కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి సర్జా. నాలుగేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణంతో శాండల్‌వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య ఐదు నెలల గర్భవతి కావడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.
అయితే ఇవాళ చిరంజీవి సర్జా జయంతి కావడంతో ఆయన భార్య మేఘన భర్తను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వే మార్గదర్శకమని భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆయన సోదరుడు ధృవ సర్జా నటించిన మార్టిన్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. విడుదల సమయంలో అన్నకు ప్రత్యేకంగా నివాళి అర్పించాడు.
కాగా.. 2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. అయితే ఊహించని విధంగా ఈ కన్నడ స్టార్ జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు కూడా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment