హీరో భార్యకు సీమంతం.. ఏకంగా సమాధి వద్దే శుభకార్యం! | Sandalwood Actor Dhruva Sarja Wife Baby Shower Goes Viral | Sakshi
Sakshi News home page

Dhruva Sarja: అన్నపై ప్రేమను చాటుకున్న హీరో.. చిరంజీవి సమాధి వద్దే భార్య సీమంతం!

Published Mon, Sep 11 2023 7:45 PM | Last Updated on Mon, Sep 11 2023 8:58 PM

Sandalwood Actor Dhruva Sarja Wife Baby Shower Goes Viral - Sakshi

శాండల్‌వుడ్ హీరో ధృవ సర్జా కన్నడనాట పరిచయం అక్కర్లేని పేరు. 2012లో విడుదలైన 'అద్దురి' అనే సినిమా ద్వారా ఎంట్రీ వచ్చారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడైన ధృవ సర్జాకు కన్నడ చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వర్గీయ చిరంజీవి సర్జాకి తమ్ముడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పనికి సర్వత్రా చర్చ మొదలైంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ధృవ సర్జా తన భార్యకు సీమంత వేడుక నిర్వహించారు. అయితే ఈ శుభకార్యం జరిగిన విధానం కన్నడ పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసింది. 

(ఇది చదవండి: పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!)

చిరంజీవి సర్జా కోసం.. 

తన అన్నయ్య చిరంజీవి సర్జా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధృవ సర్జా భార్య ప్రేరణ గర్భంతో ఉంది. ఈ శుభ సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకను చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో నిర్వహించడం విశేషం.  శ్రీకృష్ణ జన్మాష్టమిని చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధృవ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  ఫామ్ హౌస్ మొత్తం రకరకాల పూలతో అలంకరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. 

ధృవ సర్జా తన సోదరుడు చిరంజీవి సర్జా మరణంతో ఆయన కుటుంబం ఇప్పటికీ బాధలో ఉంది. ధృవ స‌ర్జా ఇంట్లో జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో చిరు జ్ఞాప‌కంగా ఉండేలా సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వేడుక‌తో చిరును ప్ర‌త్యేకంగా అన్నపై ఉన్న ప్రేమను ధృవ సర్జా చాటుకున్నారు. ఈ  కార్యక్రమానికి ధృవ సర్జా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. 

(ఇది చదవండి: బుల్లితెర నటి పోస్ట్.. ఇది మీ పర్సనల్‌ అంటూ నెటిజన్స్ ఫైర్!)

కాగా.. ధృవ సర్జా 2019లో ప్రేరణను వివాహం చేసుకున్నారు. ప్రేరణను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధృవ సర్జాకు 2022 అక్టోబర్‌లో ఆడబిడ్డకు జన్మించింది. ప్రస్తుతం ఈ జంట రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ధృవ సర్జా ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. ధృవ సర్జా ప్రస్తుతం కేడి, మార్టిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement