ఆర్థికవేత్త మార్టిన్ వోల్ఫ్
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరే అవకాశం లేదని ఫైనాన్షియల్ టైమ్స్ చీఫ్ ఎకనామిక్స్ వ్యాఖ్యాత మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. అయితే వృద్ధిబాటన అప్పటికి దేశం ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. అయితే 2047 నాటికి భారత్ కూడా సూపర్ పవర్ అవుతుందని వోల్ఫ్ అభిప్రాయపడ్డారు. వృద్ధి మందగమనం, అనిశ్చితమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధికి సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. పశి్చమ దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ, ఇది దేశాలనికి వ్యూహాత్మకంగా కీలకమైనదని అన్నారు.
ప్రస్తుత తీరిది...
ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
ఎకానమీలో ఐదవ స్థానంలో..
25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment