Dhruva Sarja
-
రూ.120 కోట్ల బడ్జెట్.. మరో ఓటీటీకి బాక్సాఫీస్ డిజాస్టర్ మూవీ!
హీరో అర్జున్ మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ హీరో ధృవ సర్జా. ధృవ్ సర్జాకు జోడీగా వైభవి శాండిల్య, అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఆయన నటించిన భారీ యాక్షన్ చిత్రం మార్టిన్. ఈ మూవీకి అర్జున్ కథను అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా గతనెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.భారీ అంచనాల మధ్య రిలీజైన మార్టిన్ ఊహించవి విధంగా బోల్తాకొట్టింది. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకే పరిమితమైంది. కేజీఎఫ్ సినిమాతో పోల్చినప్పటికీ అంచనాలు అందుకోలేకపోయింది.అయితే ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ రోజు నుంచే మార్టిన్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా... ఆహాలో కేవలం తెలుగు వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా చూసేయండి. -
చిరంజీవిని గుర్తు చేసుకున్న భార్య.. ఎమోషనల్ పోస్ట్!
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి సర్జా. నాలుగేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణంతో శాండల్‌వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య ఐదు నెలల గర్భవతి కావడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.అయితే ఇవాళ చిరంజీవి సర్జా జయంతి కావడంతో ఆయన భార్య మేఘన భర్తను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వే మార్గదర్శకమని భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆయన సోదరుడు ధృవ సర్జా నటించిన మార్టిన్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. విడుదల సమయంలో అన్నకు ప్రత్యేకంగా నివాళి అర్పించాడు.కాగా.. 2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. అయితే ఊహించని విధంగా ఈ కన్నడ స్టార్ జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు కూడా సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
హీరో ధృవ సర్జా ‘మార్టిన్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
'కేజీఎఫ్'ని మించిపోయే లాంటి సినిమా.. ట్రైలర్ చూస్తే వామ్మో!
కొన్నేళ్ల ముందు వరకు యాక్షన్ అంటే ఓ లెక్క. 'కేజీఎఫ్' తర్వాత యాక్షన్ అంటే మరో లెక్క. ఎందుకంటే ఫైట్స్ తీసే విధానమే మారిపోయింది. అయితే దీన్ని ఫాలో అయిపోతూ చాలా మూవీస్ వస్తున్నాయి. అంతెందుకు కన్నడ నుంచి ఇప్పుడు 'మార్టిన్' అనే మూవీ రాబోతుంది. తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తే వామ్మో అనకుండా ఉండలేరేమో?(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?)ఎందుకంటే దాదాపు 2 నిమిషాల 7 సెకన్ల నిడివితో తీసిన ఈ ట్రైలర్లో కళ్లు చెదిరిపోయే విజువల్స్, రేసీ యాక్షన్ సీన్స్ మాత్రమే చూపించారు. అసలు కథేంటనేది రివీల్ చేయలేదు. ట్రైలర్ చూస్తేనే వామ్మో ఇదేంట్రా బాబోయ్ అనిపించింది. చివర్లో హీరో తన నోటితో కుక్కకి బిస్కెట్ అందించే సీన్ అయితే విచిత్రంగా అనిపించింది.కన్నడ హీరో ధ్రువ సర్జా ఇందులో లీడ్ రోల్ చేయగా.. మనకు బాగా తెలిసిన హీరో అర్జున్ దీనికి స్టోరీ రాయడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషలతో పాటు జపనీస్, చైనీస్, అరబిక్, కొరియన్, రష్యన్, స్పానిష్ లాంటి విదేశాల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. అంటే దాదాపు 13 భాషల్లో రిలీజ్ అనమాట. అక్టోబరు 11న ఇది థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))<br>Powered by <a href="https://youtubeembedcode.com">how to embed a youtube video</a> and <a href="https://gamstopcancel.com/">how to cancel gamstop</a> -
అర్జున్ మేనల్లుడి యాక్షన్ చిత్రం.. ట్రైలర్ చూశారా?
ప్రముఖ కన్నడ హీరో, అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం మార్టిన్. ఈ సినిమాను పవర్ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి అర్జున్ సర్జా కథను అందించారు. తాజాగా మార్టిన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్‌గానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో రూపొందించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో విజువల్స్, యాక్షన్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీతో సహా ప్రపంచవ్యాప్తంగా 13 భాషల్లో విడుదల చేయనున్నారు. -
కన్నడ సినీ నిర్మాతను మోసం చేసిన విశాఖ వాసి
కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సీనియర్ హీరో అర్జున్ కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాసవి ఎంటర్ప్రైజెస్ ద్వారా ఉదయ్ కె మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే, రూ. 3 కోట్ల వరకు విశాఖ వాసి సత్యారెడ్డి తమను మోసం చేశాడంటూ మార్టిన్ చిత్ర నిర్మాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నిందితుడు సత్యారెడ్డిని విశాఖపట్నంలో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మార్టిన్ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్‌ను సత్యారెడ్డి ఏజన్సీకి సదరు నిర్మాత అప్పగించారు. అయితే, డబ్బు తీసుకుని ఆ సినిమాకు చేయాల్సిన పనిని చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని నిర్మాత ఉదయ్ కె మెహతా ఇలా చెప్పారు.. 'మార్టిన్ సినిమాకు ప్రత్యేక గ్రాఫిక్స్, సిజి, విఎఫ్ఎక్స్ వర్క్ అవసరం కాబట్టి మేము గత జూన్-జూలైలో సత్యారెడ్డి నేతృత్వంలోని గ్రాఫిక్ డిజైన్ ఏజెన్సీని సంప్రదించాము. మేము వారికి అడ్వాన్స్‌గా రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాము. అయితే, సినిమాకు సంబంధించిన పని విషయంలో సత్య ఆలస్యం చేస్తూ గత డిసెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ జూన్‌లో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు.' అని మార్టిన్ చిత్ర నిర్మాత చెప్పారు. సినిమా విడుదల ఆలస్యానికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ఆయన నిర్లక్ష్యం వల్ల తాము 15 వేర్వేరు సంస్థలకు గ్రాఫిక్స్ పనిని అప్పగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషనులో సత్యారెడ్డిపై ఉదయ్ కె మెహతా చీటింగ్ కేసు పెట్టారు. తాజాగా ఆయన బెంగళూరు నుంచి విశాఖ వెళ్లాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. -
మీ ఆశీస్సులే మమ్మల్ని బతికించాయి: స్టార్ హీరో పోస్ట్ వైరల్!
ఇటీవల విమాన ప్రమాదాల గురించే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇలాంటి అనుభవాన్ని పంచుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా విమానం ల్యాండింగ్ సమస్య రావడంతో భయాందోళనకు గురైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. ఆ సమయంలో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఆమెతో పాటే ఉన్నారు. తాజాగా అలాంటి అనుభవమే మరో స్టార్ హీరోకు ఎదురైంది. తొలిసారి మృత్యువు నుంచి ఆ దేవుడే మమ్మల్ని కాపాడారంటూ కన్నడ నటుడు ధృవ సర్జా పోస్ట్ చేశారు. నా జీవితంలో మొదటిసారి ఎదురైన చేదు సంఘటనను ఇన్‌స్టా ద్వారా షేర్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఫ్లైట్ ల్యాండింగ్‌కు ఇబ్బందులు రావడంతో మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం అంతా క్షేమంగా ఉన్నామని వెల్లడించారు. ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఢిల్లీ నుంచి ఓ పాట చిత్రీకరణ కోసం శ్రీనగర్‌కు ధృవ సర్జా బృందం బయలుదేరింది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అందరూ ఒక్కసారిగా తీవ్ర భయందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ చాకచక్యంగా వ్యవహరించిన సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో చిత్రబృంద సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ మాకు నిజంగా పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఇండిగో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో తీవ్ర అల్లకల్లోల వాతావరణ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించడంతో శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. కాగా..కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఓ పాట షూట్ చేసేందుకు శ్రీనగర్ వెళ్లారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) -
రాముడి ప్రాణప్రతిష్ఠ రోజే పిల్లలకు పేర్లు పెట్టుకున్న స్టార్ హీరో.. ఎందుకంటే?
యాక్షన్ ప్రిన్స్, శాండల్‌వుడ్ నటుడు ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు తమ పిల్లలకు పేర్లు పెట్టారు. తెలుగు వారికి సుపరిచయం అయిన అర్జున్‌కు ధ్రువ సర్జా మేనళ్లుడు అవుతాడనే విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యుల సమావేశంలో పిల్లలకు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అర్జున్ సర్జా పాల్గొన్నారు. ఆంజనేయుడికి గొప్ప భక్తుడైన ధ్రువ సర్జా.. తన పిల్లలకు ఏం పేరు పెట్టాలనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీకి తెర పడింది. దీంతో పాటు తొలిసారిగా ఆయన కుమారుడి ఫోటో కూడా రివీల్ అయింది. అయోధ్యలో, రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున తన పిల్లలకు పేర్లు పెట్టారు. తన కూతురికి రుద్రాక్షి, కుమారుడికి హయగ్రీవ అని నామకరణం చేశారు. వాయుపుత్ర హనుమంతుడు మహిరావణుడిని సంహరించడానికి పంచముఖి ఆంజనేయస్వామిగా అవతరించాడు. పంచముఖి అంటే ఐదు ముఖాలు. ఇందులో హనుమంతుని ముఖంతో సహా నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడతో సహా ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో నుంచి హయగ్రీవ అనే పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు ధ్రువ సర్జా.. ధృవ దంపతులకు 2022 ప్రారంభంలో కుమార్తె జన్మించగా.. 2023 సెప్టెంబర్‌లో ఆయనకు మగబిడ్డ పుట్టాడు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున రోజున తన పిల్లలకు పేర్లు పెట్టాలని ఆయన ఇన్నిరోజులు వేచి చూశాడు. హనుమంతుడిని రాముడికి సేవకుడిగా పిలుస్తారు.. అలాంటి ఆంజనేయుడికి పరమ భక్తుడు ధ్రువ సర్జా.. అందుకే రామమందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం రోజున పిల్లలకు పేర్లు పెట్టారు. దీనిపై మాట్లాడిన ధృవ సర్జా.. అయోధ్యలో 12.20కి పూజలు జరిగాయి. మేము అదే సమయంలో మా పిల్లలకు పేర్లు పెట్టాము. సంజయ్ దత్ కూడా శివ భక్తుడు. తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఆయన సంతోషించాడు. రుద్రాక్ష అంటే ఆ శివుడికి చాలా ఇష్టమైనది అని తెలిసిందే.. త్వరలో కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళతామని ఆయన చెప్పాడు. -
'చిరంజీవి అన్నయ్య కోసం ఇలా చేయండి'.. ఫ్యాన్స్‌కు తమ్ముడి విజ్ఞప్తి!
2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. ఈ మూవీ ఈనెల 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే కన్నడ స్టార్ నటుడు జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అన్నయ్య చివరి మూవీ రిలీజ్ సందర్భంగా ధృవ సర్జా ఓ వీడియో రిలీజ్ చేశారు. అభిమానులంతా అన్నయ్య సినిమాను థియేటర్లకు వచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. అన్నయ్య సినిమాను చూసి ఈనెల 17న జయంతిని జరుపుకోవాలని సూచించారు. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) ఈ సందర్భంగా ధృవ సర్జా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. రాజామార్తాండ సినిమా రిలీజ్ కానుండడంతో కన్నడ నటుడు దర్శన్ కూడా వీడియోను రిలీజ్ చేశారు. అయితే గతంలో తన అన్నయ్యకు డబ్బింగ్ చెప్పడానికి ధృవకు సమయం ఇవ్వాలని.. అతనిపై ఒత్తిడి చేయవద్దని దర్శన్ 'రాజమార్తాండ' నిర్మాతను అభ్యర్థించినట్లు సమాచారం. అన్నయ్య మరణంతో మానసికంగా కుంగిపోయిన ధృవ సర్జా.. డబ్బింగ్ చెప్పేందుకు కొంత సమయం విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన భార్య సీమంతం సందర్భంగా చిరంజీవి సర్జా సమాధి వద్దనే నిర్వహించి అన్నపై తన ప్రేమను చాటుకున్నారు. అన్నదమ్ముల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా ధృవ సర్జా నిలుస్తున్నారు. కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన 'రాజమార్తాండ'. ఈ చిత్రాన్ని శ్రీ మాదేశ్వర ప్రొడక్షన్స్‌పై నివేదిత ఎన్, ప్రణవ్ గౌడ, శివ కుమార్‌లు నిర్మించారు. ఈ మూవీకి అర్జున్ జన్య సంగీతం అందించారు. (ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు) View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) -
ఇటీవలే సమాధి వద్ద భార్య సీమంతం.. తండ్రిగా ప్రమోషన్ పొందిన హీరో
కన్నడ హీరో ధ్రువ సర్జా ఇంట పండగ వాతావరణం నెలకొంది. ధ్రువ సర్జా- ప్రేరణ శంకర్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. వినాయక చవితి(సెప్టెంబర్ 18న) రోజు ప్రేరణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ధ్రువ సర్జా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'సాధారణ ప్రసవం జరిగింది. బేబీ పుట్టింది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఇటీవల ధ్రువ సర్జా.. తన భార్యకు ఘనంగా సీమంతం ఫంక్షన్ చేసిన సంగతి తెలిసిందే! శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే తన భార్యకు సీమంత వేడుక నిర్వహించాడు. ఈ వేడుకను తన అన్నయ్య స్వర్గీయ చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో సెలబ్రేట్ చేశాడు. అన్నయ్య ఆశీర్వాదాలు తన కుటుంబానికి ఉండాలనే ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) చదవండి: అసిస్టెంట్ పెళ్లిలో ధనుశ్ సందడి.. వీడియో వైరల్ -
సమాధిపై పడుకుంటూ కూతురితో ఆడుకున్న హీరో, వీడియో వైరల్
ప్రేమ ఎంత మధురమో.. అంత కఠినం కూడా! ప్రాణంగా ఇష్టపడ్డవారిని మనకు కాకుండా చేస్తుంది. అది ప్రియురాలే కానక్కర్లేదు, కన్నవాళ్లు, అన్నదమ్ములు, సోదరులు, ఎవరైనా సరే మనసుకు నచ్చినవారు దూరమైతే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. కన్నడ హీరో ధ్రువ సర్జాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది. తన అన్నయ్య, హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో 2020 జూన్ 7న మరణించాడు. ఆయన చనిపోయి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు ధ్రువ. సమయం దొరికితే చాలు చిరు సమాధి దగ్గరే వాలిపోతున్నాడు. ఐదు రోజుల క్రితం ధ్రువ అన్న సమాధి దగ్గర నిద్రించగా అది చూసిన ఆయన అభిమాని దాన్ని వీడియో తీసి హీరోని నిద్రలేపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా అన్న మీద తమ్ముడికి ఉన్న ప్రేమ చూసి అభిమానులు ఎమోషనలయ్యారు. ఇకపోతే ధ్రువ సర్జా భార్య ప్రేరణ రెండోసారి గర్భం దాల్చగా తన సీమంతాన్ని సైతం సమాధి దగ్గరే నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే తాజాగా ఈ హీరో మరో ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. ఇందులో అతడు తన కూతురితో కలిసి అన్న సమాధిపై ఆడుకున్నాడు. 'లవ్ యూ బ్రో' అంటూ చిరంజీవి సర్జాను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు. ఇది చూసిన నెటిజన్లు మీ అన్నపై నీకెంత ప్రేమో.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా చిరు సమాధి కర్ణాటక నెలగుళిలోని ధ్రువ సర్జా ఫామ్ హౌస్‌లో ఉంది. View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) చదవండి: -
హీరో భార్యకు సీమంతం.. ఏకంగా సమాధి వద్దే శుభకార్యం!
శాండల్‌వుడ్ హీరో ధృవ సర్జా కన్నడనాట పరిచయం అక్కర్లేని పేరు. 2012లో విడుదలైన 'అద్దురి' అనే సినిమా ద్వారా ఎంట్రీ వచ్చారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడైన ధృవ సర్జాకు కన్నడ చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వర్గీయ చిరంజీవి సర్జాకి తమ్ముడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పనికి సర్వత్రా చర్చ మొదలైంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ధృవ సర్జా తన భార్యకు సీమంత వేడుక నిర్వహించారు. అయితే ఈ శుభకార్యం జరిగిన విధానం కన్నడ పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసింది. (ఇది చదవండి: పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!) చిరంజీవి సర్జా కోసం.. తన అన్నయ్య చిరంజీవి సర్జా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధృవ సర్జా భార్య ప్రేరణ గర్భంతో ఉంది. ఈ శుభ సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకను చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో నిర్వహించడం విశేషం. శ్రీకృష్ణ జన్మాష్టమిని చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధృవ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫామ్ హౌస్ మొత్తం రకరకాల పూలతో అలంకరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ధృవ సర్జా తన సోదరుడు చిరంజీవి సర్జా మరణంతో ఆయన కుటుంబం ఇప్పటికీ బాధలో ఉంది. ధృవ సర్జా ఇంట్లో జరిగిన కార్యక్రమాల్లో చిరు జ్ఞాపకంగా ఉండేలా సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకతో చిరును ప్రత్యేకంగా అన్నపై ఉన్న ప్రేమను ధృవ సర్జా చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ధృవ సర్జా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి పోస్ట్.. ఇది మీ పర్సనల్ అంటూ నెటిజన్స్ ఫైర్!) కాగా.. ధృవ సర్జా 2019లో ప్రేరణను వివాహం చేసుకున్నారు. ప్రేరణను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధృవ సర్జాకు 2022 అక్టోబర్‌లో ఆడబిడ్డకు జన్మించింది. ప్రస్తుతం ఈ జంట రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ధృవ సర్జా ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. ధృవ సర్జా ప్రస్తుతం కేడి, మార్టిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. -
ఫ్రెండ్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో!
మూవీ ఇండస్ట్రీలో బహుమతులు ఇవ్వడం లాంటివి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. సినిమా హిట్ అయితే సదరు నిర్మాతలు.. దర్శకులకు ఖరీదైన కార్స్ ని బహుమతులుగా ఇస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరో మాత్రం అలాంటిదేం లేకపోయినాసరే తన ఫ్రెండ్ కి కాస్ట్ లీ కారుని బహుమతిగా ఇచ్చాడు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ధ్రువ సర్జా గురించి తెలుగులో కొంతమందికి తెలుసు. హీరో అర్జున్ మేనల్లుడు, చిరంజీవి సర్జాకి తమ్ముడు అయిన ఇతడు.. కన్నడలో యావరేజ్ హీరో. ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తుంటాడు. కొన్నాళ్ల ముందు 'పొగరు' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం 'మార్టిన్', 'KD' లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ధ్రువ సర్జా.. తన ఫ్రెండ్ అయిన అశ్విన్ కి పుట్టినరోజున సర్ ప్రైజ్ చేశాడు. రూ.50 లక్షలు విలువ చేసే టొయాటో కారుని అతడి గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారిపోయాయి. దీనిపై ధ్రువ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్)