recall
-
కియా రీకాల్.. వందలాది ఈవీ6 కార్లు వెనక్కి
ప్రముఖ వాహన తయారీ సంస్థ.. కియా మోటార్స్ (Kia Motors) తన 'ఈవీ6' (EV6) కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. 2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన మొత్తం 1,380 యూనిట్లలో సమస్య ఉన్నట్లు గుర్తించి ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది.కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లలో.. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో 12వీ బ్యాటరీ పనితీరును ప్రభావితం చేసే లోపం కారణంగా రీకాల్ పరకటించింది. ఈ సమస్య కారణంగా.. 2024లో కూడా కంపెనీ 1138 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోమారు రీకాల్ జారీచేసింది.ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లోని సాఫ్ట్వేర్ అప్డేట్ 12వీ బ్యాటరీ ఛార్జింగ్.. పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కారులోని లైట్స్, వైపర్లు, మ్యూజిక్ సిస్టమ్ వంటి వాటికి శక్తిని ఇస్తుంది. కార్లలో ఈ లోపాన్ని కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. అయితే సంబంధిత వాహనాల యజమానులను నేరుగా సంప్రదించి వాటిని అప్డేట్ చేస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?ప్రభావిత వాహనాల కస్టమర్లు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి.. సంబంధిత కియా డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు, లేదా ఇతర వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయవచ్చు. కియా రీకాల్ గురించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కు కూడా సమాచారం అందించింది. -
80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్.. యూఎస్ఏలో ఏకంగా 80,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ముందు ప్రయాణీకుల సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల.. ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ కారణంగానే కియా అమెరికా రీకాల్ ప్రకటించింది.సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల అనుకోకుండా ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కి దాఖలు చేసిన పత్రాలలో కియా అమెరికా స్పష్టం చేసింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో 2023 నుంచి 2025 మధ్య తయారైన నీరో ఈవీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.కంపెనీ మొత్తం 80,225 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని సమస్యను గుర్తించి.. వాటిని ఉచితంగానే పరిష్కరించనున్నట్లు కియా అమెరికా వెల్లడించింది. అంతే కాకుండా వైరింగ్ కవర్లను కూడా ఉచితంగానే భర్తీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా కార్ల యజమానులకు మార్చిలో ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది.ఈ రీకాల్ అనేది అమెరికాలోని కియా కార్లకు మాత్రమే పరిమితం. కాబట్టి ఈ రీకాల్ ప్రభావం భారతదేశంలోని కియా కార్లపై ఎటువంటి ప్రభావం చూపదు. కాబట్టి దేశంలోకి కియా కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
జిమ్నీ కార్లు వెనక్కి.. మారుతి సుజుకి కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన జిమ్నీ ఆఫ్-రోడర్ కారుకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయించిన అన్ని వేరియంట్లు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి.మారుతి సుజుకి జిమ్నీ కారు 80 కిమీ వేగంతో వెళ్తున్న సమయంలో బ్రేక్ వేస్తే వైబ్రేషన్స్ వస్తున్నట్లు, వేగం 60 కిమీకి తగ్గితే ఈ వైబ్రేషన్ పోతుందని చాలామంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ ఈ సమస్యను పరిష్కరించుడనికి రీకాల్ ప్రకటించింది. కారులో సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది.మారుతి సుజుకి దేశీయ విఫణిలో.. ఆఫ్-రోడ్ విభాగంలో కూడా తన హవాను చాటుకోవడానికి, 'మహీంద్రా థార్'కు ప్రత్యర్థిగా నిలువడానికి జిమ్నీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ప్రారంభంలో ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందినప్పటికీ.. క్రమంగా అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కారు కొంత చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే కూడా ధర కొంత ఎక్కువగా ఉండటం అనే తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..మారుతి జిమ్నీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్.. 104.8 పీఎస్ పవర్, 134.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
హోండా మోటార్‌సైకిల్ కీలక ప్రకటన: ఆ బైకులకు రీకాల్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన 'సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్' బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. 2022 ఫిబ్రవరి - 2022 అక్టోబర్ మధ్య తయారైన బైకులలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.ఎన్ని బైకులు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయో.. కంపెనీ వెల్లడించలేదు. త్రాటల్ ఆపరేషన్ సమస్య వల్ల రైడర్.. రైడింగ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కంపెనీ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ సాఫ్ట్వేర్ అప్డేట్ రూపొందించనుంది.వారంటీతో సంబంధం లేకుండా ప్రభావిత బైక్‌లలో సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. హోండా బిగ్‌వింగ్ వెబ్సైట్లో VINని నమోదు చేయడం ద్వారా కస్టమర్లు.. తమ బైక్ జాబితాలో ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. ఈ బైక్ ధరలు మార్కెట్లో రూ. 16.01 లక్షల నుంచి రూ. 17.55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. -
సుజుకి హయబుసాకు రీకాల్: కారణం ఇదే..
భారతదేశంలో సుజుకి మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా'కు రీకాల్ ప్రకటించింది. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైకుకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, సమస్యను పరిష్కరించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.మూడవ తరం హయబుసాలలో బ్రేక్ సమస్య ఉన్నట్లు గుర్తించిన సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ స్వచ్ఛందంగానే రీకాల్ ప్రకటించింది. 2021 మార్చి - 2024 సెప్టెంబర్ మధ్య తయారైన సుమారు 1,056 బైకులలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. ఇది బైక్ రైడర్లను ప్రమాదంలోకి నెడుతుంది.ఇప్పటి వరకు ఈ సమస్యకు సంబంధించిన పిర్యాదులు నమోదు కాలేదు. కానీ భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. త్వరలోనే దీనిని పరిష్కరిస్తుందని సమాచారం. దీనికోసం కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేయదు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. -
90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. 'ఫ్యూయల్ పంప్లో సమస్య' కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా దీనిని పరిష్కరిస్తుంది.2024 నవంబర్ 5 నుంచి భారతదేశం అంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 2017 - అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధీకృత డీలర్‌షిప్‌ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా తమ వాహనాన్ని అధీకృత సర్వీస్ సెంటర్లో తనిఖీ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది.రీకాల్ అనేది అమేజ్ (18,851 యూనిట్లు), బ్రియో (3,317 యూనిట్లు), బీఆర్-వీ (4,386 యూనిట్లు), సిటీ (32,872 యూనిట్లు), జాజ్ (16,744 యూనిట్లు), డబ్ల్యుఆర్-వీ (14,298 యూనిట్లు) కార్లను ప్రభావితం చేస్తుంది.హోండా కార్స్ ఇండియా వెబ్‌సైట్‌లోని సర్వీస్ ట్యాబ్ ద్వారా ప్రోడక్ట్ అప్డేట్/రీకాల్ పేజీని సందర్శించి, వారి కారు 'వీఐఎన్'ను ఫిల్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనం రీకాల్ వల్ల ప్రభావితమైందో లేదో తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
7 లక్షల వాహనాలకు రీకాల్: బీఎండబ్ల్యూ కీలక ప్రకటన
బీఎండబ్ల్యూ కంపెనీ చైనాలో దాదాపు 7,00,000 బ్రాండ్ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని కూలెస్ట్ పంపులో ఏర్పడిన సమస్య కారణంగా జర్మన్ కార్‌మేకర్ ఈ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. ఇందులో స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లు మాత్రమే కాకుండా.. దిగుమతి చేసుకున్న కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ వెల్లడించింది.బీఎండబ్ల్యూ మోడళ్లలో అమర్చిన లోపభూయిష్ట కూలెస్ట్ పంప్ ప్లగ్‌లు తుప్పు పట్టే అవకాశం ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్లకు కారణమైతే.. వాహనంలో మంటలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు కంపెనీ దృష్టికి రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగా రీకాల్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.రీకాల్ ప్రకటించిన కార్లలో స్థానికంగా తయారైన బీఎండబ్ల్యూ 3 సిరీస్, 5 సిరీస్ వాహనాలు ఉన్నాయి. అలాగే దిగుమతి చేసుకున్న కార్లలో ఎక్స్ సిరీస్ కార్లు ఉన్నాయి. రీకాల్ కారణంగా కంపెనీ కార్ల సేల్స్ ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. గత నాలుగు సంవత్సరాల్లో అమ్మకాలు భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..కంపెనీ గత సెప్టెంబర్ నెలలో కూడా కాంటినెంటల్ ఏజీ ద్వారా సరఫరా చేసిన కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లలో సమస్య ఉందని గుర్తించి.. ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ లోపాన్ని కంపెనీ సరి చేయడానికి ఏకంగా 1.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు రీకాల్.. కారణం ఇదే
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య తయారు చేసిన బైకులకు రీకాల్ ప్రకటించింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో వెనుక, సైడ్ రిఫ్లెక్టర్లతో సమస్యను గుర్తించిన కంపెనీ, దీనిని పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించింది.నిర్దేశించిన సమయంలో తయారైన మోటార్‌సైకిళ్లలోని రిఫ్లెక్టర్లు.. రిఫ్లెక్టివ్ పనితీరు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల కాంతి తక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత దెబ్బతింటుంది. ఇది రోడ్డుపైన ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగానే రీకాల్ ప్రకటించింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..కంపెనీ ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. బైకులో ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ త్వరగా, సమర్ధవంతంగా ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. బ్రాండ్ సర్వీస్ టీమ్‌లు వారి సమీప సర్వీస్ సెంటర్లో రీప్లేస్మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రభావిత మోటార్‌సైకిళ్ల యజమానులను నేరుగా సంప్రదించనున్నట్లు సమాచారం. -
4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటన
అమెరికన్ వాహన తయారీ 'జనరల్ మోటార్స్' కంపెనీ 4,49,000 కంటే ఎక్కువ పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.కంపెనీ రీకాల్ ప్రకటించిన వాహనాల జాబితాలో.. 2023-2024 కాడిలాక్ ఎస్కలేడ్, ఎస్కలేడ్ ESVలు, 2023 చేవ్రొలెట్ సిల్వరాడో 1500, 2023-2024 చేవ్రొలెట్ టాహో, సబర్బన్ సిఐ 1500, 2023 జీఎంసి సియెర్రా 1500, 2023-24 జీఎంసి యుకాన్ ఎక్స్ఎల్ మోడల్స్ ఉన్నాయి.రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్వేర్ బ్రేక్ ఫ్లూయిడ్ కోల్పోయినప్పుడు వార్ణింగ్ ప్రదర్శించడంలో లోపం అని తెలుస్తోంది. ఇది బ్రేకింగ్ పనితీరును తగ్గిస్తుంది, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది.కంపెనీ వాహనాలను వినియోగిస్తున్న కస్టమర్లకు అక్టోబర్ 28న మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ సమస్యను కంపెనీ ఉచితంగా పరిష్కరిస్తుంది. దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్‌లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్లకు రీకాల్: ఎందుకో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సుమారు 7,20,796 యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఈ రీకాల్ ఎంధుకు ప్రకటించింది. దీనికయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎండబ్ల్యూ కంపెనీ తన కార్లలో వాటర్ పంప్లో ఒక లోపభూయిష్ట సీల్‌తో కూడిన సమస్య కారణంగా రీకాల్ ప్రకటించింది. ఈ లోపం కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రీకాల్ జెడ్4 కన్వర్టిబుల్తో సహా 2012 నుంచి 2018 మోడల్ సంవత్సరాల వరకు 12 మోడళ్లను ప్రకటించింది. ఇందులో 2,3,4,5 సిరీస్ కార్లు మాత్రమే కాకుండా ఎక్స్1, ఎక్స్3, ఎక్స్4, ఎక్స్5 కార్లు ఉన్నాయి.ఈ 'రీకాల్'కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే డీలర్లకు తెలియజేసింది. కస్టమర్లకు అక్టోబర్ ప్రారంభం నుంచి వెల్లడించే అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించడానికి కస్టమర్లు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే మొత్తం ఖర్చును కంపెనీ భరిస్తుంది. -
ఆల్టో కే10 కార్లకు రీకాల్.. మారుతి సుజుకి కీలక నిర్ణయం
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకి) 2,555 యూనిట్ల ఆల్టో కే10 కార్లకు రీకాల్ ప్రకటించచింది. స్టీరింగ్ గేర్ బాక్స్‌లో లోపం కారణంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.స్టీరింగ్ గేర్ బాక్స్‌లో తలెత్తిన సమస్య వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కంపెనీ భావిస్తోంది. కాబట్టి ఈ లోపాన్ని భర్తీ చేసేవరకు వాహనదారులు కార్లను డ్రైవ్ చేయవద్దని సంస్థ ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బాధిత వాహన యజమానులను మారుతి సుజుకి అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లు సంప్రదిస్తాయని కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. జూలై 30, 2019 - నవంబర్ 1, 2019 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో & 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్లను మార్చిలో రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఇప్పుడు ఆల్టో కే10 కోసం రీకాల్ ప్రకటించింది. -
16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి ఇస్తామని పేర్కొంది.టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్‌కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి. -
రూ.20.95 లక్షల బైక్‌కు రీకాల్ - కారణం ఇదే..
బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇటీవలే దేశీయ మార్కెట్లో రూ. 20.95 లక్షల (ఎక్స్ షోరూమ్) ఆర్ 1300 జీఎస్ బైక్ లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ బైకులకు రీకాల్ ప్రకటించింది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులో రిలే సరిగా పనిచేయడం లేదనే సమస్య కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య బైక్ నిలిచిపోవడానికి కారణమవుతుంది. 18 మార్చి 2024కి ముందు తయారు చేసిన బైకులలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. కాబట్టి వీటికి రీకాల్ ప్రకటించింది.రీకాల్ ప్రకటించిన బైకులలో సమస్యను పరిష్కారించడానికి కంపెనీ కొత్త ఎలక్ట్రోమెకానికల్ స్టార్టర్ రిలేను అమర్చనుంది. కంపెనీ 2024 మార్చి 18 ముందు సుమారు 25000 బైకులను తయారు చేసినట్లు.. వీటన్నంటికీ సంస్థ రీకాల్ ప్రకటించింది.ఇప్పటి వరకు బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ కంపెనీ ముందుగానే స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా ఈ బైకులలోని సమస్యను సంస్థ ఉచితంగా పరిష్కరించనుంది. -
సుజుకీ స్కూటర్ ఓనర్లకు అలర్ట్.. 4 లక్షల వాహనాలు రీకాల్!
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ భారత్‌లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్‌లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.సమస్య ఇదే..వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రాయింగ్ అవసరాలకు సరిపోని హై టెన్షన్ వైర్‌ను ఇగ్నిషన్ కాయిల్‌కు అమర్చడం వల్ల రన్నింగ్ సమయంలో వైర్ కోతలు పడటం, తెగిపోవడం జరుగుతోంది. దీంతో ఇంజన్ ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కోతలు పడిన హై టెన్షన్ వైర్ నీటితో తడిసినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ లీక్ దెబ్బతినే అవకాశం ఉంది.కాగా సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వీ-స్ట్రోమ్ 800 డీఈ (V-Strom 800 DE)కి సంబంధించిన 67 యూనిట్లను కూడా రీకాల్ చేసింది. లోపభూయిష్టమైన వెనుక టైర్ దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. బైక్ వెనుక వెనుక టైర్‌పై పగుళ్లు వస్తున్నాయని, టైర్ ట్రెడ్ బయటకు వచ్చేస్తోందని, టైర్ రూపం దెబ్బతింటోందని కంపెనీ పేర్కొంది. ఆయా వాహనాల యజమానులకు సంప్రదిస్తున్నమని అవసరమైతే వెనుక టైర్ రీప్లేస్ చేస్తామని వివరించింది. ఈ వాహనాలు 2023 మే 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 23 మధ్య కాలంలో తయారయ్యాయి. -
టెస్లా కీలక నిర్ణయం.. సైబర్ట్రక్లకు రీకాల్ - ఎందుకో తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులకు ముందు అమరికలో సైబర్‌ట్రక్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని రోజుల తరువాత కంపెనీ సుమారు 11,688 సైబర్ ట్రక్కులకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి? దీనికోసం కంపెనీ చార్జెస్ వసూలు చేస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెస్లా కంపెనీ లాంచ్ చేసిన ఈ సైబర్ ట్రక్కులను రీకాల్ చేయడానికి ప్రధాన కారణం.. విండ్‌షీల్డ్ వైపర్ పనిచేయకపోవడం, ట్రంక్ బెడ్ ట్రిమ్ సమస్య అని తెలుస్తోంది. ఈ రెండు సమస్యల కారణంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) వెల్లడించింది.ఏజెన్సీ ప్రకారం.. కొన్ని సందర్భాల్లో విండ్‌షీల్డ్ వైపర్ ఎటువంటి హెచ్చరిక లేకుండా విఫలమవుతుంది. ఇది వర్షం పడుతున్నప్పుడు సమయంలో ప్రమాదానికి కారణం అవ్వొచ్చని తెలుస్తోంది. 2023 నవంబర్ 13 నుంచి జూన్ 6 మధ్య తయారైన వాహనాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కస్టమర్లకు ఆగష్టు 18న మెయిల్ ద్వారా మెయిల్ అందుతుంది. ఈ రీకాల్ కోసం కంపెనీ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు.ఇప్పటి వరకు సైబర్ ట్రక్కుల వినియోగదారుల నుంచి దీనికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చని.. కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. దీనిని సైబర్‌ట్రక్ వినియోగదారులు సులభంగా ఎటువంటి చార్జీలు చెల్లించకుండా వినియోగించుకోవచ్చు. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్.. ఎందుకంటే..
హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన ఈవీ అయానిక్5 మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)ను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. జులై 21, 2022 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య తయారు చేసిన అయానిక్ 5 మోడల్ కార్లలో ఐసీసీయూలో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ ప్రతినిధి మాట్లాడుతూ..‘కార్ల రీకాల్ అంశాన్ని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (ఎస్ఐఏఎం)కు తెలియజేశాం. హ్యుందాయ్ మోటార్ ఇండియా కస్టమర్ భద్రతకు ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా 1,744 యూనిట్ల అయానిక్ 5 మోడల్కార్లను రీకాల్ చేస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్‌ను తనిఖీ చేసి ఏదైనా సమస్యలుంటే అప్‌గ్రేడ్ చేస్తాం. రీకాల్ ప్రక్రియలో కార్ల యజమానులతో సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు వ్యక్తిగతంగా సంప్రదిస్తాయి’ అని తెలిపారు. అయానిక్ 5 ప్రారంభ ధర రూ.46.05 లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది.ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!ఈ ఏడాదిలో కంపెనీకి చెందిన కార్లను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి జూన్ 6, 2023 మధ్య తయారు చేసిన క్రెటా, వెర్నా 7,698 యూనిట్లను ఫిబ్రవరిలో రీకాల్ చేశారు. -
1.25 లక్షల కార్లకు రీకాల్.. టెస్లా సంచలన నిర్ణయం
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఏకంగా 1,25,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్ ప్రకటించింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.రీకాల్ ప్రకటించిన కార్లలో 2012 - 2024 మధ్య తయారైన టెస్లా ఎస్ మోడల్, 2015 - 2024 మధ్య విడుదలైన ఎక్స్ మోడల్, 2017-2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి. సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నెల్ అందించాలి, కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా ఇది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి టెస్లా ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదు. కానీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను గురించినట్లు సమాచారం. -
ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
టెల్ అవీవ్: గాజాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతునే ఉంది. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రయాల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, నార్వే దేశాలలోని తమ రాయబారులు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం హోదాకు గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు. ‘‘నిస్సందేహంగా నేను ఐర్లాండ్, నార్వే దేశాలకు స్పష్టమైన సందేశం పంపతున్నా. మా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు హాని కలిగించే పరిస్థితులపై అస్సలు మౌనంగా ఉండము. మేము సాధించే లక్ష్యాలను ఐర్లాండ్, నార్వే దేశాలు అడ్డుకోలేవు. మా దేశ పౌరులకు భద్రత పునరుద్ధరిస్తాం. హమాస్‌ను అంతం చేసి, బంధీలను ఇంటికి చేరుస్తాం, ఇంతకు మించి ఏం జరగబోదు’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.మరోవైపు స్పెయిన్ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. తమ దేశం కూడా పాలస్తీనాను మే 28 నుంచి ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం వెల్లడించారు. దీంతో ఐర్లాండ్, నార్వేల వలే స్పెయిన్‌పై కూడా చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది.‘‘స్పానీష్ ప్రజల మెజార్టీ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటున్నాం. వచ్చే మంగళవారం(మే 28). మంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాలస్తీనా ప్రత్యేక దేశం గుర్తింపు విషయంలో ఆమోదం తెలుపుతాం. శాంతి, న్యాయంల కోసం ఆ నిర్ణయం మాటాలను నుంచి కార్యరూపం దాల్చుతుంది’’ అని పెడ్రో శాంచెజ్ తెలిపారు. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా నిస్సాన్ కంపెనీ తయారుచేసిన మ్యాగ్నైట్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2023 మధ్య తయారైన ఈ మోడళ్లలో ముందు డోరు హ్యాండిల్ సెన్సార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ఈవీ పాలసీపై చర్చకు హాజరైన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు ఎన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, గతేడాది డిసెంబర్ తర్వాత తయారైన మోడళ్లలో ఈ సమస్య లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ కస్టమర్లకు చేరవేశామని కంపెనీ చెప్పింది. కంపెనీ గుర్తింపు పొందిన సర్వీస్ కేంద్రాల్లో ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని సంస్థ పేర్కొంది. -
ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్ చేసిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కంపెనీకు చెందిన 16,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాహనతయారీ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా కృషిచేస్తాయి. కొన్నిసార్లు ఆ ఉత్పత్తుల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో తిరిగి వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే ఇంధన పంప్ మోటార్లో లోపం ఉన్న విడి భాగాన్ని సరిచేసేందుకు బాలెనో, వ్యాగన్ఆర్ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు (రీకాల్) మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. 2019 జులై 30 నుంచి నవంబరు 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4190 వ్యాగన్ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇంధన పంప్ మోటార్ భాగంలో లోపం ఉంటే, అరుదుగా ఇంజిన్ నిలిచిపోవడం లేదా స్టార్టింగ్ సమస్య తలెత్తవచ్చని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ అధీకృత డీలర్ వర్క్‌షాప్‌ల నుంచి ప్రభావిత వాహన యాజమానులకు సమాచారం ఇవ్వనుంది. లోపాలు ఉండే అవకాశం ఉన్న విడిభాగాలను ఉచితంగా మార్చనుంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో కంపెనీ కార్లను రీకాల్ చేయలేదని తెలిసింది. మారుతీ సుజుకీ కంపెనీ ఇటీవల ఇన్విక్టో, జిమ్నీ, ప్రాంన్క్స్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కంపెనీ తయారుచేసిన అరెనా, నెక్సా, ట్రూవాల్యూ మోడళ్లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి మొదటివారం వరకు కంపెనీ 43.82 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. 2020లో అది 31.59 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు -
4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే..
