Tunnel
-
పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!
ఇది ప్రపంచంలోనే పొడవాటి రోడ్డు సొరంగం. ఆస్ట్రేలియాలోన సిడ్నీ నగరంలో ఉన్న ఈ సొరంగం పొడవు ఏకంగా 26 కిలోమీటర్లు. ఈ సొరంగ రహదారి పేరు ‘వెస్ట్ కనెక్స్’ ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం, న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఈ సొరంగ నిర్మాణం చేపట్టి, గత ఏడాది నవంబరు 26 నాటికి దీనిని పూర్తి చేశాయి. ఉభయ ప్రభుత్వాలూ హోమ్‌బుష్–కింగ్స్గ్రోవ్ల మధ్య చేపట్టిన 33 కిలోమీటర్ల మోటారు రహదారిలో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మించాయి. ఈ రహదారి నిర్మాణం పనులు 2016 డిసెంబర్ 20న ప్రారంభించగా, సొరంగం సహా మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. దీని నిర్మాణానికి 4500 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల ఖర్చు (రూ.2.60 లక్షల కోట్లు) జరిగింది. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పొడవాటి సొరంగ రహదారిగా రికార్డులకెక్కింది.(చదవండి: మనం ధరించే డ్రెస్‌కి ఇంత పవర్ ఉంటుందా..?) -
హెజ్బొల్లా టన్నెల్ వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య దాడులు, ప్రతిదాడుల ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో.. హెజ్బొల్లా టన్నెల్‌కు సంబంధించి ఇనుప తలుపులు, ఫంక్షన్ రూమ్‌లు, ఏకే 47 రైఫిళ్లు, బెడ్రూం, బాత్రూం, స్టోర్ రూం, జనరేటర్, వాటర్ ట్యాంక్, ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లో వంద మీటర్ల మేర ఉన్న ఈ సొరంగంలో హెజ్బొల్లా సామగ్రి దృష్యాలను ఇజ్రాయెల్ ఆర్మీ చూపించింది. అయితే.. ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.INSIDE LOOK into a Hezbollah terrorist tunnel in southern Lebanon: pic.twitter.com/h3ZastZHxC— Israel Defense Forces (@IDF) October 15, 2024 ‘‘దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హెజ్బొల్లా గ్రూప్ ఏం చేస్తోందో చూడడానికి మేము సరిహద్దును దాటి అక్కడి వెళ్తున్నాం. ఉత్తర ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 హమాస్ తరహా దాడికి హెజ్బొల్లా టన్నెల్‌ను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది’’ అని వీడియో ఓ ఇజ్రాయెల్ సైనికుడు మాట్లాడటం వినవచ్చు.ఇక.. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తనంతరం గాజాపై ఇజ్రయెల్ సైన్యం భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్బొల్లా తమ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇక.. లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్.. సరిహద్దుల్లో వాటి స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. -
వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!!
మనం తెలియని ప్రదేశాలలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనలో మనకే చిన్నగా భయం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయం మరింత రెట్టింపవుతుంది. ప్రయాణించే దారిలో ఎలాంటి సంఘటనలు తారసపడుతాయో అనే సందేహం మనసులో ఏదో మూలన ఉండకమానదు. అదేవిధంగా ఈ వీడియోలో ఎదురైన ఈ సొరంగమార్గం కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి!వామ్మో ఇది పాతాళమేనా అన్నట్లుగా..ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా తనకు ఓ కొండ ఎదురైంది. ఆ కొండ దాటడానికి సొరంగ మార్గం ఒక్కటే దిక్కు. చేసేదేమిలేక కారుని ముందుకు నడిపాడు. కారు ఆ గుహ మార్గంలోకి ప్రయాణించింది. అంతా చీకటిమయం. ఎదురుగా ఏముందో కనిపించే వీలులేదు. కారుకు ఉన్న లైట్లే అతని ధైర్యం. ఆ మార్గం కైలాసం ఆడుతున్నట్లుగా అన్నీ వంక మలుపులే. అక్కడక్కడా మనసు కుదుటపడేలా.. లెఫ్ట్, రైట్ టర్నింగ్ సంకేతాలు. ఇవేగానీ లేకపోతే ముందుకు సాగకపోవడమో, ప్రమాదం జరగడమో ఖాయం.వెళ్తున్నా కొద్ది సొరంగ మార్గం తనకు తానే దారి పొడవు పెంచుతున్నట్లుగా సాగుతూనే ఉంది. ఆ గుహలోంచి బయట ఎప్పుడు పడాల్లా అనేవిధంగా భయంతో కూడిన ఆతృత. కారు పైభాగం గుహకు తాకుతున్నట్లుగా ఆలోచన. చిమ్మని చీకటి... మరోసారి మళ్లీ ఈ దారిలోకి వద్దామా? బయటికి మార్గం ఉందా? లేక ఎక్కడైనా ఇరుక్కుపోతానా? వెనక్కి వెళ్లలేం! ముందుకే తప్ప మరేదిక్కులేదు! ఇప్పుడెలా? వెళ్తున్నానుగా... అనే ఆలోచనలు లోలోనే దిగమింగుతూ తేరుకునేలోపు సొరంగమార్గం ముగిసిపోయి.., బయటిదారి ఎదురయ్యేసరికి ప్రాణం గుప్పిట్లో దాచుకుని హమ్మయ్య!! అనుకున్నాడు ఆ డ్రైవర్. View this post on Instagram A post shared by Usha Vardhan (@usha.vardhan.96) ఇవి చదవండి: ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ -
‘ప్రమాద సొరంగం’ వెలుపల ఆలయ నిర్మాణం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ వెలుపల బాబా బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని నవయుగ కంపెనీ ప్రారంభించింది. నాడు సిల్క్యారా సొరంగంలో కార్మికులు చిక్కుకున్న నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందం బౌఖ్‌నాగ్ దేవతను వేడుకున్నారట.గత ఏడాది నవంబర్‌లో సిల్క్యారా టన్నెల్లో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి సుమారు మూడు వారాల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జిల్లా యంత్రాంగంతోపాటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, విదేశీ సంస్థల నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.దీని తరువాత కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాడు బౌఖ్‌నాగ్ దేవత పూజారి సొరంగం వెలుపల ఆలయాన్ని నిర్మించాలని రెస్క్యూ టీమ్‌ని కోరాడు. ఈ నేపధ్యంలో తాజాగా నవయుగ కంపెనీ బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని కంపెనీ పీఆర్వో జీఎల్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదితోపాటు పిల్లర్ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. -
ఉత్తరకాశీ సొరంగంలో మరో ప్రమాదం.. ఒకరు మృతి!
ఉత్తరకాశీలోని యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం బయటనున్న లోడర్ మిషన్ ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కూలీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారా సొరంగం వెలుపల పనులలో ఉన్న లోడర్ యంత్రం అకస్మాత్తుగా సొరంగం వెలుపలి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో మెషిన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న ఇతర కార్మికులు బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించేలోగానే అతను మృతి చెందాడు. మృతుడిని పితోర్‌గఢ్ జిల్లా గోవింద్ కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 2023, నవంబరులో ఇదే సొరంగంలో జరిగిన ప్రమాదంలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత భారీ రెస్క్యూ ఆపరేషన్‌తో వీరిని బయటకు తీసుకువచ్చారు. -
ఉత్తరకాశీ సొరంగం శిథిలాల తొలగింపునకు రూ. 20 కోట్ల ఖర్చు!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి చాలా కాలం గడిచింది. ఈ ప్రమాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. త్వరలో ఈ సొరంగంలో శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఒక నివేదిక వచ్చింది. ఉత్తరకాశీ సొరంగం నిర్మాణ సమయంలో కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయింది. ఆ సమయంలో సొరంగంలో పనిచేస్తున్న 43 మంది కూలీలు లోపల చిక్కకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారుల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ టన్నెల్ శిథిలాల తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు రూ.20 కోట్లు వెచ్చించనున్నట్లు స్విస్ కంపెనీ వెల్లడించింది. ఈ శిథిలాలను సిల్క్యారాలోని డంపింగ్ గ్రౌండ్‌కు తరలించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నామని స్విస్ కంపెనీ తెలిపింది. -
'అరుంధతి' సినిమాని తలపించే కథ..!
సినిమాని తలపించే కథ ఈ సొరంగం స్టోరీ. వాస్తవమో కాదో తెలియదు కానీ. ప్రజలు మాత్రం అందులోకి అడుగుపెట్టాలంటే హడలిపోతారు. చూసేందుకు లోపలకి వెళ్తే బాగుండును అనేంత అందంగా ఉంటుంది. తీరా వెళ్తే మాత్రం అంతే సంగతులు. బయటి నుంచి చూడటానికి రంగురంగులుగా బాగానే కనిపిస్తుంది గాని, ఈ సొరంగంలోకి అడుగు పెట్టాలంటేనే జనాలు వణికిపోతారు. ఇందులో దయ్యాలు సంచరిస్తుంటాయని, ఇందులోకి వెళ్లే వారిని అవి ముప్పుతిప్పలు పెడతాయని స్థానికులు చెబుతారు. అమెరికాలోని టెనసీ రాష్ట్రం కింగ్స్పోర్ట్ సమీపంలో ఉంది. దాదాపు వందేళ్ల కిందట దీనిని సెన్సాబాగ్ అనే ఇంజినీర్ నిర్మించాడు. ఆయన పేరు మీదనే ఇది సెన్సాబాగ్ టన్నెల్‌గా పేరుపొందింది. ఒక దుండగుడు తనను వెంటాడుతున్న పోలీసుల నుంచి తప్పించుకుని సురక్షితంగా పారిపోవడానికి సెన్సాబాగ్ మనవరాలిని కిడ్నాప్ చేసి, ఈ సొరంగంలోనే దాక్కున్నాడు. పసిపిల్లకు అపకారం జరగకూడదని పోలీసులు అప్పటికి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ దుండగుడు ఇక పసిపిల్లతో తనకు పనిలేదని భావించి ఆమెను చంపేసి, అక్కడే పడేశాడు. ఇది జరిగిన కొంతకాలానికి సెన్సాబాగ్ కూడా మరణించాడు. అప్పటి నుంచి ఈ సొరంగంలో సెన్సాబాగ్, ఆయన మనవరాలి ఆత్మలు సంచరిస్తున్నాయని స్థానికుల కథనం. ఈ సొరంగంలోంచి ప్రయాణిస్తుంటే ఒక్కోసారి కారు ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోతుందని, సెన్సాబాగ్ ఆత్మ కనిపిస్తుందని, పసిపిల్ల ఏడుపు వినిపిస్తుందని కూడా చెబుతారు. (చదవండి: గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!) -
గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!
ఈ భూమి కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని మిస్టరీల్లా ఉంటాయి. అవి ఎవరు ఏర్పాటు చేశారన్నది కూడా కనిపెట్టలేం. కానీ వాటి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం ఇంతలా ఉండేదా అనిపిస్తుంది. అలాంటి అంతుచిక్కని మిస్టరీలాంటి సొరంగాలే ఇవి. చూసేందుకు గుహల్లా ఉంటాయి. అయితే ఇందులో ఎవరుండేవారన్నది ఓ మిస్టరీ. కానీ లోపల ఉండే భూగర్భ నగరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడంటే.. దక్షిణ అమెరికాలో బ్రెజిల్ భూభాగంలో రెండు సొరంగాలును గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇవి చూడటానికి గుహల్లా కనిపించే సొరంగాలు మాదిరిగా ఉన్నాయి. అయితే ఎవరూ వీటిని చేశారనేది తెలియరాలేదు. అయితే ఇవి మానవులకు సంబంధించిన సొరంగాలా లేక జంతువులు వాటి సంరక్షణ కోసం చేసుకునేవా అనేది మిస్టరీగా ఉంది. అయితే దక్షిణ అమెరికాలో పాంపతేరియంకి చెందిన హోల్మెసినా అనే ఒక అంతరించిపోయిన జంతువు తాబేలు మాదిరి షెల్‌తో పెద్దగా ఉండేదని, అదే ఈ సొరంగాలు చేసి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అలా ఈ సొరంగాలు ఏ జాతుల జంతువులకు సంబంధించిన అని పరిశోధను చేయగా..పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ అధ్యయనంలో దక్షిణ బ్రెజిల్,అర్జెంటీనా అంతటా దాదాపు 15 వందలకు పైగా ఇలాంటి సొరంగాలను గుర్తించారు పరిశోధకులు. అలాగే 2009లో ఒక రైతు బ్రెజిల్‌లోని దక్షిణ ప్రాంతంలో తన మొక్కజొన్న పొలం గుండా వెళ్తున్నప్పుడూ ఇలాంటి సొరంగాన్ని చూసినట్లు తెలిపాడు. తాను ఆ టైంలో ట్రాక్టర్‌పై అటువైపుగా వెళ్తుండగా ట్రాక్టర్ ఒకవైపుకి ఒరిగిపోయి ఆగిపోయిందని, అప్పుడే వీటిని గుర్తించానని చెప్పుకొచ్చాడు. దీంతో పరిశోధకుల బృందం ఆ దిశగా అధ్యయనం చేయగా, ఆ సొరంగా మొక్కజొన్న పొలం నుంచి రైతు ఇంటి కింద ఉన్న భూగర్భం వరకు ఉండటం చూసి కంగుతిన్నారు. దాదాపు రెండు మీటర్లు ఎత్తు, రెండు మీటర్ల వెడల్పూ, 15 మీటర్ల పొడవాటి పొలం మీదుగా రైతు ఇంటి వరకు సొరంగం ఉన్నట్లు తెలిపారు. అయితే గోడలపై ఉన్న లోతైన పంజాగుర్తులను చూసి నాటి మానవుల గుర్తులే సూచిస్తున్నాయన్నారు. ఇక ఆ పరిశోధకులు బృందలోని ఓ శాస్త్రవేత్త ఇది దాదాపు 10 వేల ఏళ్ల నాటిదని నిర్థారించారు. ఇందులో సుమారు 20 వేల మంది ఉండేవారని అన్నారు. అయితే ఇలా సొరంగం తవ్వే ఇజనీరింగ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సొరంగా 280 అడుగు దిగువన ఉంది. బహుశా క్రీస్తూ పూర్వం 1200 ఏళ్ల క్రితం ఫిజియన్లు అనే పూర్వీకులు ఉండే వారని భావిస్తున్నారు. వారు గృహ జీవితం ఇలా ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కొందరూ మాత్రం రోమన సామ్రాజ్యంలో క్రైస్తవ నివాసులు గుహ వ్యవస్థ ఇలా ఉండేదని, ఇవి వారి ప్రార్థన మందిరాలుగా ఉండేవని అన్నారు. కాలక్రమేణ వైన్, ఆలివ్ వంటి వాటిని తయారు చేసే ప్రదేశాలుగా మారినట్లు భావిస్తున్నారు. బహుశా అప్పటి ప్రజలకు ఈ భూగర్భ నగరం భూతల స్వర్గంగా ఉండి ఉండొచ్చు అందువల్లే ఇలా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చన్నారు. అలాగే నాటి ప్రపంచంపై దండయాత్రలు జరిగేవి కాబట్టి నాటి విజేతలు, ఆక్రమణదారులు వీటిని ఉపయోగించి ఉండొచ్చు అని పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే చివరికి సొరంగాలు ఏంటన్నవీ శాస్తవేత్తలు నిర్థారించలేకపోయారు. దీంతో అవి ఓ అంతు చిక్కని మిస్టరీ సొరంగాలుగా మిగిలిపోయాయి. These tunnels were once believed to hide religious fortunes deep in their chambers, but the real treasure is found in who - or what - created them. In 2009, a farmer was driving through his corn field in the south of Brazil when he suddenly felt his tractor sink and lurch to… pic.twitter.com/leRQyDpkA5 — Fascinating (@fasc1nate) March 18, 2024 (చదవండి: రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!) -
PM Modi: ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ ప్రారంభించిన మోదీ
ఈటానగర్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ హయాంలో పాలనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులను తాను పదేళ్లలో చేసిచూపించినట్టు మోదీ కామెంట్స్ చేశారు. కాగా, టన్నెల్ ప్రారంభోత్సవం అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఘన విజయం సాధించనుందని అర్థం అవుతోంది. ఎన్నికల్లో విజయం కోసం నేను పనిచేయను. ప్రజల కోసమే పనిచేస్తాను. యూపీఏ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో రూ.55వేల పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi inaugurates the Sela Tunnel. pic.twitter.com/hSeI30lhqk — ANI (@ANI) March 9, 2024 70 ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధిని నేను పదేళ్లలోనే చేసి చూపించాను. అష్ట లక్ష్మీ పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. పర్యాటక రంగం విషయంలో దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో దృఢమైన సంబంధాలున్నాయి. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాము అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు అనే అంశాన్ని కూడా మోదీ ఇక్కడ గుర్తుచేశారు. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, "Our vision is that of 'Ashta Lakshmi' for the development of the Northeast. Our Northeast is becoming a strong link for trade and tourism with South Asia and East Asia." pic.twitter.com/c1PyO37H7M — ANI (@ANI) March 9, 2024 కాగా, అంతకుముందు ప్రధాని మోదీ.. అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏనుగుపై సఫారీ చేశారు. నేషనల్ పార్క్‌లో తిరుగుతూ కాసేపు అక్కడే సమయం గడిపారు. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, You must have heard of 'Modi Ki Guarantee'. You will realize its meaning once you reach Arunachal. The entire Northeast is a witness to this. I laid the foundation of the Sela Tunnel here in 2019, and today… pic.twitter.com/tqjnNd2fh6 — ANI (@ANI) March 9, 2024 ఈ టన్నెల్ విశేషాలు ఇవే.. సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్-తవాంగ్(BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్-1 సింగిల్ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. దీంతో తవాంగ్-దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ టన్నెల్ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్ వ్యవస్థలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం కలిగింది. చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది. -
అటల్ టన్నెల్లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్!
హిమాచల్ ప్రదేశ్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హిమాచల్‌తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు. రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్‌లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
ఇలా ‘వెలిగొండ’గా మరో కల సాకారం
నాడొక కల.. నేడొక నిజం.. అదే వెలిగొండ ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టులో మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన ఆయన.. రెండో టన్నెల్ తవ్వకం పనులు మంగళవారం పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం ద్వారా సీఎం జగన్ చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ రెండు సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్నారు. దీంతో వచ్చే సీజన్లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, అమరావతి వరదాయినికి మహానేత వైఎస్ శ్రీకారం.. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల సాగర్‌లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో దివంగత సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004, అక్టోబర్ 27న ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా.. 23 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులనూ చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. వెలిగొండ.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను జలవనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయామీటర్ల వ్యాసార్థంతో, రెండో టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. నల్లమల పర్వతశ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో పశ్చిమాన విస్తరించిన వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియల వద్ద కొండల మధ్యన ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ 378.5 మీటర్లు, 356 మీటర్లు, 587 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటుంది. అతితక్కువ వ్యయంతో ఇన్ని టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్‌ను నిర్మించడాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలి‘కొండంత’ చిత్తశుద్ధి.. ఇక వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 56 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావంవల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తిచేయించారు. రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో.. 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి 7.698 కి.మీల పొడవున రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. హెడ్ రెగ్యులేటర్ పనులు సైతం పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. సీఎం రమేష్‌కు కట్టబెట్టిన రెండో సొరంగం మిగిలిన పనులను రద్దుచేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ఇక తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ఇలా ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.1,046.46 కోట్లను సీఎం జగన్ ఖర్చుచేశారు. ప్రతిపైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. బాబు దోపిడీ కొండంత.. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయంచేశారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించకపోవడం చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. అలాగే, 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వచ్చే సీజన్లో నీరు విడుదల ఇక ఈ ప్రాజెక్టు అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్య ప్రాణులకు సైతం ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని నిర్మాణ సంస్థ మేనేజర్ పి.రాంబాబు తెలిపారు. అలాగే, కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సహకారంతో పనులు చేపట్టామని ఆయన చెప్పారు. జలవనరుల శాఖ ఈఈ పురార్ధనరెడ్డి వెలిగొండ టన్నెల్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్లో నీటిని ఈ సొరంగాల ద్వారా విడుదల చేస్తామని చెప్పారు. మాది చెప్పింది చేసే ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా మోసపు హామీలు చెప్పటం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేసే ప్రభుత్వం మాది. మాటిస్తే మడమ తిప్పని నైజం మా సీఎం జగనన్నది. గతంలో సంక్రాంతి, దసరా, ఉగాదికి పూర్తిచేస్తాం అని టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. అలాకాకుండా.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి నిధుల మంజూరుతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షలతో ఈ ప్రాంత వాసుల కోసం పాటుపడి ఈరోజు ప్రాజెక్టు పూర్తి కావటానికి దోహదపడిన సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటారు. త్వరలోనే సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మంత్రి రికార్డు సమయంలో పూర్తి.. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడంలో సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి వెలిగొండ ప్రాజెక్టు నిదర్శనం. మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13 నాటికి.. రెండో సొరంగాన్ని రికార్డు సమయంలో మంగళవారం నాటికి పూర్తిచేశాం. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తిచేయడానికి సీఎం జగన్ దిశానిర్దేశం ఎంతో దోహదం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి, ఆయకట్టుకు నీళ్లందిస్తాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వెలిగొండను ఆయన తనయుడు పూర్తిచేసి, జాతికి అంకితం చేస్తుండటం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. – మురళీనాథ్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్, వెలిగొండ ప్రాజెక్టు -
రావికమతం మండలం కొమిర వద్ద బయట పడిన సొరంగం
-
ఆ చెక్కులు వెనక్కిచ్చేస్తాం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా వద్ద సొరంగంలో గత నెలలో 17 రోజుల పాటు చిక్కుబడిపోయిన 41 మంది కార్మికు లను రక్షించడంలో కీలకమైన 12 మంది ర్యాట్–హోల్’ గని కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ‘‘అన్ని రకాల యంత్రాలు విఫలమైన వేళ.. మేం ఎలాంటి షరతులు పెట్టకుండా ప్రాణాలనొడ్డి మార్గం తయారు చేశాం. సొరంగం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా వెలుపలికి తెచ్చాం. ఇందుకుగాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేవలం రూ.50 వేల చొప్పున చెక్కులిచ్చింది. మాకీ ప్రతిఫలం సరిపోదని చెప్పాం. అధికారుల నుంచి, ఇప్పటికీ జవాబులేదు. ఈ చెక్కులు మాకొద్దు. మేమందరం వాపసు చేస్తాం’’ అని మైనర్లలో ఒకరైన వకీల్ హసన్ పీటీఐకి తెలిపాడు. ప్రభుత్వం తమకు శాశ్వత ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశాడు. -
ప్రాణాలకు తెగించి పనిచేశాం.. కానీ!’ ర్యాట్ హోల్ మైనర్ల ఆవేదన
ర్యాట్ హోల్ మైనర్స్.. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదానికి ముందు ఈ పేరును ఎవరూ ఎక్కువగా విని ఉండరు. కానీ టన్నెల్లో ఇరుకున్న కార్మికులను రక్షించడంలో వీరు చేసిన కృషి తర్వాత అందరికీ సుపరిచితులుగా మారారు. కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ర్యాట్ హోల్ మైనర్లది కీలక పాత్ర. ఈ క్రమంలోనే వీరి సేవలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గురువారం 12 మంది ర్యాట్ హోల్ మైనర్లను ఒక్కొక్కరికి రూ. 50,000 చెక్కులతో సత్కరించారు. అయితే ర్యాట్ హోల్ మైనర్స్.. తాజాగా తమ నిరాశను వ్యక్తం చేశారు. సీఎం తమకు ఇచ్చిన రూ. 50 వేల చెక్కులను క్యాష్‌గా మార్చుకోవడానికి నిరాకరించారు. కార్మికులను రక్షించడంలో తాము పడ్డ కష్టానికి ప్రభుత్వ సాయానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల విషయంలో తాము నిరాశ చెందినట్లు తెలిపారు. ఆ చెక్కులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. యంత్రాలు కూడా చేయని పనిని తాము పూర్తి చేశామని.. ఎటువంటి షరతులు పెట్టకుండా మా ప్రాణాలను పణంగా పెట్టి శిథిలాలను మాన్యువల్‌గా డ్రిల్ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన పనిని అభినందిస్తున్నాము కానీ మాకు అందించిన మొత్తంతో సంతృప్తి చెందలేదని ర్యాట్ హోల్ మైనర్ల బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ర్యాట్ హోల్ మైనర్ల పాత్ర వీరోచితమైనదని, కానీ వారు ప్రభుత్వం నుంచి పొందిన డబ్బు సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్మానించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. తమకు అందించిన చెక్కులను క్యాష్ చేయకూడదని సమిష్టిగా నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ‘చెక్కులు అందజేసిన రోజే ముఖ్యమంత్రికి మా అసంతృప్తిని తెలియజేశాను. మా విషయంపై రెండురోజుల్లో ప్రకటన చేస్తానని అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగివచ్చాం. ఆ హామీ నిలబెట్టుకోకుంటే.. చెక్కులను తిరిగి ఇస్తాం. ఆపరేషన్‌లో సహకరించిన మైనర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాశ్వత ఉద్యోగాలు తాము ఆశిస్తున్నాం’ అని చెప్పారు. కాగా ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి నవంబర్ 12వ తేదీన 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసినా.. విదేశాల మిషన్లతో ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగి వారిని రక్షించారు. -
IDF: హమాస్ మాస్టర్ ప్లాన్ భగ్నం?
