాడు’ అని అన్నారు. ఇక టైలర్ చాలా చూశానని, చాలా బాగుందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. -
పుష్పరాజ్‌గా వస్తోన్న అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ
రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు బొడ్డు అశోక్. సినిమారంగంలో కూడా తన సత్తా చాటుకోవడానికి నిర్మాతగా మారాడాయన. ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్: ది సోల్జర్' చిత్రాన్ని ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్.శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. ఆగస్టు 19న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. 'భార్జరీ సినిమా ద్వారా కన్నడ రంగంలో అడుగుపెట్టాడు అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా. ఈయన హీరోగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. ధ్రువ సర్జా సరసన అందాల తార రచితా రామ్ హరిప్రియ హీరోయిన్ గా నటించింది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అల్లు అర్జున్ గారు నటించిన "పుష్ప" సినిమాతో పుష్పరాజ్ పేరు ఎంతో ఫేమస్ అయ్యింది. ఎప్పుడైతే ఈ టైటిల్ పెట్టామో మా సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నాకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి రంగంలో సక్సెస్ అయ్యే నేను సినిమా రంగంలో కూడా నిర్మాతగా సక్సెస్ అవుతానన్న నమ్మకంతో ఉన్నాను. తెలుగులో అర్జున్ చిత్రాలు ఎలాగైతే ఆదరించారో.. ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది' అన్నారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండ్, ఆ ఛాన్స్ వస్తే బాగుండు అతడు డ్రగ్స్ తీసుకోవడం కళ్లారా చూశా.. హీరో మాజీ ప్రేయసి -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి చెల్లెలు
Sai Pallavi Sister Puja Kannan Debut In Kollywood As Heroine: హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోతో కాకుండా కేవలం నటనతోనే ఎంతోమంది అభిమానులకు దగ్గరైంది ఈ మలయాళీ బ్యూటీ. తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే పూజా తెరంగేట్రం గురించి పలు వార్తలు వచ్చినా తాజాగా వాటిని నిజం చేస్తూ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ను రివీల్ చేసింది. తమిళ స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకత్వంలో చిత్తారాయి సెవ్వనం అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా నటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రముఖ నటుడు సముద్రఖని సైతం ఉన్నారు. ఇక ఈ సినిమాను థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి అక్క సాయిపల్లవిలా పూజా కన్నన్ హీరోయిన్గా ఏ మేరకు మెప్పిస్తుందనే చూడాల్సి ఉంది. -
కస్తూరి మహల్లో ఏం జరిగింది?
‘లవ్లీ, అడ్డా, రౌడీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు శాన్వీ. ఆ తర్వాత కన్నడ సినిమాలతో బిజీ అయ్యారామె. తాజాగా కన్నడంలో ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కన్నడ దర్శకుడు దినేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న 50వ చిత్రం ‘కస్తూరి మహల్’లో లీడ్ రోల్ చేయనున్నారు శాన్వీ. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఇంతకీ కస్తూరి మహల్ కథేంటి? అందులో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అక్టోబర్ మొదటివారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలన్నది చిత్రబృందం ప్లాన్ అని టాక్. -
కన్నడ ఎంట్రీ?
తమన్నా దాదాపుగా 15 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు పాపులారిటీ సంపాదించారామె. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, స్పెషల్ సాంగ్స్.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశారామె. తాజాగా కథానాయికగా మొదటిసారి ఓ కన్నడ సినిమా చేయబోతున్నారని టాక్. యశ్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కె.జీ.ఎఫ్’లో చేసిన ప్రత్యేక గీతం ద్వారా తొలిసారి కన్నడ తెరపై మెరిశారు తమన్నా. యశ్ హీరోగా నర్తన్ అనే కన్నడ దర్శకుడు ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు తమన్నా ఓకే అంటే కథానాయికగా ఇదే ఆమె చేయబోయే మొదటి కన్నడ సినిమా అవుతుంది.