Martin
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
రీసెంట్గా రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా.. మూడు రోజుల క్రితం ఒక ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్)ఒకప్పుడు తెలుగులో హీరోగా చేసిన అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా ప్రస్తుతం కన్నడలో హీరో. ఇతడి లేటెస్ట్ మూవీ 'మార్టిన్'. దసరాకి కన్నడతో పాటు తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఘోరమైన కంటెంట్ వల్ల దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత వేగంగా మాయమైపోయింది.మొన్న శుక్రవారం ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అంటే చూడలేకపోయారు గానీ ఓటీటీలో కాబట్టి తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తారేమో? విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ 'కేజీఎఫ్'ని కాపీ కొట్టాలనుకోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Experience the thrilling tale of Dhruva, where patriotism meets passion 🔥❤️! Watch #Martin now! 🎥👊 ▶️https://t.co/MviUsUzc3u pic.twitter.com/tgi24PYIdm— ahavideoin (@ahavideoIN) November 19, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలా ఈ శుక్రవారం 12కి పైగా మూవీస్-సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటే మరో తెలుగు డబ్బింగ్ చిత్రం కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకున్న ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?'కేజీఎఫ్' తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఈ తరహా సినిమాల్ని అప్పుడప్పుడు తీస్తున్నారు. గతేడాది ఇలానే 'కబ్జ' మూవీ తీయగా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ తరహా యాక్షన్ స్టోరీతో తీసిన మరో సినిమా 'మార్టిన్'. దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన కన్నడ డబ్బింగ్ చిత్రం.. దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత మాయమైపోయింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)ఇప్పుడు ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో తెలుగులో హీరోగా చేసి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా.. ఈ సినిమాకు స్టోరీ అందించగా, ఇతడి మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా నటించాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ సరైన కంటెంట్ లేకపోవడం, రవి బస్రూర్.. గతంలో తాను పనిచేసిన 'కేజీఎఫ్' లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దీనికి ఇవ్వడం లాంటి చాలా మైనస్‌లు ఈ మూవీలో ఉన్నాయి.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ) -
బొమ్మ పడలేదు.. కొత్త సినిమాలకు రిలీజ్ సమస్యలు!
దసరా సందర్భంగా ఈసారి థియేటర్లలో దాదాపు అరడజనుకి పైగా సినిమాలు రిలీజయ్యాయి. గురువారం రజినీకాంత్ 'వేట్టయాన్' రిలీజ్ కాగా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక శుక్రవారం గోపీచంద్ 'విశ్వం', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' మూవీస్తోపాటు 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్లలోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)మిగతా సినిమాలకు ఇబ్బందేం లేదు గానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల 'విశ్వం' సినిమా షోలకు సాంకేతిక సమస్యలు తలెత్తాయట. అనుకున్న టైంలో కేడీఎమ్ (కీ డెలివరీ మెసేజ్) రాకపోవడంతో పలు థియేటర్లలో షోలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు 'మార్టిన్' చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్ ఎదురైంది. దీంతో షోలు కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ) -
హీరో ధృవ సర్జా ‘మార్టిన్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
Independence Day 2024: మేరా భారత్ మహాన్
దేశం అంటే భక్తి... ప్రేమ ఉన్నవాళ్లు దేశం కోసం ప్రాణాలను వదిలేయడానికి కూడా వెనకడుగు వేయరు. ‘మేరా భారత్ మహాన్’ అంటూ నిజజీవితంలోప్రాణాలను పణంగా పెట్టిన అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కొందరి జీవితాల ఆదర్శంగా వెండితెరపైకి వచ్చిన సినిమాలనూ చూశాం. ప్రస్తుతం నిర్మాణంలో అలాంటి నిజ జీవిత వీరుల నేపథ్యంలో, కల్పిత పాత్రలతోనూ రూపొందుతున్న దేశభక్తి చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.భూతల్లిపై ఒట్టేయ్... ‘‘భూతల్లిపై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్... తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టేయ్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా, వారిలో దేశభక్తి ఉ΄÷్పంగేలా పాట పాడుతున్నాడు వీరశేఖరన్. ఇతని గురించి బాగా తెలిసిన వ్యక్తి సేనాపతి. ఎందుకంటే సేనాపతి తండ్రి వీర శేఖరన్. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ (కల్పిత పాత్ర) ఏ విధంగా పోరాడాడు? అనేది వెండితెరపై ‘ఇండియన్ 3’ సినిమాలో చూడొచ్చు. హీరో కమల్‌హాసన్–దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇండియన్’ (‘భారతీయుడు’) ఫ్రాంచైజీలో త్వరలో రానున్న చిత్రం ‘ఇండియన్ 3’. ఈ చిత్రంలో వీరశేఖరన్, సేనాపతి పాత్రల్లో తండ్రీకొడుకుగా కమల్‌హాసన్ కనిపిస్తారు. 1806 సమయంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ ఏ విధంగా పోరాడాడు? అతని పోరాట స్ఫూర్తితో 1940లలో సేనాపతి ఏం చేశాడు? అనే అంశాలతో ‘ఇండియన్ 3’ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. భారత్ మాతా కీ జై ‘తేరే పాకిస్తానీ అడ్డా మే బైట్ కే బతా రహా హూ... భారత్ మాతా కీ జై...’ అంటూ నాగచైతన్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ‘తండేల్’ సినిమాలోనిది. విజయనగరం, శ్రీకాకుళంప్రాంతాలకు చెందిన మత్య్సకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరప్రాంతానికి వలస వెళ్తారు. వేటలో భాగంగా వారికి తెలియకుండానే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్తారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డులు ఈ భారత మత్స్యకారులను బంధీలుగా పట్టుకుని జైల్లో వేస్తారు. పాకిస్తాన్ జైల్లో వీరి పరిస్థితి ఏంటి? వీరి కుటుంబ సభ్యులు వీరి కోసం ఏమైనా పోరాటం చేశారా? అనే అంశాల నేపథ్యంలో ‘తండేల్’ కథనం ఉంటుందని తెలిసింది. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, అతని భార్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.మార్టిన్... ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ మార్టిన్ అనే భారతీయుడిని క్రూరంగా శిక్షించాలనుకుంటుంది. మార్టిన్‌కు దేశభక్తి ఎక్కువ. ఎంతలా అంటే... అతని చేతిపై ఇండియన్ అనే ట్యాటూ ఉంటుంది. అసలు పాకిస్తాన్ జైల్లో మార్టిన్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అనేది కన్నడ చిత్రం ‘మార్టిన్’ చూస్తే తెలుస్తుంది. ధ్రువ్ సర్జా హీరోగా నటించిన చిత్రం ఇది. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ దేశభక్తి, యాక్షన్, ఎమోషనల్ మూవీ అక్టోబరు 11న రిలీజ్ కానుంది.అమరన్ ‘రమణ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయింది), తుపాకీ, కత్తి’ వంటి సినిమాల్లో సామాజిక బాధ్యతతో పాటు కాస్త దేశభక్తిని కూడా మిళితం చేసి, హిట్ సాధించారు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్‌తో ‘అమరన్’ సినిమా చేస్తున్నారాయన. ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపిస్తారు శివ కార్తికేయన్. సాయిపల్లవి హీరోయిన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్. ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ‘సికందర్’ కూడా దేశభక్తి నేపథ్యంలోనే ఉంటుందని టాక్.సరిహద్దు యుద్ధం దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న చిత్రాల్లో నటించేందుకు అక్షయ్ కుమార్ ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన చేసిన ‘బేబీ, ఎయిర్ లిఫ్ట్, ‘మిషన్ మంగళ్’ వంటి చిత్రాలు ఇందుకు ఓ నిదర్శనం. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’. 1965లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సారా అలీఖాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. సందీప్ కెవ్లానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. అలాగే 1971లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో 1997లో హిందీలో ‘బోర్డర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. కాగా ఇటీవల సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ను ప్రకటించారు. ఇంకా భారత్–పాకిస్తాన్ విడిపోయిన నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘లాహోర్ –1947’ సినిమా కూడా చేస్తున్నారు సన్నీ డియోల్. ఇక పాకిస్తాన్ చిన్నారిని ఆమె దేశంలో విడిచిపెట్టేందుకు ‘భజరంగీ భాయిజాన్’ (2015)గా సల్మాన్ ఖాన్ చేసిన సాహసాలను సులభంగా మర్చిపోలేం. ఈ ఫిల్మ్‌కు సీక్వెల్ ఉంటుందని చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
'కేజీఎఫ్'ని మించిపోయే లాంటి సినిమా.. ట్రైలర్ చూస్తే వామ్మో!
కొన్నేళ్ల ముందు వరకు యాక్షన్ అంటే ఓ లెక్క. 'కేజీఎఫ్' తర్వాత యాక్షన్ అంటే మరో లెక్క. ఎందుకంటే ఫైట్స్ తీసే విధానమే మారిపోయింది. అయితే దీన్ని ఫాలో అయిపోతూ చాలా మూవీస్ వస్తున్నాయి. అంతెందుకు కన్నడ నుంచి ఇప్పుడు 'మార్టిన్' అనే మూవీ రాబోతుంది. తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తే వామ్మో అనకుండా ఉండలేరేమో?(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?)ఎందుకంటే దాదాపు 2 నిమిషాల 7 సెకన్ల నిడివితో తీసిన ఈ ట్రైలర్లో కళ్లు చెదిరిపోయే విజువల్స్, రేసీ యాక్షన్ సీన్స్ మాత్రమే చూపించారు. అసలు కథేంటనేది రివీల్ చేయలేదు. ట్రైలర్ చూస్తేనే వామ్మో ఇదేంట్రా బాబోయ్ అనిపించింది. చివర్లో హీరో తన నోటితో కుక్కకి బిస్కెట్ అందించే సీన్ అయితే విచిత్రంగా అనిపించింది.కన్నడ హీరో ధ్రువ సర్జా ఇందులో లీడ్ రోల్ చేయగా.. మనకు బాగా తెలిసిన హీరో అర్జున్ దీనికి స్టోరీ రాయడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషలతో పాటు జపనీస్, చైనీస్, అరబిక్, కొరియన్, రష్యన్, స్పానిష్ లాంటి విదేశాల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. అంటే దాదాపు 13 భాషల్లో రిలీజ్ అనమాట. అక్టోబరు 11న ఇది థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))<br>Powered by <a href="https://youtubeembedcode.com">how to embed a youtube video</a> and <a href="https://gamstopcancel.com/">how to cancel gamstop</a> -
అర్జున్ మేనల్లుడి యాక్షన్ చిత్రం.. ట్రైలర్ చూశారా?
ప్రముఖ కన్నడ హీరో, అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం మార్టిన్. ఈ సినిమాను పవర్ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి అర్జున్ సర్జా కథను అందించారు. తాజాగా మార్టిన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్‌గానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో రూపొందించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో విజువల్స్, యాక్షన్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీతో సహా ప్రపంచవ్యాప్తంగా 13 భాషల్లో విడుదల చేయనున్నారు. -
2047 నాటికి మోదీ ఆర్థిక లక్ష్య సాధన కష్టమే
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరే అవకాశం లేదని ఫైనాన్షియల్ టైమ్స్ చీఫ్ ఎకనామిక్స్ వ్యాఖ్యాత మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. అయితే వృద్ధిబాటన అప్పటికి దేశం ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. అయితే 2047 నాటికి భారత్ కూడా సూపర్ పవర్ అవుతుందని వోల్ఫ్ అభిప్రాయపడ్డారు. వృద్ధి మందగమనం, అనిశ్చితమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధికి సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. పశి్చమ దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ, ఇది దేశాలనికి వ్యూహాత్మకంగా కీలకమైనదని అన్నారు. ప్రస్తుత తీరిది... ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఎకానమీలో ఐదవ స్థానంలో.. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు. -
ఇండియాలో ముందుగానే రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ!
విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై. ప్రముఖ ఫ్రాంచైజీలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఒక రోజు ముందుగానే భారతదేశం అంతటా భారీ స్థాయిలో జూన్ 6న విడుదలవుతోంది. ఈ యాక్షన్-అడ్వెంచర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.అత్యంత జనాదరణ పొందిన యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన బ్యాడ్ బాయ్స్ నాల్గొ విడత గురువారం రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఎదుగుతున్న గొప్ప శక్తి.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎదుగుతున్న ‘గొప్ప శక్తి‘గా మారే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి అమెరికాతో సమానమైన పరిమాణాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. పశ్చిమ దేశాలూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్‌లో ఆయన రాసిన ఒక ఆరి్టకల్‌లో ముఖ్యాంశాలు.. ► భారత్ 2050 వరకూ వార్షికంగా 5 శాతం లేదా కొంచెం అటుగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని కొనసాగించగలదని నేను విశ్వసిస్తున్నాను. ► ‘చైనా ప్లస్ వన్‘ (కేవలం చైనాలోనే పెట్టుబడులు కాకుండా మరొక దేశంలో కూడా..) వ్యూహాన్ని అనుసరించే కంపెనీలకు భారతదేశం స్పష్టమైన స్థానం. పోటీ పూర్వక పెద్ద మార్కెట్‌ను దేశం కలిగి ఉంది. ► ప్రస్తుత భారత్ 1.43 బిలియన్ జనభా సంఖ్య 2050 నాటికి 1.67 బిలియన్లకు చేరుతుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. ► దేశంలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. రుణ వృద్ధి భారీగా మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. ► దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ రాబోయే దశాబ్దాల్లో వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాము. చైనా తరహాలో కాకుండా భారత్‌తో పాశ్చాత్య దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉండడం సానుకూల పరిణామాలకు దారితీసే అంశం. ► ఒకప్పుడు నిషేధానికి గురయిన నరేంద్ర మోడీ, ఇప్పుడు భారత్‌లో రాజకీయంగా ఆధిపత్య ప్రధాన మంత్రిగా వాషింగ్టన్లో జో బిడెన్‌తో ఆలింగనం చేసుకుంటున్నారు. పారిస్‌లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కూడా ఇదే అనుబంధం కొనసాగుతోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా శక్తివంతమైన దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీనినిబట్టి అర్థం అవుతోంది. ► 2023 నుంచి 2028 మధ్య భారత్ వార్షిక వృద్ధి సగటును 6 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేయడం మరో విశేషం. ఒక శాతం తగ్గినా 5 శాతం సుస్థిర వృద్ధి కొనసాగుతుంది. ► యువత అధికంగా ఉండడం, శ్రామికశక్తి తగినంత అందుబాటులో ఉండడం, ఆ శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం, అధిక పొదుపు రేటు, వృద్ధిపై విస్తృత స్థాయి ఆశలు భారత్‌కు సంబంధించి చెప్పుకోవాల్సిన మరికొన్ని అంశాలు. ► భారత్ విషయంలో 2050 వరకూ సగటు వృద్ధి 5 శాతంగా నమోదయితే, అమెరికా వృద్ధి రేటు 1.4 శాతంగా ఉండే వీలుంది. ► భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోందని, కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుందని ప్రపంచబ్యాక్ అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎనమిస్ట్ మారి్టన్ వోల్ఫ్ భారత్‌కు సానుకూలంగా ఇచి్చన ప్రకటన దేశాభివృద్ధికి భరోసాను ఇస్తోంది. మొండిబకాయిలు తగ్గుతుండడం హర్షణీయం: ఎస్అండ్పీ ఇదిలావుండగా, బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గుతుండడం భారత్ ఎకానమీకి లాభిస్తున్న అంశమని ఎస్అండ్పీ ప్రైమరీ క్రెడిట్ విశ్లేషకులు దీపాలి సేథ్ ఛాబ్రియా పేర్కొన్నారు. ఎకానమీ పురోగతి నేపథయంలో 2025 మార్చి నాటికి బలహీన బకాయిల పరిమాణం మొత్తం రుణాల్లో 3 నుంచి 3.5 శాతం శ్రేణికి పడిపోతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2024–26 మధ్య భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 నుంచి 7.1 శాతం మేర నమోదుకావచ్చని ఎస్అండ్పీ మిడ్ ఇయర్ గ్లోబల్ బ్యాంక్ అవుట్‌లుక్ పేర్కొంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా భారత్ కొనసాగుతుందని విశ్లేíÙంచింది. ద్రవ్యోల్బణం సమస్య ఉన్నప్పటికీ, దీనిని దేశం అధిగమించగలదన్న విశ్వాసాన్ని దీపాలి సేథ్ ఛాబ్రియా వ్యక్తం చేశారు. -
మార్టిన్ వస్తున్నాడు
‘‘దేశవ్యాప్తంగా కన్నడ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. సుదీప్, యశ్గార్లు నా సీనియర్ యాక్టర్స్. వారు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు చేశారు. వారితో నేను పోటీపడటం లేదు. ఓ యాక్టర్‌గా ఇంకా మెరుగయ్యేందుకు నాతోనే నేనుపోటీ పడుతుంటాను’’ అని అన్నారు హీరో ధృవ సర్జా. ‘అద్దూరి’ (2012) చిత్రం తర్వాత హీరో ధృవ సర్జా, దర్శకుడు ఏపీ అర్జున్ కాంబోలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మార్టిన్’. ఈ చిత్రంలో వైభవి శాండల్య, అన్వేషి జైన్ హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కథ అందించిన ఈ సినిమాను ఉదయ్ కె. మెహతా నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘మార్టిన్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ధృవ సర్జా మాట్లాడుతూ– ‘‘మార్టిన్’ చిత్రం దేశభక్తి నేపథ్యంలో ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఇంటర్నేషనల్ ఫైటర్స్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాల కోసం బాగా బరువు పెరిగాను’’ అన్నారు. ‘‘రాజమౌళి, ప్రశాంత్ నీల్, మణిరత్నం వంటి దర్శకులు భాషా పరమైన హద్దులను చెరిపేశారు. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమాయే’’ అన్నారు అర్జున్. ‘‘ధృవతో నేను గతంలో ప్రేమకథ చేశాను. ఇప్పుడు యాక్షన్ మూవీగా ‘మార్టిన్’ చేశాను’’ అన్నారు అర్జున్ ఏపీ. -
టాలీవుడ్ టు హాలీవుడ్
భారతీయ సినిమా నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లాలనే కల చాలామందికి ఉంటుంది. అయితే కొందరికి అది కలగా మిగిలిపోతుంది. కానీ తన ప్రతిభతో భారతీయ సినీ దర్శక, రచయిత జగదీష్ దానేటి హాలీవుడ్ వరకూ వెళ్లారు. హాలీవుడ్లో ‘జె.డి.’ పేరుతో ఎంట్రీ ఇచ్చిన జగదీష్ పలు అంతర్జాతీయ చిత్రాలకు ‘క్రియేటివ్ కన్సల్టింగ్’ చేయటంలో విశేష నైపుణ్యం సాధించారు. హాలీవుడ్ ప్రఖ్యాత ప్రొడక్షన్ కంపెనీ మార్టిన్ ఫిలిమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు జగదీష్. లాస్ ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన ఒక వేడుకలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు–నిర్మాత జాని మార్టిన్.. జేడీతో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల తన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘జె.డి. రాసిన కథలు, స్క్రీన్‌ప్లే అద్భుతం. అందుకే ఆయన దర్శకత్వం వహించబోతున్న హాలీవుడ్ చిత్రాలకు నేను నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నా’’ అన్నారు జాని మార్టిన్. ఈ ఇండో–అమెరికన్ చిత్రాల్లో హాలీవుడ్ నటులతో పాటు భారతీయ సినిమాకి సంబంధించిన నటీనటులను కూడా నటింపజేయనున్నారు. -
బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్న నటి!
::: ప్రముఖ అమెరికన్ నటి, బిజినెస్‌ఉమన్, ఫ్యాషన్ డిజైనర్, గాయని, అవివాహిత.. లిండ్సే లోహన్ (32) తన తొలిబిడ్డగా ఎవరినైనా దత్తతు తీసుకోవాలనుకుంటున్నారు! ఇటీవల టర్కీ వెళ్లినప్పుడు అక్కడి సిరియా శరణార్థుల పిల్లలను చూశాక తనకు ఈ ఆలోచన వచ్చినట్లు ఆమె ప్రకటించారు ::: కొన్నేళ్లుగా వాషింగ్టన్ డీసీలో ఉంటూ.. స్థానికులతో పరిచయాలు, రాజకీయ పార్టీలలో పలుకుబడి పెంచుకుని అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై 29 ఏళ్ల రష్యన్ యువతి మరియా బుతీనాను యు.ఎస్. ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అమెరికన్ యూనివర్సి టీలో చదివిన మరియాను ‘రైట్ టు బేర్ ఆర్మ్’ అనే రష్యన్ ప్రో–గన్ సంస్థ వ్యవస్థాపకురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెకు, యు.ఎస్.లోని రష్యన్ సెంట్రల్ బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులకు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు ::: కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఇకనైనా తన భర్త పేరు మీద నేషనల్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించకపోతే ఆయనకు వచ్చిన పద్మశ్రీ, అర్జున అవార్డులతో పాటు మిగతావాటినీ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని దివంగత హాకీ క్రీడాకారుడు మొహమ్మద్ షాహిద్ సతీమణి పర్వీన్ హెచ్చరించారు. రెండేళ్ల క్రితం షాహిద్ మరణించినప్పుడు ఆయన పేరు మీద నేషనల్ చాంపియన్ షిప్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక స్టేడియంను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకు ఆ హామీని నెరవేర్చకపోవడంపై పర్వీన్ తీవ్రమైన అసంతృప్తితో ఉండడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆదేశాలపై కొందరు అధికారులు హుటాహుటిన ఆమెను ఇంటికి వెళ్లి మరీ కలిసి.. సంబంధిత శాఖలు ఆ పనిలోనే ఉన్నట్లు వివరణ ఇచ్చారు ::: జూలై 18న (నిన్న బుధవారం) ప్రారంభమై, ఆగస్టు 10 వరకు జరుగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం జరిగే ప్రయత్నాలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదాలు నెలకొనే వాతావరణం కనిపిస్తోంది. ఇరవై రెండేళ్ల క్రితం వాజపేయి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు చట్టంగా రూపుదాల్చకపోవడానికి కారణం.. కాంగ్రెస్‌కు, ఆ పార్టీ మిత్రపక్షాలకు చిత్తశుద్ధి లేకపోవడమేనని బీజేపీ ఆరోపిస్తుండగా.. పార్లమెంటులో మెజారిటీ ఉంచుకుని కూడా గత నాలుగేళ్ల సమావేశాలలో బిల్లు ఆమోదం కోసం మీరెందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేకపోయారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నగరంలో మహిళల, బాలల భద్రతకు, రక్షణకు ‘షీ’ టీమ్‌లు, భరోసా సెంటర్లు తీసుకుంటున్న చర్యలను యు.ఎస్. కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా ప్రశంసించారు. కేథరీన్ మంగళవారం నాడు హైదరాబాద్‌లోని షీ టీమ్‌లను, భరోసా సెంటర్లను సందర్శించినప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ అండ్ సిట్).. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రెండు బృందాల పనితీరుపై ప్రజెంటేషన్ ఇచ్చారు ::: బహిరంగంగా స్తన్యమివ్వడానికి ఇబ్బంది పడే తల్లులున్న అంత పెద్ద నాగరిక సమాజమైన అమెరికాలో అక్కడి వర్ధమాన మోడల్.. మారా మార్టిన్ తన ఐదు నెలల కూతురు ఆరియాకు స్తన్యం ఇస్తూ ర్యాంప్‌పై వాక్ చెయ్యడం మహిళా సాధికారతకు ఒక సంచలనాత్మక సంకేతం అయింది. ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ పత్రిక స్విమ్‌సూట్ షోలో మిరుమిట్లు గొల్పుతున్న పసిడివర్ణంలో ఉన్న బికినీ ధరించి, బిడ్డకు చనుబాలు పడుతూ ర్యాంప్ వాక్ చేసిన మార్టిన్.. మర్నాడు ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ‘నా మాతృ హృదయాన్ని మంచి మనసుతో అర్థంచేసుకున్న వారందరికీ ధన్యవాదాలు’ అని కామెంట్ పెట్టగా, ప్రఖ్యాత ఫెమినిస్టు వెబ్సైట్ ‘జెజెబెల్’.. ఇలా పాలిస్తూ వాక్ చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ మార్టిన్ ధోరణిని ఒక ప్రహసనంగా అభివర్ణించింది. తమిళ టీవీ సీరియల్ ‘వంశం’లో ప్రధాన పాత్రధారి అయిన రమ్యకృష్ణ పక్కన జ్యోతికగా నటించి వీక్షకుల ఆదరణ పొందిన యువ నటి ప్రియాంక చెన్నైలోని వలసరవాక్కంలో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆ అపార్ట్మెంట్ పనిమనిషికి కనిపించారు. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న ప్రియాంకపై పిల్లల్ని కనాలని ఒత్తిడి పెరుగుతోందనీ, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ::: ముంబై స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్.. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో గత నెలలోనే ప్రారంభించిన ‘ఛేంజింగ్ రూమ్’ తాళం చెవుల్ని ఓ అధికారి ఇంటికి తీసుకెళ్లడంతో అండర్ 17 çఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన వివిధ జట్లు బాలికలు వాష్‌రూమ్ కోసం ఇబ్బంది పడవలసి వచ్చింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ట్ ఆఫీసర్ సుమిత్ పాటిల్.. ఆటలు జరిగే రోజులైన జూలై 17, 18 తేదీలలో బాలికల వాష్‌రూమ్‌ను తెరిచి ఉంచాలని అసోసియేషన్‌కు ప్రత్యేకంగా లేఖ రాసినప్పటికీ బాలికలకు ఈ చేదు అనుభవం తప్పలేదు ::: -
జీవజాతులపై పరిశోధనలు అవసరం
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్రవేత్తల ప్రయోగాలు ఎలుకలు, బొద్దింకలు, ఈగలు వంటి నమూనా జంతువులకే పరిమితం చేయకుండా అన్ని రకాల జీవజాతులపై పరిశోధనలు జరపాలని నోబెల్ గ్రహీత మార్టిన్ షాలిఫీ సూచించారు. ఆవిష్కరణలు, పరిశోధనలు ఒక్కరివల్ల అయ్యేవి కావని, ఆయా రంగాల్లో కృషి చేస్తున్న ఇతర శాస్త్రవేత్తల సహకారం కూడా అవసరమని తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న ‘కణజీవశాస్త్ర అంతర్జాతీయ సదస్సు’కు ఆయన హాజరై మాట్లాడారు. గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్ ఆవిష్కరణ ద్వారా జీవిలో చూడలేని జన్యుపరమైన చర్యలను ప్రత్యక్షంగా చూసేలా చేశామన్నారు. జన్యుశాస్త్రంలో మౌలిక పరిశోధనలు వేగం పుంజుకునేందుకు, హెచ్ఐవీ పరిశోధనల్లోనూ ఈ ఆవిష్కరణ కీలకంగా మారిందని చెప్పారు. వీటితోపాటు మందుపాతరల గుర్తింపునకు, చీకట్లో వెలుగులు చిమ్మే పట్టుతయారీకి పనికొచ్చిందని తెలిపారు. గొప్ప ఆవిష్కరణల్లో చాలావరకూ యాదృచ్ఛికంగా జరిగినవేనన్నారు. ఘనంగా ప్రారంభమైన ఐసీసీబీ కణజీవశాస్త్రంలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపైకి చేర్చే లక్ష్యంగా తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ–2018 శనివారం ఘనంగా ప్రారంభమైంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఆసియా పసిఫిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్ బయాలజిస్ట్, ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజిస్ట్ వంటి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1200 మంది జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి ఆదివారం హాజరు కానున్నారు. -
పాంటింగ్‌కు కీలక బాధ్యతలు!
మెల్బోర్న్: ఘోరమైన ప్రదర్శనతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్లో పెను మార్పులకు అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చీఫ్ సెలక్టర్ రాడ్నీ మార్ష్ తప్పుకోగా, తాత్కాలిక సెలక్టర్‌గా గ్రెగ్ చాపెల్‌ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో మరికొన్ని మార్పులు జరగవచ్చని సమాచారం. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అతని మాజీ సహచరుడు డామియెన్ మార్టిన్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘ఆస్ట్రేలియా దిగ్గజం ఒకరు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కోచ్‌గా తప్పుకున్నారు. త్వరలో పెద్ద ప్రకటన వెలువడవచ్చు’ అని మార్టిన్ వ్యాఖ్యానించాడు. సెలక్టర్‌గా గానీ కోచ్‌గా కానీ పాంటింగ్ వచ్చే అవకాశం ఉంది. -
240 కోట్ల ఫైట్
జేమ్స్ బాండ్ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మామూలుగా ఛేజింగుల కోసం కార్లను ధ్వంసం చేయాల్సి వస్తే గ్రాఫిక్స్ లేదా డూప్ కార్లు వాడతారు. కానీ, డేనియల్ క్రెగ్ నటిస్తున్న లేటెస్ట్ జేమ్స్ బాండ్ ఫిల్మ్ ‘స్పెక్టర్’ కోసం ఏకంగా ఏడు కార్లను ధ్వంసం చేశారు. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా! యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర బృందం ఏకంగా ఏడు ఆస్టన్ మార్టిన్ కార్లు వాడింది. ఆస్టన్ మార్టిన్ అంటే కేవలం సంపన్నులకే పరిమితై మెన ఖరీదైన కారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘డిబి 10’ స్పోర్ట్స్ కార్లుగా వీటిని తయారు చేశారు. ఈ కారు ధర మన కరెన్సీలో 4 కోట్ల పైచిలుకే. సినిమా బడ్జెట్ రూ. 2 వేల కోట్లయితే, ఈ కార్ల ఫైట్కైన ఖర్చు అక్షరాలా 240 కోట్లు. మొత్తానికి, గడచిన 53 ఏళ్ల బాండ్ ఫిల్మ్స్ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా ‘స్పెక్టర్ ’ నిలిచిపోనుంది. -
ది వైల్డ్ బ్లూ యోండర్
బ్రాడ్ డౌరిఫ్, మార్టిన్ లో, రోజర్ డీల్, టెడ్ స్వీట్సర్ తదితరులు నటించిన ఈ ఆంగ్ల చిత్రానికి జర్మనీకి చెందిన వార్నర్ హెర్జాగ్ దర్శకుడు. కథ కూడా వార్నరే సమకూర్చాడు. చాలా ఏళ్ల కిందట వాటర్ వరల్డ్ నుంచి భూమిపైకి వచ్చిన ఓ గ్రహాంతర వాసి చుట్టూ తిరిగే సైంటిఫిక్ ఫిక్షన్ స్టోరీ ఇది. 81 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఈ నెల 15 సాయంత్రం 6.30 గంటలకు బంజారాహిల్స్ గోథెజెంత్రమ్లో ప్రదర్శిస్తున్నారు. ప్రవేశం ఉచితం. -
ఆప్ కే లియే..
ఈసారి హైదరాబాద్ బుక్ ఫెయిర్ తన పుటలో ఒక కొత్త అంశానికి చోటిచ్చింది! అదే ‘అనగనగా’ యాప్! దీని రూపకర్త మార్టిన్! వృత్తిరీత్యా మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ విభాగంలో ఉద్యోగి.. ప్రవృత్తిరీత్యా సోషియో సైకాలజిస్ట్!. ఆ కథేమిటంటే.. - సరస్వతి రమ కొన్నాళ్ల కిందట మార్టిన్ డిప్యూటేషన్‌పై మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌లో విధులు నిర్వహించారు. అందులో భాగంగా కొంతకాలం వేరే దేశాల్లోని ఇండియన్ ఎంబసీలలో పనిచేశారు. సోషియో సైకాలజిస్ట్ కూడా కాబట్టి ఆ జిజ్ఞాసతో ప్రవాసాంధ్రుల జీవనశైలిని గమనించారు. ఆ స్టడీలో పిల్లలకు కథలు చెప్పే ప్రక్రియ అంతరించిపోయిందని తేలింది. టెక్నాలజీ మాయలో పడ్డ ఈ తరం చదవడాన్ని మరిచిపోయింది. వాళ్లే చదవనప్పుడు వాళ్ల పిల్లలకేం చెప్తారు?. అందరూ కంప్యూటర్ గేమ్స్‌కి పరిమితమైపోయారు. ఇదే టెక్నాలజీ, ఈ తరం అలవాట్లనూ ఉపయోగించుకొని కథలు చెప్పే కళను పునరుద్ధరించాలనుకున్నారు. అందుకే ‘ఈ యాప్ పిల్లలకన్నా తల్లిదండ్రులకే ఎక్కువ ఉపయోగం’ అంటారు మార్టిన్. ‘వాళ్లకు కథలు తెలిస్తేనే కదా పిల్లలకు చెప్పగలుగుతారు’ అనేది ఆయన లాజిక్!. ముందుకెలా వెళ్లిందంటే.. ‘చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే.. పిల్లలకు కావల్సిన భోజనం పెట్టడం, వాళ్లడిగిన ఆట వస్తువులు, గాడ్జెట్స్ తెచ్చివ్వడం, పిల్లలతో కలిసి టీవీ చూడ్డం, సినిమాకెళ్లడం.. ఇవన్నీ చేస్తే పిల్లలతో మీనింగ్ ఫుల్ టైమ్ గడిపినట్టే అని!. కానీ క్వాలిటీ టైమ్ ఇవ్వడమంటే అదికాదుకదా.. మన సంస్కృతి, మన భాష, మన కళలు, మన కథలు.. ఇలా మన పూర్తి నేటివిటీని పిల్లలకు అందిస్తేనే మనం వాళ్లకు మేలు చేస్తున్నట్టు’ అంటారు మార్టిన్. అందులో కథలు చాలా ముఖ్యమైనవి. పిల్లలకు మనం కథలు చెప్తున్నామంటేనే జీవించడం నేర్పుతున్నామన్న మాట అని ఆయన అంటారు. ఆ కథలను నీతుల మోతతో బరువెక్కనీయకుండా ఈ కాలానికనుగుణంగా క్లుప్తంగా, తిన్నగా, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే చాలు. టెక్నికల్ టూల్స్ మన కమ్యూనికేషన్‌ను ఈజీ చేసేసి ఊహాశక్తిని తగ్గిస్తున్నాయి. కాబట్టి ఆ ఊహాశక్తిని కాస్త పెంచేలా కథలు చెప్పే విధానాన్ని మలుచుకుంటే మంచిది. ఆ రకమైన స్టోరీ టెల్లింగ్‌ను పేరెంట్స్ దగ్గర ప్రమోట్ చేయాలి అని ఓ నిశ్చయానికి వచ్చి ఆ ఆలోచనను ముగ్గురి స్నేహితులతో పంచుకున్నాడు. వాళ్లూ ఉత్సాహంగా ఓకే అన్నారు. ఫస్ట్భెల్.. నలుగురూ కలిసి ‘ఫస్ట్ భెల్ టీమ్’గా ఏర్పడ్డారు. ‘స్కూల్లో పిల్లలు లాస్ట్ భెల్‌కి హుషారుగా, ఫస్ట్భెల్కి నీరసంగా ఉంటారు. అలాకాక మా కథల కోసం ఫస్ట్భెల్నూ అంత ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఆ పేరుపెట్టాం’ అంటారు మార్టిన్. యాప్ కోసం కావల్సిన డబ్బుని తమకొచ్చే జీతంలోంచే కొంత తీసి పక్కన పెట్టసాగారు. ఈ నలుగురి స్నేహితుల్లో మార్టిన్ సహా ముగ్గురు ఇంతకుముందే కొన్ని కథలు రాశారు కూడా. ఆ అనుభవంతో పాతకథలన్నీ పోగుచేశారు. అందులోంచి కొన్ని ఎంచుకొని తెలుగు నేటివిటీకి అనుగుణమైన 20 ఎలిమెంట్లు ఉండేలా రీరైట్ చేశారు. ఒక్కో కథ నాలుగు నిమిషాల నిడివి ఉండేలా 300 కథలను రాసుకున్నారు. మళ్లీ వాటిలోంచి తుదిగా 120 కథలను ఎంచారు. పేదరాశి పెద్దమ్మ, విక్రమ్భేతాళ, పంచతంత్ర, వెర్రి వెంగళప్ప, జానపద కథలు.. ఇలా 12 విభాగాలుగా చేసి విభాగానికి పది చొప్పున ఆడియో రికార్డింగ్ చేయించారు. ఆడిషన్స్‌కి ఆడియన్స్‌నూ పిలిచి ఎవరిచేత ఏ కథను చెప్పిస్తే బాగుంటుందో వాళ్ల సలహా, సూచనలతో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లతో ఆయా కథలను చెప్పించారు. ఈ కాన్సెప్ట్నంతా తీసుకొని తనికెళ్ల భరణి దగ్గరకు వెళ్లారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌కి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడమే కాదు పన్నెండు విభాగాల ముందుమాటకు తన గొంతునిచ్చారు. అయితే, తమ కాన్సెప్ట్‌ను ప్రయోగవంతంగా నిరూపించుకోవడానికి భిన్నరంగాల్లోని పది కుటుంబాలను ఎంచుకున్నారు. ఇందులో రాజీవ్ కనకాల, సుమ దంపతులూ ఉన్నారు. రికార్డ్ చేసిన కథలను ఈ పది కుటుంబాలకు వినిపించి వాళ్ల అభిప్రాయాలు తీసుకోవడం, వాటికనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం.. ఇలా ఈ కాన్సెప్ట్ యాప్ రూపంలోకి రావడానికి ఏడాదిన్నర పట్టిందట మార్టిన్ వాళ్ల టీమ్‌కి. అనగనగా.. మొత్తానికి ఫస్ట్భెల్ కథలు ‘అనగనగా’ పేరుతో మొన్న అక్టోబర్‌లో యాప్‌లోకి ఒదిగిపోయాయి. ‘ఫోర్త్ లార్జెస్ట్ డౌన్లోడెడ్ ఇన్ ఇండియన్ యాప్స్. ఫైవ్ రేటింగ్ ఐఓఎస్, ఫైవ్ రేటింగ్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ ఫైవ్ రేటింగ్ ఇన్ విండోస్. ఇంత పెద్ద కంటెంట్ ఇచ్చిన యాప్ వరల్డ్‌లోనే లేదు. మాదే ఫస్ట్. ఇంకా కొంతమంది పేరెంట్స్ కోరిక మేరకు ఇందులో పరమానందయ్య శిష్యులు, తెనాలి రామకృష్ణ కథలనూ ఈ యాప్‌కి యాడ్ చేయబోతున్నాం. పిల్లల మొహంలో చిరునవ్వు, తద్వారా కుటుంబాల్లో ఆనందం తేవడమే తమ యాప్ ముఖ్య లక్ష్యం’ అంటూ ‘అనగనగా యాప్’ కథను ముగించారు మార్టిన్. అన్నట్టు పిల్లలకో గుడ్‌న్యూస్.. ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే పిల్లల్లో ఒక రకమైన భయం ఉంటుంది. దాన్ని పోగొట్టడానికి ఫిజిక్స్ సబ్జెక్ట్నంతా గేమ్ రూపంలో మార్చి ‘ఫిజ్వార్స్’ అనే యాప్‌నూ రూపొందించబోతోందీ టీమ్. -
15న డచ్ గిటారిస్ట్ వాన్ హీస్ రాక
హెచ్డబ్ల్యూఎంఎఫ్ ఐదో వార్షికోత్సవాలు.. హైద్రాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్ (హెచ్డబ్లుంఎఫ్) ఐదవ వార్షికోత్సవాలలో పాల్గొనేందుకు ‘అథీనియం ఛాంబర్ ఆఫ్ ఆర్కెస్ట్రా’ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత డచ్ గిటారిస్ట్ మార్టిన్ హీస్ నగరానికి విచ్చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి 19 వ తేదీ వరకూ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పబ్లిక్ పర్ఫార్మెన్స్లు బుధవారం సాయంత్రం 7 గంటలకు అన్నపూర్ణ స్టూడియో లైన్‌లోని ప్లాంటేషన్ స్టుడియో హౌస్‌లో శనివారం (18వ తేదీ) సాయంత్రం 7 గంటలకు హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో సంగీత కచేరీ ఇస్తారు. వర్క్‌షాప్‌లు శుక్రవారం సాయంత్రం (17వ తేదీ) 6-30 నుంచి 8-30 గంటల వరకూ బేగంపేటలోని పాత ఎయిర్పోర్ట్ సమీపంలోని యమహా మ్యూజిక్ స్వ్యేర్లో ఆదివారం (19వ తేదీ) ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని లామకాన్‌లో సంగీత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా సలహాలు, శిక్షణ తీసుకోవాలనుకునే వారికీ అందుబాటులో (info@hydmusic.com mailto:info@hydmusic.com 9912201659 9849451794 ) ఉంటారు. -
తన కోపమే తన శత్రువు
ప్రేరణ ‘తన కోపమే తన శత్రువు’ అని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం. కోపంతో శత్రువులను పెంచుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. క్షణికావేశం అంతులేని అనర్థాలకు దారితీస్తుంది. నిరర్థకమైన ఆగ్రహం నుంచి విముక్తి కోసం ప్రయత్నించాలి. తన శాంతమే తనకు రక్ష అనే సూక్తిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆచరించాలి. ఎప్పుడూ కోపంతో మండిపడే తన కుమారుడికి ఓ తండ్రి ఎలా జ్ఞానోదయం కలిగించాడో ఇప్పుడు తెలుసుకుందాం.. అతడి అనుభవం నుంచి మనం పాఠం నేర్చుకుందాం.. ప్రతి చిన్న విషయానికి ఆవేశమొద్దు: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరానికి సమీపంలో ఉండే నవయువకుడు మార్టిన్ ఎంతో చురుకైనవాడు. ఒళ్లు దాచుకోకుండా కష్టపడతాడు. కానీ అతడిలో ఉన్న దుర్గుణం ఏమిటంటే.. విపరీతమైన కోపం. ప్రతిచిన్న విషయానికీ తీవ్ర ఆవేశానికి లోనవుతుంటాడు. కోపంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. స్నేహితులను, కుటుంబ సభ్యులను కఠినమైన పదజాలంతో దూషిస్తుంటాడు. అలాంటి మాటలు ఎంత చేటు చేస్తాయో కూడా కోపం కోరల్లో చిక్కిన మార్టిన్ గుర్తించలేడు. తన కుమారుడి కోపావేశాలు బాగా తెలిసిన మార్టిన్ తండ్రి.. అతడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. మార్టిన్‌కు ఓ సంచి నిండా మేకులు ఇచ్చాడు. ఇకపై కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకును ఇంటి వెనకున్న చెక్కలోకి దిగగొట్టమని సూచించాడు. అప్పుడు ఏ మూడ్‌లో ఉన్నాడోగానీ మార్టిన్ దీనికి వెంటనే అంగీకరించాడు. మొదటిరోజు అతడి ప్రకోపానికి 35 మేకులు ఖర్చయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ చెక్కలోకి దిగుతున్న మేకుల సంఖ్య క్రమంగా తగ్గసాగింది. ఎందుకంటే.. కోపం వచ్చిన ప్రతిసారీ మేకు, సుత్తి తీసుకొని ఇంటి వెనక్కి వెళ్లడం మార్టిన్‌కు కష్టంగా తోచసాగింది. దీనికంటే కోపాన్ని తగ్గించుకోవడమే సులభం అని అనిపించింది. దీనివల్ల అతడు ఆగ్రహానికి గురయ్యే సందర్భాలు తగ్గాయి. చివరగా ఒకరోజు ఒక్క మేకుకు కూడా పనిచెప్పే పరిస్థితి రాలేదు. అంటే.. ఆ రోజు అతడికి ఒక్కసారి కూడా కోపం రాలేదు. ఈ పరిస్థితి మార్టిన్‌కు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింది. తనలో వచ్చిన మార్పును నమ్మలేకపోయాడు. వెంటనే తండ్రికి ఈ విషయాన్ని తెలిపాడు. అనకూడని మాటలతో ప్రతికూల ప్రభావాలెన్నో: కుమారుడికి నేర్పాల్సిన పాఠం ఇంకా మిగిలే ఉండడంతో.. తండ్రి ఇప్పుడు మార్టిన్‌కు మరో పని అప్పజెప్పాడు. అదేమిటంటే.. ఒక్కసారి కూడా కోపం రాని రోజు ఒక్కో మేకును చెక్కలోంచి బయటకు తీయమని సూచించాడు. మార్టిన్ తన తండ్రి చెప్పినట్టే చేశాడు. రోజురోజుకి అతడు తీస్తున్న మేకుల సంఖ్య పెరగసాగింది. కొన్ని నెలల తర్వాత అన్ని మేకులు తిరిగొచ్చాయి. మార్టిన్‌కు ఇది మళ్లీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లాడు. మార్టిన్‌ను తండ్రి తమ ఇంటి వెనకున్న చెక్క దగ్గరికి తీసుకెళ్లాడు. ‘‘మార్టిన్! నువ్వు నేను చెప్పినట్లే చేశావు. నీవు చేసిన పనికి నేనెంతగా గర్విస్తున్నానో మాటల్లో చెప్పలేను. నీవు కొట్టిన మేకుల వల్ల చెక్కలో ఏర్పడిన రంధ్రాలను చూశావా? రంధ్రాలతో అందవిహీనంగా మారిన చెక్కను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం సాధ్యమా? నీ కోపం కూడా అలాంటిదే. ఆవేశంలో ఒళ్లు మరిచి మాట్లాడే మాటలు వికృతమైన మరకలను సృష్టిస్తాయి. తర్వాత ఎన్నిసార్లు క్షమాపణలు కోరుకున్నా.. ఆ మరకలను చెరిపివేయలేం. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటావని ఆశిస్తున్నా...’’ అంటూ మార్టిన్ తండ్రి తన హితబోధను పూర్తిచేశాడు. ఈ ఆచరణాత్మక బోధనతో మార్టిన్‌లో పూర్తిగా మార్పు కలిగింది. ప్రశాంతంగా ఉంటేనే ఇతరులు గౌరవిస్తారు: మార్టిన్‌కు అతడి తండ్రి నేర్పిన పాఠం మనకు సైతం విలువైనదే. ఇది మనసులో నాటుకుపోతే ఇకపై అనర్థదాయకమైన కోపానికి గురయ్యే అవకాశం ఉండదు. ప్రశాంతచిత్తంతో వ్యవహరిస్తే అనుబంధాలు మెరుగవుతాయి. ఇరుగుపొరుగు మిమ్మల్ని కచ్చితంగా ఇష్టపడతారు. మిమ్మల్ని అమితంగా గౌరవిస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటే ఇతరులు సైతం మీతో అలాగే ఉంటారు. ఈసారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. మార్టిన్ లాగా మేకులు దిగగొట్టడం లాంటి ఏదైనా ఒక చిన్న శిక్ష వేసుకోండి. ఆ శిక్ష అనుభవించడం కంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే సులభమని మీరు తప్పకుండా గుర్తిస్తారు. కోపంలో, ఆవేశంలో ఉన్నప్పుడు అనుకున్నది సాధించలేమన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆవేశానికి లోనుకాకూడదు: కాగితంపై పెన్సిల్‌తో రాసిన దాన్ని చెరిపేయాలనుకుంటే రబ్బర్(ఎరేజర్) ఉపయోగిస్తాం. అక్షరాలను చెరిపేసినా అక్కడ మరక మాత్రం పూర్తిగా పోదు. ‘క్షమాపణ’ కూడా ఎరేజర్ లాంటిదే. ఆవేశంలో తప్పుగా మాట్లాడి క్షమాపణలు కోరినంత మాత్రాన వ్యక్తులపై పడిన ప్రతికూల ప్రభావం పూర్తిగా పోతుందనుకోవడం పొరపాటు. కాబట్టి ఆవేశానికి లోనుకాకుండా అప్రమత్తంగా ఉండడమే సదా మంచిది. ఆవేశం వల్ల అనర్థాలెన్నో: ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుండడంతో మనుషులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అనకూడని మాటలు అంటే అవి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎంతో నష్టాన్ని తెస్తున్నాయి. సెల్ఫోన్లలో ఎస్ఎంఎస్లు, ఈ-మెయిళ్ల వంటి వాటి విషయంలో జాగరూకత అవసరం. ఇతరులపై ఉన్న కోపంతో వారికి వ్యతిరేకంగా ఏదైనా సందేశాన్ని టైప్ చేసినప్పుడు వెంటనే పంపించకుండా కొద్దిసేపు ఓపిక పట్టండి. దాన్ని ‘డ్రాఫ్ట్ బాక్స్’కే పరిమితం చేయండి. ఆవేశపడి ‘సెండ్’ చేయొద్దు, దాని ఫలితం అనుభవించొద్దు. సహనం కోల్పోతే జీవితంలో ఎంతో పోగొట్టుకుంటామన్న విషయాన్ని తెలుసుకోవాలి. కోపం తెచ్చుకోనని బలంగా అనుకోండి: ఈసారి మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు ఇతరులతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మొదట బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. కొద్దిసేపు ఆగండి. మీ కోపం తీవ్రత తగ్గిపోయిన తర్వాత చెప్పాలనుకున్నది నిదానంగా చెప్పండి. ఇకపై ఎప్పుడూ కోపగించుకోనని తీర్మానించుకోండి. కోపం మీ మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని మింగేయకుండా చూసుకోండి. కోపం మీకు శత్రువుల్ని సృష్టించకుండా జాగ్రత్తపడండి. మీలో రావాల్సిన మార్పును ఈరోజే ప్రారంభించండి. ‘కెరీర్స్ 360’ సౌజన్యంతో