ఇజ్రాయెల్ ఆసక్తికర వీడియో ఫుటేజీ ఒకటి విడుదల చేసింది. గాజా స్ట్రిప్ కింద హమాస్‌కు చెందిన భారీ సొరంగం కనుగొన్నట్లు ఆదివారం ప్రకటించింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ టన్నెల్.. కీలకమైన ఎరెజ్ ప్రాంత సరిహద్దు ప్రాంతానికి అనుసంధానమై ఉందని తెలిపింది. అంతేకాదు.. ఇజ్రాయెల్‌పై దాడుల కోసం హమాస్ దాచుకున్న భారీ ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర గాజా ఎరెజ్ సరిహద్దు వద్ద 400 మీటర్ల దూరం నుంచి మొదలైన ఈ టన్నెల్.. మొత్తం నాలుగు కిలోమీటర్ల దూరం గాజాకు కలిపి ఉంది. చిన్నసైజు వాహనాలు సైతం ఆ టన్నెల్ గుండా ప్రయానించగలవని, మందమైన గోడలతో ఏర్పాటు చేసిన ఈ సొరంగంలో కొంత భాగం కాంక్రీట్‌తో ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ(ఐడీఎఫ్) తన ప్రకటనలో తెలిపింది. EXPOSED: The biggest Hamas terrorist tunnel discovered. This massive tunnel system branches out and spans well over four kilometers (2.5 miles). Its entrance is located only 400 meters (1,310 feet) from the Erez Crossing—used by Gazans on a daily basis to enter Israel for work… pic.twitter.com/RcjK5LbvGL — Israel Defense Forces (@IDF) December 17, 2023 టన్నెల్ గుండా రవాణా సదుపాయంతో పాటు విద్యుత్ సరఫరా, వెంటిలేషన్ సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆర్మీ ఒక వీడియోను సైతం విడుదల చేసింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో హమాస్ జరిపిన దాడుల ప్రధాన సూత్రధారి మహమద్ యహ్యా నేతృత్వంలోనే ఈ టన్నెల్ ఏర్పాటు అయ్యిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ టన్నెల్ కోసం భారీ సంఖ్యలో ఖర్చు అయ్యి ఉంటుందని అంచనా వేస్తోంది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ సోదరుడే ఈ మహమద్ యహ్యా. ఇదిలా ఉంటే.. డిసెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 800 వద్ద సొరంగాల్ని కనిపెట్టినట్లు, అందులో 500 టన్నెల్స్‌ని నాశనం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించుకుంది. -
అవుకు టన్నెల్ 2 అంటే?
మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుకు టన్నెల్ 2 ను ప్రారంభించారు మనం వార్తల్లో చదువుకున్నాం.. అసలు ఇదేంటి? ఇది ఎక్కడుంది? దీని వల్ల ఉపయోగం ఏంటి?కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ఉండిపోతుంది.. ఎక్కువగా ఉంటే ఆ వాటర్ ను మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండదు.. అది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ అక్కడి నుండి ప్రకాశం బ్యారేజీ తర్వాత సముద్రంలో కలిసిపోతుంది...శ్రీశైలం డ్యాం కెపాసిటీ మించి వరదలు వచ్చినప్పుడు అవి సముద్రం పాలు కాకోకుండా దానిని మనము కరువు జిల్లాలైన రాయలసీమకు మళ్ళి ఇస్తే ఎలా ఉంటుంది???? అనేదానికి రూపకల్పనే హంద్రీనీవా సుజల స్రవంతి మరియు గాలేరు నగరి ప్రాజెక్టులు..శ్రీశైలం బ్యాక్ వాటర్ కుడికెనాలు నుంచి ఈ ప్రాజెక్టులు మొదలవుతాయి. భానకచర్ల రెగులేటర్ ద్వారా వెలుగోడు, బ్రహ్మ సాగరం, సోమశిల,కండలేరు ఆ విధంగా చెన్నైకి వాటర్ వెళ్ళిపోతుంది.. దానిని తెలుగు గంగ ప్రాజెక్టు అని అంటారుపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కొంత తెలుగుగంగ కు, కేసీ కెనాల్ కు కొంత గోరుకల్లు రిజర్వాయర్‌కు వెళుతుంది.. అక్కడ నుంచి అవుకు రిజర్వాయర్‌కు వచ్చి, అవుకు రిజర్వాయర్ నుంచి మైలవరం రిజర్వాయరు అక్కడినుంచి గండికోట రిజర్వాయర్ కు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ధర్మవరం, నాగసముద్రం అలా అనంతపురం వైపుకు వెళ్తుంది.. గండికోట నుంచి కడప చిత్తూరు కు ఈ వాటర్ వామి కొండ, సర్వారాజసాగర్ అలా 9 రిజర్వాయర్ల ద్వారా ఈ నీరు వెళ్ళిపోతుంది...హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ గా అనంతపురం, కర్నూలు జిల్లాలకు వెళ్తే ఈ గాలేరు నగరి ప్రాజెక్టు నంద్యాల కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలకు నీటిని సరఫరా చేస్తుంది... 265,000 ఎకరాలకు (1,070 కిమీ2) సాగునీరు అందించడమే కాకుండా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని గాలేరు నగరి ప్రాజెక్టును నిర్మించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువలో ఈ అవుకు సొరంగం కీలకమైనదని, శ్రీశైలంలో వరదలు వచ్చిన 15 రోజుల్లో గాలేరు-నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్‌ను నింపేందుకు ఈ సొరంగం ఉపయోగపడుతుంది. శ్రీశైలం వరదల సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను మళ్లించాలన్నది లక్ష్యం.దీని వల్ల కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 640 గ్రామాల్లోని 20 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో నీటిపారుదల సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. అవుకు లో రెండు సొరంగాలు ఎందుకు??? మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. అవుకు లో మూడవ సొరంగం కూడా నిర్మాణం అవుతుంది!!! ముఖ్యమంత్రి జగన్ గారు రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఈ విధంగా కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు ఆ నీటిని సముద్రంలో కలవనీయకుండా ఒడిసి పట్టి మనం గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా అవుకు టన్నెల్స్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు నీటిని మల్లించి అక్కడ నుంచి మనం గండికోట రిజర్వాయర్‌కు మళ్ళీ ఇస్తాం.. ఇక్కడ నుండి గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా కడప చిత్తూరు నెల్లూరు అనంతపురం జిల్లాలకు తాగునీరు సాగునీరు లభ్యమవుతుంది... ఒకటే టన్నెల్ సొరంగం ఉంటే కేవలం 5000 క్యూసెక్కుల నీరు మాత్రమే మళ్ళించగలరు అదే మనము రెండు మూడు సొరంగాలు ద్వారా దాదాపు 20వేల క్యూసెక్కుల నీటిని మరలిస్తూ 30 దినాలలో 38 టీఎంసీల నీటిని మనం గండికోట రిజర్వాయర్ వైపు మళ్ళించవచ్చు.. అందుకనే రెండు టన్నెల్ లు కట్టారు.. మూడవ టన్నెలు కూడా రాబోతుంది... డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు -
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
ఢిల్లీ వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ (మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే ఉష్ణమండల తుఫాను)కారణంగా ఇక్కడి వాతావరణంలో వేడి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అదే సమయంలో వాయు కాలుష్య స్థాయిలో కూడా ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. ఇక్కడి ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 388, అశోక్ విహార్‌లో 386, లోధి రోడ్లో 349, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏక్యూఐ 366గా నమోదయ్యింది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎండీ)లో శనివారం ఉదయం ఒక మోస్తరు పొగమంచు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 28 అనంతరం గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది. నవంబర్ 2 నుంచి కాలుష్య నివారణ చర్యలు చేపట్టిన దరిమిలా గాలి నాణ్యతలో మెరుగదల చోటుచేసుకుంది. అనవసరమైన నిర్మాణ సంబంధిత కార్యకలాపాలు నిషేధించడం, కాలుష్య కారక వాహనాలు రోడ్లపైకి రావడాన్ని నిషేధించడంతో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం -
ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం
ఉత్తరకాశీ జిల్లాలోని మరో సొరంగం స్థానికులను భయానికి గురిచేస్తోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ఉబికివస్తుండంతో ఇక్కడి సాగునీటి కాలువ, పంట భూములు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇటీవలే కుప్పకూలిన టన్నెల్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (యూజేవీఎన్‌ఎల్) తెలిపింది. ఉత్తరకాశీలోని మనేరి భళి-2 ప్రాజెక్ట్‌లో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసులో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటుంది. ధారసు బ్యాండ్ సమీపంలోని మహర్‌గావ్‌లోని సొరంగం నుండి నీటి లీకేజీ రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇది క్రమంగా పెరుగుతోంది. యూజేవీఎన్‌ఎల్ ఇప్పటికే దీని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా లీకేజీ అదుపులోకి రావడం లేదు. గత రెండేళ్ల నుంచి ఇక్కడ నీటి లీకేజీ వేగంగా పెరుగుతోందని గ్రామ పెద్ద సురేంద్రపాల్ చెప్పారు. ఫలితంగా సాగునీటి కాలువ, పలు పంట భూములు దెబ్బతిన్నాయని, పలు చోట్ల భూమి కోతకు గురవుతోందని అన్నారు. ఈ సొరంగానికి తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. కాగా మనేరి భళి సొరంగం నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు చేస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని యూజేవీఎన్‌ఎల్ ఎండీ సందీప్ సింఘాల్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఇటలీ ప్రధానితో భారత ప్రధాని దోస్తీ చేస్తే.. -
కార్మికులను కాపాడాం... గుణపాఠాలో!
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిరక్షణ చర్య విజయవంతంగా ముగిసింది. పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో దాదాపు 17 రోజులపాటు చిక్కుకున్న కార్మికులందరినీ భారతీయ, విదేశీ నిపుణులు ఉమ్మడిగా సురక్షితంగా బయటికి తీయగలిగారు. హిమాలయ ప్రాంతంలో ఒక పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. సిల్క్యారా సొరంగంలో జరిగిన విపత్తు... పెళుసైన కొండ ప్రాంతాలలో చేపట్టే భారీ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కఠినతరమైన భూభాగంలో కార్యకలాపాల భద్రతపైనా, అలాంటి ప్రాజెక్టులకు అవసరమైన విపత్తు సంసిద్ధతపైనా కూడా ప్రశ్నలను లేవనెత్తింది. హిమాలయ పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని నష్టం నుండి రక్షించడానికి ఈ సొరంగ ప్రమాద ఘటన మరో మేల్కొలుపు కావాలి. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి ముఖ్యమైన మతపరమైన పుణ్యక్షేత్రాలను కలుపుతూ, అన్ని వాతావరణాల్లో పనిచేసే నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలనే లక్ష్యంతో, ప్రతిష్టా త్మకమైన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా సొరంగాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును పర్యావరణ సంఘాలు విమర్శించాయి. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాయి. అనేక ప్రభుత్వ కమిటీలు ప్రాజెక్టును వివిధ కోణాల్లో పరిశీలించి, దానికి అనుమతిని ఇచ్చాయి. అయితే ప్రస్తుత సొరంగ ప్రమాద ఘటన హిమాలయ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడంపై అన్ని సందేహాలను, భయాలను పునరుద్ధరించింది. సొరంగాలు ఉత్తమ మార్గమే అయినా... అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, పర్యావరణ హానిని తగ్గించడానికి సొరంగ నిర్మాణం ఒక మంచి ఎంపికగా కనిపి స్తున్నప్పటికీ, సొరంగం పరిమాణం చాలా ముఖ్యమైనది. పొడవాటి సొరంగాల వల్ల కలిగే నష్టాన్ని కొండలు తట్టుకోగలవా? చిన్న సొరంగాలను నిర్మించడంపై ప్రాజెక్ట్ బృందాలు ఆలోచించాలి. రహదారులు లేదా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం పొడవైన నిర్మాణాలను నిర్మించే ముందు సొరంగ తవ్వకం కలిగించే పర్యావరణ ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయాలి. అనాలోచితంగా చేసే సొరంగ నిర్మాణం భూగర్భ జల వనరులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడతాయి కూడా. విశాలమైన సొరంగాల తయారీ కోసం చేసే పేలుళ్లు ప్రమాదకరమైన పర్యావరణ పరిణామాలకు కారణమవుతాయి. విపత్తు సంసిద్ధతతోపాటు, నిర్మాణ సంస్థలు తీసుకునే భద్రతా జాగ్రత్తలు మరొక సమాధానం లేని ప్రశ్నగా ఉంటున్నాయి. సిల్క్యారా ప్రాజెక్ట్‌లో ప్రమేయం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థల వైపు నుండి లోపాలు ఉంటే వాటిని పూర్తి స్థాయి విచారణ మాత్రమే వెల్లడిస్తుంది. కొండల్లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు, హైవేలు, పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దాదాపు రెండు దశాబ్దాలుగా చర్చలు సాగుతున్నాయి. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో పర్యావరణ సంఘాల సుదీర్ఘ ఆందోళన తర్వాత, రెండు భారీ ప్రాజెక్టులను నిలిపివేశారు. పైగా కొత్త, పెద్ద ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదు. అయితే గత దశాబ్దంలో, కొండలపై నిర్మాణ కార్యకలాపాలను పునరుద్ధరించారు. భద్రతా సమస్యలు, పర్యావరణ సమీక్షల కోసం పిలుపులను విస్మరించారు. తప్పనిసరి పర్యావరణ ప్రభావ అంచనా వంటి వివిధ చట్టాలు, నిబంధనలను సంబంధిత ఏజెన్సీలు, ప్రభుత్వాలు తీవ్రంగా పలుచన చేసిపడేశాయి లేదా దాటవేశాయి. ఈలోగా, వాతావరణ మార్పుల కారణంగా పర్యా వరణ ప్రమాదాలు పెరిగాయి. దీని ఫలితంగా తీవ్రమైన వాతావరణ ఘటనలు, విపత్తులు సంభవిస్తాయి. సంసిద్ధత ఉందా? కొండల్లోని ప్రాజెక్టుల భద్రత, విపత్తులను ఎదుర్కొనే సంసి ద్ధతను పూర్తిగా పరిష్కరించడం అనేది మరొక ప్రధాన సమస్య. సొరంగ ప్రమాదాలకు గల కారణాలపై శ్రద్ధ చూపడం, నిర్మాణ స్థలాల వద్ద భద్రతను నిర్ధారించడం చాలా కీలకం. గతంలో ఉత్తరా ఖండ్‌లో జరిగిన సంఘటనలతో పాటు, ఇటీవల సిక్కింలో జరిగిన హిమనీనద సరస్సు ఉప్పెన వరద సంబంధిత విపత్తు ద్వారా కూడా ఇది బాగా నిరూపితమైంది. తక్కువ సాంకేతిక, భద్రతాపరమైన నిర్వహణ, అలాగే వర్ష మేఘాల విస్ఫోటనం, కొండ చరియలు విరిగి పడటం మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి. అన్ని స్థాయిలలో శిక్షణ, భద్రతా నిర్వహణపై తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక సాంకేతిక, శాస్త్రీయ సమస్యలను ప్రణాళికా దశలోనే అధ్యయనం చేసి పరిష్కరించాలి. సిల్క్యారా–బడ్‌కోట్ సొరంగం కోసం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ప్లానింగ్, కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్న యూరప్‌కు చెందిన బెర్నార్డ్ గ్రుప్పే సంస్థ, ‘‘సొరంగాన్ని తవ్వడం ప్రారంభమైనప్పటి నుండి, టెండర్ డాక్యుమెంట్లలో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాలా సవాలుగా ఉన్నా యని నిరూపితమయ్యాయి. ఆ విధంగా అమలు దశ ప్రారంభంలో చేపట్టిన తదుపరి అన్వేషణే దాని చర్యల ఫలితాలను నిర్ధారిస్తుంది’’ అని వెల్లడించింది. అటువంటి ప్రాజెక్టులను ఆమోదించే ముందు సమగ్రమైన భౌగోళిక అధ్యయనాల అవసరాన్ని ఇది సూచిస్తుంది. కేవలం ప్రమాదమా? కార్మికుల రక్షణ కోసం సొరంగం లభ్యత వంటి భద్రతా నియ మాలను, నిబంధనలను నిర్మాణ సంస్థలు అనుసరించి ఉంటే, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చాలా ముందుగానే రక్షించి ఉండ వచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవించినందున, ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రం అనేక విపత్తులను ఎదుర్కొన్న వాస్తవాన్ని బట్టి త్వరితగతిన కార్మికుల పరిరక్షణ కార్యకలాపాలకు వ్యవస్థలు ఉండాలి. సంబంధిత అన్ని ఏజెన్సీలు పరిస్థితిని ఎలా నిర్వహించాలనే అంశంపై తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. సిల్క్యారా సొరంగ విపత్తును కేవలం ప్రమాదంగా పరిగణించి హిమాలయాల్లో యధావిధిగా వ్యవహారాలను కొనసాగించడం తప్పు. కోలుకోలేని నష్టం నుండి హిమాలయ పర్యావరణాన్ని కాపాడ టానికి ఇది మరో మేల్కొలుపు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు అని పేర్కొంటున్న వాటి గురించి మనం అసౌకర్యమైన ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. 900 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవే, ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు (కనీసం ఒక డజను సొరంగాల నిర్మాణంతో కూడి ఉంటాయి), పర్యాటకాన్ని నిస్సంకోచంగా ప్రోత్సహించడం (ఇది కొండలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని మించి ఉంటోంది), జల విద్యుత్ ప్రాజెక్టుల భారీ స్థాయి అభివృద్ధి... ఇలా అన్నింటిపై ఒక పునరాలోచన అవసరం. కొండల్లోని ప్రజలకు విద్యుత్తు, ఉపాధి లేదా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆనందించే లేదా అందుబాటులో ఉండే ఇతర సౌకర్యాలు లేకుండా చేయాలని దీని అర్థం కాదు. పర్యా వరణా నికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇవన్నీ ఎలా సాధిస్తామన్నదే కీలక ప్రశ్న. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాల్‌కు తగ్గట్టుగా దీన్ని ఎలా సాధిస్తాం? సిల్క్యారాలో జరిగినటువంటి విషాద సంఘ టనల పట్ల మనకు ఒక సమగ్ర దృక్పథం లేకుండా ఎంతమాత్రమూ ముందడుగు వెయ్యలేం. వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత,దినేష్ సి. శర్మ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
టన్నెల్ టైంపాస్ పై వర్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : ఉత్తర కాశీ టన్నెల్ నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఒక్కొక్కటిగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లో ఉన్నప్పుడు వారు ఎలా టైమ్ గడిపారో చెప్తున్నారు. తాజాగా యూపీలోని మోతీపూర్‌కు చెందిన అంకిత్ టన్నెల్లో 17 రోజుల పాటు తాము చేసిన పనులకు సంబంధించి ఆసక్తికరర విషయాలు వెల్లడించారు. ‘టన్నెల్లో గడిపిన 17 రోజులు టైమ్ పాస్ చేసేందుకు చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఆడాం. రాజా, మంత్రి, చోర్, సిపాయి లాంటి ఆటలు ఆడుకున్నాం. టన్నెల్ చాలా పొడవుండడంతో ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్లం. టన్నెల్లో పెద్దగా చలి లేదు. నిద్రపోవడానికి బ్లాంకెట్లు, జియో టెక్స్టైల్స్ వాడాం’అని అంకిత్ చెప్పాడు. ‘అయితే, టన్నెల్లో ఉన్న సమయంలో చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అనుభవం కలిగింది. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా అన్న కంగారుండేది. ఎందుకటే టన్నెల్లో నుంచి మేము వారితో మాట్లాడేంందుకు వీలు లేదు’అని అంకిత్ వివరించాడు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న చార్దామ్ ప్రాజెక్టు టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. 17 రోజులు టన్నెల్‌లోనే ఉండిపోయిన కార్మికులను అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఇదీచదవండి..బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు -
ఉత్తర కాశీ టన్నెల్ వర్కర్స్ ఆరోగ్యంపై ఎయిమ్స్ కీలక అప్డేట్
రిషికేష్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నారని రిషికేష్ ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. వాళ్లు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పారు. టన్నెల్ నుంచి బయటపడ్డ తర్వాత 41 మంది కార్మికులను చికిత్స నిమిత్తం రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. 41 మందిలో యూపీ, జార్ఖండ్, బీహార్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ‘టన్నెల్ నుంచి బయటికి వచ్చిన కార్మికులందరికీ ఇళ్లకు వెళ్లేందుకు మెడికల్ క్లియరెన్స్ ఇచ్చాం. వారంతా వారి రాష్ట్రాల నోడల్ ఆఫీసర్లకు టచ్‌లో ఉంటారు. ఈ మేరకు నోడల్ అధికారులకు సమాచారమిచ్చాం’అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఉత్తరకాశీలో చార్దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద నిర్మిస్తున్న టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయి 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. ఇదీచదవండి...రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
నంద్యాల జిల్లా: అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
సీమ ప్రజలకు వరం అవుకు రెండో టన్నెల్ రెడీ
-
నెరవేరిన రాయలసీమ-నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం
-
ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే..
ఉత్తరకాశీ టన్నెల్ నుండి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను ప్రభుత్వం ఆర్మీకి చెందిన హెలికాప్టర్లో రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించింది. ఈ కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు, మానసిక పరీక్షలు చేసిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఎయిమ్స్‌కు కార్మికులు చేరుకోకముందే ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్ హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే, ఆరోగ్య కార్యకర్తలు.. కార్మికులను ఆరోగ్య పరీక్షల కోసం అంబులెన్స్‌లు, వీల్చైర్ల ద్వారా వారిని వార్డులకు తీసుకు వెళ్లారు. వైద్యుల బృందం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సొరంగం నుండి బయటపడిన కార్మికులంతా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే వారి ఆరోగ్యం గురించి మరింతగా తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను పరీక్ష కోసం తీసుకుంటున్నట్లు వైద్యుల బృందం తెలిపింది. కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు సైకియాట్రిస్ట్ బృందం కూడా సేవలను అందిస్తోంది. ఇది కూడా చదవండి: కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు