bicycles
-
వాటర్ క్యాన్, సైకిళ్లపై తగ్గింపు షూ, వాచీలపై పెంపు
న్యూఢిల్లీ: 20 లీటర్ల వాటర్ క్యాన్, సైకిళ్లు, నోటు పుస్తకాల ధరలు తగ్గే వీలుంది. వస్తుసేవల పన్నుల(జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీఓఎం) శనివారం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్యాక్చేసిన 20 లీటర్ల నీళ్ల క్యాన్, సైకిళ్లు, రాసుకునే నోటుపుస్తకాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని జీఓఎం నిర్ణయించింది. ఖరీదైన చేతి గడియారాలు, షూలపై పన్నులను పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా రూ.22,000 కోట్ల ఆదాయం సమకూరవచ్చని బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం అంచనావేసింది. ఈ సిఫార్సులను జీఎస్టీ మంత్రిమండలి ఆమోదిస్తే సవరణల అమల్లోకి రానున్నాయి. ప్యాక్చేసిన 20 లీటర్ల నీళ్ల బాటిల్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలుచేస్తుండగా త్వరలో అది 5 శాతానికి దిగిరానుంది. రూ.10వేలలోపు ధర ఉన్న సైకిళ్లపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండగా దానిని 5 శాతానికి తగ్గిస్తారు. నోటు పుస్తకాలపైనా 5 శాతం జీఎస్టీనే వసూలుచేయనున్నారు. కొన్నింటి ధరలు పెరిగే వీలుంది. హెయిర్ డ్రయర్లు, హెయిర్ కర్లర్లు, బ్యూటీ/మేకప్ సామగ్రిపై ప్రస్తుతం అమలవుతున్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచనున్నారు. మంత్రుల బృందంలో ఉత్తరప్రదేశ్ ఆర్థికమంత్రి సురేశ్ ఖన్నా, రాజస్తాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ సభ్యులుగా ఉన్నారు. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబులతో జీఎస్టీని అమలుచేస్తున్నారు. నిత్యావసరాల సరకులపై తక్కువ పన్నులను, అత్యంత విలాసవంత వస్తువులపై 28 శాతం జీఎస్టీని వసూలుచేస్తుండటం తెల్సిందే. వినియోగదారులు, మార్కెట్వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ ఎప్పటి కప్పుడు ఆయా వస్తువులను ప్రభుత్వం వేర్వేరు శ్లాబుల్లోకి మారుస్తోంది. -
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
-
పేదలు ఉన్నత విద్య అభ్యసించడమే సీఎం లక్ష్యం
సాక్షి, అనకాపల్లి: పేదింటి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అరబిందో ఫార్మసీ రూ.2 కోట్ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన 2,500 సైకిళ్లను అనకాపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం పంపిణీ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రితో పాటుగా అరబిందో ఫార్మసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి హాజరయ్యారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నాలుగేళ్లలో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తెచ్చినట్లు చెప్పారు. -
మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్
టాలీవుడ్లో నమ్రతా శిరోద్కర్ పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబును ప్రేమ వివాహాం చేసుకున్న నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. ఎక్కడికెళ్లినా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే తన ముద్దుల కూతురు సితార బర్త్ డే వేడుకను మహేశ్ బాబు ఫౌండేషన్ విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. అంతే కాదు సితార పుట్టిన రోజు సందర్భంగా పాఠశాల విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేశారు. (ఇది చదవండి:స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే! ) మహేశ్ బాబు స్వగ్రామమైన బుర్రిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 40 మంది బాలికలకు ఏంబీ ఫౌండేషన్ ద్వారా ఈ సైకిళ్లను అందించారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను నమ్రత తన ఇన్‌స్టాలో పంచుకుంది. బాలికలందరూ సైకిళ్లతో పాఠశాల ముందు నిలబడిన ఫోటోలను షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం మహేశ్ బాబు ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ 40 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. మీరంతా పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన చదువును ఆనందంగా నేర్చుకోవడానికి ఇలాంటివి అవసరం. మీ కళ్లలో సంతోషం తీసుకొచ్చిన సితారకు, మహేశ బాబు ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. 'అంటూ పోస్ట్ చేశారు. కాగా.. శనివారం మహేశ్ బాబు ఫ్యామిలీ వేకేషన్‌కు వెళ్తూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. (ఇది చదవండి: వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
భారత్ నుంచి వాల్‌మార్ట్ మరిన్ని ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉంది. ఆటబొమ్మలు, సైకిళ్లు, పాద రక్షలను భారత సరఫరా దారుల నుంచి సమీకరించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్, కన్జ్యూమబుల్, హెల్త్, వెల్నెస్, అప్పారెల్, హోమ్ టెక్స్టైల్ విభాగాల్లో భారత్ నుంచి కొత్త సరఫరాదారులను ఏర్పాటు చేసుకోవడంపైనా దృష్టిపెట్టింది. భారత్ నుంచి ఎగుమతులను 2027 నాటికి 10 బిలియన్ డాలర్లకు (రూ.82,000 కోట్లు) పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ లోగడే విధించుకుంది. ఈ దిశగా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే భారత్‌కు చెందిన పలువురు బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. తమకు ఎంత మేర ఉత్పత్తి కావాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలను వారికి తెలియజేసింది. ఐకియా సైతం... మరో ప్రముఖ అంతర్జాతీయ రిటైలింగ్ సంస్థ ఐకియా సైతం తన అంతర్జాతీయ విక్రయ కేంద్రాల కోసం భారత్ నుంచి ఆటబొమ్మలను సమీకరిస్తోంది. ఈ చర్యలు ఆట బొమ్మల విభాగంలో పెరుగుతున్న భారత్ బలాలను తెలియజేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం ఆటబొమ్మల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. చైనా నుంచి చౌక ఆట ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తేవి. కేంద్ర సర్కారు దీనికి చెక్ పెట్టేందుకు దిగుమతి అయ్యే ఆట బొమ్మల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, టారిఫ్‌లను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఫలితమిస్తున్నాయి. సరఫరా వ్యవస్థ బలోపేతం ఈ నెల మొదట్లో వాల్‌మార్ట్ ఐఎన్‌సీ ప్రెసిడెంట్, సీఈవో డగ్ మెక్‌మిల్లన్ భారత పర్యటన సందర్భంగా సంస్థ ప్రణాళికలను పునరుద్ఘాటించారు. భారత్‌లోని వినూత్నమైన సరఫరాదారుల వ్యవస్థ అండతో 2027 నాటికి ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సైతం ఆయన కలిశారు. ఆ తర్వాత సంస్థ లక్ష్యాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా భారత్‌ను ఆటబొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, ఇతర విభాగాల్లో అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. -
నగరంలోని సైకిళ్లన్నీ మాయం.. కారణం తెలిసి పోలీసులే షాక్!
చండీగఢ్: హరియాణాలోని పంచకుల జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా సైకిళ్లు మాయమవుతున్నాయి. ఒక్కసారిగా సైకిళ్లు మాయమవుతున్నట్లు ఫిర్యాదులు పెరగటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లోనే కేసు ఛేదించారు. అయితే.. పోలీసులే విస్తుపోయే సంఘటన ఎదురైంది. నగరంలోని సైకిళ్లన్నింటిని ఒకే వ్యక్తి ఎత్తుకెళ్లటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచకుల జిల్లాలోని మంజ్రి గ్రామంలో రవి కుమార్(32) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. పంచకుల జిల్లా మొత్తం తిరుగుతూ సైకిళ్లు ఎత్తుకెళ్లే పని పెట్టుకున్నాడు. ఇటీవలే సెప్టెంబర్ 14న సెక్టార్ 26లో సుమారు రూ.15,000 విలువ చేసే సైకిల్‌ను మాయం చేశాడు. సెక్టార్స్ 2,4,7,9,10,11,12,12A,20, 21,25లలో సైకిళ్లు చోరీకి గురయ్యాయనే ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల తర్వాత రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. నిఘా కెమెరాల ఆధారంగా మొత్తం 62 సైకిళ్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ‘సీసీటీవీ ఫుటేజ్, సైబర్ టెక్నాలజీ ఆధారంగా పంచకుల జిల్లా మొత్తం ఒకే వ్యక్తి సైకిళ్లు దొంగతనం చేసినట్లు తేలింది. ఈ సైకిళ్లు గరిష్ఠంగా రూ.20,000 వరకు ధర ఉన్నాయి.’ అని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన సైకిళ్లను అత్యంత తక్కువ ధరకు రూ.2,000లకే అమ్మటం.. వచ్చిన డబ్బును మత్తుపదార్థాలు కొనుగోలు చేసేందుకు వినియోగించటం చేస్తున్నాడు. ‘2021లో లుథియానా నుంచి చండీగఢ్‌లోని రాయ్‌పుర్ ఖుర్ద్‌కు మకాం మార్చాడు రవి. జిరాక్‌పుర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు. తన ఉద్యోగం పోయిన క్రమంలో మత్తుకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత పంచకులకు మారి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తున్నాడు.’ అని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపాడు. ఇదీ చదవండి: భర్తను చితకబాది.. భార్యను లాక్కెళ్లి ఆరుగురు గ్యాంగ్ రేప్! -
సైకిళ్లకు ‘చంద్ర’గ్రహణం
సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాజన్న బడిబాట’లో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8న ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేసే సైకిళ్లపై ఉన్న లోగో మార్పు ప్రధానోపాధ్యాయులను టెన్షన్‌కు గురి చేస్తోంది. ఆ సైకిళ్లపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన లోగోలే ఉన్నాయి. వాటిని మార్చి ఇదివరకే సైకిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీ ద్వారా ‘రాజన్న బడిబాట’ లోగో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాకు మాత్రం ఇప్పటిదాకా కొత్త లోగో ఒక్కటీ రాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీకి అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాకు మొత్తం 32,287 సైకిళ్లు రాగా.. 8,762 సైకిళ్లు విద్యార్థినులకు పంపిణీ చేశారు. 23,525 సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. తీరా ఎన్నికల ముందు... గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల తాయిలాల్లో భాగంగా తీరా ఎన్నికల ముందు సైకిళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంది. జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైతే ఫిబ్రవరి నెలాఖరులో పంపిణీ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా సైకిళ్లను పాఠశాలలకు చేర్చారు. తీరా బాలికలకు పంపిణీ చేసే సమయానికి కోడ్ అడ్డంకిగా మారి బ్రేక్ పడింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరడంతో సైకిళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటోంది. కాగా 2018–19 సంవత్సరానికి మంజూరు చేసిన సైకిళ్లు కావడంతో ప్రస్తుతం 9, 10 తరగతులు చదువుతున్న బాలికలకు పంపిణీ చేయనున్నారు. ఆందోళనలో ప్రధానోపాధ్యాయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన లోగోను సైకిళ్లపై ముద్రించారు. వాటిస్థానంలో ‘రాజన్న బడిబాట’ లోగోను ముద్రించి సైకిళ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైకిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బాలికలకు సరఫరా చేసేందుకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటిదాకా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. బాలికలకు సైకిళ్లు ఎలా సరఫరా చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. దీనిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. చర్యలు తీసుకుంటున్నాం సైకిళ్లపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు లోగోను తొలిగించి ‘రాజన్న బడిబాట’ లోగో ముద్రించి సరఫరా చేయాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏజెన్సీ వారితో మాట్లాడాం. వారు జిల్లాలో సబ్ ఏజెన్సీకి ఇచ్చారట. వారితో కూడా మాట్లాడాం. ఆదివారం లోపు కొత్త లోగోలు వస్తాయన్నారు. వాటిని నేరుగా స్కూళ్లకు సరఫరా చేసి అమర్చేలా చర్యలు తీసుకుంటాం. – దేవరాజు, ఇన్చార్జి డీఈఓ -
సైకిళ్ల నుంచి సైకిళ్ల వరకు అద్భుత ప్రయాణం
బీజింగ్ : జపాన్ సినీ తార ర్యోకో నకానో 1979లో చైనా సందర్శనలో భాగంగా బీజింగ్ వెళ్లారు. అప్పటికే ఆమె నటించిన ‘మ్యాన్ హంట్’ సినిమా చైనాలో విడుదలై ఏడాది అయింది. సినిమా హిట్టయిన సందర్భంగానే ఆమె బీజింగ్ వచ్చారు. ఇక్కడి హోటల్లో బస చేసిన ఆమె కిటికీలో నుంచి చూడగా, ఆమెకు ప్రతివీధిలో కనుచూపు మేర సైకిళ్లే కనిపించాయి. ఇదేమి ‘సైకిళ్ల సముద్రమా చైనా’ అని ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆమె ఒక్కరేమిటీ? ఆ కాలంలో చైనాకు వెళ్లిన ప్రతి విదేశీయుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం చైనా ప్రజలకు కార్లు కొనే స్థోమత, వాటిల్లో తిరిగే యోగ్యతా లేదు. అందుకని సైకిళ్లనే అత్యంతగా ఆదరించారు. అందుకనే చైనాకు ‘కింగ్డ్‌మ్ ఆఫ్ బైస్కిల్స్’ అని పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత అనతికాలంలోనే చైనా ప్రజల రవాణా వ్యవస్థలోనే అద్భుతమైన మార్పులు వచ్చాయి. అందుకు కారణం చైనా అధ్యక్షుడు డెంగ్జియావోపింగ్ 1978లో చరిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం. ఆ సంస్కరణల కారణంగా నాలుగు దశాబ్దాల కాలంలోనే చైనా అనూహ్య అభివద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగిన ఈ దేశం ప్రపంచంలోనే రెండవ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఘనతికెక్కింది. నేడు చైనా అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లకు నిలయంగా మారింది. 2008లో చైనా మొదటి బుల్లెట్ రైలు నిర్మించింది. బీజింగ్ నుంచి టియాన్జిన్ మున్సిపాలిటీకి మధ్య 120 కిలోమీటర్ల దూరాన్ని ఇది 30 నిమిషాల్లో చేరుకునేది. 2017, చివరి నాటికి రెండున్నర లక్షల కిలోమీటర్ల వరకు బుల్లెట్ ట్రెయిన్ల వ్యవస్థ విస్తరించింది. అంటే ప్రపంచంలో మొత్తం రైల్వే నెట్వర్కుల్లో 66 శాతం నెట్వర్క్ ఒక్క చైనాకే ఉంది. డెంగ్ జియావోపింగ్ 1978లో జపాన్ను సందర్శించినప్పుడు టోక్యో నుంచి క్యోటోకు శింకన్‌సేన్ బుల్లెట్ ట్రెయిన్లో ప్రయాణించి అశ్చర్యపడ్డారు. ఆ రోజే తమ దేశంలో కూడా ఇలాంటి విప్లవాత్మక రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఆధునిక రవాణా వ్యవస్థ కారణంగా మధ్యలో అంతరించి పోయిన సామాన్య మానవుల వాహనం ‘సైకిల్’ ఇప్పుడు చైనా వీధుల్లో మళ్లీ ప్రత్యక్షమయింది. ఏ వీధిలో తిరిగినా అవే దర్శనమిస్తున్నాయి. అందుకు కారణం పర్యావరణం పట్ల అవగాహన కలగడం, ఆరోగ్య రక్షణ పట్ల ఆసక్తి పెరగడం. మెట్రో రైల్వే స్టేషన్ల మధ్య నడిపేందుకు ఇవి మరింతగా ఈ సైకిళ్లు మరింతగా ఉపయోగపడుతున్నాయి. -
‘అమ్మ ఒడి’ సేవల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వైద్య సేవ లలో మరో ముందడుగు పడింది. అమ్మ ఒడి (102 సేవలు) విస్తరణ, కొత్తగా ద్విచక్ర అంబులెన్సులు, ఏఎన్ఎంలు వినియోగించే ద్విచక్ర వాహనాల (వింగ్స్) సేవలను సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అమలవుతున్న జననీ సురక్ష యోజన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. 2016 డిసెంబర్ 28న రాష్ట్రంలో అమ్మ ఒడి సేవలను ప్రారంభించారు. మొదటి దశలో 41 వాహనాలతో సేవలు మొదలయ్యాయి. జీవీకే ఈఎంఆర్ఐ భాగస్వామ్యంతో 102 వాహనాలకు విస్తరించింది. అయితే 12 జిల్లాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తున్నారు. మిగతా జిల్లాల్లోనూ ఈ పథకం అమలుకు కొత్తగా 200 వాహనాలను కొనుగోలు చేశారు. ఈ వాహనాల సేవలు బుధవారం ప్రారంభం కానున్నాయి. అలాగే అత్యవసర సమయాల్లో వేగంగా రోగుల దగ్గరకు వెళ్లేందుకు వినియోగించే ద్విచక్ర అంబులెన్స్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సేవల కోసం 50 వాహనాలను కొనుగోలు చేశారు. మరోవైపు గ్రామీణ ఆరోగ్య సేవలలో కీలకమైన ఏఎన్ఎంల కోసం తక్కువ ధరతో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయించనున్నారు. ఈ వాహనాలను సైతం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఏఎన్ఎంలకు పంపిణీ చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. -
సైకిళ్లకూ ఓ సొరంగం!
పెరుగుతున్న వాహనాల రద్దీ మధ్య పట్టణాలు, నగరాల్లో సైకిల్‌పై వెళ్లాలంటే కాస్త ఆలోచించాల్సిందే.. ఆరోగ్యం పక్కన పెడితే వాహనాల కాలుష్యానికి ఉన్న ఆరోగ్యాన్ని కాస్తా పణంగా పెట్టాల్సిందే. శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల కారణంగా వాతావరణానికి కూడా హానికరమే. కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్‌తో నడిచే ఈ–వాహనాలను అందుబాటులోకి తేవాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బీఎండబ్ల్యూ సంస్థ ఓ అడుగు ముందుకేసి ఈ–బైక్‌లు, సైకిళ్లు నడిపేవారికి ఒక మార్గాన్నే నిర్మించాలని భావిస్తోంది. ‘విజన్ ఈ3 వే’అని పిలుస్తున్న ఈ ప్రాజెక్టును చైనాలోని షాంఘైలో ఉన్న టోంగ్జీ యూనివర్సిటీ, బీఎండబ్ల్యూ సంయుక్తంగా చేపడుతున్నాయి. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో రెండు మార్గాలను నిర్మించాలని భావిస్తున్నారు. ఎలన్ మస్క్ రూపొందించనున్న హైపర్‌లూప్ ప్రాజెక్టులాగే దీన్ని కూడా రూపొందించాలని బీఎండబ్ల్యూ అనుకుంటోంది. -
ఈ బండి ఎవరిదో..?
♦ నంబర్ ప్లేట్లు లేకుండానే తిరుగున్న ద్విచక్రవాహనాలు ♦ ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన 8 వేల హై సెక్యూరిటీ ప్లేట్లు ♦ టీఆర్ నంబర్ సైతం కేటాయించని షోరూంలు ♦ ప్రమాదాల సమయంలో గుర్తించడంలో ఇబ్బందులు ♦ పట్టించుకోని పోలీస్, రవాణా శాఖాధికారులు మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ద్విచక్రవాహనాలు ఎలాంటి నంబరు ప్లేటు లేకుండా రోడ్లపై రయ్.. రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. పలు బైక్ షోరూం నిర్వాహకులు సైతం వాహనాలు షోరూం నుంచి డెలివరీ చేసే సమయంలో వాహనాలకు ఇచ్చే సమయంలో తాత్కాలిక (టీఆర్) నంబర్ కేటాయించకుండా స్టిక్కర్ అతికించి చేతులు దులుపుకొంటున్నారు. నంబర్ ప్లేట్ లేకపోవడంతో ప్రమాదాల జరిగిన సమయంలో నిందితులను గుర్తించడానికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ప్రమాదాలు జరిపిన వారు ఎక్కడున్నా తెలిసేలా ‘హై సెక్యూరిటీ’ నంబర్ పేట్లను తయారు చేయించి వాహనదారులకు అప్పగిస్తోంది. అయితే వాహనదారులు కొత్త వాహనం కొనగానే రవాణా శాఖలో రిజిస్ట్రేషన్‌కి వచ్చినప్పుడు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌కు వాహనాన్ని బట్టి నిర్ణయించిన ధర చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది. నంబర్‌ను ఆ రోజు సాయంత్రమే రవాణా శాఖ కేటాయిస్తుంది. రెండు రోజుల్లో నంబర్ ప్లేట్ పూర్తయి బిగించుకోవాలని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అయితే వాహనదారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్లేట్ అన్ని బిగింపు కేంద్రంలోనే ఉండిపోతున్నాయి. పోలీసులు, రవాణా శాఖాధికారులు కూడా తనిఖీలు చేయకపోవడంతో వాహనదారులు నంబరు ప్లేట్ల బిగింపునకు ఆసక్తి చూపడంలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో.. గతంలో వాహనదారులు దొంగ నంబర్ ప్లేట్లు వాడుతుండడంతో పలు కేసుల్లో నిందితులను పట్టుకోవడం చాలా ఇబ్బందులుండేవి. ఇబ్బందులు ఉండకుండా తప్పు చేసిన వారు ఎక్కడున్నా తెలిసేలా సీసీ కెమెరాలో నమోదయ్యేలా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాహనదారులు ఇష్టారీతిన వాడకుండా నిబంధనల ప్రకారం తయారు చేసిన హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమలు చేసింది. అయితే రెండు మూడేళ్లుగా రవాణా శాఖలో ఎనిమిది వేలకు పైగా నంబర్ ప్లేట్లు వాహనదారులకు బిగించుకోకపోవడంతో మూలనపడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వరకు ద్విచక్రవాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా అధికారుల ముందు తిరిగినా చర్యలు శూన్యం. ఏవైనా ప్రమాదాలు, దోపిడీలు జరిగినప్పుడు నిందితులను ఎలా పట్టుకుంటారో అధికారులకే తెలియాలి మరి. నెల రోజుల గడువిస్తాం.. చాలా వరకు వాహనదారులు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెంబర్ ప్లేట్లు బిగించుకోకుండా వెళ్తున్నారు. దీని ద్వారా నెంబర్ ప్లేట్ బిగింపు సెంటర్లో చాలా వరకు మిగిలిపోతున్నాయి. అలాంటి వారికి ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు గడువు కేటాయిస్తున్నాం. ఈ సమయంలో వచ్చిన వాహనదారులకు ఉచితంగా ప్లేట్లు బిగిస్తాం. రాకపోతే జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నంబర్ ప్లేట్లు లేని ప్రతి వాహనంపై కేసులు నమోదు చేసి.. సీజ్ చేస్తాం. – మమత ప్రసాద్, డీటీసీ, మహబూబ్‌నగర్ -
విద్యార్థులకు సైకిళ్లు
lట్రాన్స్పోర్ట్ చార్జీలకు బదులు సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయం lప్రభుత్వ పాఠశాలల్లో 1061 మంది బాలురు.. 985 మంది బాలికల ఎంపిక విద్యారణ్యపురి : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతదూరం నడవడం కష్టం కావడంతో విద్యార్థులు ఆటోల్లో వెళ్లేవారు. అయితే పేద పిల్లలకు రవాణా చార్జీలు భారం కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా సర్వశిక్షాభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన వారికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున అందజేస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2,049, యూపీఎస్‌లు 360, ఉన్నత పాఠశాలలు 510 ఉన్నాయి. యూపీఎస్, హైస్కూళ్లలో 6,7,8 తరగతుల విద్యార్థులకు 2015–16 విద్యా సంవత్సరానికి ట్రాన్స్పోర్ట్ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి రూ.3 వేల చొప్పున రూ. 61.38 లక్షలు మంజూరయ్యాయి. ఈ మెుత్తాన్ని పంపిణీ చేసేందుకు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే 1061 మంది బాలురు, 985 మంది బాలికలను ఎంపిక చేశారు. అయితే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు చెల్లించే బదులు సైకిళ్లు ఇవ్వాలని కలెక్టర్ వాకాటి కరుణ ఇటీవలే నిర్ణయించారు. ఒక్కో సైకిల్ రూ. 3 వేల కంటే ఎక్కువే అవుతున్నందున అదనపు ఖర్చులు సుమారు రూ.13 లక్షలు తన నిధుల నుంచి ఇచ్చేందుకు కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. టెండర్లు పిలిచి సైకిళ్లను కొనుగోలు చేయడంతో పాటు సగానికి పైగా ఆయా మండలాల ఎమ్మార్సీ కార్యాలయాలకు కూడా పంపించారు. కొద్దిరోజుల్లోనే పూర్తిస్థాయిలో చేరుకోబోతున్నాయి. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 6,7,8 తరగతుల విద్యార్థులకు ఈ సైకిళ్లు అందించనున్నారు. కాగా 2016–17 సంవత్సర ట్రాన్స్పోర్ట్ నిధులు ఇంకా మంజూరు కాలేదు.