'చిరంజీవి అన్నయ్య కోసం ఇలా చేయండి'.. ఫ్యాన్స్‌కు తమ్ముడి విజ్ఞప్తి! | Dhruva Sarja Released Video About Late Brother Chiranjeevi's Rajamarthanda Movie | Sakshi
Sakshi News home page

Dhruva Sarja: అన్నయ్య చివరి సినిమా.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసిన ధృవ సర్జా..!

Published Tue, Oct 3 2023 4:43 PM | Last Updated on Tue, Oct 3 2023 5:25 PM

Kannda Actor Dhruva Sarja Video Released About Chiranjeevi Movie - Sakshi

2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. ఈ మూవీ ఈనెల 6న  థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే కన్నడ స్టార్ నటుడు జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అన్నయ్య చివరి మూవీ రిలీజ్ సందర్భంగా ధృవ సర్జా ఓ వీడియో రిలీజ్ చేశారు. అభిమానులంతా అన్నయ్య సినిమాను థియేటర్లకు వచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. అన్నయ్య సినిమాను చూసి ఈనెల 17న జయంతిని జరుపుకోవాలని సూచించారు. 

(ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్‌ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!)
 
ఈ సందర్భంగా ధృవ సర్జా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. రాజామార్తాండ సినిమా రిలీజ్ కానుండడంతో కన్నడ నటుడు దర్శన్ కూడా వీడియోను రిలీజ్ చేశారు. అయితే గతంలో తన అన్నయ్యకు డబ్బింగ్ చెప్పడానికి ధృవకు సమయం ఇవ్వాలని.. అతనిపై ఒత్తిడి చేయవద్దని దర్శన్ 'రాజమార్తాండ' నిర్మాతను అభ్యర్థించినట్లు సమాచారం. అన్నయ్య మరణంతో మానసికంగా కుంగిపోయిన ధృవ సర్జా..  డబ్బింగ్ చెప్పేందుకు  కొంత సమయం విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన భార్య సీమంతం సందర్భంగా చిరంజీవి సర్జా సమాధి వద్దనే నిర్వహించి అన్నపై తన ప్రేమను చాటుకున్నారు. అన్నదమ్ముల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా ధృవ సర్జా నిలుస్తున్నారు. 

కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన 'రాజమార్తాండ'. ఈ చిత్రాన్ని శ్రీ మాదేశ్వర ప్రొడక్షన్స్‌పై  నివేదిత ఎన్, ప్రణవ్ గౌడ, శివ కుమార్‌లు నిర్మించారు. ఈ మూవీకి అర్జున్ జన్య సంగీతం అందించారు.

(ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్‌ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement