టాలీవుడ్‌లో నమ్రతా శిరోద్కర్ పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబును ప్రేమ వివాహాం చేసుకున్న నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. ఎక్కడికెళ్లినా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే తన ముద్దుల కూతురు సితార బర్త్ డే వేడుకను మహేశ్ బాబు ఫౌండేషన్ విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. అంతే కాదు సితార పుట్టిన రోజు సందర్భంగా పాఠశాల విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేశారు.
(ఇది చదవండి:స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే! )
మహేశ్ బాబు స్వగ్రామమైన బుర్రిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 40 మంది బాలికలకు ఏంబీ ఫౌండేషన్ ద్వారా ఈ సైకిళ్లను అందించారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను నమ్రత తన ఇన్‌స్టాలో పంచుకుంది. బాలికలందరూ సైకిళ్లతో పాఠశాల ముందు నిలబడిన ఫోటోలను షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం మహేశ్ బాబు ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ 40 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. మీరంతా పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన చదువును ఆనందంగా నేర్చుకోవడానికి ఇలాంటివి అవసరం. మీ కళ్లలో సంతోషం తీసుకొచ్చిన సితారకు, మహేశ బాబు ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. 'అంటూ పోస్ట్ చేశారు. కాగా.. శనివారం మహేశ్ బాబు ఫ్యామిలీ వేకేషన్‌కు వెళ్తూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.
(ఇది చదవండి: వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!)
Comments
Please login to add a commentAdd a comment