ఉత్తరకాశీ సొరంగం శిథిలాల తొలగింపునకు రూ. 20 కోట్ల ఖర్చు! | Silkyara Tunnel Debris Will be Dump | Sakshi
Sakshi News home page

Silkyara Tunnel: ఉత్తరకాశీ సొరంగం శిథిలాల తొలగింపునకు రూ. 20 కోట్ల ఖర్చు!

Published Tue, Mar 26 2024 8:41 AM | Last Updated on Tue, Mar 26 2024 8:41 AM

Silkyara Tunnel Debris Will be Dump - Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి చాలా కాలం గడిచింది. ఈ ప్రమాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. త్వరలో ఈ సొరంగంలో శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఒక నివేదిక వచ్చింది.

ఉత్తరకాశీ సొరంగం నిర్మాణ సమయంలో  కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయింది. ఆ సమయంలో సొరంగంలో పనిచేస్తున్న 43 మంది కూలీలు లోపల చిక్కకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారుల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.  ఎట్టకేలకు కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ టన్నెల్‌ శిథిలాల తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు రూ.20 కోట్లు వెచ్చించనున్నట్లు  స్విస్ కంపెనీ వెల్లడించింది. ఈ శిథిలాలను సిల్క్యారాలోని డంపింగ్ గ్రౌండ్‌కు తరలించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నామని స్విస్ కంపెనీ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement