
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి కన్నుమూశారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుండె పోటు రావడంతోనే రాకేశ్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉడిపిలో జరిగిన ఓ మెహందీ వేడుకలో ఈ విషాదం చోటు చేసుకుంది.
కాగా.. కన్నడలో ప్రముఖ రియాలిటీ షో కామెడీ కిలాడిగలు ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ షోలో సీజన్-3 విన్నర్‌గా రాకేశ్ నిలిచారు. మరోవైపు రాకేశ్ ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్‌గా వస్తోన్న కాంతారా చాప్టర్-1లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేశ్ మృతి పట్ల పలువురు కన్నడ సినీతారలు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
Always with a pure sweet hearted smile , ever loving , and extremely talented artist , you will always remain in our heart , deeply saddened , Rakesh we miss you! pic.twitter.com/Qx9Tx0bOOT
— Pruthvi Ambaar (@AmbarPruthvi) May 12, 2025