
ప్రేమ ఎంత మధురమో.. అంత కఠినం కూడా! ప్రాణంగా ఇష్టపడ్డవారిని మనకు కాకుండా చేస్తుంది. అది ప్రియురాలే కానక్కర్లేదు, కన్నవాళ్లు, అన్నదమ్ములు, సోదరులు, ఎవరైనా సరే మనసుకు నచ్చినవారు దూరమైతే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. కన్నడ హీరో ధ్రువ సర్జాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది. తన అన్నయ్య, హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో 2020 జూన్ 7న మరణించాడు.
ఆయన చనిపోయి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు ధ్రువ. సమయం దొరికితే చాలు చిరు సమాధి దగ్గరే వాలిపోతున్నాడు. ఐదు రోజుల క్రితం ధ్రువ అన్న సమాధి దగ్గర నిద్రించగా అది చూసిన ఆయన అభిమాని దాన్ని వీడియో తీసి హీరోని నిద్రలేపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా అన్న మీద తమ్ముడికి ఉన్న ప్రేమ చూసి అభిమానులు ఎమోషనలయ్యారు.
ఇకపోతే ధ్రువ సర్జా భార్య ప్రేరణ రెండోసారి గర్భం దాల్చగా తన సీమంతాన్ని సైతం సమాధి దగ్గరే నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే తాజాగా ఈ హీరో మరో ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. ఇందులో అతడు తన కూతురితో కలిసి అన్న సమాధిపై ఆడుకున్నాడు. 'లవ్ యూ బ్రో' అంటూ చిరంజీవి సర్జాను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు. ఇది చూసిన నెటిజన్లు మీ అన్నపై నీకెంత ప్రేమో.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా చిరు సమాధి కర్ణాటక నెలగుళిలోని ధ్రువ సర్జా ఫామ్ హౌస్‌లో ఉంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment