![Viswam, Martin Movie Screening Delayed In Telugu States](/styles/webp/s3/article_images/2024/10/11/viswam-movie.jpg.webp?itok=sa38o13w)
దసరా సందర్భంగా ఈసారి థియేటర్లలో దాదాపు అరడజనుకి పైగా సినిమాలు రిలీజయ్యాయి. గురువారం రజినీకాంత్ 'వేట్టయాన్' రిలీజ్ కాగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇక శుక్రవారం గోపీచంద్ 'విశ్వం', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' మూవీస్‌తోపాటు 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్లలోకి వచ్చేశాయి.
(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)
మిగతా సినిమాలకు ఇబ్బందేం లేదు గానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల 'విశ్వం' సినిమా షోలకు సాంకేతిక సమస్యలు తలెత్తాయట. అనుకున్న టైంలో కేడీఎమ్ (కీ డెలివరీ మెసేజ్) రాకపోవడంతో పలు థియేటర్లలో షోలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు 'మార్టిన్' చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్ ఎదురైంది. దీంతో షోలు కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment