ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. టన్నెల్‌లో అమర్చిన పైప్‌లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు బయటకు వస్తున్నారు. వారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థించారు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్.
నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ రంగంలోకి దిగారు. రెస్క్యూ బృందం ప్రయత్నాలు ఫలించి బాధితులు బయటపడుతున్న వేళ ఆర్నాల్డ్ డిక్స్ మంగళవారం టన్నెల్ సైట్ సమీపంలోని చిన్న దేవాలయం వద్ద కార్మికుల క్షేమం కోసం అర్చకులతో కలిసి పూజలు చేశారు. దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా మారింది.
While long awaited breakthrough in #Uttarkashi tunnel operation is achieved, visual of Prof. Arnold Dix, international tunnelling expert, bowing and praying before temple near the site is so heartwarming.
— Arun Bothra 🇮🇳 (@arunbothra) November 28, 2023
Prayers for safety of all the trapped workers.
pic.twitter.com/CcrkeEZZ9i
Comments
Please login to add a commentAdd a comment