బీఎండబ్ల్యూ కంపెనీ చైనాలో దాదాపు 7,00,000 బ్రాండ్ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని కూలెస్ట్ పంపులో ఏర్పడిన సమస్య కారణంగా జర్మన్ కార్‌మేకర్ ఈ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. ఇందులో స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లు మాత్రమే కాకుండా.. దిగుమతి చేసుకున్న కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ వెల్లడించింది.
బీఎండబ్ల్యూ మోడళ్లలో అమర్చిన లోపభూయిష్ట కూలెస్ట్ పంప్ ప్లగ్‌లు తుప్పు పట్టే అవకాశం ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్‌లకు కారణమైతే.. వాహనంలో మంటలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు కంపెనీ దృష్టికి రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగా రీకాల్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
రీకాల్ ప్రకటించిన కార్లలో స్థానికంగా తయారైన బీఎండబ్ల్యూ 3 సిరీస్, 5 సిరీస్ వాహనాలు ఉన్నాయి. అలాగే దిగుమతి చేసుకున్న కార్లలో ఎక్స్ సిరీస్ కార్లు ఉన్నాయి. రీకాల్ కారణంగా కంపెనీ కార్ల సేల్స్ ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. గత నాలుగు సంవత్సరాల్లో అమ్మకాలు భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..
కంపెనీ గత సెప్టెంబర్ నెలలో కూడా కాంటినెంటల్ ఏజీ ద్వారా సరఫరా చేసిన కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లలో సమస్య ఉందని గుర్తించి.. ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ లోపాన్ని కంపెనీ సరి చేయడానికి ఏకంగా 1.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment