న్యూఢిల్లీ: భారత్ ఎదుగుతున్న ‘గొప్ప శక్తి‘గా మారే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి అమెరికాతో సమానమైన పరిమాణాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. పశ్చిమ దేశాలూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్‌లో ఆయన రాసిన ఒక ఆరి్టకల్‌లో ముఖ్యాంశాలు..
► భారత్ 2050 వరకూ వార్షికంగా 5 శాతం లేదా కొంచెం అటుగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని కొనసాగించగలదని నేను
విశ్వసిస్తున్నాను.
► ‘చైనా ప్లస్ వన్‘ (కేవలం చైనాలోనే పెట్టుబడులు కాకుండా మరొక దేశంలో కూడా..) వ్యూహాన్ని అనుసరించే కంపెనీలకు భారతదేశం స్పష్టమైన స్థానం. పోటీ పూర్వక పెద్ద మార్కెట్‌ను దేశం కలిగి ఉంది.
► ప్రస్తుత భారత్ 1.43 బిలియన్ జనభా సంఖ్య 2050 నాటికి 1.67 బిలియన్‌లకు చేరుతుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా.
► దేశంలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. రుణ వృద్ధి భారీగా మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది.
► దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ రాబోయే దశాబ్దాల్లో వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాము. చైనా తరహాలో కాకుండా భారత్‌తో పాశ్చాత్య దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉండడం సానుకూల పరిణామాలకు దారితీసే అంశం.
► ఒకప్పుడు నిషేధానికి గురయిన నరేంద్ర మోడీ, ఇప్పుడు భారత్‌లో రాజకీయంగా ఆధిపత్య ప్రధాన మంత్రిగా వాషింగ్టన్‌లో జో బిడెన్‌తో ఆలింగనం చేసుకుంటున్నారు. పారిస్‌లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కూడా ఇదే అనుబంధం కొనసాగుతోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా శక్తివంతమైన దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీనినిబట్టి అర్థం అవుతోంది.
► 2023 నుంచి 2028 మధ్య భారత్ వార్షిక వృద్ధి సగటును 6 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేయడం మరో విశేషం. ఒక శాతం తగ్గినా 5 శాతం సుస్థిర వృద్ధి కొనసాగుతుంది.
► యువత అధికంగా ఉండడం, శ్రామికశక్తి తగినంత అందుబాటులో ఉండడం, ఆ శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం, అధిక పొదుపు రేటు, వృద్ధిపై విస్తృత స్థాయి ఆశలు భారత్‌కు సంబంధించి చెప్పుకోవాల్సిన మరికొన్ని అంశాలు.
► భారత్ విషయంలో 2050 వరకూ సగటు వృద్ధి 5 శాతంగా నమోదయితే, అమెరికా వృద్ధి రేటు 1.4 శాతంగా ఉండే వీలుంది.
► భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోందని, కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుందని ప్రపంచబ్యాక్ అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎనమిస్ట్ మారి్టన్ వోల్ఫ్ భారత్‌కు సానుకూలంగా ఇచి్చన ప్రకటన దేశాభివృద్ధికి భరోసాను ఇస్తోంది.
మొండిబకాయిలు తగ్గుతుండడం హర్షణీయం: ఎస్‌అండ్‌పీ
ఇదిలావుండగా, బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గుతుండడం భారత్ ఎకానమీకి లాభిస్తున్న అంశమని ఎస్‌అండ్‌పీ ప్రైమరీ క్రెడిట్ విశ్లేషకులు దీపాలి సేథ్ ఛాబ్రియా పేర్కొన్నారు. ఎకానమీ పురోగతి నేపథయంలో 2025 మార్చి నాటికి బలహీన బకాయిల పరిమాణం మొత్తం రుణాల్లో 3 నుంచి 3.5 శాతం శ్రేణికి పడిపోతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2024–26 మధ్య భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 నుంచి 7.1 శాతం మేర నమోదుకావచ్చని ఎస్‌అండ్‌పీ మిడ్ ఇయర్ గ్లోబల్ బ్యాంక్ అవుట్‌లుక్ పేర్కొంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా భారత్ కొనసాగుతుందని విశ్లేíÙంచింది. ద్రవ్యోల్బణం సమస్య ఉన్నప్పటికీ, దీనిని దేశం అధిగమించగలదన్న విశ్వాసాన్ని దీపాలి సేథ్ ఛాబ్రియా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment