expert
-
ప్రపంచం చూపు.. భారత్ వైపు..!
ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్తులో ఇతర దేశాలు శ్రామికశక్తికోసం యువకులు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలవైపు చూసే పరిస్థితులు ఏర్పడవచ్చని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ ఉపాధ్యక్షుడు, బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత ఇటీవల తెలిపారు. ప్రపంచానికి నిపుణులైన కార్మికులను అందించే సత్తా భారత్‌కు ఉందని చెప్పారు. దశాబ్దం క్రితం భారత్ నుంచి ఉపాధి కోసం, ఇతర కారణాల వల్ల కార్మికులు పలు దేశాలకు వలస వెళ్లేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ప్రపంచ దేశాలకు నిపుణుల కొరత తీర్చేలా భారత్ సన్నద్ధం అవుతోందని మహంత చెప్పారు. అందులో భాగంగానే ప్రపంచంలోని నిపుణుల కొరత తీర్చడానికి ప్రస్తుతం ఇతర దేశాలకు పయనం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి శ్రామికశక్తిలో భారత కార్మికులు దాదాపు 15 శాతం ఉండడం గమనార్హం. రానున్న ఐదేళ్లలో భారత కార్మికులు ఇతర దేశాలకు వెళ్లడం 28-30శాతం పెరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా ఎక్కువగా ఐటీ, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ప్లబింగ్, మెకానిక్, ఆతిథ్యం, సేల్స్ రంగాల్లో నిపుణులకు, కార్మికులకు గిరాకీ ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్’ ఇళ్ల నిర్మాణం..? భారత్‌లో 15-65 ఏళ్ల వయసు వారు సుమారు 55.4 కోట్ల మంది ఉన్నారని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, యూకే, స్వీడన్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూఎస్ఏ, జపాన్, మలేషియా తదితర దేశాల్లో భారతీయ కార్మికులకు గిరాకీ పెరుగుతోందని మహంత చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా దాదాపు లక్ష మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా 13,944 మందిని, ఖతార్ 3,646 మంది, యూఏఈ 2,941 మంది భారత నిపుణులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. -
పదేళ్ల క్రితం మిస్సైన మలేషియా విమానం.. పైలట్ ఆత్మహత్య స్కెచ్!!
మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమై పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ విమానం మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలింది. దీనికి సంబంధించి పలు కథనాలు వార్తల రూపంలో తెరపైకి వస్తునే ఉన్నాయి. మార్చి 8, 2014న మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్‌కు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమైంది. ఈ విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ ప్రయత్నాలు చేసినప్పటికీ, విమానం విడి భాగాలు గానీ, దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు గానీ గుర్తించలేకపోయారు. ప్రమాద సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం కౌలాలంపూర్‌లో టేకాఫ్ అయ్యాక 39 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సిగ్నల్ కోల్పోయి అదృశ్యం అయింది. ఈ విమానం అదృశ్యంపై పరిశోధన చేసిన బృందంలోని సభ్యుడైన బ్రిటన్ ఏవియేషన్ నిపుణుడు, పైలట్ సైమన్ హార్డీ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై పరిశోధన చేసిన హారీ.. ఈ విమాన అదృశ్యం సదరు పైలట్ జహారీ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకోవాలనే పథకంలో భాగంగానే జరిగినట్లు వెల్లడించారు. ఎంహెచ్ 370 విమానం పైలట్ జహారీ అహ్మద్ షా.. తోటి ప్రయాణీకులను తన ఆత్మహత్య పథకంలో భాగంగా విమానం అదృశ్యం చేసినట్లు సైమన్ హార్డీ తెలిపారు. ప్రమాద సమయంలో దక్షిణ హిందూ సముద్రంలో గీల్విన్క్ ఫ్రాక్చర్ జోన్లో విమానం అదృశ్యం అయ్యేలా పైలట్ భావించినట్లు తన పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. విమానం అదృశ్యం విషయంలో ఎఫ్‌బీఐ పరిశోధనలో కూడా దాదాపు దగ్గరా ఉన్న ఇటువంటి ఒక ముగింపు వచ్చినట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు. విమాన అదృష్యానికి సంబంధించిన దర్యాప్తు 2017లో ముగిసింది. అయితే గతంలో హార్డీకి తన పరిశోధనను రుజువు చేసుకోవడానికి సమయం లేదని తెలిపారు. గతంలో ఎంహెచ్370 విమానం సముద్రంలో భూకంపాలు గురయ్యే ప్రాంతంలో అదృశ్యం అయినట్లు నమ్మినట్లు తెలిపారు. అదృశ్యమైన విమానం సముద్రపు అడుగుభాగంలో కప్పబడి ఉండవచ్చని హార్డీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు సైమన్ హార్డీ వెల్లండించారు. -
నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. టన్నెల్లో అమర్చిన పైప్‌లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు బయటకు వస్తున్నారు. వారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థించారు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ రంగంలోకి దిగారు. రెస్క్యూ బృందం ప్రయత్నాలు ఫలించి బాధితులు బయటపడుతున్న వేళ ఆర్నాల్డ్ డిక్స్ మంగళవారం టన్నెల్ సైట్ సమీపంలోని చిన్న దేవాలయం వద్ద కార్మికుల క్షేమం కోసం అర్చకులతో కలిసి పూజలు చేశారు. దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా మారింది. While long awaited breakthrough in #Uttarkashi tunnel operation is achieved, visual of Prof. Arnold Dix, international tunnelling expert, bowing and praying before temple near the site is so heartwarming. Prayers for safety of all the trapped workers. pic.twitter.com/CcrkeEZZ9i — Arun Bothra 🇮🇳 (@arunbothra) November 28, 2023 -
ఆహారపు అలవాట్లను నియంత్రించకపోతే..ఆ సమస్యలు తప్పవు!
మనం తీసుకునే ఆహారం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ నిర్ణయిస్తుంది. ఆహరం అనేది రుచి కోసమో బలం కోసమో మాత్రమే కాదు, సరైన సంపూర్ణ ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. ఆహారం తక్కువగా తింటే పోషకాహార లోపాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎక్కువగా తింటే అది ఊబకాయం వంటి ఎన్నో సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకని ఆహారాన్ని ఎప్పుడు కంట్రోల్‌గానే తినాలి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. ఒక డైలీ డైట్ అనేది నిర్ణయించుకొని సరైన ఆహారాన్నే తినాలి. ఒక వేళ ఆహారాన్ని నియంత్రించకపోతే సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు నవీన్ నడిమింటి. ఇంతకీ ఎలాంటి సమస్యలు వస్తాయి? తక్కువగా తినాంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి తదితరాలు నవీన్ నడిమింటిగారి మాటల్లో చూద్దాం. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..? ఊబకాయం: ఊబకాయం అనేది అధిక బరువు లేదా అధిక కొవ్వు కలిగి ఉండటం. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, వీటిలో గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం మరియు క్యాన్సర్ ఉన్నాయి. గుండె జబ్బులు: గుండె జబ్బులు అనేవి గుండెను ప్రభావితం చేసే అనేక రకాల పరిస్థితులను సూచిస్తాయి. అవి అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు ఊబకాయం వంటి ఆహారపు అలవాట్ల ద్వారా ప్రభావితమవుతాయి. మధుమేహం: మధుమేహం అనేది శరీరం రక్తంలో చక్కెరను సరిగ్గా నియంత్రించలేకపోవడం. ఇది అధిక కొవ్వు, అధిక చక్కెర మరియు తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు తినడం వల్ల ప్రభావితమవుతుంది. క్యాన్సర్: క్యాన్సర్ అనేది కణాలు అసాధారణంగా పెరిగే పరిస్థితి. కొన్ని రకాల క్యాన్సర్లు ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తాయి. వీటిలో కడుపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ఉన్నాయి. పాటించాల్సి టిప్స్: తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. గోధుమ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తినండి తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాలను ఎంచుకోండి. ఆహారాన్ని మితంగా తినండి. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యంగా ఉండటానికి తప్పక సహాయపడతాయి. -- నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..) -
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్‌షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్‌షాట్‌కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్‌బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్‌బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్‌లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్‌బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్‌బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్‌లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్‌లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్‌లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్‌లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్‌లను నమ్మవద్దు. -
హైకావా అప్లయెన్సెస్ తో ఎక్స్పర్ట్ ఏసి సొల్యూషన్స్.. జొఇనింగ్ హాండ్స్
-
డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలకు కొత్త రూల్! మార్గదర్శకాలు విడుదల
వైద్య ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తుల ప్రకటనల్లో హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు, డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయన్సర్లు వీక్షకులను తప్పుదారి పట్టించకుండా డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ప్రకటనల్లో అసలైన వైద్య నిపుణులు, హెల్త్, ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు నటించినా కూడా వైద్య, ఆరోగ్య సంబంధ సమాచారాన్ని తెలియజేసేటప్పుడు, ఆయా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేస్తున్నప్పుడు తాము ధ్రువీకరణ పొందిన హెల్త్/ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు లేదా వైద్య నిపుణులమనే విషయాన్ని బహిర్గతం చేయాలని సూచించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహా వాటాదారులతో చర్చించిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆరోగ్య నిపుణులుగా లేదా వైద్య నిపుణులుగా నటిస్తూ వైద్య, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు, వైద్య ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేసేటప్పుడు తాము చెప్పే విషయాలు వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టమైన డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటికి మినహాయింపు అయితే వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట ఉత్పత్తులు, సేవలతో సంబంధం లేని సాధారణ వెల్నెస్, ఆరోగ్య సలహాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే నీరు ఎక్కువగా తాగండి.. వ్యాయామం చేయండి.. బాగా నిద్రపోండి.. వంటి సాధారణ సలహాలు ఇవ్వవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మార్గదర్శకాల అమలును చురుకుగా పర్యవేక్షిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడితే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాలు విధించవచ్చు. -
చూపు లేదు కాని క్యాన్సర్‌ని గుర్తిస్తారు!
స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. రేడియేషన్‌తో కూడిన మామోగ్రఫీ కన్నా స్పర్శతో బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించడాన్ని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అంటారు. స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడ్డ అంధ మహిళలకు ఒక ఉపాధిగా. స్పర్శతో కేన్సర్‌ను గుర్తించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే 18 మంది అంధ మహిళలు ఈ శిక్షణ పొందారు. ఇతర అంధ మహిళలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. స్త్రీలు పరస్పరం మేలు పొందే ఈ విశేష కార్యక్రమాన్ని ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ అంటున్నారు. న్యూఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మీనాక్షి గుప్తా ప్రతి ఉదయం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ ఆమెను సాధారణ అంధురాలు అనుకుంటారు. కాని తాను పనిచేసే హాస్పిటల్‌కు ఆమె చేరుకున్నాక ఆ అంధురాలిలోని అసామాన్య నైపుణ్యం తెలిసి ఆశ్చర్యపోతారు. ఆమె ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణురాలు. ఇలాంటి నిపుణులను ‘మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్’ (ఎం.టి.ఇ) అంటారు. వీరు చేతి స్పర్శతో స్త్రీల వక్షోజాలలో వచ్చిన అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించి కేన్సర్ బారిన పడకుండా కాపాడుతారు. బ్రెస్ట్ కేన్సర్‌ను స్త్రీలు ఎవరికి వారు స్పర్శ ద్వారా చెక్ చేసుకుంటూ లంప్స్‌ను గుర్తించవచ్చు. కాని అందరూ సరిగ్గా గుర్తించలేరు. చిన్న లంప్స్‌ను అసలు గుర్తించలేరు. కాని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణులు మాత్రం అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించడంలో శిక్షణ పొందుతారు. అంధ మహిళలే ఎందుకు? ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ను జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ ఫ్రేన్ హాఫ్‌మేన్ కనుగొన్నాడు. బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించే మామోగ్రఫీలో రేడియేషన్ ఉంటుంది. ఖర్చు కూడా. కాని చేతులతో గుర్తించడంలో ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఖర్చు కూడా ఉండదు. అందుకే చేతి స్పర్శ ద్వారా ఎలా బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించవచ్చో అతను కొన్ని పద్ధతులను ప్రతిపాదించాడు. ఇందులో శిక్షణకు అంధ మహిళలను ఎంచుకున్నాడు. ఎందుకంటే చూపు లేకపోవడం వల్ల అంధులు స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడతారు. వారు తమ స్పర్శతో కచ్చితంగా లంప్స్‌ను గుర్తించగలరని ఊహించాడు. అతని ఊహ నిజమైంది. అంధ మహిళల స్క్రీనింగ్‌లో కేవలం 1 శాతం మాత్రమే తప్పు అంచనా వచ్చి మిగిలిన 99 శాతం నిర్థారిత అంచనా వచ్చింది. దాంతో అతను ఒక సేవాకార్యక్రమంగా ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ పేరుతో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, కొలంబియా, మెక్సికో, ఇండియాలలోని ఆయా ప్రభుత్వ అంధుల పర్యవేక్షణ సంస్థలను కోరారు. మన దేశంలో 2017 నుంచి ఈ శిక్షణ జరుగుతోంది. ఇప్పటికి 18 మంది ఎం.టి.ఇలు శిక్షణ పొందారు. మరో 8 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. 9 నెలల శిక్షణ ఢిల్లీలోని ‘బ్లైండ్ ఇండియా సెంటర్ ఫర్ బ్లైండ్ విమెన్ అండ్ డిజేబిలిటీ స్టడీస్’ (ఎన్.ఏ.బి.సి.బి.డబ్లు్య)లో మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్ (ఎం.టి.ఇ)లుగా శిక్షణను ఇస్తున్నారు. అంధ మహిళలు, చూపు లోపం పాక్షికంగా ఉన్నవారు ఈ శిక్షణను పొందవచ్చు. 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆరు నెలలు సెంటర్లో, మూడు నెలలు ఆస్పత్రిలో పని చేయాలి. ఈ ట్రయినింగ్లో ఇంగ్లిష్, కంప్యూటర్ను ఆపరేట్ చేయడం, మానవ శరీర నిర్మాణంలో ప్రాథమిక అవగాహన తదితరాలు నేర్పిస్తారు. ‘అంధులు బ్రెస్ట్ కేన్సర్‌ను స్పర్శతో ఎలా గుర్తించగలరా అని ముందు సందేహించాను. కాని జర్మనీకి వెళ్లి చూశాక మన దేశంలో అంధ మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు బ్లైండ్ ఇండియా సెంటర్ డైరెక్టర్ షాలినీ ఖన్నా. క్యాంపులలో సేవలు బ్లైండ్ ఇండియా సెంటర్ తరచూ బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల్లో ఎం.టి.ఇలు తమ స్పర్శతో స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నారు. ‘4 మిల్లీమీటర్ల చిన్న లంప్‌ను కూడా ఎం.టి.ఇలు గుర్తిస్తున్నారు’ అని క్యాంప్ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. వీరి నిర్థారణ తప్పడం లేదు కనుక అంధ మహిళలు ఈ శిక్షణ తీసుకుని ఈ సేవలను కొనసాగిస్తూ ఉపాధి పొందాలని బ్లైండ్ ఇండియా సెంటర్ తెలియచేసింది. (చదవండి: వెన్నునొప్పే కదా! అని తేలిగ్గా తీసుకోకండి! ఆ వ్యాధికి సంకేతం కావోచ్చు) -
ఎదుగుతున్న గొప్ప శక్తి.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎదుగుతున్న ‘గొప్ప శక్తి‘గా మారే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి అమెరికాతో సమానమైన పరిమాణాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. పశ్చిమ దేశాలూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్‌లో ఆయన రాసిన ఒక ఆరి్టకల్‌లో ముఖ్యాంశాలు.. ► భారత్ 2050 వరకూ వార్షికంగా 5 శాతం లేదా కొంచెం అటుగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని కొనసాగించగలదని నేను విశ్వసిస్తున్నాను. ► ‘చైనా ప్లస్ వన్‘ (కేవలం చైనాలోనే పెట్టుబడులు కాకుండా మరొక దేశంలో కూడా..) వ్యూహాన్ని అనుసరించే కంపెనీలకు భారతదేశం స్పష్టమైన స్థానం. పోటీ పూర్వక పెద్ద మార్కెట్‌ను దేశం కలిగి ఉంది. ► ప్రస్తుత భారత్ 1.43 బిలియన్ జనభా సంఖ్య 2050 నాటికి 1.67 బిలియన్లకు చేరుతుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. ► దేశంలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. రుణ వృద్ధి భారీగా మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. ► దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ రాబోయే దశాబ్దాల్లో వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాము. చైనా తరహాలో కాకుండా భారత్‌తో పాశ్చాత్య దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉండడం సానుకూల పరిణామాలకు దారితీసే అంశం. ► ఒకప్పుడు నిషేధానికి గురయిన నరేంద్ర మోడీ, ఇప్పుడు భారత్‌లో రాజకీయంగా ఆధిపత్య ప్రధాన మంత్రిగా వాషింగ్టన్లో జో బిడెన్‌తో ఆలింగనం చేసుకుంటున్నారు. పారిస్‌లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కూడా ఇదే అనుబంధం కొనసాగుతోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా శక్తివంతమైన దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీనినిబట్టి అర్థం అవుతోంది. ► 2023 నుంచి 2028 మధ్య భారత్ వార్షిక వృద్ధి సగటును 6 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేయడం మరో విశేషం. ఒక శాతం తగ్గినా 5 శాతం సుస్థిర వృద్ధి కొనసాగుతుంది. ► యువత అధికంగా ఉండడం, శ్రామికశక్తి తగినంత అందుబాటులో ఉండడం, ఆ శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం, అధిక పొదుపు రేటు, వృద్ధిపై విస్తృత స్థాయి ఆశలు భారత్‌కు సంబంధించి చెప్పుకోవాల్సిన మరికొన్ని అంశాలు. ► భారత్ విషయంలో 2050 వరకూ సగటు వృద్ధి 5 శాతంగా నమోదయితే, అమెరికా వృద్ధి రేటు 1.4 శాతంగా ఉండే వీలుంది. ► భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోందని, కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుందని ప్రపంచబ్యాక్ అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎనమిస్ట్ మారి్టన్ వోల్ఫ్ భారత్‌కు సానుకూలంగా ఇచి్చన ప్రకటన దేశాభివృద్ధికి భరోసాను ఇస్తోంది. మొండిబకాయిలు తగ్గుతుండడం హర్షణీయం: ఎస్అండ్పీ ఇదిలావుండగా, బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గుతుండడం భారత్ ఎకానమీకి లాభిస్తున్న అంశమని ఎస్అండ్పీ ప్రైమరీ క్రెడిట్ విశ్లేషకులు దీపాలి సేథ్ ఛాబ్రియా పేర్కొన్నారు. ఎకానమీ పురోగతి నేపథయంలో 2025 మార్చి నాటికి బలహీన బకాయిల పరిమాణం మొత్తం రుణాల్లో 3 నుంచి 3.5 శాతం శ్రేణికి పడిపోతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2024–26 మధ్య భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 నుంచి 7.1 శాతం మేర నమోదుకావచ్చని ఎస్అండ్పీ మిడ్ ఇయర్ గ్లోబల్ బ్యాంక్ అవుట్‌లుక్ పేర్కొంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా భారత్ కొనసాగుతుందని విశ్లేíÙంచింది. ద్రవ్యోల్బణం సమస్య ఉన్నప్పటికీ, దీనిని దేశం అధిగమించగలదన్న విశ్వాసాన్ని దీపాలి సేథ్ ఛాబ్రియా వ్యక్తం చేశారు. -
ఎంతటి సంపన్నుడయినా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా?
మోసం... సాధారణంగా ఇది నమ్మకాన్ని ఆనుకుని ఉంటుందేమో! అందుకే నమ్మిన వ్యక్తులనే ఎదుటివారు నయవంచన చేస్తుంటారు. మోసాలకు పాల్పడేవారు ఎదుటివారి మానసిక బలహీనతలను ఉపయోగించుకోవడం ద్వారా ఎంతటి తెలివితేటలు కలిగినవారినైనా ఇట్టే బురిడీ కొట్టిస్తారు. నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని ఎంతటి సంపన్నులైనా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లెక్కకు అందనంత బిలియన్ డాలర్లకు సంబంధించిన మోసాల వార్తలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్, ఎఫ్‌టీఎక్స్ (బహామాస్-ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్) వ్యవస్థాపకుడు. ఈయన తన కంపెనీ పెట్టుబడిదారులుగా ప్రముఖులను ఆకర్షించి, వారి చేత పెట్టుబడులు పెట్టించారు. ఈ ప్రముఖుల జాబితాలో టామ్ బ్రాడీ, స్టెఫ్ కర్రీ, నవోమి ఒసాకా, లారీ డేవిడ్, కెవిన్ ఓ లియరీ తదితరులు ఉన్నారు. బిలియనీర్ అయిన బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సామ్రాజ్యం నవంబర్ 2022లో కూలిపోయింది. ఇప్పుడు ఎఫ్‌టీఎక్స్ దివాలా కంపెనీ. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మోసానికి సంబంధించిన పలు కేసులు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఎలిజబెత్ హోమ్స్ చేసిన పని ఇదే.. ఇదే కోవలోనే ఎలిజబెత్ హోమ్స్ కథ కూడా ఉంటుంది. హోమ్స్ అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్‌గా పేరొందింది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె నికర విలువ ఆస్తుల $4.5 బిలియన్లు. ప్రస్తుతం పనిచేయని ఆమె సంస్థ థెరానోస్‌లో ఆమె 50% వాటా కలిగివుంది. థెరానోస్ కంపెనీ పెట్టుబడిదారుల జాబితాలో రూపర్ట్ ముర్డోక్, వాల్టన్ కుటుంబంతో సహా ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు కనిపిస్తాయి. 2022లో ఆమెపై వచ్చిన ఆరోపణలలో దోషిగా తేలిన నేపధ్యంలో ఆమె యూఎస్ నుండి పారిపోయే ప్రయత్నంలో హోమ్స్ మెక్సికోకు వన్-వే టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు కోర్టు వెల్లడించింది. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్,హోమ్స్లు తెలివైనవారిని ప్రముఖులను ఎలా మోసం చేశారు? వీరు నైపుణ్యం కలిగిన మోసగాళ్ల మాదిరిగానే, ఎదుటివారి భావోద్వేగాలను, వారి అవసరాలను ఉపయోగించుకున్నారనే ఆరోపణలున్నాయి. భిన్నమైన వ్యక్తిత్వాలను గుర్తించి.. ఇలా మోసపోతున్న బాధితుల జాబితాలో అమాయకులు, వయసుపైబడినవారు సాధారణంగా కనిపిస్తారు. మోసాలకుగురయిన బాధితుల డేటా భిన్నమైన వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుంది. ఇది చాలా నిశితంగా పరిశీలిస్తేనే అవగతమవుతుంది. దీనిపై పరిశోధకులు చేపట్టిన పరిశోధనలలో అధునికులు, బాగా చదువుకున్నవారు, యువకులందరూ స్కామ్‌లకు గురవుతారని వెల్లడయ్యింది. మోసగాళ్ళు నిర్దిష్ట జనాభాను తమ లక్ష్యంగా చేసుకుంటారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగర్భం.. లోపల ఏముందో చూసేసరికి.. మితిమీరిన నమ్మకంతోనే.. దుర్బలత్వంతో కూడిన మితిమీరిన నమ్మకమే మోసాలకు ప్రధాన కారకం అని కూడా పరిశోధనలో కనుగొన్నారు. ఒక రంగంలో అత్యధిక విజయాలు సాధించిన వారి సామర్థ్యం మరో రంగంలో వీక్‌గా ఉండటాన్ని మోసగాళ్లు గ్రహిస్తారు. ఉదాహరణకు బెర్నీ మాడాఫ్.. ఆర్థిక నిపుణులు కాని సంపన్నులను, బాగా చదువుకున్న వృత్తిపరమైనవారిని సులభంగా మోసం చేశారని పరిశోధనలో తేలింది. చాలామంది విపరీతమైన నమ్మకం కారణంగానే స్కామ్‌ను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. దీనికి ఉదాహరణ లాటరీ విజేతలు వీరే నంటూ వచ్చే ప్రకటనలు. ఇవి ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా చాలామంది వీటి బారిన పడి మోసపోతుంటారు. సాధారణంగా మోసగాళ్లు ఇతరులలో భవిష్యత్ భయం వంటి బలమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తారు. దీంతో మోసగాళ్ళు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. దీంతో వారు ఎదుటివారిలో తమపై మరింత నమ్మకం కలిగేలా వాతావరణం సృష్టిస్తారు. సెలబ్రిటీలు- సామాజిక గుర్తింపు సోషల్ ప్రూఫ్ అనేది మనస్తత్వవేత్త రాబర్ట్ సియాల్డిని రూపొందించబడిన పదం. వినియోగదారులు.. ఇతరులు ఏమి చేస్తున్నారో తెలుసుకుని, దానికి ప్రతిస్పందనగా తాము ఏమి చేయాలనేది నిర్ణయించుకుంటారు. దీనినే సోషల్ప్రూప్ అనవచ్చు. సెలబ్రిటీలు తమ సామాజిక గుర్తింపును ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. పలువురు ప్రముఖులు ఆధునిక సాంకేతికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఉత్పత్తి లేదా సేవల ప్రభావంపై అమితమైన నమ్మకం కలిగివుంటారు. క్రిప్టోకరెన్సీ బారినపడి.. అక్టోబర్ 2022లో కిమ్ కర్దాషియాన్.. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను ప్రచురించినందుకు $250,000 చెల్లించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఆమె యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి $1.26 మిలియన్ సెటిల్మెంట్ చెల్లించడానికి అంగీకరించారు. ఆమె నెలకొల్పిన సంస్థ ఎథేరియం మ్యాక్స్ బారినపడి సెలబ్రిటీలు మడోన్నా, జస్టిన్ బీబర్, డీజే ఖలీద్, పారిస్ హిల్టన్, గ్వినేత్ పాల్ట్రో, స్నూప్ డాగ్, సెరెనా విలియమ్స్, జిమ్మీ ఫాలన్లు మోసపోయారని తేలింది. అప్రమత్తతతో నేరాలకు అడ్డుకట్ట పలు పరిశోధనల ప్రకారం మోసగాళ్ల కోణం నుండి చూస్తే ఆర్థికంగా దిగువస్థాయిలో ఉన్నవారి కంటే ధనవంతులను లేదా సంస్థలను మోసం చేయడం చాలా సులభం. నిపుణులు మోసాలకు గురైన వారిని ఇంటర్వ్యూ చేయగా వారు ‘బ్రాండ్’కు అమితంగా ప్రభావితమయ్యారని, మోసపోయినా వారు బహిర్గతం చేయడానికి, అవమానాన్ని ఎదుర్కొనేందుకు, లేదా నేరాన్ని నివేదించడానికి ఇష్టపడటం లేదని తేలింది. సోషల్ మీడియా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడి మోసాలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో నిపుణులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి ఎందుకు పంపిస్తున్నారంటే.. -
Tech layoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: అమెరికాలోని బడా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలతో భారత ఐటీ సంస్థలకు గణనీయంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని హిటాచీ గ్రూప్‌లో భాగమైన ఐటీ సంస్థ గ్లోబల్‌లాజిక్ ప్రెసిడెంట్ నితేష్ బంగా అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంతో అమెరికా నుంచి భారత సంస్థలకు బోలెడంత పని బదిలీ కావచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సంస్థ భారత్‌లో ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి పెడుతోందని, ఏటా సిబ్బంది సంఖ్యను 25 నుంచి 35 శాతం మేర పెంచుకోవాలని భావిస్తోందని బంగా పేర్కొన్నారు. ‘గూగుల్, ట్విటర్ లేదా ఫేస్బుక్ లేదా ఇతరత్రా అమెరికాలోని ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగిస్తున్నాయంటే, అవి పనులను నిలిపివేయాలని అనుకుంటున్నట్లుగా భావించరాదు. ఆయా కంపెనీలు ఇప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగించాల్సే ఉంటుంది. అందుకోసం నిపుణుల అవసరమూ ఉంటుంది. కాబట్టి అమెరికా నుంచి బోలెడంత పని భారత్‌కు రావచ్చు. (ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు ) అయితే, ఆయా సంస్థలు తమ ఖర్చుల విషయంలో బేరీజు వేసుకుని, తగు నిర్ణయం తీసుకుంటాయి‘ అని ఆయన తెలిపారు. తాము ప్రతి నెలా 1,000 మంది వరకూ రిక్రూట్ చేసుకుంటామని, వీరిలో 50 శాతం మంది భారత్‌లో ఉంటారని బంగా చెప్పారు. ఏటా ఈ సంఖ్య 25-35 శాతం మేర పెరుగుతోందన్నారు. గ్లోబల్‌లాజిక్ ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల్లో 2-3 ఏళ్ల అనుభవమున్న ఇంజినీర్లను రిక్రూట్ చేసుకుని, తమ కార్యకలాపాలకు అవసరమైన విధంగా వారికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 15,000 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. ఇది అంతర్జాతీయంగా గ్లోబల్‌లాజిక్‌కు ఉన్న సిబ్బందిలో సగం. (EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు.. పెళ్లి కోసం కూడా!) -
న్యూ లుక్ హెయిర్ స్టైల్స్...
-
కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక
వాషింగ్టన్ : కరోనా వైరస్ అమెరికాను వణికిస్తోంది. మరోవైపు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే రోజుకు లక్ష కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అమెరికా ఆరోగ్య నిపుణుడు నిన్న(మంగళవారం) హెచ్చరించారు. వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపైనా ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అత్యవసర చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌కు సూచించారు. ప్రమాదకరమైన పెరుగుదలను నివారించడానికి తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఫౌసీ నొక్కిచెప్పారు. మహమ్మారిని అణిచివేసేందుకు అధికారులు, ప్రజలు చర్యలు తీసుకోకపోతే రోజుకు ప్రస్తుతం 40వేలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇకపై లక్షకు చేరినా ఆశ్యర్యం లేదని కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కాంగ్రెస్‌ను హెచ్చరించారు. మహమ్మారిపై సమీక్ష సందర్భంగా సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ అండ్ పెన్షన్స్ కమిటీలో ప్రసంగిస్తూ ఫౌసీ ఈ హెచ్చరిక జారీ చేశారు. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం నిబంధలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికా మహమ్మారి నియంత్రణలో తప్పు దారిలో ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా కేసులు వ్యాపిస్తున్న తరుణంలో తక్షణమే ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కరోనా కట్టడికి సామాజిక ప్రయత్నంలో భాగంగా, బాధ్యతగా వ్యవహరించాలని ఫౌసీ సూచించారు. ప్రధానంగా బార్లలో మాస్క్ లు ధరించకపోవడం, సామాజిక దూర మార్గదర్శకాలను పాటించకపోవడం వంటి "ప్రమాదకరమైన" ప్రవర్తన మంచిది కాదంటూ దేశ యువతను ఫౌసీ తీవ్రంగా హెచ్చరించారు. యుఎస్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నప్పటి ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో సమావేశమవుతున్నారని, ముసుగులు ధరించడంలేదని ఫౌసీ ఆరోపించారు. లాక్ డౌన్ మార్గదర్శకాలపై అమెరికన్లు సరైన శ్రద్ధ చూపడం లేదన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అలాగే 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నానన్నారు. కాగా 2.6 మిలియన్లకు పైగా కేసులు, లక్షా 26 వేల మరణాలతో ప్రపంచంలోనే అత్యంత కరోనా ప్రభావిత దేశంగా అమెరికా నిలిచింది. -
ప్రకృతిసేద్య నిపుణుడు నారాయణరెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84) కర్ణాటకలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిద్రలోనే కన్నుమూశారు. మరలేనహళ్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సైతం ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. కాగా, ఆయన స్వస్థలం బెంగళూరు రూరల్ వర్తూర్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వర్తించారు. జపాన్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనొబు ఫుకువోకా శిష్యుడిగా నారాయణరెడ్డి ప్రసిద్ధి పొందారు. ఫుకువోకా భారత్‌లో పర్యటనకు వచ్చినప్పుడు మరలేనహళ్లిలోని నారాయణరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. డాక్టర్ నారాయణరెడ్డి 35 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆ పొలంలోని మట్టి 5 శాతం సేంద్రియ కర్బనంతో కూడి ఉండటం విశేషంగా చెబుతారు. దేశ విదేశాల నుంచి రైతులు వచ్చి ఆయన వద్ద అనుభవపూర్వకంగా ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. లీసా ఇండియా ఆంగ్ల ప్రకృతి వ్యవసాయ మాసపత్రికకు చాలా ఏళ్లుగా ఆయన కాలమిస్టు. వేలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించిన డా. నారాయణరెడ్డి మరణం తీరని లోటని పలువురు నివాళులర్పించారు. -
మూడో నిపుణుడు
రాజుగారు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచారు. లేవగానే తన నోట్లో దంతాలున్నాయో లేవోనని చూసుకోసాగారు. అంతా సరిగానే ఉందని భావించి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి రాజదర్బారు కొలువయ్యాక తన మంత్రి వర్గంతో ‘‘రాత్రి కలలో నా దంతాలన్నీ విరిగిపోయాయనే కల వచ్చింది. దీని నిగూడార్థం చెప్పే నిపుణుడిని హాజరుపరచండి’’ అని హుకుం జారీ చేశారు. రాజుగారు చెప్పినట్లుగానే హుటాహుటిన స్వప్న ఫలితాలను వివరించే ఒక నిపుణుడిని హాజరుపర్చారు. ‘నా పళ్లన్నీ ఊడిపోయినట్లుగా నేను కలగన్నాను’ అని చెప్పి కలను వివరించారు. రాజుగారు. దానికి ఆ నిపుణుడు ‘‘అపచారం అపచారం.. రాజుగారూ మీకు వచ్చిన కల ఏమి చెబుతోందంటే... మీ కళ్లముందే మీ ఇంటిలోని వారంతా చనిపోతారు’’ అని అర్థం చెప్పాడు. రాజుగారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే అతన్ని కారాగారంలో వేసి నిర్బంధించవలసిందిగా భటులను ఆదేశించి, మరో నిపుణుడిని పిలవాలని ఆజ్ఞాపించారు. మరో నిపుణుడు వచ్చాడు. రాజుగారు చెప్పిన కలను విన్న అతనూ మొదటి నిపుణుడు చెప్పినట్లుగానే చెప్పడంతో అతన్నీ చెరసాలలో వేసి, మూడో నిపుణుడిని పిలవాలని మళ్లీ రాజుగారు హుకుం జారీచేశారు. మూడో నిపుణుడు హాజరయ్యాడు. రాజుగారు తనకొచ్చిన కలను పూసగుచ్చినట్లు వివరించారు. ఇది విన్న ఆ నిపుణుడు రాజుగారూ ‘మీకు నిజంగానే ఈ కల వచ్చిందా?’ అని మళ్లీ రెట్టించాడు. రాజుగారు ఎంతో ఆతృతతో అవునని తలూపారు. దానికా నిపుణుడు ‘‘రాజుగారూ మీకు శుభాకాంక్షలు’’ చెప్పగానే.. రాజుగారు ‘‘దేనికి శుభాకాంక్షలు:’’ అని ఎంతో ఆతృతతో అడిగారు. దానికా నిపుణుడు ‘‘మీ ఆయుష్షు సుదీర్ఘమైనది. మీ కుటుంబంలో అందరికంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు’’ అని కల అర్థాన్ని వివరించాడు. రాజుగారు అతను చెప్పిన జోస్యానికి ఎంతో మెచ్చుకున్నారు. ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు. నిజానికి మిగతా ఇద్దరు జ్యోతిష్యులు చెప్పింది కూడా ఇదే అయినప్పటికీ చెప్పే తీరులో వ్యత్యాసముంది. కొందరి మాటలతో మనస్సుకు గాయాలవుతాయి. మరికొందరి మాటలు ప్రేమను పంచి హృదయాలను గెలుచుకుంటాయి. – ముజాహిద్ -
మేకప్ పై పెరుగుతున్న వ్యామోహం..!
భారత్ లో సంప్రదాయ వివాహాల్లో ఇటీవల మేకప్ పై తీవ్ర వ్యామోహం పెరుగుతున్నట్లు మేకప్ పరిశ్రమ నిపుణులు పనాజీ వెల్లడించారు. దేశంలో మేకప్ ఇండస్ట్రీరీ ప్రతి సంవత్సరం ఇరవై శాతం చొప్పున అభివృద్ధి చెందేందుకు ఈ వివాహాలు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రజలు సౌందర్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా భారత వివాహాలు పరిశ్రమకు మంచి అభివృద్ధి సాధకాలుగా మారుతున్నాయని, ముంబైలోని బాలీవుడ్, హాలీవుడ్ ఇంటర్నేషనల్(BHI), మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ అకాడమీ నిపుణుడు వివేక్ భారతీ వివరించారు. ముంబైలో ప్రారంభమైన ఓ అంతర్జాతీయ వర్క్ షాప్ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఈ విషయాన్ని వెల్లడించారు. హాలీవుడ్ ప్రముఖ మేకప్ కళాకారుడు డోనాల్డ్ సిమ్ రాక్ ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అభివృద్ధి చెందిన, అత్యంత సంపన్నదేశమైన అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహ సందర్భాల్లో మేకప్ కు సుమారు 150 నుంచి 200 డాలర్లను ఖర్చు పెడుతుంటే... ఇండియాలో మాత్రం బ్రైడల్ మేకప్ కు సుమారు 14 నుంచి 15 వేల రూపాయలు దాకా ఖర్చు చేయడం పెద్ద విషయంగా భావించడం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రత్యేక వివాహ వేడుకల్లో లక్షలకొద్దీ మేకప్ కోసం ఖర్చుచేసిన దాఖలాలు ఉన్నాయంటున్నారు. వివాహాన్ని ఓ చిరస్మరణీయ వేడుకగా జరుపుకునేందుకు భారతీయులు ఎంతో ఖర్చు పెడతారని ఈ సందర్భంగా భారతీ వివరించారు. వివాహం అనేది భారత కుటుంబాల్లో ఓ ప్రత్యేక కార్యక్రమం అని, ఇందులో వధువు దుస్తులతోపాటు, అలంకరణ, మేకప్ ఆకర్షణీయంగా ఉండేందుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారని భారతీ అన్నారు. పెళ్ళి సందర్భంలో వధువు అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం వారి ఐశ్వర్యాన్ని సూచిస్తుందని, ఆ సన్నివేశంలోని చిత్రాలను తరతరాలపాటు భద్రపరచుకొంటారని సూచించారు. బ్యూటీ ఇండ్రస్ట్రీ సంవత్సరానికి ఇరవై శాతం అభివృద్ధి చెందుతుండగా మేకప్ పై జనంలో ఏభైశాతం అవగాహన కూడ పెరుగిందని అయన తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమ అభివృద్ధి భారతీయ సెలూన్లలో చూస్తే తెలుస్తుందని, గతంలో బ్యూటీ ఇండస్ల్రీపై అవగాహన అంతగా ఉండేది కాదని, నిరక్షరాస్యులే ఇందులో పనిచేసేందుకు ముందుకొచ్చేవారని అన్నారు. ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు బ్యూటీ పరిశ్రమలో అడుగిడి, దాన్ని ఉద్యోగంగా మార్చుకుంటున్నారన్నారు. అంతేకాక ఎక్కువ మొత్తంలో చెల్లింపులు పొందే ఉద్యోగంగా మేకప్ ఉద్యోగం మారుతోందని, మంచి మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో సంపాదిస్తున్నాడని ఆయన వివరించారు. -
తొమ్మిదేళ్ళకే సీఈవో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు..!
తొమ్మిదేళ్ళకే ఆ కుర్రోడు.. తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. స్వంత గేమ్ అభివృద్ధి సంస్థకు సీఈవోగా, నిష్ణాతుడైన హ్యాకర్‌గా, యాప్ డెవలపర్‌గా, సైబర్ క్రైం బస్టర్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ఢిల్లీలో జరిగిన గ్రౌండ్ జీరో సమ్మిట్ 2015 కు హాజరైన వారిలో అత్యంత పిన్న వయస్కుడైన రూబేను పాల్... సమాచార భద్రతపై ఆసియాలో జరిగిన మొట్టమొదటి సమావేశంలో అందరినీ ఆశ్చర్య పరచడమే కాక, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పరిశోధకులు, సైబర్ నిపుణులు.. మైక్రోఫోన్ పై ప్రసంగిస్తున్నసభలో... వెనుక ఉన్న కుర్చీపై నిలుచొని తొమ్మిదేళ్ళ చిన్నారి రూబేను ప్రత్యేకంగా కనిపించాడు. భారత సంతతికి చెందిన ఆ చిన్నారి గత ఏడాది నవంబర్ 14న జరిగిన సదస్సులో తన సొంత కీలకోపన్యాసం చేశాడు. అయితే ఈ ఏడాది అతడో స్పెషల్ గెస్ట్ గా మారిపోయాడు. పిల్లలకు సైబర్ భద్రతా బోధనలో తన జ్ఞానాన్ని పంచగలిగే రాయబారి అయిపోయాడు. హ్యాకింగ్ లో నైపుణ్యం పొందగల్గితే ఎంతో శక్తి వస్తుందని, ఆ శక్తి వల్ల ఎంతో బాధ్యత కూడ వస్తుందంటున్నాడు తన హీరోగా స్పైడర్ మ్యాన్ ను ఊహించుకునే రూబేను. టెక్సాస్ విద్యా వ్యవస్థ నిర్వహించే టెక్సాస్ లోని ఆస్టిన్ స్కూల్లో జరిగే గిఫ్టెడ్ ట్యాలెంటెడ్ కార్యక్రమానికి రూబేను ఎంపికయ్యాడని, ఓ గేమ్ ను తయారు చేయడానికి అవకాశం కూడ అతడికి వచ్చిందని రూబేను తల్లి సంగీత తెలిపారు. రూబేను కు వీడియో గేమ్స్ తయారు చేయడం అంటే ఎంతో ఇష్టమని ఇప్పుడు షూటింగ్ నింజా స్టార్స్ గేమ్‌ను చేయాలనుకుంటున్నాడని ఆమె అన్నారు. ఐదేళ్ళ ప్రాయంలోనే రూబేను ఫైర్ వాల్ వంటి పదాలు వాడుతుండటం చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళమని రూబేను తండ్రి తెలిపారు. అతడు యాప్ లు డెవలప్ చేసేందుకు ముందు కుంగ్ ఫూ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ నేర్చుకునేవాడని, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేవాడని రూబేను తల్లిదండ్రులు చెప్తూ.. ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఫైండ్... పీస్ ఆఫ్ మైండ్
కాలం మారిపోయింది... ఉరుకులు పరుగుల జీవితం. ఇంట్లో... బయట... ఆఫీసులోనూ టెన్షన్ టెన్షన్ టెన్షన్! ఈ రోజువారి ఆందోళన కొందరు స్థైర్యవంతుల్ని ఏమీ చేయలేకపోయినా కొందరు దుర్బల మనస్కులు మాత్రం బలహీన క్షణాల్లో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ క్షణికావేశపు నిర్ణయాల్ని మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంచెం స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడితే అన్నీ సర్దుకుంటాయి. ఈ రకమైన ఆలోచనలకు సాయపడే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి! ఉద్వేగాన్ని తగ్గించేందుకు బెల్లీబయో అకారణంగా టెన్షన్‌కు గురవడం... ఒళ్లంతా చెమటలు పట్టేసినట్టుగా అయిపోవడం.. హడావుడిగా అటు ఇటు అడుగులేయడం... యాంగ్జైటీ లక్షణాలివి. ఇలాంటి పరిస్థితుల్లో మీ టెన్షన్‌ను తగ్గించుకునేందుకు మేలైన మార్గం గట్టిగా ఊపిరి తీసుకుని వదలడం. ఈ పనినైనా మీరు సరిగా చేస్తున్నారా? లేదా తెలుసుకోవాలనుకుంటే ‘బెల్లీబయో’ అప్లికేషన్‌ను వాడవచ్చు. ఈ అప్లికేషన్ మీ ఉచ్ఛ్వాస, నిశ్వాసల శబ్దాలను వింటూ పనిచేస్తుంది. పొట్ట కదలికల ఆధారంగా మీ శ్వాస తీరును గమనించి ఛార్ట్లను సిద్ధం చేసి చూపుతుంది. టెన్షన్ తగ్గించుకునేందుకు ఇది బాగా పనికొస్తుందని నిపుణుల అంచనా. విపరీత ఆలోచనలను దూరం చేసే ‘ఆపరేషన్ రీచ్ ఔట్’ మార్కులు తక్కువ వచ్చాయని, ర్యాగింగ్‌కు గురయ్యామని.. కుటుంబ సమస్యలున్నాయని... బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి గురించి మనం తరచూ వింటూంటాం. వార్తలు చూస్తూంటాం. బలవంతంగా తనువు చాలించాలనుకునే వారు ఒక్క క్షణం పునరాలోచించినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉంటాయి. తమ గోడును, బాధను ఇంకొకరితో పంచుకున్నా బలవన్మరణమనే ఆలోచన దూరమవుతుంది. ఆపరేషన్ రీచ్ ఔట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఈ రకమైన ఆసరా ఇస్తుంది. అమెరికాలో మాజీ సైనికుల కోసం సిద్ధం చేసిన ఈ అప్లికేషన్ ఆ బలహీన క్షణాల్లో మీ ఆలోచనలను మార్చేందుకు రకరకాల వీడియోలను చూపుతుంది. అంతేకాకుండా ఆత్మహత్యల నివారణకు ఉద్దేశించిన కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించే అవకాశం కల్పిస్తుంది. తగిన వైద్యసాయం పొందడం ఎంత అవసరమో గుర్తు చేస్తూ... విపరీత ఆలోచనల నుంచి బయటపడేందుకు సహకరిస్తుంది. స్ట్రెస్‌కు విరుగుడు ఈసీబీటీ కామ్ ఈ అప్లికేషన్ ఐఫోన్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే లక్ష్యంతో కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ ఆధారంగా అభివృద్ధి చేశారు. కౌన్సెలింగ్‌కు ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం రిలాక్స్డ్గా మారేందుకు పనికొస్తుంది. ఇందుకు అవసరమైన పద్ధతులు, సమాచారం దీంట్లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈసీబీటీ కామ్ వంటి అప్లికేషన్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. నార్త్వెస్ట్రర్న్ యూనివర్శిటీ వారు తయారు చేసిన ‘ఇంటెలీకేర్’ వీటిల్లో ఒకటి. దాదాపు 12 మినీ ఆప్స్‌లో వచ్చే ఈ అప్లికేషన్ మీ నెగటివ్ ఆలోచనలను మార్చేందుకు, భరోసా ఇచ్చే సందేశాలతో కూడి ఉంటుంది. సుఖ నిద్రకు డీప్ స్లీప్ విత్ ఆండ్రూ జాన్సన్ కంటి నిండా నిద్రపోతే ఆ ఉదయం కలిగే ఫ్రెష్ ఫీలింగ్ అనిర్వచనీయం. కానీ రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టేదెలా? డీప్ స్లీప్ విత్ ఆండ్రూ జాన్సన్ మీకు సాయపడుతుంది. రకరకాల సున్నితమైన శబ్దాలతో, సూచనలతో సాగిపోయే ఈ అప్లికేషన్ మీ మనస్సును శాంతపరిచి నిద్రపోయేలా చేస్తుంది. ప్రతిరోజూ కనీసం మూడువారాల పాటు ఆప్‌లోని సూచనలను వినాల్సి ఉంటుంది. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ థెరపీకి సంబంధించిన సందేశాలతో ఉండే రికార్డింగ్‌ను వినడం ద్వారా నిద్ర బాగాపడుతుందని అంచనా. ఆపిల్ ఐఫోన్ వినియోగదారులతోపాటు, ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లోనూ లభించే ఈ అప్లికేషన్ కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్లేస్టోర్‌లోని డీప్ స్లీప్ రిలాక్స్ హిప్నాసిస్ అప్లికేషన్ మాత్రం ఉచితంగా లభిస్తుంది. వాట్స్ మై ఎం3 మనోవ్యాకులత, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలను గుర్తించేందుకు పనికొచ్చే మొబైల్ అప్లికేషన్ ఇది. సైకాలజిస్ట్‌ల ద్వారా సిద్ధం చేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా పనిచేస్తుంది. బైపోలార్ డిజార్డర్ మొదలుకొని పీటీఎస్డీ వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్‌ను ఉపయోగిస్తారు. మీ సమాధానాల ఆధారంగా ఒక స్కోర్ సిద్ధం చేసి ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చో సూచిస్తుంది కూడా. ఇంగ్లీషుతో పాటు స్పానిష్ భాషలోనూ అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది. - గిళియార్ -
అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందే
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో కుంగిన అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందేనని ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ), చెన్నై రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహారావు సూచించారు. ఆరు రోజుల క్రితం శ్రీకాళహస్తి ఆలయంలోని కంచుగడప సమీపంలో ఉన్న అష్టోత్తరలింగ మండపం కుంగిన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించడానికి చెన్నైకి చెందిన ఐఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్, గోపురాల ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యుడు నరసింహారావును ఆలయ అధికారులు పిలిపించారు. మరో నిపుణుడు జీఎస్ రెడ్డితో కలసి ఆయన అష్టోత్తరలింగ మండపాన్ని, ఆలయంలోని నాలుగు గోపురాలను, చిన్న చిన్న మండపాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ అష్ఠోత్తరలింగ మండపాన్ని మరమ్మతులు చేస్తే సరిపోదు. పూర్తిగా తొలగించి నూతన మండపాన్ని నిర్మించాల్సిందే. మండప బీమ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఏక్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మండప బీమ్‌కు ఆధారంగా చెక్కలు ఒక్కచోట పెడితే సరిపోదు. పదిచోట్ల చెక్కలు ఏర్పాటు చేయాలి. ఈ మార్గంలో భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేయండి. ఆలయంపైన పిచ్చిమొక్కలు, కొబ్బరి చిప్పలు నూనె డబ్బాలు ఉంచవద్దు అని సూచించారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు మండపం మొత్తం బీమ్‌కు ఆధారంగా చెక్కలను పెట్టారు. ఆమేరకు నూతన మండపం నిర్మాణానికి ఆలయ ఈఈ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మండపం తొలగింపునకు రూ.1.5 లక్షలు, నూతన మండప నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.