పెరుగుతున్న వాహనాల రద్దీ మధ్య పట్టణాలు, నగరాల్లో సైకిల్‌పై వెళ్లాలంటే కాస్త ఆలోచించాల్సిందే.. ఆరోగ్యం పక్కన పెడితే వాహనాల కాలుష్యానికి ఉన్న ఆరోగ్యాన్ని కాస్తా పణంగా పెట్టాల్సిందే. శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల కారణంగా వాతావరణానికి కూడా హానికరమే. కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్‌తో నడిచే ఈ–వాహనాలను అందుబాటులోకి తేవాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
బీఎండబ్ల్యూ సంస్థ ఓ అడుగు ముందుకేసి ఈ–బైక్‌లు, సైకిళ్లు నడిపేవారికి ఒక మార్గాన్నే నిర్మించాలని భావిస్తోంది. ‘విజన్ ఈ3 వే’అని పిలుస్తున్న ఈ ప్రాజెక్టును చైనాలోని షాంఘైలో ఉన్న టోంగ్జీ యూనివర్సిటీ, బీఎండబ్ల్యూ సంయుక్తంగా చేపడుతున్నాయి. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో రెండు మార్గాలను నిర్మించాలని భావిస్తున్నారు. ఎలన్ మస్క్ రూపొందించనున్న హైపర్‌లూప్ ప్రాజెక్టులాగే దీన్ని కూడా రూపొందించాలని బీఎండబ్ల్యూ అనుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment