ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..టెస్లాకు గట్టిపోటీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టెస్లాను తలదన్నేలా ఇప్పటి వరకు ఏ కార్లలో లేని డిజైన్లతో ప్రత్యేకమైన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోటో టైప్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా, చైనా ఎలక్ట్రిక్ మార్కెట్‌లో తొలిస్థానంలో ఉన్న టెస్లా, ఇతర స్థానిక ఆటోమొబైల్ కంపెనీలను వెనక్కి నెట్టి, వాహనదారుల్ని ఆకట్టుకునేలా ఈ కారును డిజైన్ చేసింది.
‘బీఎండబ్ల్యూ న్యూ క్లాస్సే’ (bmw Neue Klasse) పేరుతో విడుదల కానున్న బీఎండబ్ల్యూ కారును వచ్చే వారం జర్మనీ మ్యూనిచ్‌లో జరిగే ఇంటర్నేషన్ మోటార్స్ షో (iss) ప్రదర్శనకు పెట్టనుంది. 2025లో ఈ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
అదే సమయంలో మెర్సిడెజ్ బెంజ్ గ్రూప్ సైతం న్యూ బ్యాటరీ పవర్డ్ మోడల్స్‌తో పాటు, వోక్స్‌వ్యాగన్ కార్ విడుదల కావాల్సి ఉంది. కానీ కార్లలో తలెత్తిన సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా ఫోర్ష్, ఆడి కార్ల విడుదల కంటే ఆలస్యంగా మార్కెట్‌కు పరిచయం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
డిజైన్‌లు, ఫీచర్లు అదరగొట్టేస్తున్నాయ్
దశబ్ధాల కాలంగా రెండు డోర్లతో విడుదల చేసే కూపే (cupe) తరహా కార్లకు బీఎండబ్ల్యూ స్వస్తి చెప్పింది. బదులుగా, విండ్‌స్క్రీన్ మొత్తం వెడల్పు చేసింది. దీంతో పాటు వాయిస్ కమాండ్‌లు, హ్యాండ్ మూమెంట్‌తో డ్రైవింగ్ చేసేలా డిజిటల్ డిస్‌ప్లేను డిజైన్ చేసింది. చైనా కంపెనీలైన బీవైడీ కో, ఎన్‌ఐఓ ఐఎన్‌సీకి పోటీగా స్థానిక వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా అదిరిపోయే ఫీచర్లతో ఈవీ కారును రూపొందిస్తుంది.
bmw Neue Klasse రేంజ్ ఎంతంటే
బీఎండబ్ల్యూ న్యూ క్లాస్సే మోడల్‌లు 800 కిలోమీటర్ల (497 మైళ్ళు) పరిధిని కలిగి ఉంటాయి. అరగంటలో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. గత సంవత్సరం, మెర్సిడెస్ నుండి ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ ఒకే ఛార్జ్‌తో 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచింది. కాగా, బీఎండబ్ల్యూ, మెర్సిడైజ్ బెంజ్, ఆడి కార్లు చైనా ప్రీమియం సెగ్మెంట్లలో ఆదిపత్యాన్ని చెలాయించాయి. కానీ అక్కడ ఈవీ కార్లకు డిమాండ్ పెరడగడంతో ఫ్యూయిల్ కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అందుకే ఆటోమొబైల్ సంస్థ ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారించాయి.
Comments
Please login to add a commentAdd a comment