sandalwood actors
-
కన్నడ హీరో దర్శన్ కేసు.. అతని భార్యకు నోటీసులు!
ప్రస్తుతం శాండల్‌వుడ్ అంతటా హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ పేర్లే వినిపిస్తున్నాయి. బెంగళూరులో జరిగిన ఓ అభిమాని హత్య కేసు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. తన ప్రియురాలు పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపాడని రేణుకాస్వామి అనే అభిమానిని దారుణ హత్య చేశారని వీరిపై ఆరోపణలొచ్చాయి. అయితే హీరో దర్శన్‌కు ఇదివరకే పెళ్లయింది. విజయలక్ష్మిని వివాహం చేసుకోగా.. ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. గత పదేళ్లుగా పవిత్ర గౌడతో రిలేషన్లో ఉన్నారు. తాజాాగ హత్య కేసులో నోటీసు అందుకున్న విజయలక్ష్మి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన భార్య వాంగ్మూలాన్ని బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రేణుకస్వామి హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇండస్ట్రీకి సంబంధం లేదు: కిచ్చా సుదీప్అయికే మరోవైపు.. ఈ వ్యవహారంతో కన్నడ ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ ఇప్పటికే హీరో కిచ్చా సుదీప్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు. -
తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్‌జెండర్.. హీరోగా ఎవరంటే?
ఏ సినీ పరిశ్రమ అయినా సరే ఎప్పుడు కొత్తదనం ఉండాల్సిందే. అది కంటెంట్ అయినా.. నటీనటులైనా సరే. కాన్సెప్ట్ కొత్తగా ఉంటేనే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా కొత్తవారితో ప్రయోగాలు కొత్త ప్రయత్నాలతో కొత్త కాన్సెప్ట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఏ ఇండస్ట్రీలో సినిమా హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటూ వస్తున్నారు. ఇటీవల హీరో, హీరోయిన్ల విషయంలో కొత్తవారితోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈసారి కన్నడ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త, ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. తొలిసారిగా ఓ సినిమాలో ట్రాన్స్‌జెండర్ హీరోయిన్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: అక్కడేమో క్రేజ్ లేదు.. ఇక్కడ చూస్తే ఫ్లాప్.. మిగిలింది ఆ సినిమా ఒక్కటే!) హీరోయిన్గా అవకాశం అయితే ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో తెరకెక్కుతోన్న చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ. ఈ సినిమా కోసం ఏకంగా ఆరుగురు హీరోయిన్లకు ఎంపిక చేశారు. వారిలో ట్రాన్స్‌జెండర్ వైశాలి కూడా ఒకరు. దీంతో తొలిసారిగా ఓ హీరోయిన్గా నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది వైశాలి. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన వైశాలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వైశాలి మాట్లాడుతూ..'మేం ఎందుకు అడుక్కోవాలి. మాకు కూడా ఒక జీవితం ఉంది. అందుకే నటించాలని కలలు కన్నా. అందుకు తగ్గట్టుగానే మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఫేస్బుక్ ద్వారా తనకు ఈ సినిమా అవకాశం వచ్చింది' అని వెల్లడించింది. అంతే కాకుండా ట్రాన్స్జెండర్లను ప్రజలు చూసే తీరుపై అసహనం వ్యక్తం చేసింది వైశాలి. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కూర్చోవడానికి జనం సంకోచిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి పరిస్థితుల్లో సినిమా అవకాశం కోసం నేరుగా గోవాలోని ఓ క్లబ్లో డాన్సర్‌గా చేరానని వైశాలి పేర్కొంది. గోవాలో ఉద్యోగం మానేసి ఈ సినిమాలో నటించినట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సుబ్రమణి హీరోగా నటించారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అసలు ఎవరీ వైశాలి? వైశాలికి మొదట్నుంచీ నటనపై ఆసక్తి ఎక్కువ. అందువల్లనే వైశాలికి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం హీరోయిన్గా కనిపించనున్న వైశాలి గతంలో గోవాలోని నైట్ క్లబ్‌లలో డ్యాన్సర్‌గా పనిచేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో బెంగళూరుకు వచ్చేసింది. కామెడీ ఖిలాడీ సీజన్- 2 కోసం జరిగిన ఆడిషన్స్‌లో కూడా వైశాలి పాల్గొంది. -
హీరో భార్యకు సీమంతం.. ఏకంగా సమాధి వద్దే శుభకార్యం!
శాండల్‌వుడ్ హీరో ధృవ సర్జా కన్నడనాట పరిచయం అక్కర్లేని పేరు. 2012లో విడుదలైన 'అద్దురి' అనే సినిమా ద్వారా ఎంట్రీ వచ్చారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడైన ధృవ సర్జాకు కన్నడ చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వర్గీయ చిరంజీవి సర్జాకి తమ్ముడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పనికి సర్వత్రా చర్చ మొదలైంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ధృవ సర్జా తన భార్యకు సీమంత వేడుక నిర్వహించారు. అయితే ఈ శుభకార్యం జరిగిన విధానం కన్నడ పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసింది. (ఇది చదవండి: పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!) చిరంజీవి సర్జా కోసం.. తన అన్నయ్య చిరంజీవి సర్జా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధృవ సర్జా భార్య ప్రేరణ గర్భంతో ఉంది. ఈ శుభ సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకను చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో నిర్వహించడం విశేషం. శ్రీకృష్ణ జన్మాష్టమిని చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధృవ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫామ్ హౌస్ మొత్తం రకరకాల పూలతో అలంకరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ధృవ సర్జా తన సోదరుడు చిరంజీవి సర్జా మరణంతో ఆయన కుటుంబం ఇప్పటికీ బాధలో ఉంది. ధృవ సర్జా ఇంట్లో జరిగిన కార్యక్రమాల్లో చిరు జ్ఞాపకంగా ఉండేలా సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకతో చిరును ప్రత్యేకంగా అన్నపై ఉన్న ప్రేమను ధృవ సర్జా చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ధృవ సర్జా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి పోస్ట్.. ఇది మీ పర్సనల్ అంటూ నెటిజన్స్ ఫైర్!) కాగా.. ధృవ సర్జా 2019లో ప్రేరణను వివాహం చేసుకున్నారు. ప్రేరణను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధృవ సర్జాకు 2022 అక్టోబర్‌లో ఆడబిడ్డకు జన్మించింది. ప్రస్తుతం ఈ జంట రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ధృవ సర్జా ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. ధృవ సర్జా ప్రస్తుతం కేడి, మార్టిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. -
అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!
సినీ ఇండస్ట్రీలో నటుడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్రబాబును బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో వీరేంద్ర స్నేహితుల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు.. ప్రాణహాని ఉందంటూ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. కాగా.. శాండల్‌వుడ్‌లో వీరేంద్రబాబు స్వయం కృషి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ అంబరీష్ ప్రధాన పాత్రలో నటించారు. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ) అసలేం జరిగిందంటే.. 2021లో అపస్మారక స్థితిలోకి వెళ్లగా వీరేంద్ర తనపై అత్యాచారం చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. ఆ తర్వాత మొత్తం వీడియో చిత్రీకరించి తనను మహిళను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు తెలిపింది. రూ.15 లక్షలు ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడని.. అతని వేధింపులు భరించలేక వీరేంద్రకు కొంత డబ్బు ఇచ్చినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత జులై 30న మళ్లీ ఆ మహిళకు ఫోన్ చేసిన వీరేంద్ర బాబు.. ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతని స్నేహితుల ప్రమేయం కూడా ఉందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుతో వీరేంద్ర, అతని స్నేహితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొడిగేహళ్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ నటుడు నితిన్ గోపి (39) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందూతూ తుది శ్వాస విడిచారు. నితిన్ గోపి అకాల మరణంతో శాండల్‌వుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నితిన్ గోపీ తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు) హలో డాడీ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నితిన్ గోపీ కెరీర్ ప్రారంభించారు. ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి చిత్రాలలో కూడా ఆయన నటించారు. శృతి నాయుడు నిర్మించిన పునర్ వివాహ సీరియల్లో కూడా నితిన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితిన్ భక్తి సీరియల్ హర హర మహాదేవ్లో కొన్ని ఎపిసోడ్స్‌లో కనిపించారు. అంతేకాకుండా కొన్ని తమిళ సీరియల్స్‌లో కూడా నటించాడు. ప్రస్తుతం నితిన్ కొత్త సీరియల్‌కి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. (ఇది చదవండి: 'త్వరలోనే కీర్తి సురేశ్ పెళ్లి .. క్లారిటీ ఇచ్చిన నటి!) -
వ్యభిచారగృహం నిర్వహిస్తున్న సినీ నటుడి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: వ్యభిచార గృహం నిర్వహిస్తున్న కన్నడ నటుడు మంజునాథ్ అలియాజ్ సంజును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం విడుదలైన న్యూరాన్ సినిమాలో మంజునాథ్ నటించారు. వేశ్యవాటిక నిర్వహిస్తూ యాప్ ద్వారా విటులను రప్పించేవాడు. పోలీసులు దాడి చేసి మంజునాథ్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: (Tamannaah: ఆ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు) -
కన్నడ చిత్రసీమ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం!
ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయిన కన్నడ చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్–2, విక్రాంత్ రోణా, చార్లీ 777 కాంతార తదితర చిత్రాలు ఇతర పరిశ్రమలను కన్నడం వైపు తిరిగి చూసేలా చేశాయి. 2022లో ఈ 5 చిత్రాలు కలిపి రూ.1,851 కోట్ల వసూళ్ల దాటి వసూలు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేశాయి. కాగా తాజాగా కలల చిత్ర ప్రసాద్ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతుంది. దీని పేరు కేడీ ది డెవిల్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ కేడీఎం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న నాలుగవ చిత్రం ఇది. అదేవిధంగా కర్ణాటక నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ధృవ సర్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందన్నారు. ఉదాహరణకు రాముడు ఉన్న కాలంలోనే రావణుడు ఉన్నాడని పేర్కొన్నారు. యాక్షన్, సెంటిమెంట్, వినోదం వంటి జనరంజకమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం కేడీ ది డెవిల్ అని తెలిపారు. కాగా కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల బెంగుళూరులో భారీఎత్తున నిర్వహించినట్లు నిర్మాత తెలిపారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు తెలిపారు. చదవండి: Kiran Abbavaram Tweet: కిరణ్ అబ్బవరం ట్వీట్.. దారుణంగా నెటిజన్స్ ట్రోల్స్ -
KGF రికార్డ్స్ పై కన్నేసిన " కాంతారా "
-
ఐసీయూలో నటుడు సత్యజిత్.. పరిస్థితి విషమం
Actor Sathyajith Admitted In Hospital: శాండల్‌వుడ్ సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొద్దిరోజుల క్రితం కామెర్లు సోకడంతో పాటు గత శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. బీపీ, షుగర్ ఉన్న కారణంగా చికిత్సకు స్పందించడం లేదని తనయుడు ఆకాశ్‌జిత్ తెలిపారు. చికిత్స ఖర్చులకు ఫిలిం చాంబర్, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చదవండి: Ram Pothineni: హీరో రామ్‌కు గాయాలు.. షూటింగ్‌కు బ్రేక్ సింపుల్‌గా ధ్రువసర్జా జన్మదిన వేడుకలు శాండల్‌వుడ్ నటుడు ధ్రువ సర్జా సోమవారం సింపుల్‌గా పుట్టినరోజును ఆచరించారు. ఏటా తన స్నేహితులు, అభిమానులతో కలిసి వైభవంగా జరుపుకొనే వారు. కరోనాతో కారణంగా, ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. చదవండి: MAA Elections 2021: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు -
ఆ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతా...
యశవంతపుర: డ్రగ్స్ దందాకు సంబంధించి మత్తు పదార్థాల నియంత్రణ దళం (ఎన్సీబీ) అధికారులు నటులు, సంగీత దర్శకులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. వీటి మధ్య పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ తనకు రక్షణ కల్పిస్తే సినిమా రంగానికి చెందిన ముఖ్యల పేర్లను బయటపెడతానని ప్రకటించడం శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు కలిగిస్తోంది. డ్రగ్స్ కేసులో విచారణ తప్పదని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంథ్ తెలిపారు. కొన్నేళ్లుగా డ్రగ్స్ సరఫరా గత గురువారం డ్రగ్స్ డీలర్లు అనికా, అనూప్, రాజేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఆసక్తికర వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి పలువురు నటీ–నటులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. టీవీ రియాలీటీ షో కళాకారులు, డ్యాన్సర్లు కూడా డ్రగ్స్ వాడేవారని, నటీమణులు ఎక్కువగా మత్తు పదార్థాలను కొనేవారని చెప్పినట్లు వెల్లడి. సౌందర్య పోషణ కోసం నటీమణులు డ్రగ్స్‌ను ఉపయోగించేవారని తెలిపారు. సినిమా విడుదలైన వెంటనే నటీనటులు, యూనిట్ సిబ్బంది నగరంలో పేరుమోసిన హోటల్స్, పబ్‌లకు వెళ్లి పార్టీలు చేసుకునేవారు. లాక్డౌన్ సమయంలో అనికా డ్రగ్స్‌ను కోరినచోటికి సరఫరా చేసేవారు. ఇంద్రజిత్ లంకేశ్‌కు పిలుపు నటీనటులు ఎక్కడ డ్రగ్స్ తీసుకొనేవారో వెళ్లడిస్తానని పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ చెబుతున్నారు. ఎన్సీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పోలీసు కమిషనర్ కమల్ పంథ్ తెలిపారు. కేసును తమకు అప్పగించిన కేసును విచారిస్తామని అయన తెలిపారు. ఇంద్రజిత్ ప్రకటనపై దృష్టి పెట్టామన్నారు. విచారణకు రావాలని లంకేశ్‌కు శనివారం నోటీసులు పంపినట్లు చెప్పారు. విద్యాసంస్థలూ పారాహుషార్ బనశంకరి: పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమైన తరువాత మాదకద్రవ్యాల దుష్పరిణామాల పట్ల జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తాం, కాలేజీలు, హాస్టళ్లలో డ్రగ్స్ దొరికితే సంబంధిత విద్యాసంస్థలనే బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి బసవరాజబొమ్మై తెలిపారు. శనివారం హావేరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీసీబీ పోలీసులు పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, మాదకద్రవ్యాల ముఠా గురించి కీలక సమాచారం తెలిసిందన్నారు. విదేశీయుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది, ఆ ముఠాలను కూకటి వేళ్లతో పెకలిస్తామన్నారు. – హోంమంత్రి -
నటులకు మ్యాచ్ ఫిక్సింగ్ మరక
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రోజుకొక కొత్త విషయం బయటకు వస్తోంది. ఇన్ని రోజులు ఆటగాళ్లు, కోచ్‌లు, బుకీల బాగోతంతోపాటు హనీట్రాప్ మరక కూడా నమోదైంది. తాజాగా ఈ స్కామ్‌లో శాండల్వుట్ నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నగర పోలీసు కమిషనర్ భాస్కర్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నటీనటులకు సంబంధం ఉందని అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత జరిగే పార్టీల్లో నటీనటులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ విందుల్లో నటీనటులు, ఆటగాళ్లతో కలిసిమెలిసి కనిపించేవారన్నారు. తద్వారా కొద్ది రోజుల్లోనే నటులు భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసిందని తెలిపారు. హఠాత్తుగా వీరికి అంత డబ్బు ఎలా వచ్చిందనే విషయాన్ని మున్ముందు విచారణలో తెలుసుకుంటామన్నారు. కేవలం రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత ధనవంతులయిపోవడం సాధ్యమయ్యే పనేనా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. బెళగావి ప్యాంథర్స్ కోచ్ సు«దీర్ శింధేను మంగళవారం అరెస్టు చేసినట్లు, అతని నుంచి విచారణలో పలు విషయాలను రాబట్టినట్లు చెప్పారు. ఆ క్లబ్ నుంచే ఫిక్సింగ్ సుధీర్ శింధేకు చెందిన జయనగరలోని సోషల్ క్రికెట్ క్లబ్లో చాలా మంది ఆటగాళ్లు క్రికెట్ ఆడేవారని, ఆ ఆటగాళ్లే దాదాపుగా చాలామంది బెళగావి ప్యాంథర్స్ జట్టులో ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా ఈ క్లబ్లో శిక్షణ పొందిన క్రికెటర్లు కేపీఎల్లోని చాలా జట్లలో చేరారని తెలిపారు. ఆయా జట్లలో చేరిన ఈ ఆటగాళ్లతో∙మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే వారని చెప్పారు. ఆ క్రికెట్ క్లబ్‌కు బెళగావి జట్టు యజమాని అస్ఫాక్ థార్ అలి తరచూ వచ్చి ఆటగాళ్లతో పరిచయాలు పెంచుకునే వాడని తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న సినీ నటులు అప్రూవర్‌గా మారితే వారికి పోలీసుల నుంచి సహాయంతోపాటు రక్షణ కల్పిస్తామని కమిషనర్ తెలిపారు. కేపీఎల్ రద్దు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కేపీఎల్కు మాయని మచ్చ పడింది. ఇప్పటికే ఈ కేసులో ఆటగాళ్లు, జట్ల యజమానులు, కోచ్‌లతో కలుపుకుని సుమారు 9 మంది వరకు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఫిక్సింగ్ కేసు తేలే వరకు కేపీఎల్ నిర్వహించరాదని కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) నిర్ణయించింది. వచ్చే ఏడాది జరగనున్న కేపీఎల్ టోర్నీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. క్యాబ్‌లకు సీసీ కెమెరా, జీపీఎస్ ఓలా, ఉబర్ తదితర ట్యాక్సీలు, క్యాబ్‌లల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చుకోవాలని కమిషనర్ సూచించారు. హైదరాబాద్ వద్ద పశువైద్యురాలిపై దారుణ హత్యాచారం నేపథ్యంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ట్యాక్సీల్లో సీసీటీవీ కెమెరా, జీపీఎస్, ఎమెర్జెన్సీ బటన్ అమర్చుకోవడం తప్పనిసరి అని చెప్పారు. హైదరాబాద్ ఘటన తర్వాత బెంగళూరు నగర పోలీసులు సిద్ధం చేసిన బీసీపీ సురక్షా యాప్ డౌన్లోడ్లు పెరిగాయని తెలిపారు. -
హనీట్రాప్ కేసులో హీరోయిన్లు?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్ చేసిన హనీట్రాప్ కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన ముగ్గురు నటీమణుల పాత్ర ఇందులో ఉన్నట్లు సీసీబీ పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఒకరు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాగా, మరో ఇద్దరు రెండు, మూడు సినిమాల్లో నటించిన వారని సమాచారం. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి త్వరలోనే వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు సుమారు 25కు పైగా చిత్రాల్లో పలువురు ప్రముఖ హీరోలతో నటించిన హీరోయిన్గా భావిస్తున్నారు. మరో తార చిన్న సినిమాలు టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించారు. ఇక మూడో నటి బహుభాషా చిత్రాల్లో నటించిన హీరోయిన్గా గుర్తించారు. వారం క్రితం బహిర్గతమైన హనీట్రాప్ బాగోతంలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల శృంగార వీడియోలు బయటపడ్డాయి. రాఘవేంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు, కొందరు యువతులను ఎమ్మెల్యేల వద్దకు పంపి పరిచయాలు పెంచుకున్నాడు. వారితో నాయకులు గడుపుతున్న రహస్య వీడియోలు సేకరించి భారీగా డబ్బు డిమాండ్ చేయడం, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాఘవేంద్ర, అతని ప్రియురాలు పోలీసుల అదుపులో ఉన్నారు. చదవండి: వీఐపీల ఫోన్ డేటా ఆమె గుప్పిట్లో -
కాజల్ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది
చెన్నై: కాజల్‌అగర్వాల్‌ను తాజాగా కర్ణాటక ఆహ్వనించింది. కళాకారులకు భాషా బేధం ఉండదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సౌలభ్యం ఎక్కువన్నది విధితమే. ఒక భాషలో నటించిన చిత్రం విజయం సాధిస్తే వెంటనే ఇతర భాషా దర్శకులు ఆ చిత్రాలపై, అందులో నటించిన హీరోయిన్లపైనా దృష్టిసారిస్తారు. అలా ప్రస్తుతం హీరోయిన్లుగా నటిస్తున్న వారందరూ బహుభాషా నటీమణులగా పేరు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. నటి కాజల్‌అగర్వాల్ కూడా బహుభాషా నటినే. బాలీవుడ్లో రంగప్రవేశం చేసి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రవేశించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. అయితే దక్షిణాది భాషల్లో ఒకటైన కన్నడంలో ఈ బ్యూటీ ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది తాజాగా అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. కన్నడంతో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న ఉపేంద్రతో జతకడుతోంది. కబ్జా అనే చిత్రంలో ఈ జంట నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. తమిళంలో కమలహాసన్‌కు జంటగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు భాషల్లోనూ మరో అవకాశం లేకపోవడంతో కన్నడ పరిశ్రమపై దృష్టి సారించింది. అయితే అక్కడ త్రిష, నయనతార వంటి వారు నటించినా పేద్దగా పేరుతెచ్చుకోలేకపోయారు. మరి కాజల్‌అగర్వాల్‌కు శాండిల్‌వుడ్‌లో భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ ఒక రౌండ్ కొడుతుందా లేక ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకుంటుందా అన్న ఆసక్తి మాత్రం సినీ వర్గాల్లో నెలకొంది. కాగా శాండిల్‌వుడ్ ఎంట్రీ గురించి కాజల్ మాట్లాడుతూ తాను నటించే ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తానని చెప్పింది. ఇప్పుడు కన్నడంలో మొదటి సారి నటిస్తున్నాను. ఈ అనుభవం కొత్తగా ఉంది అని పేర్కొంది. ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో విడుదల చేయనున్నారని తెలిపింది. ఇప్పటికి 50 చిత్రాలను పూర్తి చేశానని, వంద చిత్రాలను పూర్తి చేయడమే తన లక్ష్యమని కాజల్‌అగర్వాల్ పేర్కొంది. అయితే లక్ష్యంపెద్దదిగానే ఉంది. అందుకు మరో 10, 15 ఏళ్లు పడుతుందే. అప్పటికి వయసు ప్రభావం చూపదా? అయినా నూరు చిత్రాల్లో నటించడమే తన లక్ష్యం అంటోంది గానీ, హీరోయిన్‌గానే అని అనలేదు కాబట్టి అక్కగా, వదినగా అయినా తన టార్గెట్‌ను పూర్తి చేసుకుంటుందేమో. అన్నట్టు ఈ జాణ నటించిన ఏకైక హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ప్యారిస్ ప్యారిస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నా, విడుదలకు మోక్షం కలగలేదు. -
బిగ్‌బాస్‌లో పాల్గొనవద్దు
బొమ్మనహళ్లి (బెంగళూరు) : బుల్లి తెరపై తీవ్ర ప్రభావం చూపుతున్న బిగ్‌బాస్ షోలో శాండిల్‌ఉడ్ నటులు, నిపుణులు ఎవరూ పాల్గొనవద్దని డిమాండ్ చేస్తూ కన్నడ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు సా.రా గోవిందు డిమాండ్ చేశారు. గోవిందు నేతృత్వంలో శనివారం నిర్మాతలు, సినిమా డిస్ట్రిబూటర్లు బిడిదిలోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో వేసిన బిగ్‌బాస్ సెట్టింగ్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సారా గోవిందు మాట్లాడుతూ... యువత రియాల్టీ షోపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని, దీని వల్ల సినిమా నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. నటులు రియాల్టీ షోలలో పాల్గొన కూడదని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ బిగ్‌బాస్ రియాల్టీ షోలు జరిగినా అవి రాత్రి 10 గంటలపైన ప్రసారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో నిర్మాత హరీష్, ఎం.ఎన్.సురేష్, గిరిష్, గణేష్, ఆర్ఎస్.గౌడ, నరసింహులు, జయన్నలు తదితరులు పాల్గొన్నారు.