అర్జున్ మేనల్లుడి యాక్షన్ చిత్రం.. ట్రైలర్ చూశారా? | Dhruva Sarja Latest Movie Martin Trailer Out Now | Sakshi
Sakshi News home page

Martin Trailer: ధృవ సర్జా ఫుల్ యాక్షన్‌ మూవీ.. ట్రైలర్‌ రిలీజ్!

Published Mon, Aug 5 2024 9:45 PM | Last Updated on Tue, Aug 6 2024 9:16 AM

Dhruva Sarja Latest Movie Martin Trailer Out Now

ప్రముఖ కన్నడ హీరో, అర్జున్‌ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం మార్టిన్‌. ఈ సినిమాను పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీగా రూపొందిస్తున్నారు.  ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి అర్జున్ సర్జా కథను అందించారు. తాజాగా మార్టిన్‌ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

ట్రైలర్ చూస్తే స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో రూపొందించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో విజువల్స్, యాక్షన్‌ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీతో సహా ప్రపంచవ్యాప్తంగా 13 భాషల్లో విడుదల చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement