Uttarkashi
-
ఉత్తరకాశీ సొరంగం శిథిలాల తొలగింపునకు రూ. 20 కోట్ల ఖర్చు!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి చాలా కాలం గడిచింది. ఈ ప్రమాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. త్వరలో ఈ సొరంగంలో శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఒక నివేదిక వచ్చింది. ఉత్తరకాశీ సొరంగం నిర్మాణ సమయంలో కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయింది. ఆ సమయంలో సొరంగంలో పనిచేస్తున్న 43 మంది కూలీలు లోపల చిక్కకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారుల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ టన్నెల్ శిథిలాల తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు రూ.20 కోట్లు వెచ్చించనున్నట్లు స్విస్ కంపెనీ వెల్లడించింది. ఈ శిథిలాలను సిల్క్యారాలోని డంపింగ్ గ్రౌండ్‌కు తరలించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నామని స్విస్ కంపెనీ తెలిపింది. -
76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్ పనులు ప్రారంభించారు. అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల సెంటర్ వాల్ (సెపరేషన్ వాల్) షట్టరింగ్ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. -
కార్మికులను కాపాడాం... గుణపాఠాలో!
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిరక్షణ చర్య విజయవంతంగా ముగిసింది. పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో దాదాపు 17 రోజులపాటు చిక్కుకున్న కార్మికులందరినీ భారతీయ, విదేశీ నిపుణులు ఉమ్మడిగా సురక్షితంగా బయటికి తీయగలిగారు. హిమాలయ ప్రాంతంలో ఒక పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. సిల్క్యారా సొరంగంలో జరిగిన విపత్తు... పెళుసైన కొండ ప్రాంతాలలో చేపట్టే భారీ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కఠినతరమైన భూభాగంలో కార్యకలాపాల భద్రతపైనా, అలాంటి ప్రాజెక్టులకు అవసరమైన విపత్తు సంసిద్ధతపైనా కూడా ప్రశ్నలను లేవనెత్తింది. హిమాలయ పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని నష్టం నుండి రక్షించడానికి ఈ సొరంగ ప్రమాద ఘటన మరో మేల్కొలుపు కావాలి. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి ముఖ్యమైన మతపరమైన పుణ్యక్షేత్రాలను కలుపుతూ, అన్ని వాతావరణాల్లో పనిచేసే నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలనే లక్ష్యంతో, ప్రతిష్టా త్మకమైన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా సొరంగాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును పర్యావరణ సంఘాలు విమర్శించాయి. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాయి. అనేక ప్రభుత్వ కమిటీలు ప్రాజెక్టును వివిధ కోణాల్లో పరిశీలించి, దానికి అనుమతిని ఇచ్చాయి. అయితే ప్రస్తుత సొరంగ ప్రమాద ఘటన హిమాలయ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడంపై అన్ని సందేహాలను, భయాలను పునరుద్ధరించింది. సొరంగాలు ఉత్తమ మార్గమే అయినా... అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, పర్యావరణ హానిని తగ్గించడానికి సొరంగ నిర్మాణం ఒక మంచి ఎంపికగా కనిపి స్తున్నప్పటికీ, సొరంగం పరిమాణం చాలా ముఖ్యమైనది. పొడవాటి సొరంగాల వల్ల కలిగే నష్టాన్ని కొండలు తట్టుకోగలవా? చిన్న సొరంగాలను నిర్మించడంపై ప్రాజెక్ట్ బృందాలు ఆలోచించాలి. రహదారులు లేదా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం పొడవైన నిర్మాణాలను నిర్మించే ముందు సొరంగ తవ్వకం కలిగించే పర్యావరణ ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయాలి. అనాలోచితంగా చేసే సొరంగ నిర్మాణం భూగర్భ జల వనరులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడతాయి కూడా. విశాలమైన సొరంగాల తయారీ కోసం చేసే పేలుళ్లు ప్రమాదకరమైన పర్యావరణ పరిణామాలకు కారణమవుతాయి. విపత్తు సంసిద్ధతతోపాటు, నిర్మాణ సంస్థలు తీసుకునే భద్రతా జాగ్రత్తలు మరొక సమాధానం లేని ప్రశ్నగా ఉంటున్నాయి. సిల్క్యారా ప్రాజెక్ట్‌లో ప్రమేయం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థల వైపు నుండి లోపాలు ఉంటే వాటిని పూర్తి స్థాయి విచారణ మాత్రమే వెల్లడిస్తుంది. కొండల్లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు, హైవేలు, పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దాదాపు రెండు దశాబ్దాలుగా చర్చలు సాగుతున్నాయి. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో పర్యావరణ సంఘాల సుదీర్ఘ ఆందోళన తర్వాత, రెండు భారీ ప్రాజెక్టులను నిలిపివేశారు. పైగా కొత్త, పెద్ద ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదు. అయితే గత దశాబ్దంలో, కొండలపై నిర్మాణ కార్యకలాపాలను పునరుద్ధరించారు. భద్రతా సమస్యలు, పర్యావరణ సమీక్షల కోసం పిలుపులను విస్మరించారు. తప్పనిసరి పర్యావరణ ప్రభావ అంచనా వంటి వివిధ చట్టాలు, నిబంధనలను సంబంధిత ఏజెన్సీలు, ప్రభుత్వాలు తీవ్రంగా పలుచన చేసిపడేశాయి లేదా దాటవేశాయి. ఈలోగా, వాతావరణ మార్పుల కారణంగా పర్యా వరణ ప్రమాదాలు పెరిగాయి. దీని ఫలితంగా తీవ్రమైన వాతావరణ ఘటనలు, విపత్తులు సంభవిస్తాయి. సంసిద్ధత ఉందా? కొండల్లోని ప్రాజెక్టుల భద్రత, విపత్తులను ఎదుర్కొనే సంసి ద్ధతను పూర్తిగా పరిష్కరించడం అనేది మరొక ప్రధాన సమస్య. సొరంగ ప్రమాదాలకు గల కారణాలపై శ్రద్ధ చూపడం, నిర్మాణ స్థలాల వద్ద భద్రతను నిర్ధారించడం చాలా కీలకం. గతంలో ఉత్తరా ఖండ్‌లో జరిగిన సంఘటనలతో పాటు, ఇటీవల సిక్కింలో జరిగిన హిమనీనద సరస్సు ఉప్పెన వరద సంబంధిత విపత్తు ద్వారా కూడా ఇది బాగా నిరూపితమైంది. తక్కువ సాంకేతిక, భద్రతాపరమైన నిర్వహణ, అలాగే వర్ష మేఘాల విస్ఫోటనం, కొండ చరియలు విరిగి పడటం మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి. అన్ని స్థాయిలలో శిక్షణ, భద్రతా నిర్వహణపై తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక సాంకేతిక, శాస్త్రీయ సమస్యలను ప్రణాళికా దశలోనే అధ్యయనం చేసి పరిష్కరించాలి. సిల్క్యారా–బడ్‌కోట్ సొరంగం కోసం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ప్లానింగ్, కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్న యూరప్‌కు చెందిన బెర్నార్డ్ గ్రుప్పే సంస్థ, ‘‘సొరంగాన్ని తవ్వడం ప్రారంభమైనప్పటి నుండి, టెండర్ డాక్యుమెంట్లలో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాలా సవాలుగా ఉన్నా యని నిరూపితమయ్యాయి. ఆ విధంగా అమలు దశ ప్రారంభంలో చేపట్టిన తదుపరి అన్వేషణే దాని చర్యల ఫలితాలను నిర్ధారిస్తుంది’’ అని వెల్లడించింది. అటువంటి ప్రాజెక్టులను ఆమోదించే ముందు సమగ్రమైన భౌగోళిక అధ్యయనాల అవసరాన్ని ఇది సూచిస్తుంది. కేవలం ప్రమాదమా? కార్మికుల రక్షణ కోసం సొరంగం లభ్యత వంటి భద్రతా నియ మాలను, నిబంధనలను నిర్మాణ సంస్థలు అనుసరించి ఉంటే, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చాలా ముందుగానే రక్షించి ఉండ వచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవించినందున, ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రం అనేక విపత్తులను ఎదుర్కొన్న వాస్తవాన్ని బట్టి త్వరితగతిన కార్మికుల పరిరక్షణ కార్యకలాపాలకు వ్యవస్థలు ఉండాలి. సంబంధిత అన్ని ఏజెన్సీలు పరిస్థితిని ఎలా నిర్వహించాలనే అంశంపై తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. సిల్క్యారా సొరంగ విపత్తును కేవలం ప్రమాదంగా పరిగణించి హిమాలయాల్లో యధావిధిగా వ్యవహారాలను కొనసాగించడం తప్పు. కోలుకోలేని నష్టం నుండి హిమాలయ పర్యావరణాన్ని కాపాడ టానికి ఇది మరో మేల్కొలుపు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు అని పేర్కొంటున్న వాటి గురించి మనం అసౌకర్యమైన ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. 900 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవే, ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు (కనీసం ఒక డజను సొరంగాల నిర్మాణంతో కూడి ఉంటాయి), పర్యాటకాన్ని నిస్సంకోచంగా ప్రోత్సహించడం (ఇది కొండలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని మించి ఉంటోంది), జల విద్యుత్ ప్రాజెక్టుల భారీ స్థాయి అభివృద్ధి... ఇలా అన్నింటిపై ఒక పునరాలోచన అవసరం. కొండల్లోని ప్రజలకు విద్యుత్తు, ఉపాధి లేదా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆనందించే లేదా అందుబాటులో ఉండే ఇతర సౌకర్యాలు లేకుండా చేయాలని దీని అర్థం కాదు. పర్యా వరణా నికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇవన్నీ ఎలా సాధిస్తామన్నదే కీలక ప్రశ్న. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాల్‌కు తగ్గట్టుగా దీన్ని ఎలా సాధిస్తాం? సిల్క్యారాలో జరిగినటువంటి విషాద సంఘ టనల పట్ల మనకు ఒక సమగ్ర దృక్పథం లేకుండా ఎంతమాత్రమూ ముందడుగు వెయ్యలేం. వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత,దినేష్ సి. శర్మ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సిల్క్యారా చేస్తున్న హెచ్చరిక
మానవ సంకల్పం ముందు శిఖరం తలొంచింది. పదిహేడు రోజులుగా కోట్లాదిమంది దేశ ప్రజానీకం మాత్రమే కాదు... దేశదేశాల పౌరులూ పడిన ఆరాటం, ఆత్రుత ఫలించాయి. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం కుప్పకూలటంతో 422 గంటలపాటు బందీలైన 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నిపుణులు మొదలుకొని వైద్య నిపుణుల వరకూ అందరికందరూ రాత్రింబగళ్లు సమన్వయంతో సాగించిన కృషి ఒక ఎత్తయితే...అత్యంత కష్టసాధ్యమైన ర్యాట్ హోల్ మైనింగ్‌లో నిపుణులైన కార్మికులు చివరి 12 మీటర్ల పొడవునా వున్న శిథిలాలను ఎంతో ఓపిగ్గా, జాగ్రత్తగా తొలగించటం మరో ఎత్తు. వెరసి బందీలైనవారంతా క్షేమంగా బాహ్యప్రపంచాన్ని చూడగలిగారు. ఇలాంటి సంక్లిష్ట సందర్భాల్లో చిక్కుకున్నవారిలో సమూహ చేతన ఎంతమాత్రమూ సడలరాదన్నది మనస్తత్వ నిపుణుల మాట. బందీల్లో కనీసం ఒక్కరికైనా సద్యోజనిత నాయకత్వ లక్షణం వుంటే తప్ప ఇలాంటి సామూహిక చేతనకు అవకాశం వుండదు. 2010లో చిలీ రాగి గనుల్లో పదివారాలు చిక్కుకున్న కార్మికులైనా... మరో ఏడెనిమిదేళ్లకు ఉత్తర థాయ్‌లాండ్‌లోని కొండ గుహల్లోకి వరద నీరు ప్రవేశించటంతో పదకొండు రోజులపాటు చిక్కుకున్న ఫుట్‌బాల్ టీమ్ పిల్లలైనా క్షేమంగా బయటపడటానికి కారణం ఇదే అంటారు. భయానక పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా నాలుగో రోజు వరకూ ప్రాణాలు నిలుపుకోగలిగితే మానసికంగా వారు దృఢంగా వున్నట్టేనని, ఆ తర్వాత వారు దేన్నయినా సునాయాసంగా అధిగమిస్తారని మనస్తత్వ నిపుణులు చెబుతారు. వెలుపలి ప్రపంచంలో కోట్లాదిమంది పడుతున్న తపనకు బందీలైన ఆ 41 మంది కార్మికుల దృఢచిత్తం తోడవటం వల్లనే ఇదంతా సవ్యంగా పూర్తయింది. ఆ కార్మిక కుటుంబాల మాటేమోగానీ... అశేష ప్రజానీకం ఆశానిరాశాల్లో ఊగిసలాడిన తీరు మాత్రం మరిచిపోలేనిది. మినుకు మినుకుమంటున్న ఆశలు, అంతలోనే గంపెడు నిరాశలో ముంచే పరిణామాలూ ఈ పదిహేడురోజులూ ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆ కార్మికులు బయటికిరావటం నూటికి నూరుపాళ్లూ సాధ్యమేనని మంగళవారం సాయంత్రానికిగానీ ధ్రువపడలేదు. బందీలను విడిపించటానికి భారీ యంత్రాలను వినియోగించి కొండను తొలుస్తున్న క్రమంలో ఈనెల 16న సంభవించిన భూకంపం అన్ని రకాల ప్రయత్నాలపైనా నీళ్లుజల్లింది. ఒక దశలో పైపును అమరుస్తుండగా భారీ పగుళ్ల శబ్దాలు విన బడ్డాయి. ఈలోగా 25 టన్నుల భారీయంత్రమైన అగర్ మెషిన్‌తో తవ్వుతుండగా శిథిలాల్లో ఇరుక్కున్న ఇనుప రాడ్లు తగిలి దాని బ్లేడ్లు తెగిపడ్డాయి. ఇక ర్యాట్‌హోల్ మైనింగ్ నిపుణులు రంగంలో దిగితే తప్ప ఇది పూర్తికాదని నిర్ధారించుకుని మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ల నుంచి వారిని రప్పించారు. అయితే ఈ ఆనందోత్సాహాల సందడిలో అసలు విషయం మరుగున పడకూడదు. అపార ఖనిజ సంపద వున్న దేశాలన్నిటా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటానికీ, ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకూ ప్రభుత్వాలు తపిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యావరణానికి కలుగుతున్న చేటు సరే, మనుగడ కోసం మరేదీ చేయలేక ప్రాణాలకు తెగించి గనుల్లో పనిచేస్తున్న బడుగు జీవులు సమిధలవుతున్నారు. చాన్నాళ్ల క్రితమే ఎన్జీటీ నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ సిల్క్యారాలో కార్మికుల ప్రాణాలు కాపాడటానికి దోహదపడిన మాట నిజమే అయినా...ఇప్పటికీ చట్టవిరుద్ధంగా అలాంటి మైనింగ్ సాగుతున్నదని ఈ ఎపిసోడ్ నిరూపించింది. కేవలం ఒక మనిషి పాకుకుంటూ వెళ్లగలిగేంత కంత తవ్వుకుంటూ భూగర్భం మూలల్లో వున్న బొగ్గు లేదా ఇతర ఖనిజాలనూ సేకరించటం ఈ కార్మికుల పని. ఈ క్రమంలో ఎక్కడైనా పైకప్పు కూలిందంటే వాళ్ల బతుకులు ముగిసినట్టే. గనుల పరిసర ప్రాంతాల్లో వుంటున్నవారికే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నప్పుడు నేరుగా అందులోకి ప్రవేశించి నిత్యం ఆ దుమ్మూ ధూళితో సావాసం చేసేవారికి ఎంత ముప్పు కలుగుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఇక భూమి కుంగిపోవటం, భూగర్భ జలాలు కలుషితం కావటంవంటి పర్యావరణ సమస్యలకు అంతే లేదు. ఇంతా చేసి ఇలాంటి కార్మికుల శ్రమంతా భారీ యంత్రపరికరాలపై పెట్టుబడులూ, అనుమతులు, రాయల్టీ చెల్లింపులూ లేకుండా చట్టవిరుద్ధంగా దోపిడీచేసే మైనింగ్ మాఫియాల పాలవుతోంది. కార్పొరేట్ల లాభార్జనకు దోహదపడుతోంది. హిమశిఖరాలు ఆల్ప్ పర్వతశ్రేణిలా పురాతనమైనవి కాదు. అవి ఆరున్నరకోట్ల సంవత్సరా లనాటివైతే, హిమశిఖరాల వయసు నాలుగుకోట్ల సంవత్సరాలు మించదు. అందువల్లే వాటి భూగర్భంలో నిరంతర చలనం, ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత కొనసాగుతున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీతో సహా 51 శాతం నేల కుంగుబాటు ప్రాంతంలో వున్నదని జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్స్ పత్రిక చాన్నాళ్ల క్రితం తెలిపింది. ఇక్కడి కొండల్లో మట్టి, రాళ్లు కలిసి వుండటం వల్ల ఈ కుంగుబాటు ప్రమాదం ఎక్కువ. గత కొన్నేళ్లుగా జోషీమuŠ‡ కుంగుబాటు, ఇతర ప్రాంతాల్లో సైతం భూమి నెర్రెలుబారటం ప్రమాదకర సంకేతాలందిస్తోంది. చార్ధామ్ యాత్రికులకూ, పర్యాటకులకూ అనుకూలంగా వుంటుందని 900 కిలోమీటర్ల మేర చార్ధామ్ హైవే నిర్మాణం చేపట్టారు. సిల్క్యారా సొరంగ నిర్మాణం దానిలో భాగమే. ఇవిగాక ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులను సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సిల్ క్యారా ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. అప్రమత్తం కావటం మనకే మంచిది. -
సొరంగంలో సంకల్ప స్ఫూర్తి.. ప్రధాని ప్రశంసలు.. ఎవరీ గబ్బర్ సింగ్ నేగి?
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుని 17 రోజులు పర్వత గర్భంలో గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలు పూర్తయి బయటపడే వరకూ సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల్లో మానిసిక స్థైర్యం చాలా అవసరం. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మానసికంగా చాలా ధైర్యం కావాలి. బతకాలన్న సంకల్పం ఉండాలి. బతుకుతామన్న ఆశ కోల్పోకూడదు. ఇది అందరికీ ఉండదు. కానీ ఉత్తరకాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిలో ఈ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు గబ్బర్ సింగ్ నేగి. ఆ స్థైర్యాన్ని మిగతా 40 మందికీ పంచాడు. సొరంగంలో ఉన్న 17 రోజులూ తోటి కార్మికులకు యోగా, ధ్యానం నేర్పించి చేయించాడు. వారు శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేలా చూసుకున్నారు. అందరం తప్పకుండా బయటపడతామంటూ వారిలో ధైర్యం నూరిపోశాడు. చివరగా నేనే.. సొరంగంలో ఉండగా గబ్బర్ సింగ్ నేగి చెప్పిన మాటలను ఆయన అతని సోదరుడు జయమల్ సింగ్ నేగి తెలియజేశారు. రెస్క్యూ ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరుగుతుందా అని అతన్ని అడిగినప్పుడు.. నేను సీనియర్ని..అందరూ బయటకు వచ్చిన తర్వాతే నేను చివరిగా వస్తాను అని గబ్బర్ సింగ్ నేగి చెప్పినట్లుగా జయల్ సింగ్ నేగి పేర్కొన్నారు. సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులందరూ తమ సహచరుడు గబ్బర్ సింగ్ నేగి కృషిని ప్రశంసించారు. తమను సురక్షితంగా మానసికంగ సంతోషంగా ఉంచడంలో నేగి పాత్రను వివరించారు. యోగా, ధ్యానంతోపాటు లూడో, చెస్ వంటి ఆటలు కూడా ఆడించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సైట్‌లోని మానసిక వైద్యులలో ఒకరైన డాక్టర్ రోహిత్ గోండ్వాల్ కూడా తెలిపారు. ప్రధాని ప్రశంసలు గబ్బర్ సింగ్ నేగీ ధైర్యాన్ని, చొరవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు. కార్మికులు సురక్షితంగా బయటపడిన తర్వాత మంగళవారం రాత్రి రాత్రి వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు. గబ్బర్ సింగ్ నేగి గురించి తోటి కార్మికులు చెప్పడంతో ప్రధాని మోదీ ఆయన్ను అభినందించారు. -
రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు
ఉత్తరకాశీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు బుధవారం తరలించారు. అక్కడ కార్మికులకు అన్ని రకాల మెడికల్ చెకప్‌లను నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చినూక్ హెలికాఫ్టర్‌లో 41 మంది కార్మికులను రిషికేశ్కు తరలించారు. గత 17 రోజులుగా సొరంగంలోనే చిక్కుకున్న నేపథ్యంలో కార్మికులకు ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకాయా? అని వైద్యులు పరీక్షించనున్నారు. #WATCH | Uttarkashi tunnel rescue | IAF's transport aircraft Chinook, carrying 41 rescued workers, arrives in Rishikesh. It has been flown to AIIMS Rishikesh from Chinyalisaur for the workers' further medical examination.#Uttarakhand pic.twitter.com/hrWm1dlxsM — ANI (@ANI) November 29, 2023 కార్మికులను సొరంగం నుంచి రక్షించిన తర్వాత స్థానికంగా ఉన్న చిన్యాలిసౌర్ ఆస్పత్రికి కార్మికులను తరలించారు. బుధవారం తెల్లవారుజామున, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా కార్మికులను కలిశారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. తదుపరి పరీక్షల కోసం ఎయిమ్స్‌కు తరలిస్తామని వెల్లడించారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami meets and enquires about the health of rescued tunnel workers at Chinyalisaur Community Health Centre, also hands over relief cheques to them pic.twitter.com/fAT6OsF4DU — ANI (@ANI) November 29, 2023 కార్మికులను రక్షించడానికి కీలక సహాయం అందించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను కూడా పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం కార్మికుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. #WATCH | Matli: Uttarakhand CM Pushkar Singh Dhami meets the ITBP personnel involved in the Uttarkashi Silkyara tunnel rescue. pic.twitter.com/tVlklz4FOl — ANI (@ANI) November 29, 2023 నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. ఇదీ చదవండి:41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ
ఢిల్లీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధానికి తమ అనుభవాలను కార్మికులు తెలియజేశారు. తొలిత బయపడ్డాం.. కానీ నమ్మకం కోల్పోలేదని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం కాపాడుతుందనే భరోసా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న కార్మికులనే కాపాడారని గుర్తుచేశారు. సహాయక చర్యలు పూర్తైన తర్వాత ప్రధాని మోదీ కూలీలందరితో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. యోగా, మార్నింగ్ వాక్‌తోనే తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఓ కూలీ ప్రధానికి తెలిపారు. మేం సొరంగంలో చిక్కుకుపోయినా చాలా ధైర్యంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులనే కాపాడింది... దేశంలో ఉన్న మమ్మల్ని కచ్చితంగా కాపాడగలదన్న భరోసాతో ఆందోళన చెందలేదని వెల్లడించారు. ఈ 17 రోజులు మేమంతా కలిసిమెలిసి ఉన్నామని తెలిపిన కూలీలు.. యోగా, మార్నింగ్ వాక్ వంటివి చేసి మాలోని స్థైర్యాన్ని పెంచుకున్నామని ప్రధానితో అన్నారు. సొరంగంలో చిక్కుకోగానే మొదట 10-15 గంటలు భయపడ్డామని కూలీలు తెలిపారు. శ్వాసతీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. కానీ అధికారులు తాము చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించి ఓ పైపును పంపించారని వెల్లడించారు. దాని ద్వారా ఆహారం పంపించారని పేర్కొన్నారు. ఓ మైక్‌ను కూడా అమర్చడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగామని ప్రధానితో చెప్పారు. మోదీ భావోద్వేగం.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసిన సాహసకృత్యాన్ని టెలివిజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి కేబినెట్ భేటీ జరిగిన క్రమంలో మంత్రులతో కలిసి సిల్క్యారా సొరంగంలో కార్మికుల వెలికితీతను వీక్షించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కేబినెట్ సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటపడటంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒకానొక దశలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారని వెల్లడించారు. నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. సొరంగం నుంచి బయటకు తీసుకురాగానే బాధిత కార్మికులను రిషికేశ్‌లోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Uttarkashi Tunnel Collapse: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
‘ప్రిన్స్’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఈ నేపధ్యంలో తొమ్మిదేళ్ల క్రితం హర్యానాలో జరిగిన ప్రిన్స్ రెస్క్యూ ఆపరేషన్‌ను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలోగల హల్దేహరి గ్రామంలో తొమ్మిది ఏళ్ల క్రితం బోరుబావి ప్రమాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు ప్రిన్స్ 60 అడుగుల లోతు కలిగిన బోరుబావిలో పడిపోయాడు. మూడు రోజులపాటు అదే బావిలో మగ్గిపోయాడు. అయితే సైన్యం బోరుబావి దగ్గర సొరంగం నిర్మించి ఆ బాలుడిని రక్షించింది. అది జూలై 21, 2006.. హల్దేహరి గ్రామానికి చెందిన ప్రిన్స్ తన స్నేహితులతో ఆడుకుంటూ, తెరిచివున్న బోరుబావిలో పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని ప్రిన్స్ కుటుంబసభ్యులకు తెలిపారు. కొడుకు బోరు బావిలో పడిపోయాడని తెలియగానే వారంతా నిస్తేజంగా మారిపోయారు. కొద్దిసేపటికే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి ప్రిన్స్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులు సైన్యం సహాయాన్ని కోరారు. వెంటనే భారత సైన్యం ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు మొదలుపెట్టింది. చీకట్లో ప్రిన్స్ భయపడకుండా ఉందేందుకు సైన్యం మొదట బోర్‌వెల్‌లో లైట్లు ఏర్పాటు చేసింది. అనంతరం అతనికి తాడు సహాయంతో బిస్కెట్లు, నీళ్లు, జ్యూస్ అందించారు. దాదాపు 50 గంటల పాటు శ్రమించిన అనంతరం సైన్యం ప్రిన్స్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ప్రిన్స్‌ను బోర్‌వెల్‌లో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ సిబ్బంది ఆ బోర్వెల్ దగ్గర సొరంగం నిర్మించింది. ఈ మార్గం గుండా సైన్యం ప్రిన్స్ దగ్గరకు చేరుకుంది. ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఆ సమయంలో దేశ ప్రజలంతా ప్రిన్స్ క్షేమం కోరుతూ ప్రార్థనలు, పూజలు చేశారు. ప్రస్తుతం ప్రిన్స్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ ఘటన అనంతరం ప్రిన్స్ ఉంటున్న గ్రామాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రిన్స్ పేరుతో వచ్చిన పరిహారంతో ఆ బాలుని కుటుంబం ఇల్లు నిర్మించుకుంది. ఇది కూడా చదవండి: కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు -
ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ కార్మికులలో యూపీలోని మీర్జాపూర్ నివాసి అఖిలేష్ కుమార్ ఒకరు. ఈయన బయటకు వస్తున్నాడని తెలియగానే అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ గత 17 రోజులుగా పలు ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం కార్మికులందరినీ సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. కార్మికులంతా బయటకు వస్తున్నారని తెలియగానే అఖిలేష్ కుటుంబం సంతోషంలో మునిగితేలింది. ఈ సందర్భంగా అఖిలేష్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు.. మేము పగలు, రాత్రి దేవుణ్ణి ప్రార్థించాం. భగవంతుడా నా కుమారుడు బయటపడేలా చూడు అని వేడుకున్నాం’ అని తెలిపారు. కాగా ఆమె తన కుమారుడు సొరంగం నుంచి బయటపడిన సంతోషంలో ఇంటి చుట్టుపక్కల వారికి స్వీట్లు పంచారు. తన కుమారునికి పునర్జన్మ లభించిందని ఆమె కనిపించిన అందరికీ చెబుతున్నారు. ఈరోజు ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొందని అఖిలేష్ తండ్రి మీడియాకు తెలిపారు. ‘గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించి మా పిల్లలను బయటకు పంపించాడు. ఈ ప్రమాదం కారణంగా మా ఇంటిలో దీపావళి బోసిపోయింది. ఇప్పుడు మేము ఇంటిలో దీపావళి చేసుకుంటాం. క్రాకర్లు పేల్చి, స్వీట్లు పంచుకుంటాం’ అని ఆనందంగా తెలిపారు. మంగళవారం సాయంత్రం 7.50 గంటల ప్రాంతంలో మొదటి కార్మికుడిని సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత కార్మికులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కార్మికులందరూ పూర్తి ఆరోగ్యంతొ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కార్యకలాపాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి బికె సింగ్ పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కార్మికులతో ఫోన్లో సంభాషించారు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఉత్తరకాశీలో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘టన్నెల్ ఆపరేషన్‌లో రెస్క్యూ టీం అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి. మొత్తం 41 మంది కార్మికులు సొరంగం నుండి సురక్షితంగా బయటపడటం సంతోషాన్నిచ్చింది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. My appreciation for the tireless commitment and unwavering efforts of the rescue team in the Uttarkashi Tunnel Operation! Their determination and bravery is an inspiration to all of us! I am relieved that all 41 of the trapped workers have safely been evacuated from the… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2023 ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లో సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఇదీ చదవండి: వాళ్లు సొరంగాన్ని జయించారు! -
ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర వీరిదే..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. నవంబర్ 12న టన్నెల్ కూలిపోయి లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేసింది. చివరకు ర్యాట్-హోల్ పద్ధతిలో డ్రిల్లింగ్ చేసి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సొరంగం లోపల కార్మికులు చిక్కుకున్న చోటకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు పంపించడంతో వారు ఇన్ని రోజులు సజీవంగా ఉండగలిగారు. సహాయక చర్యల్లో దేశ విదేశాల నిపుణులు సైతం పాలుపంచుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో ఇందులో కీలకంగా పాత్ర వహించిన నలుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సభ్యుడు, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఎంఏ పాత్రను పర్యవేక్షిస్తున్నారు. ఈయన శ్రీనగర్‌లోని భారత సైన్యం జీవోసీ 15 కార్ప్స్లో మాజీ సభ్యుడు. 2018 జూలై 13న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీకి ఛాన్సలర్‌గా లెఫ్టినెంట్ జనరల్ హస్నైన్ను నియమించారు. మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ నవంబర్ 19న ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ప్రయత్నాల్లో చేరిన మెల్బోర్న్కు చెందిన చార్టర్డ్ ఇంజనీర్ క్రిస్ కూపర్స్ మైక్రో టన్నెలింగ్ స్పెషలిస్ట్. తన దశాబ్దాల అనుభవంలో ఆయన మెట్రో సొరంగాలు, పెద్ద గుహలు, ఆనకట్టలు, రైల్వేలు, మైనింగ్ వంటి ప్రాజెక్టులలో పనిచేశారు. కూపర్ రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టుకు అంతర్జాతీయ సలహాదారుగా కూడా ఉన్నారు. ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న పలు కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్‌ను నోడల్ అధికారిగా సీఎం ధామి నవంబర్ 18న నియమించారు. గత పది రోజులుగా ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాటి గురించి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయాలకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఆయన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆస్ట్రేలియాకు చెందిన ఆర్నాల్డ్ డిక్స్ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో సేవలందించాలని కోరడంతో నవంబర్ 20న ఆయన రంగంలోకి దిగారు. ఆయన వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం.. ఆర్నాల్డ్ బారిస్టర్, శాస్త్రవేత్త, ఇంజనీరింగ్ ప్రొఫెసర్. భూగర్భ, రవాణా మౌలిక రంగంలో నిపుణుడు. నిర్మాణ ప్రమాదాలను అంచనా వేయడం నుంచి కార్యాచరణ భద్రతా పనితీరుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం వరకు ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. -
అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది సురక్షితంగా బయటకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కార్మికులు క్షేమంగా తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వారి ధైర్యం, సంకల్పం కార్మిక సోదరులకు కొత్త జీవితాన్నిచ్చాయన్నారు. మానవత,జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారంటూ రెస్క్యూ టీంను ప్రశంసించారు. ఉత్తరకాశీలో కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ధైర్యం, సహనం అందరికి స్ఫూర్తిని కలిగిస్తున్నాయంటూ కార్మికులను అభినందించారు. అందరికీ శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇంతకాలం నిరీక్షణ తర్వాత కార్మికులు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం. ఈ సమయంలో సహనంతో ఆయా కుటుంబాలన్నీ చూపించిన ఓర్పు, ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేమని కొనియాడారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है। टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं। यह अत्यंत… — Narendra Modi (@narendramodi) November 28, 2023 రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము కూడా కార్మికులును వెలికి తీసుకొచ్చిన ఘటనపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర నితిన్ గడ్కరీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తన సందేశాన్ని వీడియో రూపంలో ట్విటర్లో షేర్ చేశారు. అలాగే నటుడు సోనూ సూద్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర) सिल्क्यारा टनल बचाव कार्य में शामिल सभी का धन्यवाद। #SilkyaraTunnelRescue pic.twitter.com/H8r0JsRELY — Nitin Gadkari (@nitin_gadkari) November 28, 2023 Uttarkashi rescue operation complete. All 41 workers rescued from the collapsed #SilkyaraTunnel ❤️❤️❤️❤️ A M A Z I N G 🙏 — sonu sood (@SonuSood) November 28, 2023 -
ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్ వారిని ఒక్కొక్కరినీ బయటికి తీసుకువచ్చారు. దీంతో అక్కడంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం (నవంబరు 28) తొలిసారి వెలుగు ముఖం చూశారు. Uttarkashi tunnel rescue | Uttarakhand CM Pushkar Singh Dhami meets the workers who have been rescued from inside the Silkyara tunnel. pic.twitter.com/8fgMiHPkAD — ANI (@ANI) November 28, 2023 బయటకు తీసుకొచ్చిన వారిని అత్యవసర వైద్య పరీక్షల నిమత్తం ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. దీనిపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. 423 గంటలు, 41 జీవితాలు!!! రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు!! అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పరిశీలించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సిల్క్యారా సొరంగం లోపల నుండి బైటికి వచ్చిన కార్మికులను కలిసి ఆనందం ప్రకటించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్) ముఖ్యంగా ఆనంద్ మహీంద్ర ఈ ఆపరేషన్‌పై సక్సెస్‌పై స్పందించారు. 41 మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు గత 17 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం సాధించగలిగే దానికంటే గొప్పగా, దేశ స్ఫూర్తిని ఇనుమడింప చేశారు. మా ఆశల్ని ద్విగుణీ కృతం చేశారని పేర్కొన్నారు. మన ఆశయం, కృషి కలెక్టివ్‌గా ఉంటే, ఐక్యంగా ఉంటే ఏ సొరంగం నుండి బయటపడటం కష్టం కాదు, ఏ పని అసాధ్యం కాదని మరోసారి గుర్తు చేసారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) It’s time for gratitude. Thank you to EVERY single person who worked tirelessly over the past 17 days to save these 41 precious lives. More than any sporting victory could have, you have uplifted the spirits of a country & united us in our hope. You’ve reminded us that no tunnel… https://t.co/ZSTRZAAJOl — anand mahindra (@anandmahindra) November 28, 2023 -
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
కోట్లాది మంది ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగం ఆపరేషన్ విజయవంతం అయ్యింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను మంగళవారం సురక్షితంగా బయటకు తెచ్చింది రెస్క్యూ టీం. పాక్షికంగా కూలిపోయిన టన్నెల్లో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉండగా.. వైద్య పరీక్షల కోసం ఆంబులెన్స్‌లో వాళ్లను ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 17 రోజులపాటు నిర్మిరామంగా కృషి చేసి బయటకు తెచ్చిన బలగాలపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వీడియో సందేశం ఎక్స్‌లో ఉంచారు. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసిన అధికారులు.. చివరకు రాట్‌హోల్ మైనింగ్ టెక్నిక్‌తో విజయం సాధించారు. మంగళవారం సాయంత్రం ఐదుగురు సభ్యుల బృందం ప్రత్యేక పైప్ ద్వారా లోపలికి వెళ్లి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తెచ్చింది. గంటపాటు కొనసాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఘటనాస్థలానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రోడ్డు రవాణా శాఖల మంత్రి జనరల్ వీకే సింగ్‌లు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. सिल्क्यारा टनल बचाव कार्य में शामिल सभी का धन्यवाद। #SilkyaraTunnelRescue pic.twitter.com/H8r0JsRELY — Nitin Gadkari (@nitin_gadkari) November 28, 2023 నవంబర్ 12వ తేదీన పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. అదృష్టవశాత్తూ టన్నెల్లో రెండు కిలోమీటర్ల ప్రాంతం తిరగడానికి ఉండడం, బయట నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు అందించడంతో వాళ్లంతా క్షేమంగా ఉండగలిగారు. మరోవైపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుకల్పించి మానసికంగానూ ధైర్యం అదించారు అధికారులు. This is called rat mining. A person is filling this small bucket with hand tools to create further space and a push cushion machine advances this pipe inside the rubble. Process was repeated numerous times to dig down and reach trapped workers. #UttarakhandTunnelRescue pic.twitter.com/HGZMLnMWNe — Dutchess of Saffronation (@Kaalbhairavee) November 28, 2023 అంతకు ముందు దాదాపు 17 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు. ఆ పైప్ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా.. కూలీలంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కన్పించింది. ఫలించిన ప్రార్థనలు కుటుంబ సభ్యుల ఆందోళనలు ఒకవైపు.. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికులు బయటకు రావాలని కోట్ల మంది ప్రార్థించారు. అధికారులు సైతం ఆశలు వదిలేసుకోకుండా నిరంతరంగా శ్రమించారు. కార్మికులు బయటకు వస్తున్న సమయంలో మిఠాయిలు పంచుకుంటూ స్థానికులు కనిపించారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: Locals distribute sweets outside Silkyara tunnel as trapped workers are being rescued from the tunnel pic.twitter.com/oASZAy8unf — ANI (@ANI) November 28, 2023 #WATCH| Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami meets the workers who have been rescued from inside the Silkyara tunnel pic.twitter.com/vuDEG8n6RT — ANI (@ANI) November 28, 2023 Uttarkarshi tunnel collapse UPDATE: Photos of the first worker rescued from the tunnel. pic.twitter.com/Iq0iVHOarv — Press Trust of India (@PTI_News) November 28, 2023 -
ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. ఎవరీ డిక్స్.. ఈయన ప్రత్యేకత ఏంటి? మన ఊరు కాదు, మన భాషకాదు అయినా అందరితోనూ మమేకమవుతూ రక్షణ చర్యల్లో భాగంగా దేశం కాని దేశం వచ్చి ఇక్కడి కార్మికుల కోసం 24/7 ఎందుకంత కష్టపడ్డారు? ఇలాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ .ఆస్ట్రేలియా స్వతంత్ర విపత్తు పరిశోధకుడు. అంతర్జాతీయ టన్నెలింగ్ సంఘం అధ్యక్షుడు కూడా. ఉత్తరకాశీ వద్ద సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు సవాల్‌గా తీసుకున్నారు. నవంబర్ 20నుంచి రెస్క్యూ ఆపరేషన్‌లో దిగిపోయారు. అప్పటినుంచీ సొరంగంలో చిక్కుకు పోయిన 41 మంది కార్మికులను తన సొంత కొడుకుల కంటే మిన్నగా భావిస్తూ, నిరంతరం వారి క్షేమం కోసం పరితపించిన వ్యక్తి. అటు కార్మికులతో మాట్లాడుతూ, వారికి భరోసా ఇస్తూనే రక్షణ చర్యల్ని కొనసాగించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ పై ‘17 రోజుల విరామం లేని శ్రమ, 400పైగా గంటలు, 41 మంది కార్మికులు’ ఎట్టకేలకు వారంతా మృత్యుంజయులుగా బైటపడ్డారు అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు. వినయంగా ఉండాలనే విషయం పర్వతం మాకు చెప్పింది: డిక్స్ భూగర్భ టన్నెలింగ్‌లో ప్రపంచంలోని ప్రముఖ నిపుణుడిగా పేరొందిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ భూగర్భ మరియు రవాణా రంగంలో ప్రత్యేకత ఆయన సొంతం. నిర్మాణ ప్రమాదాలు, సెక్యూరిటీ చర్యలు, వాస్తవ భద్రతా పనితీరు మొదలు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారం వరకూ ఆయనకు ఆయనే సాటి. ఉత్తరకాశీ వద్ద సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే, డిక్స్ సిల్క్యారా టన్నెల్ సైట్లో తనిఖీ నిర్వహించి, సహాయక చర్యల్లో పాల్గొన్న ఏజెన్సీలతో చర్చించిన తరువాత కార్మికులను రక్షించడంపై భరోసా ఇచ్చారు. కార్మికులకు ఆహారం, నీళ్లు లాంటి అత్యవసర సాయాన్ని అందించారు. వాళ్లతో ఫోన్లతో మాట్లాడటం, వీడియోలతో కుటుంబ సభ్యులకు కూడా కాస్త ఊరట కలిగింది. అయితే క్రిస్మస్ నాటికి వారంతా బైటికి వచ్చే అవకాశం ఉందని తొలుత ప్రకటించారు. కానీ ఆయన అంచనా కంటే ముందుగానే వారిని రక్షించడం విశేషం. అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్ ఆపరేషన్ పగుళ్లతో దీనికి అంతరాయం ఏర్పడింది. ఆగర్ ఆపరేషన్‌ను పాజ్ చేశారు. అగర్ డ్రిల్లింగ్ మెషిన్ చివరి భాగం విరిగిపోవడంతో చివరికి ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా కార్మికులను రక్షించే ప్రక్రియ విజయంతంగా పూర్తి అయింది. రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇంతకు ముందెప్పుడూ ఇలా చెప్పలేదు.మంచిగా అనిపిస్తోంది. పర్వతం పైభాగంలో డ్రిల్లింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందని మాన్యువల్ డ్రిల్లింగ్‌పై సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆనంద్ మహీంద్రా మంగళవారం డిక్స్ పై ప్రశంసలు The art of communication is essentially the art of storytelling. Our ancient culture has its roots in storytelling. But we need to revive & refine those skills. In the meantime, here’s an Australian giving us a master class…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/QP4huuS78u — anand mahindra (@anandmahindra) November 28, 2023 మరిన్ని సంగతులు, అవార్డులు ♦2011లో, టన్నెలింగ్‌లో ప్రత్యేకించి టన్నెల్ ఫైర్ సేఫ్టీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అలాన్ నేలాండ్ ఆస్ట్రలేసియన్ టన్నెలింగ్ సొసైటీ ద్వి-వార్షిక అవార్డును అందుకున్నారు. ♦ డిక్స్ న్యాయవాది కూడా బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్స్లో సభ్యుడు. స్పెషలిస్ట్ అండర్ గ్రౌండ్ వర్క్స్ ఛాంబర్స్ సభ్యుడు, విక్టోరియన్ బార్ సభ్యుడు , టోక్యో సిటీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ (టన్నెల్స్) విజిటింగ్ ప్రొఫెసర్. ♦ ఇంజనీరింగ్, జియాలజీ, లా రిస్క్ మేనేజ్మెంట్ విషయాల్లో మూడు దశాబ్దాలుగా బలమైన కరియర్ ♦ రిస్క్ అసెస్మెంట్ లేదా అంశానికి సంబంధించి చట్టపరమైన , సాంకేతిక పరిమాణాలను అంచనా వేయడంలో దిట్ట. ♦ లాయర్ కూడా కావడంతో లీగల్ అంశాలతోపాటు, పరిశోధకుడిగా, నిపుణుడుగా క్లిష్ట పరిస్థితి అంచనా వేయడంలో సమర్ధుడు. ♦ ముఖ్యంగా సొరంగాలలో ఫైర్ సేఫ్టీని పెంపొందించడంలో డిక్స్ సంచలనాత్మక విజయాలు సాధించారు. ♦ 2022లో అమెరికా నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కమిటీ సర్వీస్ అవార్డు -
నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. టన్నెల్లో అమర్చిన పైప్‌లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు బయటకు వస్తున్నారు. వారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థించారు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ రంగంలోకి దిగారు. రెస్క్యూ బృందం ప్రయత్నాలు ఫలించి బాధితులు బయటపడుతున్న వేళ ఆర్నాల్డ్ డిక్స్ మంగళవారం టన్నెల్ సైట్ సమీపంలోని చిన్న దేవాలయం వద్ద కార్మికుల క్షేమం కోసం అర్చకులతో కలిసి పూజలు చేశారు. దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా మారింది. While long awaited breakthrough in #Uttarkashi tunnel operation is achieved, visual of Prof. Arnold Dix, international tunnelling expert, bowing and praying before temple near the site is so heartwarming. Prayers for safety of all the trapped workers. pic.twitter.com/CcrkeEZZ9i — Arun Bothra 🇮🇳 (@arunbothra) November 28, 2023 -
ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చే విషయంలో కీలక పురోగతి. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ఉన్న కార్మికులు ఎట్టకేలకు వెలుగు చూసే క్షణాలు సమీపిస్తున్నాయి. దీంతో అక్కడంతా ఉత్కంఠ వాతావారణం నెలకొంది. ఈ ఉద్వేగభరిత క్షణాలకోసం కుటుంబ సభ్యులతో పాటు, రెస్క్యూ ఆపరేషన్ టీం ఎదురు చూస్తున్నారు. టన్నెల్లో అమర్చిన పైప్‌లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. మరోవైపు కార్మికులు బైటికి వచ్చిన వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబంధిత మెడికల్ ఆఫీసర్లు కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సిల్క్యారా సొరంగం ప్రవేశ ద్వారం వద్ద నలభై ఒక్క అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా కార్మికులను సమీప వైద్య శాలలకు తరలిస్తారు. ఇందు కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. తద్వారా బయటికి వచ్చిన కార్మికులదరిన్నీ హుటాహుటిన ఈ సొరంగం నుండి 30 కి.మీ దూరంలో ఉన్న చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తారు. కార్మికులకు స్వాగతం పలికేందుకు పూలమాలలు కూడా సిద్ధం చేశారు. #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel rescue: Rishikesh AIIMS on alert mode for medical services. A 41-bed ward including trauma center ready. A team of cardiac and psychiatric specialist doctors including trauma surgeon ready. Three helicopters can be landed simultaneously at… pic.twitter.com/Xesrf1zc6u — ANI (@ANI) November 28, 2023 ఒక్కో వ్యక్తిని బయటకు తీయడానికి మూడు నుండి ఐదు నిమిషాలు పడుతుంది. కాబట్టి, మొత్తం 41 మంది కార్మికులను రక్షించేందుకు నుండి నాలుగు గంటల సమయం పడుతుందని ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూపై NDMA సభ్యుడు లెఫ్టినెంట్జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ చెప్పారు. ప్రతి కార్మికుడికి సత్వర వైద్య సంరక్షణ అందించేలా 41 ఆక్సిజన్‌తో కూడిన పడకలతో ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. వర్కర్లు అందర్నీ రెస్క్యూ చేయనున్నట్లు కార్మికులకు తక్షణ వైద్యం సహాయం అందించేందుకు అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రస్తుత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారికి యూపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సమన్వయకర్త అరుణ్ మిశ్రా ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే కార్మికులంతా బైటికి రానున్నారని తెలిపారు. VIDEO | "It will take about three to five minutes to pull out one individual each. So, it will take about three to four hours to rescue all 41 workers," says Lt Gen (Retd) Syed Ata Hasnain, NDMA member, on Uttarkashi tunnel rescue.#UttarkashiTunnelRescue #SilkyaraTunnelRescue pic.twitter.com/AJ7bHXOVIS — Press Trust of India (@PTI_News) November 28, 2023 बाबा बौख नाग जी की असीम कृपा, करोड़ों देशवासियों की प्रार्थना एवं रेस्क्यू ऑपरेशन में लगे सभी बचाव दलों के अथक परिश्रम के फलस्वरूप श्रमिकों को बाहर निकालने के लिए टनल में पाइप डालने का कार्य पूरा हो चुका है। शीघ्र ही सभी श्रमिक भाइयों को बाहर निकाल लिया जाएगा। — Pushkar Singh Dhami (@pushkardhami) November 28, 2023 -
Uttarakhand: రెస్క్యూ బృందాలకు 5 మీటర్ల దూరంలో కార్మికులు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత 17 రోజులు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సొరంగంలోని బండరాళ్లను తవ్వే క్రమంలో అవంతరాలు ఎదురవ్వడంతో రెస్క్యూ ప్లాన్లను మార్చి మార్చి అమలు చేస్తున్నారు. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను పక్కనపెట్టి.. కొండపై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను సోమవారం మొదలు పెట్టారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing. First visuals of manual drilling ongoing inside the rescue tunnel. Auger machine is being used for pushing the pipe. So far about 2 meters of… pic.twitter.com/kXNbItQSQR— ANI (@ANI) November 28, 2023 ఇక ‘ర్యాట్ హోల్ మైనింగ్’ బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ముందుగా 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించి.. అదే మార్గంలో దూరిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్‌గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా శిథిలాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 2 మీటర్ల మేర మాన్యువల్ డ్రిల్లింగ్ పూర్తయింది. చదవండి: ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing. Manual drilling is going on inside the rescue tunnel and auger machine is being used for pushing the pipe. So far about 2 meters of manual… pic.twitter.com/oIMNAxvre2— ANI (@ANI) November 28, 2023 మరోవైపు టన్నెల్ పైభాగం నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. 86 మీటర్లు తవ్వాల్సి ఉండగా.. మంగళవారం ఉదయం నాటికి 51 మీటర్ల మేర మైక్రో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ బృందాల నుంచి కార్మికులు కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అయిదు మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయితే కార్మికులను చేరుకోనున్నారు. ఈ పద్దతి ద్వారా గురువారం నాటికి కార్మికులను బయటకు తీయాలని అధికారులు భావిస్తున్నారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Micro tunnelling expert Chris Cooper says, "...It went very well last night. We have crossed 50 metres. It's now about 5-6 metres to go...We didn't have any obstacles last night. It is looking very positive..." pic.twitter.com/HQssam4YUs— ANI (@ANI) November 28, 2023 కాగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న టన్నెల్ వద్దకు నేడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి వెళ్లారు. సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. ఇక ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిల్క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు. చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు! -
Uttarkashi tunnel collapse: శరవేగంగా డ్రిల్లింగ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు కొండపై భాగంలో మొదలెట్టిన డ్రిల్లింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 86 మీటర్ల లోతు తవ్వాల్సి ఉండగా 36 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయిందని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల గుండా భారీ ఆగర్ డ్రిల్లింగ్ మెషీన్ తవ్వుతున్నపుడు రాడ్లు అడ్డుతగిలి మెషీన్ ధ్వంసమవడం తెల్సిందే. దీంతో 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించి అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్‌గా రంధ్రం చేయనున్నారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ‘‘ మేం పదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కార్మికులను కాపాడేందుకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేయాలి. మేం 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేశాం. చిన్న గడ్డపార, పార, చిన్న తట్ట వెంట తీసుకెళ్లి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ శిథిలాలను తొలగిస్తాం. 12 మీటర్లలో కేవలం మట్టి ఉంటే పని 24 గంటల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ గట్టి రాళ్లు ఉంటే 36 గంటలకుపైనే పడుతుంది. వంతుకు ఇద్దరు చొప్పున ఆరుగురం తవ్వేస్తాం’’ అని కార్మికులు వెల్లడించారు. ఈ మార్గంలో ఇంకా 8.15 మీటర్లమేర బ్లేడ్ల ముక్కలను తొలగించాల్సిఉంది. ఆ తర్వాతే మ్యాన్యువల్ డ్రిల్లింగ్ మొదలవుతుంది. మరోవైపు, కొండపైనుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ పూర్తయ్యాక రంధ్రంలోకి 1.2 మీటర్ల వ్యాసమున్న పైపులను అమర్చి దాని ద్వారా కార్మికులను పైకి లాగుతారు. రంగంలోకి ‘ర్యాట్–హోల్’ మైనింగ్ కార్మికులు ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్–హోల్’ మైనింగ్‌లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదలనున్నారు. ఇలా 12 మీటర్ల మేర డిల్లింగ్ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్ రాజ్‌పుత్ తదితరులను ఈ పనికి పురమాయించారు. -
ఉత్తరకాశీ: కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోవడంతో దాదాపు 40 మంది కూలీలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ కూలీలను రక్షించేందుకు నేషనల్, స్టేట్ డిజాస్టర్ బృందాల తోసహ అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు కూడా పాల్గొని సహాయక చర్యలు చేపట్టారు. తీరా కూలీలు బయటకు వచ్చేస్తారనే లోపలే ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ కాస్త పనిచేయకుండా మొరాయించింది. ఇక లాభం లేదనుకుని మరో ప్రణాళికతో సాగేందుకు సన్నద్ధమయ్యారు అధికారులు. అందులో భాగంగా కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులు ముమ్మరం చేశారు. అంటే..ఈ దురదృష్టకర ఘటన జరిగి నేటికి దాదాపు 15 రోజులు కావొస్తుంది. అందులో చిక్కుకున్న వారి కోసం ఆక్సిజన్, ఆహారం, నీళ్లు వంటి వాటిని పైపుల ద్వారా అందజేశారు కూడా అధికారులు. ఇప్పటి వరకు భయాందోళనల నడుమ గడిపిని ఆ కూలీలకు ఈ ఆహారం ఎంత వరకు సరిపోతుంది. వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తదితరాల గురించే ఈ కథనం!. మూడు.. నాలుగు.. రోజుల కాదు దాదాపు పదిరోజులపైనే ఆ సోరంగంలో చిక్కుకుపోయారు కార్మికులు. అధికారుల అందించే ఆహారం వారి ప్రాణాలను నిలబెడుతుందో లేదో చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకుంటే మానసిక భయాందోళనకు మించిన భయానక వ్యాధి ఇంకొకటి ఉండదు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆకలి అనేది పుట్టి తినగలడు. ఎప్పుడూ బయటపడతామన్నా ఆలోచన ప్రతి గడియా ఓ యుగంలా టెన్షతో ఉన్నవారికి పోషకవిలువతో కూడిన ఆహారం అయినా సహించదని అన్నారు. ముఖ్యంగా అన్ని రోజులు లోపలే ఉన్నారు కాబట్టి మనిషి రోజువారీ కాలకృత్యాలు సైతం తీర్చుకోవడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణిస్తుందో చెప్పనవసరం లేదన్నారు.ఆ చీకటి ప్రదేశంలో బిక్కుబిక్కుమని ఉంటున్న వ్యక్తి మానసిక స్థితే సంఘర్షణలో ఉంటే మిగతా ఆరోగ్య వ్యసస్థలు సంక్రమంగా ఉండవని తేల్చి చెప్పారు. అదీగాక ఆ సొరంగంలోని సిలికా కారణంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉందన్నారు. అధికారులు అందించే కృత్రిమ ఆక్సిజన్ ఎంతవరకు వారిని సంరక్షిస్తుందనేది కూడా చెప్పలేం. కొందరిలో హైపోక్సియా కారణంగా సాధారణ ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోయి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.కాగా, వైద్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో నేపథ్యంలో చిక్కుకున్న కార్మికులకు కావాల్సిన విటమిన్ సీ టాబ్లెట్లు, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు సంబంధించిన మందులను పంపించామని ఉత్తకాశీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చీకట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమని ఉన్న ఆ కార్మికుల మానసిక స్థితి ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ కాంత్ రాఠీ మాట్లాడుతూ..ఒకే పరిస్థితికి వివిధ వ్యక్తులు భిన్నమైన మానసిక ప్రతిస్పందనలను ప్రదర్శిస్తారని, అందరి మానసిక స్థితి ఒకేలా ఉండదని అన్నారు. బయటపడిన వెంటనే ఆ కార్మికులకు కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షలో ఉండటం అత్యంత అవసరమని చెప్పారు. ఎందుకంటే..కొందరూ డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని అన్నారు. (చదవండి: పల్లీలు తింటే ఆ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
Uttarakhand tunnel collapse: నిట్టనిలువుగా డ్రిల్లింగ్ మొదలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. రెండు మూడు రోజులుగా శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ప్రస్తుతానికి పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను ఆదివారం మధ్యాహ్నం మొదలు పెట్టారు. ‘మొదలెట్టి నిలువుగా 20 మీటర్లకుపైగా డ్రిల్లింగ్ చేశాం. భారీ బండలు లాంటివి అడ్డుప డకపోతే నవంబర్ 30వ తేదీకల్లా డ్రిల్లింగ్ పూర్తి అయ్యే అవకాశ ముంది. 85 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశాక సొరంగం పైకప్పుకు చేసిన కాంక్రీట్, ఉక్కు రాడ్ల నిర్మాణాన్ని ఛిద్రం చేసి మార్గం సుగమం చేయాల్సి ఉంది’’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చెప్పారు. ‘‘ఇప్పటికి మొత్తంగా ఆరు రకాల రెస్క్యూ ప్లాన్లను అమలుచేశాం. అయినా సరే మొదటిదే అన్నింటికన్నా ఉత్తమం, సురక్షితం. సమాంతరంగా తవ్వే ప్లాన్‌ను మళ్లీ అమలుచేస్తాం. దాదాపు 62 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేశాం. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో 47 మీటర్లవరకు ఉన్న మెషీన్‌ను వెనక్కి లాగాం. 15 మీటర్లు లాగాక మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీస్తున్నాం. 23 మీటర్లవరకు ముక్కలను తొలగించాం. మొత్తం పొడవునా బ్లేడ్ల ముక్కలను తీయడానికి ఒక రోజంతా పట్టొచ్చు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడం మొదలుపెడుతుంది’’ అని వివరించారు. ‘‘ 62 మీటర్ల శిథిలాల గుండా ఇప్పటికే 47 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. మెషీన్ బ్లేడ్లు తొలగించాక మిగతా 15 మీటర్లను మ్యాన్యువల్‌గా తవ్వితే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చు’’ అని ఆయన వెల్లడించారు. గత 14 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చేందుకు సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు సిల్క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు. -
Uttarkashi tunnel collapse: డ్రిల్లింగ్కు భారీ అవాంతరం
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఒకటి రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకొస్తారన్న ఆశలకు గండి పడింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ఆగర్ మెషీన్ డ్రిల్లింగ్‌ను నిలిపేశారు. శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడమే ఇందుకు అసలు కారణం. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నాయి. దీంతో డ్రిలింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. డ్రిల్లింగ్ ప్లాన్‌ను పక్కనబెట్టి ఇక మాన్యువల్‌గా తవ్వాలని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇంకా దాదాపు 12 మీటర్లమేర శిథిలాల గుట్టను తొలగించాల్సి ఉంది. ‘‘ఇదంతా తొలగించి కార్మికులను బయటకు తెచ్చేందుకు ఇంకొన్ని రోజులు/వారాలు పట్టొచ్చు’ అంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యుడు, మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చేసిన మీడియా ప్రకటన కార్మికుల కుటుంబాల్లో భయాందోళనలు పెంచేసింది. క్రిస్మస్ పండుగ లోపు కార్మికులను రక్షిస్తామంటూ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ చెప్పడంచూస్తుంటే ఈ మొత్తం ప్రక్రియకు నెలరోజులు పట్టేట్టు ఉందని తెలుస్తోంది. ‘ మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంది. కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ వచ్చే 24–36 గంటల్లో మొదలెడతాం’’ అని సయ్యద్ చెప్పారు. ‘ 25 మీటర్ల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేసేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను తెప్పిస్తున్నాం’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనాస్థలిలో చెప్పారు. డ్రిల్లింగ్‌ను నిలిపేయడంతో డ్రిల్లింగ్ చోటుదాకా వెళ్లి తాజా పరిస్థితిని ధామీ పర్యవేక్షించారు. లోపలికి ల్యాండ్‌లైన్, ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ ప్రస్తుతానికి కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్’ను పంపుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడుతున్నారు. -
సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తారు ఇలా...
ఉత్తరాఖండ్‌లో టన్నెల్ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు గత 13 రోజులుగా శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉత్తర్‌కాశీలో సిల్క్యారా టన్నెల్ కూలిన ఘటనలో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని గంటల్లో 41 మందిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరికి తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఘటన స్థలంలో అంబులెన్సులు, ప్రత్యేక పడకలు, ఔషధాలు, ఆక్సిజన్ కిట్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం టన్నెల కూలిన స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్లో ఉండిపోయిన కార్మికులను రాళ్ల శిథిలాల నుంచి బయకు తీసుకొచ్చే పద్దతి గురించి అధికారులు వెల్లడించారు. పెద్ద పైపు ద్వారా చక్రాలు కలిగిన స్ట్రేచర్‌ను కార్మికుల వద్దకు చేర్చి.. ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకురానున్నట్లు తాజాగా తెలిపారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) ఓ వీడియో విడుదల చేసింది .వెల్డింగ్ చేసిన పైపులో స్ట్రెచర్ మీద కార్మికులు వెల్లికిలా పడుకొని ఉంటే దానిని తాడుతో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు బయటకు లాగనున్నారు. చదవండి: నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట #WATCH | | Uttarkashi (Uttarakhand) tunnel rescue: NDRF demonstrates the movement of wheeled stretchers through the pipeline, for the rescue of 41 workers trapped inside the Silkyara Tunnel once the horizontal pipe reaches the other side. pic.twitter.com/mQcvtmYjnk — ANI (@ANI) November 24, 2023 కాగా నవంబర్ 12 టన్నెల్‌లోని కొంతభాగం కూలడంతో 41 మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కులడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారుతోంది. ప్రస్తుతం చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందిస్తున్నారు. ఇటీవల స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలు తొలిసారి కనిపించిన సంగతి విదితమే. -
ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు
ఉత్తరకాశీ: నిర్మాణంలో ఉన్న సొరంగం కాస్తా కుప్పకూలడంతో అందులో తొమ్మిది రోజులుగా చిక్కుకుపోయిన కూలీలను రక్షించేందుకు ఇప్పుడు అంతర్జాతీయ బృందం ఒకటి సిద్ధమైంది. ఉత్తరకాశీలోని ఈ సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఇప్పటివరకూ జరిగిన అనేకానేక ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. కూలీల వెలికితీతకు జరుగుతున్న ప్రయత్నాలను పర్యవేక్షించేందుకు ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ సొరంగం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation | International Tunneling Expert, Arnold Dix says "We are going to get those men out. Great work is being done here. Our whole team is here and we are going to find a solution and get them out. A lot of work is being done… https://t.co/ta5cXfBRyv pic.twitter.com/Mfwkxu5UbJ — ANI (@ANI) November 20, 2023 'చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకొస్తాం. పనులు బాగా జరుగుతున్నాయి. మా బృందం మొత్తం ఇక్కడే ఉంది. సమస్యకు ఏదో ఒక పరిష్కారం కచ్చితంగా కనుక్కుంటాం. ప్రస్తుతం ఇక్కడ చాలా పనులు జరుగుతున్నాయి. క్రమపద్ధతిలో పని చేసుకుపోతున్నారు. బాధితులకు ఆహారం, మందులు సరియైన విధంగా అందిస్తున్నారు' అని ఆర్నాల్డ్ డిక్స్ చెప్పారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌లో భాగం. ఈ సొరంగం ఉత్తరకాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై ఉంది. అయితే.. నవంబర్ 12 అర్ధరాత్రి సమయంలో సొరంగంలో కొంతభాగం కూలిపోయింది. దీంతో 41 మంది లోపలే చిక్కుకుపోయారు. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత -
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని సిలి్కయారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా బయటకురాలేదు. వారం రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో వారు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కార్మికులు బయటకు రావడానికి వీలుగా ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి తలపెట్టిన డ్రిల్లింగ్ పనులను ఆదివారం నిలిపివేశారు. డ్రిల్లింగ్ యంత్రానికి అడ్డంకులు ఎదురు కావడమే ఇందుకు కారణం. గట్టి రాళ్లు రప్పలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం సమీక్షించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైపులైన్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైపులైన్‌ను పంపించనున్నట్లు తెలిపారు. సొరంగంలో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవడానికి నిట్టనిలువుగా కంటే అడ్డంగా తవ్వడమే సరైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా యంత్రానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుంటే రెండున్నర రోజుల్లో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవచ్చని వెల్లడించారు. సొరంగంలో కార్మికులు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగగలుగుతున్నారని, వారికి ఆహారం, నీరు, విద్యుత్, ఆక్సిజన్ అందుతున్నాయని, ప్రాణాపాయం లేదని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.అమెరికా యంత్రంతో అతిత్వరలో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సొరంగంలో ఉన్న కార్మికులకు మల్టీ విటమిన్ మాత్రలు, ఎండు ఫలాలు తదితరాలు అందిస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం తెలిపారు.