హీరో అర్జున్ మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ హీరో ధృవ సర్జా. ధృవ్ సర్జాకు జోడీగా వైభవి శాండిల్య, అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఆయన నటించిన భారీ యాక్షన్ చిత్రం మార్టిన్. ఈ మూవీకి అర్జున్ కథను అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా గతనెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
భారీ అంచనాల మధ్య రిలీజైన మార్టిన్ ఊహించవి విధంగా బోల్తాకొట్టింది. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకే పరిమితమైంది. కేజీఎఫ్ సినిమాతో పోల్చినప్పటికీ అంచనాలు అందుకోలేకపోయింది.
అయితే ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ రోజు నుంచే మార్టిన్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా... ఆహాలో కేవలం తెలుగు వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment