
సైకిళ్లు పంపిణీ చేస్తున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తదితరులు
సాక్షి, అనకాపల్లి: పేదింటి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అరబిందో ఫార్మసీ రూ.2 కోట్ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన 2,500 సైకిళ్లను అనకాపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం పంపిణీ చేశారు. అనకాపల్లి ఎన్‌టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రితో పాటుగా అరబిందో ఫార్మసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి హాజరయ్యారు. మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నాలుగేళ్లలో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తెచ్చినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment