Economy Development
-
త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారే క్రమం (అమృత్ కాల్) తొలి దశలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. భారతదేశం 2027–28లో ఐదు ట్రిలియన్ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వం, దీనివల్ల ఏర్పడే బలమైన రూపాయి సహాయంతో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మైలురాయిని దాటుతుందని లోక్‌సభలో ఇచి్చన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా అమృత్ కాల్ ప్రారంభ సమయంలోనే దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది‘ అని చౌదరి చెప్పారు. పురోగతి ఇలా... మంత్రి పేర్కొన్న సమాచారం ప్రకారం, 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించుకుంది. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► భారతదేశం మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మార్కెట్ నిర్ణయించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), మారకపు రేటు ద్వారా ప్రభుత్వం ఆర్థిక పురోగతిని పర్యవేక్షిస్తుంది. ►దేశీయ–అంతర్జాతీయ మార్కెట్లు రెండూ భారతదేశ జీడీపీ మారకపు రేటు, జీడీపీకి సంబంధించి వివిధ రంగాల సహకారాన్ని నిర్ణయించే యంత్రాంగాలు. ►2022–23లో భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. ►వార్షిక బడ్జెట్లలో ప్రకటించిన చర్యలతో సహా విధానపరమైన నిర్ణయాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. ►జీడీపీ వృద్ధి రేటును వేగంగా పెంచడం కోసం ప్రభుత్వం గత 9 ఏళ్లలో తీసుకున్న ప్రధాన కార్యక్రమాలలో... దివాలా (ఐబీసీ) కోడ్ అమలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన కల్పన, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు, మూలధన వ్యయాల్లో నాణ్యత పెంపు, 14 రంగాలలో ఉత్పత్తి ఆధారిత పథకాల పథకం అమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విధానాల్లో నిరంతర సరళీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన ఉన్నాయి. -
ఎదుగుతున్న గొప్ప శక్తి.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎదుగుతున్న ‘గొప్ప శక్తి‘గా మారే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి అమెరికాతో సమానమైన పరిమాణాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. పశ్చిమ దేశాలూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్‌లో ఆయన రాసిన ఒక ఆరి్టకల్‌లో ముఖ్యాంశాలు.. ► భారత్ 2050 వరకూ వార్షికంగా 5 శాతం లేదా కొంచెం అటుగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని కొనసాగించగలదని నేను విశ్వసిస్తున్నాను. ► ‘చైనా ప్లస్ వన్‘ (కేవలం చైనాలోనే పెట్టుబడులు కాకుండా మరొక దేశంలో కూడా..) వ్యూహాన్ని అనుసరించే కంపెనీలకు భారతదేశం స్పష్టమైన స్థానం. పోటీ పూర్వక పెద్ద మార్కెట్‌ను దేశం కలిగి ఉంది. ► ప్రస్తుత భారత్ 1.43 బిలియన్ జనభా సంఖ్య 2050 నాటికి 1.67 బిలియన్లకు చేరుతుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. ► దేశంలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. రుణ వృద్ధి భారీగా మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. ► దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ రాబోయే దశాబ్దాల్లో వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాము. చైనా తరహాలో కాకుండా భారత్‌తో పాశ్చాత్య దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉండడం సానుకూల పరిణామాలకు దారితీసే అంశం. ► ఒకప్పుడు నిషేధానికి గురయిన నరేంద్ర మోడీ, ఇప్పుడు భారత్‌లో రాజకీయంగా ఆధిపత్య ప్రధాన మంత్రిగా వాషింగ్టన్లో జో బిడెన్‌తో ఆలింగనం చేసుకుంటున్నారు. పారిస్‌లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కూడా ఇదే అనుబంధం కొనసాగుతోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా శక్తివంతమైన దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీనినిబట్టి అర్థం అవుతోంది. ► 2023 నుంచి 2028 మధ్య భారత్ వార్షిక వృద్ధి సగటును 6 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేయడం మరో విశేషం. ఒక శాతం తగ్గినా 5 శాతం సుస్థిర వృద్ధి కొనసాగుతుంది. ► యువత అధికంగా ఉండడం, శ్రామికశక్తి తగినంత అందుబాటులో ఉండడం, ఆ శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం, అధిక పొదుపు రేటు, వృద్ధిపై విస్తృత స్థాయి ఆశలు భారత్‌కు సంబంధించి చెప్పుకోవాల్సిన మరికొన్ని అంశాలు. ► భారత్ విషయంలో 2050 వరకూ సగటు వృద్ధి 5 శాతంగా నమోదయితే, అమెరికా వృద్ధి రేటు 1.4 శాతంగా ఉండే వీలుంది. ► భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోందని, కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుందని ప్రపంచబ్యాక్ అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎనమిస్ట్ మారి్టన్ వోల్ఫ్ భారత్‌కు సానుకూలంగా ఇచి్చన ప్రకటన దేశాభివృద్ధికి భరోసాను ఇస్తోంది. మొండిబకాయిలు తగ్గుతుండడం హర్షణీయం: ఎస్అండ్పీ ఇదిలావుండగా, బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గుతుండడం భారత్ ఎకానమీకి లాభిస్తున్న అంశమని ఎస్అండ్పీ ప్రైమరీ క్రెడిట్ విశ్లేషకులు దీపాలి సేథ్ ఛాబ్రియా పేర్కొన్నారు. ఎకానమీ పురోగతి నేపథయంలో 2025 మార్చి నాటికి బలహీన బకాయిల పరిమాణం మొత్తం రుణాల్లో 3 నుంచి 3.5 శాతం శ్రేణికి పడిపోతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2024–26 మధ్య భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 నుంచి 7.1 శాతం మేర నమోదుకావచ్చని ఎస్అండ్పీ మిడ్ ఇయర్ గ్లోబల్ బ్యాంక్ అవుట్‌లుక్ పేర్కొంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా భారత్ కొనసాగుతుందని విశ్లేíÙంచింది. ద్రవ్యోల్బణం సమస్య ఉన్నప్పటికీ, దీనిని దేశం అధిగమించగలదన్న విశ్వాసాన్ని దీపాలి సేథ్ ఛాబ్రియా వ్యక్తం చేశారు. -
ఉపాధి, నైపుణ్యాభివృద్ధి
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి తాలూకు ఫలాలు యువత, ఆదివాసీలతో పాటు సమాజంలో అన్ని వర్గాలకూ చేరేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడం, ఉత్పత్తి రంగ వృద్ధికి ఊతమివ్వడం, స్వాతంత్య్రానంతరం నిర్లక్ష్యానికి గురైన ఇతర రంగాల్లోనూ ఉపాధి సృష్టికి కృషి చేయడం తమ లక్ష్యమన్నారు. గుజరాత్ ప్రభుత్వం సోమవారం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘దేశంలో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. ఇవి ఉపాధి కల్పించమే గాక లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి దిశగా స్ఫూర్తినిస్తున్నాయి. స్టార్టప్‌లకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు అవసరమైన బ్యాంకు గ్యారంటీలు కూడా అందజేస్తోంది’’ అని వివరించారు. ‘‘గుజరాత్లో గత ఐదేళ్లలో లక్షన్నర మంది యువకులకు ప్రభుత్వోద్యోగాలు లభించాయి. 2023లో మరో పాతిక వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి’’ అన్నారు. ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భరత ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ఆరోగ్య, వైద్య పరిశోధనలపై బడ్జెట్ అనంతర వెబినార్‌నుద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్య రంగానికి సంబంధించిన ఎలాంటి పరికరాలనూ, టెక్నాలజీనీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వయంసమృద్ధంగా మార్చాల్సిన బాధ్యత దేశ పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలపై ఉందన్నారు. ఈ దిశగా తామిప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్లపాటు సమీకృత ధోరణి, దీర్ఘకాలిక విజన్ లేమి దేశ వైద్య రంగ వృద్ధికి ముందరి కాళ్ల బంధంగా ఉండేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని చెప్పారు. ‘‘నేను ఫార్మా మార్కెట్ రూ.4 లక్షల కోట్లకు విస్తరించింది. ప్రైవేట్ రంగం, వైద్య విద్యా రంగం మధ్య సరైన సమన్వయముంటే ఇది రూ.10 లక్షల కోట్లకు విస్తరించగలదు. కరోనా కల్లోలం సంపన్న దేశాలను కూడా అల్లాడించింది. దాని దెబ్బకు ప్రపంచమంతా ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ తరుణంలో భారత్ మాత్రం మరో అడుగు ముందుకేసి వెల్నెస్పై దృష్టి పెట్టింది. మనమిప్పుడు ప్రపంచం ముందుంచిన ‘ఒక భూమి, ఒకే ఆరోగ్యం’ విజన్ అందులో భాగమే. మనుషులకే గాక జంతు, వృక్షజాలాలన్నింటికీ ఒకే తరహాలో సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడమే దీని ఉద్దేశం. అంతేగాక ఆరోగ్య సేవలు అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం కూడా మా ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటి. అందుకే ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేపట్టిన చర్యల ద్వారా పేద రోగులకు ఇప్పటికే రూ.80,000 కోట్లు ఆదా అయ్యాయి’’ అని చెప్పారు. మార్చి 7ను జన్ ఔషధీ దివస్ జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. 9,000 జన్ ఔషధీ కేంద్రాల వల్ల పేద, మధ్యతరగతి వారికి రూ.20 వేల కోట్ల దాకా ఆదా అయిందన్నారు. వేసవిలో జాగ్రత్త: మోదీ రానున్న వేసవిలో తీవ్ర ప్రతికూల వా తావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రజలతో పాటు వైద్య నిపుణులకు, స్థానిక సంస్థలకు సమగ్ర అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. వేసవి సన్నద్ధత దిశగా చేపట్టిన చర్యలను ఆయన సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ఆహార ధాన్యాల నిల్వలను ఎఫ్‌సీఐ వీలైనంతగా పెంచాలని మోదీ సూచించారు. వచ్చే వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలను మోదీ దృష్టికి తెచ్చారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థే ఆశాకిరణం
ముంబై: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దన్నుతో కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న అంచనాను హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యక్తం చేశారు. అంచనాల కంటే ముందే దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుందన్నారు. లాక్డౌన్ చర్యలను జూలై ఆఖరుకు పూర్తిగా ఎత్తివేస్తే భారత జీడీపీ 2020–21లో హీనపక్షం మైనస్ 5 శాతానికి పడిపోవచ్చని చాలా సంస్థలు అంచనాలను ఇప్పటికే విడుదల చేశాయి. గరిష్టంగా మైనస్ 7.5 శాతం వరకు క్షీణించొచ్చని పేర్కొన్నాయి. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదలడం మొదలైనట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మే నెలలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి వెళ్లి క్రమంగా తగ్గడం మొదలైంది. డిజిటల్ లావాదేవీలు జోరందుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు తిరిగి 90,000 కోట్ల స్థాయిని చేరాయి. సకాలంలో వర్షాల ఆగమనంతో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగింది’’ అని చెప్పారు. -
ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతాం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ మూలంగా దెబ్బతిన్న వివిధ రంగాలకు అండగా నిలిచి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. లాక్డౌన్ సమయంలోనూ లైఫ్ సైన్సెస్ వంటి అత్యవసర సేవల పరిశ్రమలకు మినహాయింపును ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఫిక్కీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం– పునరుత్తేజం’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని రకాల పరిశ్రమలకు అండగా నిలుస్తూ కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వాటి కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని, కరోనాపై పోరుకు ప్రజలు సహకరించాలన్నారు. ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు బ్యాంకర్ల సమావేశం నిర్వహించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు విద్యుత్ బిల్లులు, ఆస్తిపన్ను విషయంలో పలు వెసులుబాట్లు కల్పించామన్నారు. సంక్షోభ సమయంలోనూ అవకాశాలను వెతకడంతో పాటు, చైనా నుంచి వెనక్కి మళ్లుతున్న విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఆరోగ్యం, వైద్య ఉపకరణాల రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందన్నారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం మరింత సాయం అందించాలని కేటీఆర్ కోరారు. -
21వ శతాబ్దపు నగరాలు నిర్మిద్దాం
ముంబై/ఔరంగాబాద్: 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో భారతీయ నగరాల్లో భద్రత, అనుసంధానత, ఉత్పాదకత విషయంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. లేదంటే రాబోయే ఐదేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పగటి కలలాగే మిగిలిపోతుందని హెచ్చరించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోదీ, ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సమగ్రాభివృద్ధిపై దృష్టి.. ‘గత ఐదేళ్లకాలంలో ముంబై నగరంలో మౌలిక ప్రాజెక్టులపై మేం రూ.1.5 లక్షల కోట్లను వెచ్చించాం. కేవలం ముంబైనే కాకుండా దేశంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మనం సొంతంగా మెట్రో రైలు కోచ్‌లను రూపొందిస్తున్నాం. మౌలికవసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. చిన్న పట్టణాల్లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుల కారణంగా ఎక్కువమందికి జీవనోపాధి దొరుకుతోంది. గతంలో ఇంతవేగంగా ప్రాజెక్టు నిర్మాణం ఎన్నడూ జరగలేదు కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు’ అని మోదీ వెల్లడించారు. ముంబై మెట్రో కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏటా 2.5 కోట్ల టన్నులమేర తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ‘ఒకేదేశం–ఒకే కార్డు’ వ్యవస్థ కోసం ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థ తయారుచేసిన 500 మెట్రో కోచ్‌లను ప్రధాని ఆవిష్కరించారు. గణేశ్ ఆలయంలో పూజలు అంతకుముందు ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా విలే పార్లేలోని గణేశ్ ఆలయానికి చేరుకున్న మోదీ, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లోక్మాన్య సేవాసంఘ్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఇంటికి తాగునీరు అందించేందుకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నాం. మహిళలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్న రామ్మనోహర్ లోహియా కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముద్రా పథకం కింద ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.లక్ష చొప్పున రుణాలు ఇస్తున్నాం’’ అని మోదీ తెలిపారు. ముద్రా పథకం కింద ఇప్పటివరకూ 14 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు. -
ఎఫ్‌డీఐ 2.0
న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చేందుకు ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మరోసారి ద్వారాలు తెరిచింది. బొగ్గు మైనింగ్, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతి అవసరం లేని ఆటోమేటిక్ మార్గంలో ఆహ్వానించింది. అలాగే, డిజిటల్ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్‌డీఐలను స్వీకరించొచ్చు. బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. అలాగే, సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు స్థానిక ఉత్పత్తులను సమీకరించుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఐదేళ్ల కనిష్ట స్థాయికి (5.8 శాతం) జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో గత వారం పలు వర్గాలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగా.. వారం తిరగకముందే ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి విషయంలో మరిన్ని చర్యలకూ అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపినట్టయింది. గత 3–4 త్రైమాసికాలుగా దేశ వృద్ధి కుంటుపడిన విషయం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి 5.8 శాతం అన్నది ఐదేళ్ల కనిష్ట స్థాయి. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తక్షణ నిధుల సాయం సహా పలు చర్యలను ప్రభుత్వం గతవారం ప్రకటించింది. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు.. ‘‘ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేయడం వల్ల భారత్ ఎఫ్‌డీఐలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా పెట్టుబడుల రాక పెరిగి, ఉపాధి, వృద్ధికి తోడ్పడుతుంది’’ అని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో అన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు గాను ఎఫ్‌డీఐ పాలసీని మరింత సరళీకరించడమే కేబినెట్ నిర్ణయాల ఉద్దేశంగా పేర్కొన్నారు. కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతించడం వల్ల దేశీ తయారీ వృద్ధి చెందుతుందన్నారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ సింగిల్ బ్రాండ్ రిటైల్ విభాగంలో 51 శాతానికి మించి ఎఫ్‌డీఐలను కలిగిన సంస్థ... 30 శాతం ఉత్పత్తులను స్థానిక మార్కెట్ నుంచే సమీకరించుకోవాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. ఇటువంటి సంస్థలకు కార్యకలాపాల నిర్వహణలో గొప్ప వెసులుబాటు కల్పించేందుకు గాను, భారత్ నుంచి సేకరించే అన్ని రకాల ఉత్పత్తులను స్థానిక సమీకరణగానే గుర్తిస్తారు. అంటే భారత్‌లో విక్రయించేందుకు అయినా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు సమీకరించినా ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే, భౌతికంగా సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలు ప్రారంభించడానికి ముందే ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టుకునేందుకు కూడా అనుమతించింది. ‘‘ఆన్లైన్ విక్రయాలతో లాజిస్టిక్స్, డిజిటల్ చెల్లింపులు, కస్టమర్ కేర్, శిక్షణ, ఉత్పత్తులపై నైపుణ్యం విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి’’ అని మంత్రి గోయల్ తెలిపారు. డిజిటల్ న్యూస్ మీడియా డిజిటల్ మీడియాకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మంచి ముందడుగు వేసిందనే చెప్పాలి. ప్రింట్ మీడియా తరహాలోనే... ఇకపై డిజిటల్ మీడియాలో వార్తలు, కరెంట్ అఫైర్స్ అప్లోడింగ్, స్ట్రీమింగ్ విభాగంలోకి ప్రభుత్వ అనుమతితో 26 శాతం వరకు ఎఫ్‌డీఐలు ప్రవేశించొచ్చు. ప్రింట్ మీడియాలో ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 26 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అలాగే, బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ సేవల్లోనూ ప్రభుత్వ అనుమతితో 49 శాతం ఎఫ్‌డీఐలకు ప్రవేశం ఉంది. బొగ్గు రంగంలోకి ఇలా... ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులు, ఐరన్, స్టీల్, సిమెంట్ ప్లాంట్ల సొంత వినియోగానికి ఉద్దేశించిన బొగ్గు, లిగ్నైట్ మైనింగ్‌లోకి ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఇకపై బొగ్గు విక్రయాలు, మైనింగ్, కోల్ వాషరీ, క్రషింగ్, కోల్ హ్యాండ్లింగ్ తదితర బొగ్గు అనుబంధ విభాగాల్లోకీ వంద శాతం ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐలను తెచ్చుకోవచ్చు. ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐ అన్నది ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంధనం వంటిది. రుణాల రూపంలో కాకుండా పెట్టుబడులుగా దేశాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తోడ్పడతాయి. ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రభుత్వం నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2014–15 నుంచి 2018–19 వరకు దేశంలోకి 286 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అంతకుముందు 5 ఏళ్లలో వచ్చిన 189 బిలియన్ డాలర్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. 2018–19లో వచ్చిన 64.37 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇప్పటి వరకు ఓ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గరిష్ట ఎఫ్‌డీఐలు కావడం గమనార్హం. యాపిల్, వన్‌ప్లస్‌లకు ప్రయోజనం దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించడం వల్ల మొబైల్ హ్యాండ్సెట్ రిటైల్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని, యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి సంస్థలు సొంత దుకాణాలు తెరిచేందుకు మార్గం సుగమం అవుతుందని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) పేర్కొంది. పెట్టుబడులు పెరుగుతాయ్: హెచ్అండ్ఎం ‘‘ హెచ్అండ్ఎం గత 30 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్ కోసం భారత్ నుంచి సమీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ కోసం సమీకరించేవి కూడా ఇకపై 30 శాతం స్థానిక సమీకరణ కింద పరిగణించడం ఆహ్వానించతగినది. ఇది భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. విదేశీ కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’ అని హెచ్అండ్ఎం భారత మేనేజర్ జానే ఎనోలా పేర్కొన్నారు. ప్రోత్సాహకరం: ఐకియా ‘‘సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి స్థానిక ఉత్పత్తుల సమీకరణ నిబంధనను ప్రభుత్వం సులభతరం చేయడాన్ని ఐకియా ఇండియా ఆహ్వానిస్తోంది. సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే ప్రభుత్వ చర్యలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని ఐకియా ఇండియా పేర్కొంది. -
బ్రెగ్జిట్ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్
మాంచెస్టర్: బ్రెగ్జిట్ ద్వారా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లవచ్చనీ, ఇది గొప్ప అవకాశమని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కానీ థెరిసా మే ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రతికూలాంశంగానే చూసిందన్నారు. మాంచెస్టర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో బోరిస్ మాట్లాడుతూ.. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసిన ప్రాంతాల్లో కొత్తగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఆగిపోయిన బ్రెగ్జిట్ చర్చలను వేగవంతం చేస్తామనీ, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఫ్రీపోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బ్రిటన్‌లోని ఉత్తర ఐర్లాండ్, పొరుగునున్న రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలు ఉండాలన్న నిబంధనను తొలగిస్తే ఈయూతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని చెప్పారు. ఒప్పందం కుదిరినా, కుదరకున్నా అక్టోబర్ 31 నాటికి ఈయూ నుంచి బయటకొచ్చేస్తామన్నారు. -
ఎకానమీ వృద్ధికి నీతి ఆయోగ్ ఫార్ములా
♦ పన్నులు, వ్యవసాయం, ఇంధన రంగాల్లో సంస్కరణలు ♦ నష్టాల్లో ఉన్న పీఎస్‌యూల మూసివేత ♦ మూడేళ్ల ముసాయిదా అజెండా న్యూఢిల్లీ: వృద్ధికి, ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై నీతి ఆయోగ్ మూడేళ్ల ముసాయిదా కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది. పన్నులు, వ్యవసాయం, ఇంధన రంగాల్లో కీలక సంస్కరణలు చేపట్టాల్సి ఉందని సూచించింది. ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించని కార్యకలాపాల్లో ప్రభుత్వ తన పాత్ర పరిమితంగానే ఉండేలా చూసుకోవాలని సూచించింది. ముసాయిదా అజెండాను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా మంగళవారం ఆవిష్కరించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ప్రతిపాదిత మూడేళ్ల అజెండాలో పన్నుల ఎగవేతను అరికట్టడానికి, మరింత మందిని పన్నుల పరిధిలోకి తెచ్చేందుకు, ట్యాక్సేషన్‌ను సరళతరం చేసేందుకు చర్యలు అవసరమని నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే నష్టాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను(సీపీఎస్ఈ) మూసివేయాలని, 20 పీఎస్‌యూల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం చేపట్టాలని సిఫార్సు చేసింది. సామాన్యులకు అందుబాటు ధరల్లో గృహాలు లభించేలా స్థలాల రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, వలసవచ్చే వారికోసం డార్మిటరీ హౌసింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.