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ అయిన కియా మధ్యస్థాయి ఎస్యూవీ సెల్టోస్ పెట్రోల్ మోడల్ కారులో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణ వ్యవస్థలో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా 4,358 కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 వరకు తయారు చేసిన జీ1.5 పెట్రోల్ సెల్టోస్ (ఐవీటీ ట్రాన్స్మిషన్) కార్లు కొన్నింటిలో ఈ లోపం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల వాహనం ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపింది. లోపాలున్న భాగాలను మార్చి ఇస్తామని, ఇప్పటికే సంబంధిత కార్ల యజమానులకు సమాచారం ఇచ్చినట్లు కియా ఇండియా చెప్పింది. -
అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా USAలో దాదాపు 2,00,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్‌లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయకపోవచ్చనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. టెస్లా రీకాల్ అనేది 2023 మోడల్ ఎస్, ఎక్స్, వై వాహనాలకు వర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ 4.0ని కలిగి ఉన్నాయి. ఇది 2023.44.30 సాఫ్ట్వేర్ వెర్షన్‌పై పనిచేస్తుంది. ప్రస్తుతానికి టెస్లా కార్లలో ఈ లోపాలకు సంబంధించిన ఎలాంటి ప్రమాదం జరగలేదని టెస్లా యూఎస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు తెలిపింది. భవిష్యత్తులో కూడా టెస్లా కార్లలో ఎలాంటి సమస్య తలెత్తకూడదనే భావనతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కంపెనీ జనవరి 12 నుంచి రీకాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నష్టాల్లో టెస్లా.. ఇదిలా ఉండగా టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలిసింది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది. -
11.2 లక్షల టయోటా కార్లు వెనక్కి! అగ్ర రాజ్యంలో అత్యధికం..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 11.2 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇన్ని కార్లకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, ఈ కార్లలో ఉన్న లోపాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 మధ్యలో తయారైన అవలాన్, కామ్రీ, కరోలా, ఆర్ఏవీ4, లెక్సస్ ఈఎస్ 250, ఈఎస్300హెచ్, ఈఎస్350, ఆర్ఎక్స్350 హైల్యాండర్, సియన్నా హైబ్రిడ్ వెహికిల్స్ వంటి వాటికి రీకాల్ ప్రకటించింది. సమస్య ఏంటంటే? 2020 నుంచి 2022 మధ్యలో తయారైన ఈ కార్లలో ఎయిర్ బ్యాగులో ఏర్పడే లోపం కారణంగా ఆక్యుపెంట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (OCS) సెన్సార్లకు సంబంధిచిన సమస్యలు తలెత్తవచ్చని సంస్థ భావించి, దీనిని భర్తీ చేయడానికి ఈ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒక్క అమెరికాలో మాత్రమే సుమారు 10 లక్షల కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. రీకాల్ సమయంలో సదరు వినియోదారుడు తన కారుని కంపెనీ అధికారిక డీలర్షిప్ వద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ కార్ ఓనర్లకు సమాచారం అందించలేదని, 2024 ఫిబ్రవరి సమయంలో అందరికి సమాచారం అందించే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! కార్లలోని లోపాలకు పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు, గతంలో చాలా కంపెనీలు ఇలా రీకాల్ ప్రకటించి సమస్యలను పరిష్కరించాయి. ఇటీవల టెస్లా కూడా ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. -
20 లక్షల టెస్లా కార్లు వెనక్కి.. కారణం ఏంటంటే?
అగ్రరాజ్యం అమెరికాలో టెస్లా కంపెనీ సుమారు 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? కారులో రీప్లేస్ చేయాల్సిన భాగాలూ ఏమైనా ఉన్నాయా.. అనే మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. కంపెనీకి చెందిన దాదాపు రెండు మిలియన్స్ కార్లలో ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి రీకాల్ చేసింది. ఇందులో 2015 నుంచి మార్కెట్లో విక్రయించిన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆటోపైలట్ యాక్టివేట్ సిస్టం అనేది సెల్ఫ్-డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్‌ను హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేక ప్రమాదాలకు దారితీసినట్లు అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' వెల్లడించింది. ఈ దర్యాప్తు మొదలైన సుమారు రెండు సంవత్సరాల తర్వాత కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి రీకాల్ ప్రకటించడం జరిగింది. ఇదీ చదవండి: రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్.. సెల్ఫ్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు డ్రైవర్‌ను ఉంచడానికి ఆటోపైలట్ చర్యలు సరిపోకపోవచ్చని, తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిశోధనలో తేలింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో టెస్లా మోడల్ వై, ఎస్, 3 మాత్రమే కాకుండా 2012 నుంచి 2023 మధ్య ఉత్పత్తి అయిన టెస్లా మోడల్ ఎక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ నిర్దేశించిన సమయంలో టెస్లా కార్లను కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు వారి కారులోని సమస్యను ఇప్పుడు రీకాల్ సమయంలో సులభంగా పరిష్కరించుకోవచ్చు. -
లోపాన్ని సరిచేసేందుకే దిగ్గజ కంపెనీ కార్ల రీకాల్
డెట్రాయిట్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్ చేసింది. ఇవి సుమారు 20 లక్షల పైచిలుకు ఉంటాయి. 2012 అక్టోబర్ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. ఆటోపైలట్ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరి చేసేందుకు, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. డ్రైవర్లకు జారీ చేసే హెచ్చరికలు, అలర్ట్‌లను సాఫ్ట్వేర్ అప్డేట్ మరింతగా పెంచుతుందని, అలాగే ఆటోపైలట్ బేసిక్ వెర్షన్లు పని చేయగలిగే పరిధిని కూడా నియంత్రిస్తుందని పేర్కొంది. ఆటోపైలట్ పాక్షికంగా వినియోగంలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలపై జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత ఏజెన్సీ రెండేళ్ల పాటు దర్యాప్తు నిర్వహించిన మీదట టెస్లా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోపైలట్ మోడ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచేందుకు టెస్లా కార్లలో తీసుకున్న జాగ్రత్త చర్యలు తగినంత స్థాయిలో లేవని దర్యాప్తులో ఏజెన్సీ అభిప్రాయపడింది. పేరుకు ఆటోపైలట్ సిస్టమ్ అయినప్పటికీ ఇది డ్రైవర్‌కు కొంత అసిస్టెంట్‌గా మాత్రమే పని చేయగలదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే (తన లేన్‌లో) వాహనాన్ని నడపడం, యాక్సిలరేట్ చేయడం, బ్రేక్‌లు వేయడం మొదలైన పనులు చేస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో డ్రైవరు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తనే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఈ జాగ్రత్తలను పక్కన పెట్టి ఆటోపైలట్‌ను ఆన్ చేసి వెనక సీట్లో కూర్చోవడం లేదా తాగేసి కూర్చోవడం వంటివి చేస్తుండటమే ప్రమాదాలకు దారి తీస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది. -
ఆ బైకులు కొన్నవారికి షాక్.. రీకాల్ ప్రకటించిన కంపెనీ!
Honda Motorcycle & Scooter: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఈ రోజు హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ బైకులపై ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పటికీ కంపెనీ తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ రెండు బైకుల విడిభాగాల్లో లోపం ఉందని, వాటిని సరి చేయదనే ఈ రీకాల్ ప్రకటించినట్లు స్పష్టం చేసింది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ రావొచ్చనే అనుమానంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ వచ్చినట్లైతే నీరు లోపలి వెళ్లే అవకాశం ఉందని, తద్వారా లోపల తుప్పు పట్టే అవకాశం ఉందని కంపెనీ ముందుగానే ఊహించింది. 2020 ఆక్టోబర్ నుంచి 2023 జనవరి మధ్యలో తయారైన బైకులలో ఈ సమస్య తలెత్తవచ్చని.. వాటిని డిసెంబర్ 2023 రెండవ వారం నుంచి బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకురావాలని కంపెనీ తెలిపింది. బైక్ వారంటీ స్థితితో సంబంధం లేకుండా నాసిరకం భాగాలు ఉచితంగా భర్తీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే అయితే ఎన్ని బైక్స్‌పై ఈ ప్రభావం ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ వెల్లడించినట్లు 2020 - 2023 మధ్య కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. -
'డైజీన్ సిరప్' వాడుతున్నారా? వెంటనే ఆపేయండి! లేదంటే..
ప్రముఖ ఔషధాల తయారీదారు 'అబాట్ ఇండియా' (Abbott India) తన గోవా ఫెసిలిటీలో తయారు చేసిన యాంటాసిడ్ సిరప్ 'డైజీన్ జెల్'కి సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణం ఏంటి? దీని వినియోగం వల్ల వచ్చే ప్రమాదమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పింక్ కలర్లో ఉన్న ఈ మెడిసిన్‌ని వినియోగదారులు ఆగస్టు ప్రారంభంలో కొనుగోలు చేసినప్పుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా, ఘాటైన వాసన కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అబాట్ యాంటాసిడ్ డైజీన్ జెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటాసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరింది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని, దీని వల్ల రోగి ప్రతికూల ప్రభావాణ్ణి ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! నిజానికి డైజీన్ సిరప్ లేదా మాత్రలు అసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటిని నివారించడంలో ఉపయోగిస్తారు. అయితే ఈ సమస్యల కోసం ఈ ఔషధం ఉపయోగించే వారు వెంటనే నిలిపివేయాలి. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ ప్రొడక్ట్‌కి రీకాల్ ప్రకటించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా దీనిని ఎవరైనా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఔషధం వినియోగించిన వ్యక్తికి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే దాని గురించి తెలియజేయాలని DCGI ఆదేశించింది. -
మహీంద్రా కీలక నిర్ణయం..ఎక్స్‌యూవీ 700 కార్లను వెనక్కి ఇచ్చేయండి
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌యూవీ 700 కార్ల ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్‌లో లోపాల్ని గుర్తించింది. వెంటనే ఈ సమస్య ఉన్న కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, 2021 జూన్ 8 నుంచి 2023 జూన్ 28 మధ్య తయారైన మొత్తం 1,08,306 కార్లలో ఈ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌యూవీ 700తో పాటు, ఎక్స్‌యూవీ 400 ఎస్‌యూవీలను సైతం రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్ 5 మధ్య తయారైన 3,560 కార్లలో బ్రేక్ పొటెన్షియోమీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్‌లో లోపాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కార్లను సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కార్లలో సమస్యల్ని గుర్తించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా బాగు చేసి కస్టమర్లకు అందిస్తామని స్పష్టం చేసింది. -
87,599 కార్లకు రీకాల్ ప్రకటించిన దిగ్గజ కంపెనీ - కారణం ఇదే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో సుమారు 87,599 ఎస్-ప్రెస్సో & ఈకో కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, మారుతి సుజుకి తన ఎస్ ప్రెస్సో అండ్ ఈకో కార్లలో స్టీరింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించింది. ఇది వెహికల్ స్టీరబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2021 జులై 05 నుంచి 2023 ఫిబ్రవరి 15 మధ్య తయారైన ఎస్ ప్రెస్సో & ఈకో కార్లకు మాత్రమే రీకాల్ ప్రకటించడం జరిగింది. కావున కస్టమర్లు ఈ సమస్యను సంబంధిత డీలర్‌షిప్‌లలో చెక్ చేసుకుని తగిన పరిష్కారం పొందవచ్చు. ఈ సర్వీస్ మొత్తం ఉచితంగానే లభిస్తుంది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) మారుతి సుజుకి ఈ సంవత్సరంలో రీకాల్ చేయడం ఇది నాలుగవ సారి కావడం గమనార్హం. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 1,23,351 యూనిట్లను రీకాల్ చేసింది. కార్లను రీకాల్ చేయడం మన దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా వంటి కంపనీలు కూడా రీకాల్ ప్రకటించాయి. -
హోండా కస్టమర్లకు షాక్.. 13 లక్షల కార్లు వెనక్కి!
Honda Recall: ప్రపంచ మార్కెట్లో వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో అనేక కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ 'హోండా' (Honda) సుమారు 13 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ఎక్కడ ప్రకటించింది? దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, హోండా అమెరికాలోనే 12 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. అంతే కాకుండా కెనడా నుంచి 88,000 & మెక్సికోలో 16,000 కార్ల మీద ఈ ప్రభావం పడినట్లు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) తెలిపింది. ఇందులో 2018 నుంచి 2023 మధ్య నిర్మించిన 'ఒడిస్సి', 2019 నుంచి 2022 మధ్య తయారైన పైలట్, 2019 - 2023 మధ్య విడుదలైన హోండా పాస్‌పోర్ట్ మోడల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో ఎక్కువ అమ్ముడయ్యే కార్లు - ఇక్కడ చూడండి!) రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. లోపభూయిష్టమైన కమ్యూనికేషన్ కోక్సియల్ కేబుల్ కనెక్టర్ కలిగి ఉండటం వల్ల 'రియర్ వ్యూ కెమెరా'లో సమస్య ఏర్పడే అవకాశం ఉండటమే. ఈ సమస్యను తొలగించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది. సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ సంవత్సరాల్లో ఉత్పత్తయిన కార్లు కలిగిన వినియోగదారులు సమస్యను ఈ రీకాల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సమస్య మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ముందుగానే కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడం కోసం రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రీకాల్ భారతదేశంలో ప్రకటించలేదు. -
కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థలైన కియా, హ్యుందాయ్ కంపెనీల కార్లను అమెరికా దేశంలో రీకాల్ చేసేయాలని ఆ దేశ ఫెడరల్ ప్రభత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. ఎందుకంటే ఆ కార్లను సులువుగా దొంగిలిస్తున్నారట. ‘అసోసియేటెడ్ ప్రెస్’ కథనం ప్రకారం.. అమెరికాలోని 17 రాష్ట్రాల అటార్నీ జనరల్‌లు మిలియన్ల కొద్దీ కియా, హ్యుందాయ్ కార్లను రీకాల్ చేయాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! అమెరికా దేశంలో గత దశాబ్దంలో విక్రయించిన కొన్ని కియా, హ్యుందాయ్ కార్లలో ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు లేవు. వీటిని చాలా కార్లలో ప్రామాణిక ఫీచర్‌గా పరిగణిస్తారు. కీ లేకుండా ఇంజిన్‌ను స్టార్ట్ చేయకుండా ఈ ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు నిరోధిస్తాయి. కేవలం స్క్రూడ్రైవర్, యూఎస్బీ కేబుల్‌తో కియా, హ్యుందాయ్ కార్లను ఎలా కొట్టేయొచ్చో చూపించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లో దర్శనమిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో కేవలం హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 2022లో దాదాపు 85 శాతం పెరిగాయి. నగరంలో జరిగిన మొత్తం కార్ల దొంగతనాలలో హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 20 శాతం ఉన్నాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. దొంగిలించిన ఈ కార్లు 14 ప్రమాదాలు, ఎనిమిది మరణాలకు కారణమయ్యాయని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంటోంది. గత అక్టోబరులో న్యూయార్క్‌లోని బఫెలోలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు టీనేజర్లు చనిపోయారు. టిక్‌టాక్ ఛాలెంజ్‌లో భాగంగా కియా కారును దొంగిలించిన ఆరుగురు యువకులు వేగంగా దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా, ఇతర అటార్నీ జనరల్‌లు కియా, హ్యుందాయ్ కార్ల దేశవ్యాప్త రీకాల్‌ను అభ్యర్థిస్తూ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ పంపారు. కియా, హ్యుందాయ్ కంపెనీలు తమ అనేక వాహనాలకు ప్రామాణిక భద్రతా ఫీచర్లను కల్పించడంలో విఫలమవడం వల్ల వాహనదారులను, సామాన్య ప్రజలను ప్రమాదంలో పడేశాయని ఆరోపించారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
పాపులర్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?
అతి తక్కువ కాలంలోనే యువ రైడర్ల మనసు దోచిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు సుమారు 5,000 యూనిట్ల హిమాలయన్ బైకులకు రీకాల్ ప్రకటించింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ప్రకారం, శీతాకాలంలో రోడ్లను ట్రీట్ చేయడానికి ఉపయోగించే ఉప్పు బైక్ బ్రేక్ పనితీరు తగ్గిస్తుంది, లేదా మొత్తం నష్టానికి కారణమవుతుందని నివేదించింది. కంపెనీ 2017 - 2021 మధ్య తయారు చేసిన 4,891 యూనిట్ల హిమాలయన్ బైకులు దీనికి ప్రభావయుతమయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే డీలర్లు ప్రభావిత వాహనాల ముందు, వెనుక బ్రేక్ కాలిపర్లను రీప్లేస్ చేస్తారు. 2021 తర్వాత విడుదలైన బైకులు ఈ సమస్యకు ప్రభవితమయ్యే అవకాశం లేదు. గతంలో కూడా హిమాలయన్కు రీకాల్ ప్రకటించారు. అప్పుడు యుకె, యూరప్, దక్షిణ కొరియా దేశాలలో రీకాల్ ప్రకటించారు. ఇప్పుడు అదే సమస్యకు గాను అమెరికాలో రీకాల్ ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ మోడల్ బైకులకు రీకాల్ ప్రకటించడంపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పటివరకు భారతదేశంలోని బైకులలో ఎటువంటి సమస్య నమోదు కాకపోవడం గమనార్హం. -
నిస్సాన్ కస్టమర్లకు భారీ షాక్: 8 లక్షల కార్లు రీకాల్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ తన కస్టమర్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. అమెరికా, కెనడాలో దాదాపు 8 లక్షల కార్లను రీకాల్ చేస్తోంది. ఇంజీన్‌లో లోపం కారణంగా ఈ భారీ రీకాల్ చేపట్టింది. 2014 నుండి 2020లో కొన్న రోగ్ మోడల్ కార్లను, అలాగే 2017 నుండి 2022 వరకు విక్రయించిన రోగ్ స్పోర్ట్స్ కార్లను వెనక్కి తీసుకోనుంది. ఈ కార్లలో జాక్‌నైఫ్ ఫోల్డింగ్ కీ పూర్తిగా తెరుచుకోక పోవచ్చని, కీని పాక్షికంగా తిప్పి, డ్రైవ్ చేస్తే, డ్రైవర్ ఫోబ్‌ను తాకడం, లేదా ఇంజీన్ ఆగిపోవడం లాంటివి జరగవచ్చని నిస్సాన్ తెలిపింది. అంతేకాదు దీని కారణంగా ఇంజిన్ పవర్ , పవర్ బ్రేక్‌లను కోల్పోయేలా చేస్తుంది. కారు క్రాష్ అవవ్వొచ్చు. ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కాకపోవచ్చు అని తెలిపింది. అయితే ప్రమాద తీవ్రతపై స్పష్టత లేదని పేర్కొంది. ఫలితంగా అమెరికా, కెనడాలో 809,000 కంటే ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది.అలాగే సంబంధిత కారు యజమానులకు ఈ మార్చి నెలలో సమాచారం అందిస్తున్నట్టు తెలిపింది. -
టెస్టింగ్‌లో ఫెయిలైన సన్‌ఫార్మ హైబీపీ జెనరిక్ డ్రగ్: భారీ రీకాల్
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాకు అమెరికాలో భారీ షాక్ తగిలింది. అధిక రక్తపోటు చికిత్సలో వాడే జనరిక్ మందు అమెరికా మార్కెట్లో డిసల్యూషన్ టెస్టింగ్‌లో విఫలమైంది. దీంతో 34వేలకు పైగా జెనరిక్ మందుల బాటిళ్లను రీకాల్ చేస్తోంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలోని సన్ ఫార్మాకు చెందిన ఏంజినా అధిక రక్తపోటు, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ సమస్యకు చికిత్స చేయడానికి ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను రీకాల్ చేస్తోంది. వీటిని వాడటంతో తాత్కాలిక లేదా వైద్యపరంగా రివర్సిబుల్ ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు కారణం కావచ్చు లేదా తీవ్రమైన ప్రతికూల ఆరోగ్య పరిణామాల సంభవించవచ్చని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరించింది. "స్టెబిలిటీ టెస్టింగ్ సమయంలో ఫెయిల్డ్ ఇంప్యూరిటీ(డీసెటైల్ డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్) స్పెసిఫికేషన్, ఎఫ్‌డీఏ ల్యాబ్‌లో డిసోల్యూషన్ టెస్టింగ్ ఫెయిల్యూర్ కారణంగా ప్రభావితమైన లాట్‌ను రీకాల్ చేస్తోంది. ముంబైకి చెందిన డ్రగ్ మేజర్ గుజరాత్‌లోని ప్లాంట్లోవీటిని ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 13న క్లాస్ II దేశవ్యాప్తంగా రీకాల్ (అమెరికా)ను ప్రారంభించింది. కాగా మల్టిపుల్ మైలోమా చికిత్సలో ఉపయోగించే జెనరిక్ ఔషధాల విక్రయాలకు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ ఆమోదం పొందినట్టు సన్‌ఫార్మ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
6 వేల మందిపై ‘ఫిలిప్స్’ కంపెనీ వేటు...కారణం ఇదే
ప్రముఖ వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ వరల్డ్ వైడ్‌గా వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు నెలల ముందు ఫిలిప్స్ సంస్థ 4వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. తాజాగా సిబ్బందికి పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు జాకబ్స్ తెలిపారు. ఇది కష్టతరమైన సమయం, కానీ తప్పడం లేదంటూ ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. 2025 నాటికి వర్క్ ఫోర్స్‌ను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 3వేల మందిని, 2025 నాటికి మొత్తం 6వేల మందిని తొలగిస్తామని అన్నారు. ఫిలిప్స్ సంస్థ నిద్రలేమని సమస్యతో బాధపడే వారి కోసం స్లీప్ రెస్పిరేటర్లను చేసింది. వాటి వల్ల వినియోగదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ రెస్పిరేటర్లను రీకాల్ చేసింది. వెరసీ ఫిలిప్స్ కంపెనీ గత ఏడాది క్యూ4లో సుమారు 114 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది మొత్తం ఆ కంపెనీ సుమారు 1.605 బిలియన్ల యూరోలు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. -
ఈ కార్లకు జనాల్లో ఫుల్ క్రేజ్..కానీ ఇప్పుడు షెడ్డుకు చేరిన వేల కార్లు!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 9,125 కార్లను రీకాల్ చేస్తోంది. మార్కెట్లో విపరీతంగా అమ్ముడు పోతున్న సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా కార్లలో ముందు వరుస సీట్ల బెల్ట్లలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవి 2022 నవంబర్ 2–28 తేదీల్లో తయారైనవని కంపెనీ తెలిపింది. షోల్డర్ హైట్ అడ్జెస్టర్ ఉప భాగాలలో ఒకదానిలో లోపం ఉందని అనుమానిస్తున్నామని, ఇది అరుదైన సందర్భంలో సీట్ బెల్ట్ విడదీయడానికి దారితీయవచ్చని మారుతీ సుజుకీ వెల్లడించింది. వాహనాలను తనిఖీ చేసి, లోపం ఉన్న భాగాన్ని భర్తీ చేయడం కోసం ఉచితంగా రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వివరించింది. అధీకృత వర్క్‌షాప్‌ల నుండి సంబంధిత కార్ల యజమానులకు సమాచారం వెళుతుందని తెలిపింది. -
కొనుగోలుదారులకు భారీ షాక్, మహీంద్రా కార్లలో లోపాలు..రీకాల్‌కు పిలుపు
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసిన కార్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కార్లలో వేడిని నిరోధించేందుకు సింథటిక్ ఎలాస్టోమర్ నుంచి తయారు చేసిన రబ్బర్ బెలో’లో లోపాలు తలెత్తుతున్నట్లు తేలింది. దీంతో మహీంద్రా యాజమాన్యం ఈ ఏడాది జులై 1 నుంచి నవంబర్ 11 వరకు మ్యానిఫ్యాక్చరింగ్ చేసిన 6618 స్కార్పియో - ఎన్ కార్లను, ఎక్సయూవీ - 700 వేరియంట్‌కు చెందిన 12,566 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. కార్లలోని తలెత్తుతున్న లోపాలపై మహీంద్రా యాజమాన్యం స్పందించింది. కార్లలో ఉండే బెల్ హౌసింగ్ లోపల రబ్బరు బెలో’ ఏం సంస్థ తయారు చేసింది. ఏయే తేదీలలో వాటిని తయారు చేశారో గుర్తించి, క్రమబద్దీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం వాహనాదారులకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత డీలర్ షిప్ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలని కోరింది. నాణ్యతలో రాజీపడం అంతేకాదు సంస్థ తయారు చేసే కార్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడమని, అలాగే ప్రస్తుతం కార్లలోని లోపాల్ని గుర్తించడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు మహీంద్రా సంస్థ తెలిపిన వివరాల మేరకు..మహీంద్రా ఎక్స్‌యూవీ 700, స్కార్పియో - ఎన్లు కార్లు వాహనదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఒక్క ఆగస్ట్ నెలలో ఈ రెండు కార్లు సుమారు 2.40 లక్షలు ఓపెన్ బుకింగ్స్ అయ్యాయని..ఆ బుకింగ్స్ చేసుకున్న కార్లు కొనుగులో దారులకు చేరాలంటే 20 నుంచి 24 నెలల సమయం పడుతుందన్నారు. అందుకు మార్కెట్లో ఈ కార్లు ఉన్న డిమాండేనని చెప్పారు. ఇక ఇదే ఏడాది జులై నెలలో స్కార్పియో ఎన్ వేరియంట్ లక్ష కార్లను వాహనదారులు బుక్ చేసుకోగా.. ట్రాప్ - ఎండ్ ట్రిమ్ కార్ల కోసం 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉంది. మిగిలిన వేరియంట్ కార్లను కొనుగులో చేసిన కస్టమర్ల దగ్గరికి చేరుకునేందుకు 20-24 నెలల సమయం పట్టనున్నట్లు స్పష్టం చేశారు. చదవండి👉 ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
ఎలాన్ మస్క్‌కు మరో దెబ్బ.. ఆ మోడల్ టెస్లా కారులో లోపాలు, చేసేదేమిలేక..
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీ వినియోగదారుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన 30 వేలకు పైగా వాహనాలను రీకాల్ చేసింది. తమ వాహనాలలోని లోపాలు ఉన్న భాగాలను రిపేర్/రీప్లేస్ చేయడానికే టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోడల్ ఎక్స్ (Model X) కార్లలో ఎయిర్‌బ్యాగ్ అమరికలో లోపాలు ఉన్నాయని కంపెనీ గుర్తించింది. ఈ సమస్య వల్ల కారు ముందు కూర్చునే ప్యాసింజర్లకు ప్రమాద సమయల్లో గాయాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ మోడల్లోని 30 వేల కార్లను రీకాల్ చేసింది. ఈ సమస్యను ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ పరిష్కరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో.. కఠినమైన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా గుంతలలో ప్రయాణించేటప్పుడు మోడల్ ఎస్ (Model S), మోడల్ ఎక్స్ (Model X) కార్లలో పవర్ స్టీరింగ్ సమస్య ఏర్పడుతోందని, ఆ మోడల్లోని 40,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు టెస్లా షేర్లు దాదాపు 3 శాతం క్షీణించి రేండేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే ట్విటర్లోని పరిణామాలు మస్క్‌కి తలనొప్పిగా ఉంటే తాజాగా టెస్లా షేర్లు పతనం కావడం దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. చదవండి: భారత్‌లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం! -
71 వేల కార్స్ ను రీకాల్ చేసిన కియా ..
-
రాయదుర్గం భూములపై సర్కార్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం భూములపై సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి.. కోర్టును తప్పుదోవ పట్టించారని ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం గ్రామంలోని సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమిపై ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలతో హక్కులు పొందారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. ఈ భూ ములకు సంబంధించి ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ ప్రియదర్శిని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయ వాది సీఎస్ వైద్యనాథన్‌వాదనలు వినిపించారు. విచారణ అర్హతను మాత్రమే సమీక్షిస్తా మని చెప్పిన హైకోర్టు 84 ఎకరాల భూమిపై హక్కులు ఇస్తూ తీర్పునిచి్చందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వాదనను వినాల్సి ఉండ గా, ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలను కోర్టుకు సమ ర్పించారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తులు లింగయ్య, మరికొందరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రీకాల్ పిటిషన్‌పై విచారణ సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పేర్కొన్నారు. చదవండి: సీఎం ఫాంహౌస్ కోసమే ‘రీజినల్’ అలైన్మెంట్ మార్పు -
మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్!
ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్ తగిలింది. బెంజ్ కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాల్ని జర్మన్ ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎత్తిచూపించింది. వెంటనే బెంజ్‌కు చెందిన 1మిలియన్ కార్లను రీకాల్ చేయాలని స్పష్టం చేసింది. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ప్రకారం.. 2004 - 2015 మధ్య కాలంలో తయారు చేసిన ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సిరీస్‌తో పాటు ఆర్ -క్లాస్ లగ్జరీ మినివాన్ వంటి కార్లలో ఈ లోపం తలెత్తినట్లు స్పష్టం చేసింది. మెర్సిడెస్ సైతం కార్లను రీకాల్‌ను ఏఎఫ్పీకి ధృవీకరించింది. కొన్ని సందర్భాలలో బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఇక బెంజ్ ప్రపంచవ్యాప్తంగా 993,000 వాహనాలు రీకాల్ చేయబడుతున్నాయి. వాటిలో 70,000 వెహికల్స్ జర్మనీలో ఉన్నాయని ఏఎఫ్‌పీ నివేదించింది. -
అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్
న్యూఢిల్లీ: పలు కారణాలతో అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, జూబిలెంట్ సంస్థలు వివిధ ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ఒక నివేదికలో పేర్కొంది. విటమిన్ బీ12 లోపం చికిత్సలో ఉపయోగించే సైనాకోబాలమిన్ ఇంజెక్షన్‌కు సంబంధించి 4.33 లక్షల వయాల్స్‌ను అరబిందో ఫార్మా రీకాల్ చేస్తోంది. ఏప్రిల్ 5న ఈ ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు, కళ్లలో సహజసిద్ధంగా నీటి ఉత్పత్తిని చేసేందుకు తోడ్పడే ’సెక్వా’ ఔషధాన్ని సన్ ఫార్మా వెనక్కి రప్పిస్తోంది. ఏప్రిల్ 1న ఈ ప్రక్రియ ప్రారంభించింది. అటు జూబిలెంట్ క్యాడిస్టా ఫార్మా .. మిథైల్ప్రెడ్నిసొలోన్ ట్యాబ్లెట్లకు సంబంధించి 19,222 బాటిల్స్‌ను రీకాల్ చేస్తోంది. -
ఆ స్కూటర్లు కూడా రీకాల్.. ఒకినావా బాటలో ప్యూర్ ఈవీ
ఎన్నో అంచనాల మధ్య మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకి ఫైర్ యాక్సిడెంట్లు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. దీంతో తమ కంపెనీకి చెందిన స్కూటర్ల నాణ్యతను పరిశీలించేందుకు అనేక ఈవీ కంపెనీలో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే హర్యానాకు చెందిన ఒకినావా తమ కంపెనీ స్కూటర్లను రీకాల్ చేయగా తాజాగా హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ కూడా రీకాల్ బాట పట్టింది. హైదరాబాద్ స్టార్టప్ కంపెనీగా ఇప్పుడిప్పుడే మార్కెట్లో దూసుకుపోతుంది ప్యూర్ ఈవీ సంస్థ. అనతి కాలంలోనే మార్కెట్లో పట్టు సాధించింది. అయితే ఇటీవల చెన్నైలో ప్యూర్ ఈవీకి చెందిన ఓ స్కూటర్ తగలబడిపోయింది. మరుసటి రోజే నిజామాబాద్‌లో ఛార్జింగ్‌లో ఉండగా ఒక్కసారిగా బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ఇప్పటికే అమ్ముడైన స్కూటర్లను రీకాల్ చేసి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ప్యూర్ ఈవీ నిర్ణయించింది. ప్యూర్ ఈవీకి చెందిన ఎంట్రన్స్ ప్లస్, పీ ప్లూటో 7జీ మోడల్స్‌కి సంబంధించి మొత్తం 2,000 స్కూటర్లను రీకాల్ చేయాలని నిర్ణయించారు. ఈ కంపెనీకి చెందిన డీలర్ల ద్వారా స్కూటర్లను వెనక్కి తెప్పించుకుని బ్యాటరీల పనితీరు ఛార్జింగ్ అవుతున్న విధానం గురించి మరోసారి పరిశీలించనున్నారు. చదవండి: ఆ స్కూటర్లు వెనక్కి తీసుకుంటాం -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయాలపై... సీబీఐ విచారణకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్ పిటిషన్‌ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ ధర 4% పైగా పెరిగి రూ.334. 05 వద్ద ముగిసింది. హిందుస్తాన్ జింక్‌పై ఎన్జీటీ రూ.25 కోట్ల జరిమానా రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యావరణ సంబంధ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వేదాంతా గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.25 కోట్ల జరిమానా విధించింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి హిందుస్తాన్ జింక్ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణ. మూడు వారాల్లో జరిమానా మొత్తాలను జిల్లా మేజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలని ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఏకే గోయెల్ ఆదేశించారు. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించడంసహా, బాధిత గ్రామాల్లో చెట్లునాటడం తదితర చర్యలు తీసుకుంటామని హిందుస్తాన్ జింక్ ప్రకటించడం గమనార్హం. -
‘నీట్’ తీర్మానం వెనక్కి పంపిన గవర్నర్.. దుమారం
After NEET Bill Sent Back GetOutRavi Trending In Twitter: నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని వెనక్కి పంపించినట్టు రాజ్ భవన్ గురువారం ప్రకటించింది. దీంతో గవర్నర్ నిర్ణయంపై డీఎంకేతో పాటుగా నీట్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి, చెన్నై : గురువారం రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో నీట్‌పై అసెంబ్లీలో చేసిన తీర్మా నం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నట్టు వివరించారు. నీట్ రాకతో విద్యార్థులందరికీ సామాజిక న్యాయం దక్కుతోందని పేర్కొన్నారు. సమగ్ర పరిశీలన, సమీక్ష మేరకు పేద విద్యార్థులకు నీట్ ఎంతో దోహదకరంగా ఉందన్నారు. Christian Medical College, Vellore Association Vs. Union of India (2020) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని వెనక్కి పంపించడమే కాకుండా, అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో, పునః పరిశీలన జరిపాలని, తగిన వివరణ ఇవ్వాలని స్పీకర్ అప్పవును గవర్నర్ ఆదేశించడం గమనార్హం. గెట్‌అవుట్‌రవి ట్రెండింగ్‌లో.. ఇక గవర్నర్ నిర్ణయంపై పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ ప్రజలంతా గవర్నర్ రవి నిర్ణయాన్ని ఖండిస్తూ.. ట్విటర్లో గెట్ అవుట్ రవి యాష్ ట్యాగ్‌తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, మనోభావాల్ని గౌరవించలేనప్పుడు తప్పుకోవాలంటూ, వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. #GetOutRavi😡😡 That’s the tweet — Dr Sharmila (@DrSharmila15) February 3, 2022 Hon TR Balu MP at parliament of India Today said that" To call back TN Governor Ravi "#GetOutRavi pic.twitter.com/QQn7fiABR7 — ELAIYA (@elaiyakumar_r) February 3, 2022 ఇదిలా ఉంటే అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఈ బిల్‌కు మద్ధతు తెలపగా.. బీజేపీ మాత్రం సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. NEET అసమానతలను పెంపొందించడంతో పాటు సమాజంలోని ధనవంతులు, అధిక ప్రాధాన్యత కలిగిన తరగతికి అనుకూలంగా ఉందని, XII తరగతిని కొనసాగించడమే కాకుండా ప్రత్యేక కోచింగ్‌ను పొందగలుగుతారు. ఇది వాస్తవంగా వైద్య మరియు దంత విద్య నుండి గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన సామాజిక వర్గాలను అడ్డుకుంటుంది. Who are you to decide the NEET is against rural students....#GetOutRavi Or you will be forced to get out of TN pic.twitter.com/ygM9oGN8Lj — selvam (@Selvam_nallavan) February 3, 2022 #GetOutRavi When you can’t work for TN, quit https://t.co/hhbOUJNry1 — Upright (@GATHOBIAS) February 3, 2022 వైద్య UG ప్రోగ్రామ్‌ల తర్వాత సంపన్న తరగతికి చెందిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడం లేదని. తరచూ విదేశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్నారని, ఇది రాష్ట్రంలో సేవలందిస్తున్న వైద్యుల సంఖ్య క్షీణతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. All party has to take unanimous decision to send back the governer.#GetOutRavi #GetOutGovernorRavi https://t.co/1HoemlZLMx — Aravindan L (@i_am_aravindan) February 3, 2022 రీకాల్ చేయండి ఇదిలా ఉంటే నీట్ బిల్లును వెనక్కి పంపిన నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం గుర్రుగా ఉంది. వెంటనే గవర్నర్ రవిని రీకాల్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు సైతం గళం వినిపించారు. ఐదు నెలల కాలయాపన తర్వాత ఆ బిల్లును పంపించడం ఏంటో అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ(ఎం) ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 5న గవర్నర్ నిర్ణయంపై చర్చించేందుకు.. భవిష్యత్ చర్యల కోసం శనివారం(ఫిబ్రవరి 5న) సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రాజ్యాంగం ప్రకారం.. సాధారణంగా అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిస్తారు. ఒకవేళ వెనక్కి పంపిన బిల్లు మళ్లీ గవర్నర్ దగ్గరికి గనుక వస్తే మాత్రం.. దానిపై ఆయన ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపిస్తారు. ఆపై తుది నిర్ణయం రాష్ట్రపతికే ఉంటుందని రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్ చెప్తున్నారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్‌ల రీకాల్
న్యూఢిల్లీ: బ్రేక్ భాగంలో సమస్యలను పరిష్కరించేందుకు క్లాసిక్ 350 మోడల్‌కు సంబంధించి 26,300 బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు మోటర్‌సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. వీటిల్లో సమస్యలు తలెత్తే అవకాశాలను తమ సాంకేతిక బృందం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వెనుక బ్రేకు పెడల్పై భారీ స్థాయిలో ఒత్తిడి పడినప్పుడు, అసాధారణంగా బ్రేకింగ్ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్ చానెల్, ఏబీఎస్, రియర్ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 మోడల్స్‌కు ఈ సమస్య పరిమితమని వివరించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్దిష్ట కాల వ్యవధిలో తయారైన మోటర్‌సైకిళ్ల గుర్తింపు నంబరు (వీఐఎన్) ఆధారంగా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ బృందాలు లేదా స్థానిక డీలర్లు.. వాటి వినియోగదారులను సంప్రదిస్తారని పేర్కొంది. అలాగే ఈ సమస్య గురించి వినియోగదారులు స్వయంగా కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని లేదా స్థానిక వర్క్‌షాపులను సంప్రదించవచ్చని తెలిపింది. -
లక్షద్వీప్ దుమారం: ప్రఫుల్ రీకాల్‌కు తీర్మానం
లక్షద్వీప్ అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్.. ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించడం, దానికి వ్యతిరేకంగా ‘సేవ్ లక్షద్వీప్’ పేరుతో క్యాంపెయిన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రఫుల్‌ను రీకాల్ చేయాలంటూ కేరళ ప్రభుత్వం సోమవారం ఏకంగా ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. తిరువనంతపురం : లక్షద్వీప్ లో కాషాయ ఎజెండానుఅమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ఆ కేంద్రపాలిత ప్రాంతపు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల ఖోడా పటేల్ ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి దాదాపు అన్ని పక్షాల నుంచి మద్దతు లభించడంతో ఏకగ్రీవంగా తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. కాగా, లక్షద్వీప్ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ తీర్మానం కోరింది. వివాదాస్పద సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని ఆ తీర్మానంలో కేరళ సర్కార్ కోరింది. ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుకువచ్చిన డెవలప్మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్ గత వారం రోజులుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆ తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. ఈ రెగ్యులేషన్ వల్ల లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని, దీవి ప్రజల పరిరక్షణకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. చెట్లతో మొదలుపెట్టారు ఇక పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసే పేరుతో లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. బ్రిటీష్ పాలనలో కంటే ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితులతోనే లక్షద్వీప్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. లక్షద్వీప్ లో కాషాయ ఎజెండాను అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ముందుగా అక్కడి కొబ్బరి చెట్లకు కాషాయ రంగును వేశారని, ఇప్పుడు ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై ఆయన మండిపడ్డారు.దీవి ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: సేవ్ లక్షదీవ్.. ఆ హీరోకి మద్దతు ఇక ప్రఫుల్ రూపొందించిన డ్రాఫ్ట్ ప్రకారం.. లక్షద్వీప్‌లో మద్య నిషేధాన్ని ఎత్తేశారు. తీర ప్రాంత చట్టాన్ని ఉల్లంఘించారని తీరంలోని మత్స్యకారుల షెడ్లను తొలగించారు. బీఫ్‌పై బ్యాన్ విధించారు. ఈ డ్రాఫ్ట్ తీవ్ర దుమారం రేపింది. కాగా, అక్కడి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఆ డ్రాఫ్ట్‌ను నిలిపివేయాలంటూ అక్కడి ప్రజలు, పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మద్దతు లభిస్తోంది. -
మహా గవర్నర్ రీకాల్‌కు సేన డిమాండ్
ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి వ్యవహరిస్తున్నారని పాలక శివసేన ఆరోపించింది. గవర్నర్ స్ధానంలో కూర్చున్న వ్యక్తి చేయకూడని రీతిలో ఆయన పనిచేస్తున్నారని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన విమర్శలు గుప్పించింది. రాజ్‌భవన్ ప్రతిష్టను కాపాడాలాని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావిస్తే గవర్నర్ కోష్యారిని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. ‘ఆయన సంఘ్ ప్రచారక్ లేదా బీజేపీ నేత కావచ్చు..కానీ ఆయన ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ హోదాలో ఉన్న విషయం మరువరాద’ని హితవు పలికింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ లేఖ పంపడం అవాంఛనీయ చర్యగా శివసేన అభివర్ణించింది. ఉద్ధవ్ ఠాక్రేకు ఇటీవల కోష్యారి రాసిన లేఖలో మీరు ఒక్కసారిగా సెక్యులర్‌గా మారారా అంటూ ప్రశ్నించడాన్ని సేన ప్రస్తావించింది. సీఎంకు లేఖ రాసిన సమయంపైనా శివసేన మండిపడుతూ కోష్యారి బీజేపీ అజెండాను ముందుకు తీసుకువెళుతున్నారని వ్యాఖ్యానించింది. -
వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కార్లను భారీ సంఖ్యలో రీకాల్ చేస్తోంది. ఫ్యూయెల్ పంప్లో లోపాలు ఉండటంతో వ్యాగన్ ఆర్, బాలెనో మోడళ్ళను రీకాల్ చేస్తున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మారుతి బుధవారం ప్రకటించింది. ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఈ లోపాలను సరిదిద్ది కస్టమర్లకు తిరిగి అందించనున్నామని దేశంలోని అతిపెద్ద ప్రయాణీకుల వాహనాల తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కార్లు వాగన్ ఆర్, బాలెనో (పెట్రోల్ వేరియంట్) 1,34,885 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. నవంబర్ 15, 2018-2019 అక్టోబర్ 15 మధ్య తయారైన వ్యాగన్ఆర్ 56,663 కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. అలాగే జనవరి 8, 2019-నవంబర్ 8, 2019 మధ్య తయారైన బాలెనో 78,222 కార్లను రాబోయే వారాల్లో రీకాల్ చేస్తామని పేర్కొంది. కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ భర్తీ చేస్తుందని వెల్లడించారు. మోటారు జనరేటర్ యూనిట్లో లోపం కారణంగా డిసెంబరులో, 63,493 యూనిట్ల ప్రీమియం సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6, ఆగస్టులో 40,618 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. -
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలనం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల్లో 2018లో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంది. గతేడాది మార్చి 20న ఇచ్చిన తీర్పు పునఃసమీక్ష కోరుతూ కేంద్రం దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. గత ఉత్తర్వులను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో యథావిధిగా తక్షణ అరెస్ట్ అమల్లోకి వస్తుంది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు దర్యాప్తు కూడా అవసరం లేదు. పిటిషన్ విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎస్సీ,ఎస్టీలు ఇప్పటికీ సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. సమానత్వం కోసం వీరు చేస్తోన్న పోరాటం ముగియలేదని వ్యాఖ్యానించింది. -
రఫేల్‌పై తీర్పును రీకాల్ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కు తీసుకోవాలని (రీకాల్) కాంగ్రెస్ పార్టీ ఆదివారం కోరింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంతోపాటు పార్లమెంటు సమగ్రతను దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలంది. రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి కాగ్ తన నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి సమర్పించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తప్పుగా చెప్పడం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత అనంద్ శర్మ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘అసలు విమానాల కొనుగోలుపై కాగ్ ఇంకా నివేదికే తయారు చేయకపోతే పీఏసీకి ఎప్పుడు అందజేసింది? పార్లమెంటుకు ఎప్పుడు సమర్పించింది’ అని ప్రశ్నించారు. రఫేల్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి తీర్పునే ప్రభావితం చేసిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి తీర్పును వెనక్కు తీసుకుని కేసును పునర్విచారించాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తమ తప్పును అంగీకరించి, ప్రాయశ్చిత్తంగా గంగా నదిలో మునిగితేలాలని ఆనంద్ శర్మ అన్నారు. అసలు రఫేల్ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారానే సాధ్యపడుతుందని ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పే అంతిమం: జైట్లీ రఫేల్‌పై జేపీసీని ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పే ఈ విషయంలో అంతిమమనీ, ఆ కోర్టే తమ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చాక జేపీసీ ఎందుకని జైట్లీ ఫేస్బుక్లో ప్రశ్నించారు. రఫేల్‌పై కాగ్ నివేదిక సిద్ధమయ్యాక అది ఎలాగూ పీఏసీ ముందుకు వెళ్లక తప్పదన్నారు. రఫేల్‌పై పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాంగ్రెస్‌కు తెలుసనీ, వారిది విధ్వంసకర పార్టీ అని విమర్శించారు. కాగా, సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం చేరిన అంశంపై అటార్నీ జనరల్ (ఏజీ), కాగ్‌లకు నోటీసులిస్తామన్న పీఏసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని పీఏసీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. -
10 లక్షల బీఎండబ్ల్యూ కార్లు వెనక్కి
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన అత్యున్నత శ్రేణి కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూలోని డీజిల్ వాహనాల్లో సమస్యలు తలెత్తుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 లక్షలకు పైగా కార్లను వెనక్కి రప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీఎండబ్ల్యూ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘కొన్ని డిజిల్ వాహనాల్లో గ్లైకాల్ కూలింగ్ ఫ్లూయిడ్ లీక్ అవుతోంది. ఎక్జాస్టింగ్ సిస్టమ్‌లో (వాహనాల్లో పొగను రీసైక్లింగ్ చేసి బయటకు పంపే యూనిట్) ప్రాబ్లం ఉండటంతో ఈ సమస్య తలెత్తుతోంది. దీని వల్ల అగ్రి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్లను వెనక్కి రప్పించాలని భావిస్తున్నాము’ అని తెలిపారు. అంతేకాక ‘ఇప్పటికే ఈ విషయం గురించి కార్ ఓనర్లకు కూడా సమాచారం ఇచ్చాము. ఈ వాహనాల్లోని ఎక్జాస్ట్ రిసర్క్యూలేషన్ మాడ్యూల్‌ని చెక్ చేస్తాము. ఏదైనా సమస్య ఉంటే ఆయా భాగాలను మారుస్తాము’ అని వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కూడా ఇదే సమస్య తలెత్తడంతో దక్షిణ కొరియాలో 30 కార్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో బీఎమ్‌డబ్ల్యూ కంపెనీ ఇందుకు క్షమాపణలు చెప్పడమే కాకా యూరోప్, ఆసియా దేశాల్లో ఉన్న 4, 80, 000 డీజిల్ కార్లను వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే. -
హైకమిషనర్‌ను రీకాల్ చేసిన పాక్
ఇస్లామాబాద్ : భారత్ తమ దౌత్యవేత్తలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తున్న పాకిస్తాన్ తాజాగా భారత్‌లో తమ హైకమిషనర్‌ను వెనక్కి పిలిపించింది. భారత్ తీరును నిరసిస్తూ న్యూఢిల్లీలో పాక్ హైకమిషనర్ సొహైల్ మహ్మద్‌ను రీకాల్ చేసింది. విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మహ్మద్ ఫైసల్ గురువారం వెల్లడించారు. తమ దౌత్యవేత్తలను భారత్ వేధింపులకు గురిచేస్తుండటంపై హైకమిషనర్‌తో పాకిస్తాన్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. భారత్‌లో పాక్ దౌత్యవేత్తలు, వారి కుటుంబాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై భారత డిప్యూటీ హైకమిషనర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. మరోవైపు న్యూఢిల్లీలో పాకిస్తాన్ దౌత్య సిబ్బంది..వారి కుటుంబాలపై వేధింపులు, దాడులు తీవ్రతరమయ్యాయని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గత వారం న్యూఢిల్లీలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ కారును కొందరు వెంటాడి, డ్రైవర్‌ను వేధించారని తెలిపింది. పాక్ ఫిర్యాదులపై స్పందించిన భారత్ స్నేహపూర్వక వాతావరణంలో దౌత్యవేత్తలు పనిచేసుకునేలా అన్ని చర్యలూ చేపడతామని హామీ ఇచ్చింది. గత ఏడాది పాక్‌లో భారత అధికారులు సైతం వేధింపులకు గురయ్యారని దౌత్యపరమైన పద్ధతుల్లో వీటిని వారు పరిష్కరించుకున్నారని స్పష్టం చేసింది. -
జాకబ్ జుమా రీకాల్‌కు ఏఎన్సీ నిర్ణయం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాను రీకాల్ చేయాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) నిర్ణయించింది. అవినీతి ఆరోపణలతో నిండా మునిగిన జుమా రాజీనామాకు నిరాకరించటంతో సోమవారం ఏఎన్సీ అత్యున్నత స్థాయి భేటీ జరిపింది. దాదాపు 13 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత జుమాను సాగనంపాలని తీర్మానించింది. అయితే, ఇందుకు గడువేదీ విధించలేదు. ఈ మేరకు జుమాకు ఏఎన్సీ లేఖ రాయనున్నట్లు సమాచారం. రాజీనామాకు అంగీకరించిన జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్సీ ప్రధాన కార్యదర్శి మగషులే తెలిపారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం కారణాలతో జుమాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడటంతో పార్లమెంట్‌ను రద్దుచేసి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
హార్లీ-డేవిడ్సన్ బైక్‌లు వెనక్కి
చికాగో : అమెరికన్ మోటార్‌సైకిల్ దిగ్గజం హార్లీ-డేవిడ్సన్ భారీ మొత్తంలో బైక్‌లను వెనక్కి తీసుకుంది. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంతో ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా మోటార్‌సైకిళ్లను స్వచ్ఛదంగా వెనక్కి తీసుకున్నట్టు హార్లీ-డేవిడ్సన్ ప్రకటించింది. యాంటీ-లాక్ బ్రేక్స్‌తో సీవీఓ టూరింగ్, వీఎస్‌ఆర్‌సీ బైక్‌లతో ఇవి రూపొందాయి. 2008 నుంచి 2011 మధ్యలోని మోడల్స్‌ను హార్లీ-డేవిడ్సన్ వెనక్కి తీసుకున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఈ రీకాల్ ఖర్చు 29.4 మిలియన్ డాలర్లు(రూ.189 కోట్లకు పైగా)గా కంపెనీ తెలిసింది. బైక్ ఫెయిల్యూర్‌కు ప్రభావితమైన మోటార్స్ సైకిళ్లలో లక్షా 75వేలు అమెరికాలోనే విక్రయించారు. యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్‌లో సమస్య ఉందని, ఎలాంటి వార్నింగ్ లేకుండా బ్రేక్ ఫెయిల్ అయిపోతుందని తెలిసింది. 43 ఫిర్యాదులు అనంతరం అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను 2016 జూలై నుంచి విచారించడం ప్రారంభించింది. -
బ్యాక్టీరియా భయం : రెండోసారి భారీ రీకాల్
పారిస్: ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ, ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్ మరోసారి భారీ రీకాల్ చేపట్టింది. తాము తయారు చేసిన బేడీ పౌడర్‌లో అతిప్రమాదకరమైన సాల్మొనెల్లా బాక్టీరియా ఉందంటూ 7వేల టన్నుమేర గ్లోబల్ రీకాల్ చేపట్టిన సంస్థ తాజా మరోసారి తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ముందు ప్రకటించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈ రీకాల్ చేస్తున్నామిన గురువారం సంస్థ వెల్లడించింది. రెండు వారాల వ్యవధిలో రెండోసారి సాల్మొనెల్లా భయాందోళనలకారణంగా దాదాపు రెట్టింపు పరిమాణంలో మరోసారి రీకాల్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. తాజా రీకాల్ ఫ్రాన్ సహా విదేశాలలో విక్రయించే 720 బ్యాచ్ ఉత్పత్తులు ఉన్నాయి కాగా ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్‌గా 625 బ్యాచ్‌లను లేదా దాదాపు 7,000 టన్నుల ఉత్పత్తులను మార్కెట్‌నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు డిసెంబర్ 10 న ప్రకటించిన సంగతి తెలిసిందే. సాల్మొనెల్లా ( జంతువుల లేదా మానవుల మలంతో కలుషితమైన) బాక్టీరియా కారణంగా చాలామంది పిల్లలు అస్వస్థతకు గురికావడంతోపాటు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా ఆహారం విషతుల్యంగా మారి పిల్లలో డయేరియా, కడుపు తిమ్మిరి, వాంతులు తదితర లక్షణాలు వ్యాపించాయి. డిసెంబరు ప్రారంభంలో దేశంలో 26 మంది శిశువులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బ్రిటన్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సూడాన్ సహా పలు దేశాలకు ఎగుమతులపై ప్రభావం చూపనుంది. కాగా అతి ముఖ్యమైన బేబీ పౌడర్ లేదా పాల పొడి ఉత్పత్తులు అతి ప్రమాదకరమైన బాక్టీరియా ప్రభావానికి గురికావడం ఇదే మొదటి సారి కాదు. చైనాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన పాల పౌడర్‌లో పారిశ్రామిక రసాయనం మెలామైన్ కలవడంతో 2008 లో ఆరుగురు పిల్లలు మరణించారు. సుమారు 3లక్షలమంది పిల్లలతో సహా ఇతరులు కూడా అనారోగ్యం పాలయ్యారు. -
జనరల్ మోటార్స్ వాహనాల భారీ రీకాల్
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అతిపెద్ద ఆటో మేకర్ జనరల్ మోటార్స్ సంస్థ భారీ ఎత్తున వాహనాలను రీకాల్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8లక్షల పికప్ ట్రక్కులను వెనక్కి తీసుకుంటోంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ యంత్రంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 పికప్ టక్కులను రీకాల్ చేస్తోంది. 2014 నాటి మోడల్ ట్రక్కులు షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 లలో తాత్కాలికంగా విద్యుత్ శక్తి స్టీరింగ్‌లో లోపాలు, ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో తాత్కాలిక సమస్యలు ఎదురవుతున్నాయని జనరల్ మోటార్స్ ప్రకటిచింది. అందుకే వీటిని రీకాల్ చేస్తున్నట్టు చెప్పింది. అమెరికాలో 6 లక్షల 90వేలు వాహనాలను, కెనడాలో 80వేలు వాహనాలతోపాటు ఇతర మార్కెట్లలో 25వేల వాహనాలను రీకాల్ చేస్తోంది. జీఎం డీలర్లు కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఈ లోపాన్ని పరిష్కరించనున్నారని ప్రకటించింది. అయితే ప్రమాదాలు, గాయాలకు సంబంధింత తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని జీఎం ప్రతినిధి టామ్ వికిన్సన్ పేర్కొన్నారు. అయితే 2015 సం.రం మోడల్ వాహనాల్లో దీనికి సంబంధించి కొన్ని మార్పులను జోడించింది. -
యమహా బైక్స్ రీకాల్
కార్ల కంపెనీలను సతమతం చేసిన రీకాల్ ప్రక్రియ, ఇప్పుడు బైక్ లకు చుట్టుకుంది. ఇంధన ట్యాంక్ బ్రాకెట్, మెయిన్ స్విచ్ సబ్ అసెంబ్లీలో లోపాలు కారణంగా యమహా ఇండియా తన పాపులర్ YZF-R3 బైక్ లను స్వచ్ఛదంగా రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 1,155 యూనిట్ల YZF-R3 బైక్ లను యమహా రీకాల్ చేయనుంది. కస్టమర్లకు సంతృప్తినిచ్చే బైక్ లను ఆఫర్ చేసే యమహా ఇండియా, కస్టమర్ల భద్రతే తన కమిట్ మెంట్ గా భావిస్తుందని కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. లోపాలను భాగాలను కొత్త వాటితో రీప్లేస్ చేస్తామని కంపెనీ తెలిపింది. యమహా డీలర్ షిప్ అన్నింటిలో వీటిని ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్టు పేర్కొంది. రీప్లేస్మెంట్ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని, దీనికి సంబంధించి కంపెనీనే డైరెక్ట్‌గా కస్లమర్లను కాంట్రాక్టు చేయనున్నట్టు యమహా ఇండియా ప్రకటనలో స్పష్టంచేసింది. గతేడాది జూన్ లో కూడా యమహా 902 యూనిట్ల YZF-R3 బైక్ లను రీకాల్ చేసింది. YZF-R3 మోటార్ సైకిల్ కొన్నింటిలో లోపాలు కారణంగా, కంపెనీ ఉత్పత్తిని తగ్గించింది. -
88,700-6ఎస్ ఐఫోన్లు వెనక్కు!
అబుదాబి: ఆపిల్ సంస్ధ మార్కెట్లోకి తెచ్చిన 6ఎస్ ఐఫోన్లలో 88,700 వెనక్కి తెప్పించనుంది. యూఏఈలో విక్రయించిన 6ఎస్ మోడల్స్‌లో బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆ ఫోన్లంటినీ వెనక్కి పిలిపించాలని నిర్ణయించింది. 2015లో చైనాలో తయారైన ఈ ఫోన్లన్నీ ఉన్నట్టుండి షట్‌డౌన్ అయిపోతున్నాయి. 6ఎస్ ఫోన్ల వినియోగదారులు తమ ఫోన్ బ్యాటరీలో లోపం ఉందా? అనే విషయాన్ని https://www.apple.com/ae/support/iphone6s-unexpectedshutdown/ ద్వారా పరిశీలించుకోవాలని యూఏఈ కంజ్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ చెప్పింది. -
భారీ సంఖ్యలో బీఎండబ్ల్యూ కార్ల రీకాల్
బీజింగ్ : ఎయిర్‌బ్యాగ్స్ లోపాలతో ప్రముఖ కార్ల సంస్థలు చేస్తున్న రీకాల్ బాటలో జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా చేరిపోయింది. లక్షల సంఖ్యలో కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌బ్యాగ్స్‌లో ఏర్పడ్డ లోపాల కారణంగా 1,93,611 బీఎండబ్ల్యూ కార్లను చైనాలో రీకాల్ చేయనున్నామని క్వాలిటీ వాచ్ డాగ్ తెలిపింది. 2005 డిసెంబర్ 9 నుంచి 2011 డిసెంబర్23 వరకు దాదాపు 1,68,861 కార్లను బీఎండబ్ల్యూ చైనాకు దిగుమతి చేసింది. అంతేకాక 2005 జూలై 12 నుంచి 2011 డిసెంబర్ 31 వరకు 24,750 సెడాన్లను చైనాకు పంపింది. ఈ కార్లన్నింటిన్నీ 2017 ఆగస్టు 1 నుంచి రీకాల్ చేయడం ప్రారంభిస్తుందని నాణ్యత పర్యవేక్షణ, తనిఖీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. డ్రైవర్‌కు, ముందు కూర్చునే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్‌బ్యాగ్స్‌లో లోపాలున్నాయని, లోపల గ్యాస్ జనరేటర్లకు హాని కలిగే అవకాశముందని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సురక్షణ నేపథ్యంలో వీటిని రీకాల్ చేస్తున్నామని తెలిపింది. ఈ లోపాలున్న భాగాలను ఎలాంటి చార్జీలు లేకుండానే ఉచితంగా వేరే వాటిని అమర్చి ఇస్తామని బీఎండబ్ల్యూ తెలిపినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. -
రెనో క్విడ్, డాట్సన్ రెడీ గో కార్ల రీకాల్
• ఇంధన వ్యవస్థలో లోపాలు • సరిదిద్దడానికి చర్యలు... • 51 వేల కార్లను రీకాల్ చేస్తున్న • రెనో నిస్సాన్... 932 కార్లు న్యూఢిల్లీ: వాహన కంపెనీ భారత్‌లో 50 వేలకు పైగా రెనో క్విడ్ కార్లను రీకాల్ చేస్తోంది. మరో వాహన కంపెనీ నిస్సాన్ డాట్సన్ రెడీ గో మోడల్లో 932 కార్లను రీకాల్ చేస్తోంది. ఇంధన వ్యవస్థలో లోపాలను సరిచేయడానికి, హోస్ క్లిప్‌ను జత చేయడానికి ఈ కార్లను రీకాల్ చేస్తున్నామని రెండు కంపెనీలు పేర్కొన్నాయి. 2015, అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే 18 వరకూ తయారైన క్విడ్ (800 సీసీ) ఎల్ వేరియంట్లలో స్వచ్ఛంద తనిఖీలు నిర్వహిస్తున్నామని రెనో కంపెనీ తెలిపింది. ఇంధన వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంధన వ్యవస్థను తనిఖీ చేస్తున్నామని, ఫ్యూయల్ హోస్ క్లిప్‌ను జత చేస్తున్నామని వివరించింది. ఈ సమస్యలున్న కార్లను ఉచితంగా తనిఖీ చేస్తామని, ఏమైనా అవసరమైన చర్యలుంటే తీసుకుంటామని పేర్కొంది. ఈ కార్లను కొనుగోలు చేసిన యజమానులను సంప్రదిస్తున్నామని, తనిఖీ కోసం కార్లను డీలర్ల వద్దకు తీసుకురావలసిందిగా కోరుతున్నామని వివరించింది. కాగా రీకాల్ కార్లలో 10 శాతం కార్లలో మాత్రమే ఈ సమస్యలున్నట్లు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన క్విడ్ 800 సీసీ కార్లను రూ.2.64-3.95 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో విక్రయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 56 వేల క్విడ్ కార్లను రెనో విక్రయించింది. మరోవైపు నిస్సాన్ కంపెనీ డాట్సన్ రెడీ గో మోడల్లో లోపాలున్న ఇంధన వ్యవస్థను సరిదిద్దడానికి 932 కార్లను రీకాల్ చేస్తోంది. ఈ ఏడాది మే 18 వరకూ తయారైన కొన్ని కార్లలో ఈ లోపాలున్న కార్లను గుర్తించామని తెలిపింది. ఈ మోడల్ కార్లు ఇప్పటివరకూ 14వేలు అమ్ముడయ్యాయి. క్విడ్, డాట్సన్ రెడీ గో కార్లు సీఎంఎఫ్‌ఏ ప్లాట్ఫార్మ్పై చెన్నై ప్లాంట్‌లోనే తయారయ్యాయి. -
గవర్నర్‌ను రీకాల్ చేయాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఐని మాఫియా అని వ్యాఖ్యానించిన గవర్నర్ నరసింహన్‌ను రీకాల్ చేయాలని రాష్ట్రపతికి లేఖ రాసినట్టుగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యుడికి సమాచారం అందుబాటులోకి తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని మాఫియాగా అభివర్ణించిన నరసింహన్‌కు గవర్నర్ హోదాలో ఉండే అర్హత లేదన్నారు. ఆర్టీఐని అవమానించిన నరసింహన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బన్స ల్ కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకోవడం కేంద్రానికి సిగ్గుచేటన్నారు. సీబీఐ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాశారన్నారు. -
మిస్తుబిషీ, టయాటో కార్లకు ఏమైంది?
కాన్ బెరా: ఇంధన మైలేజీ పరీక్షల్లో అక్రమాల కారణంగా వివాదంలో ఇరుక్కున్న జపాన్ కు చెందిన కార్ల దిగ్గజ కంపెనీలు మిస్తుబిషీ, టోయాటో లకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో కార్లను వెనక్కి తీసుకుంటున్న ఈ జెయింట్స్ కు ఆస్ట్రేలియాలో తీవ్రమైన షాకే తగిలింది. దేశం అంతటా 8 లక్షల 24 వేల కార్లను రీకాల్ చేయాల్సిందిగా ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ఎసీసీసీ) ఆదేశించింది. వివిధ లోపాల కారణంగా జపనీస్ కార్లను పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. మిస్తుబిషి, టొయాటో ల పాపులర్ మోడళ్ల కార్ల లో తీవ్రమైన డ్రైవర్ భద్రత లోపాలు, ఎయిర్ బ్యాగ్ , హ్యాండ్ బ్రేక్ లో లోపాలపై విచారించిన ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ఎసీసీసీ) ఈ భారీ స్థాయిలో కార్ల రీకాల్ కు నోటిసులిచ్చింది. ఈ క్రమంలో భారీ ఎత్తున ఈ కార్లను రీకాల్ చేయనున్నట్టు టొయాటో, మిస్తుబిషి ప్రకటించాయి. ఫ్యూయల్ ట్యాంక్ లో పగుళ్లు వచ్చే అవకాశం ఉందని, ఈ క్రాక్ మరింత విస్తరిస్తే లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని టయోటా అంగీకరించింది. ఫ్యూయల్, ఫ్యూయల్ వేపర్ లో లోపాలుంటే అగ్ని ప్రమాద తీవ్రత పెరుగుతుంది టయోటా చెప్పింది. టయోటా ఆస్ట్రేలియా కార్లలో లోపభూయిష్ట హెడ్లైట్లు, ఎయిర్ బ్యాగ్స్ , ఇంధన దోషాలతోపాటు 3లక్షల 24వేల వాహనాలను తిరిగి పిలిపించాలని ఎసీసీసీ ఆదేశించింది. మిత్సుబిషి మోటర్స్ ఆస్ట్రేలియా దాదాపు 5లక్షల వాహనాలకు రీకాల్ చేయాలని ఆదేశించిందని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. శుక్రవారం అందించిన నివేదిక ప్రకారం ఈ రికాల్ లో ట్రిటోన్ యుటే, లాన్సర్ సెడాన్, ఔట్ లాండర్, సహా మిత్సుబిషి కి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్లున్నాయి. అక్టోబర్ 2008, 2015 మధ్య తయారైన ఇరు కంపెనీ కార్లను రీకాల్ చేయనున్నాయి. మరోవైపుఈ రెండు కంపెనీలు చెందిన ఎనిమిది లక్షలమంది కార్ల యజమానులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయనున్నట్టు వెల్లడించాయి. -
1.9లక్షల ఫోక్స్ వాగన్ కార్లు రీకాల్
కర్బన ఉద్గారాల స్కాం ఎఫెక్ట్ భారత్ లో అమ్ముడుపోయిన ఫోక్స్ వాగన్ కార్లపైనా పడింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ, జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్ వాగన్, భారత్ లో కూడా తన కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. 1.9లక్షల కార్లను ఈ ఏడాది జూలై నుంచి రీకాల్ చేస్తామని వెల్లడించింది. కర్బన ఉద్గారాల స్కామ్ ఆరోపణలు రుజువైన క్రమంలో ఫోక్స్ వాగన్ తన కార్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. అయితే భారత్ లో స్వచ్ఛందంగానే తమ కార్లను రీకాల్ చేస్తున్నామని, అమెరికాలో లాగా భారత్ లో కర్బన ఉద్గారాల నిబంధనలను ఉల్లఘించినందుకు ఎలాంటి చర్యలను, ఫీజులను భరించలేదని పేర్కొంది. జూలై నుంచి రీకాల్ ప్రాసెస్ ప్రారంభించి, తర్వాత 10 నెలల వరకు కొనసాగిస్తామని ఫోక్స్ వాగన్ మార్కెటింగ్ అధినేత కమల్ బసు వెల్లడించారు. నిబంధనలు ఉల్లఘించి మోసపూరిత కర్బన ఉద్గారాల సాప్ట్ వేర్ ను ఫిక్స్ చేసినందుకు అమెరికాలో తన కార్లను ఫోక్స్ వాగన్ రీకాల్ చేసింది. భారత్ లో కూడా ఈ సాప్ట్ వేర్ ఫిక్స్ చేసిన వాహనాలను రీకాల్ చేయనున్నామని బసు ప్రకటించారు. రీకాల్ కోసం రెగ్యులేటరీ నుంచి ఫోక్స్ వాగన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మోసపూరిత సాప్ట్ వేర్ ఉన్న దాదాపు 11 మిలియన్ డీజిల్ ఇంజన్ కార్లను యూఎస్, యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మినట్టు ఫోక్స్ వాగన్ ప్రకటించింది. అమెరికాలో ఈ స్కామ్ బయటపడిన తర్వాత భారత్ లో ఫోక్స్ వాగన్ అమ్మకాలు పడిపోయాయి. అమెరికాలో మార్కెట్లో ఫోక్స్ వాగన్ జరిమానాలు, క్రిమినల్ ఇన్ వెస్టిగేషన్లతో రెట్టింపు చర్యలను ఎదుర్కొంటోంది. -
భారీ సంఖ్యలో మారుతి కార్లు రీకాల్
కార్ల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోసారి వేల సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తోంది. బాలెనో పేరుతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో దూసుకువచ్చిన మారుతి సుమారు 75వేల బాలెనో రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. కార్ల మార్కెట్ లో నెలకొన్న పోటీని తట్టుకునేందుకు వీలుగా తన కార్లను వరుసగా అప్ గ్రేడ్ చేస్తూ వస్తున్న మారుతి తాజాగా తన సరికొత్త మోడల్ బాలెనో 75,419 కాలర్లను వెనక్కి రప్పించనుంది. 2015 ఆగస్టు 3 నుంచి 2016 మే 17 వరకు తయారుచేసిన పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్ల కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు సుజుకి ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ సమయంలో తయారుచేసిన 16వేల డీజిల్ బాలెనో కార్లలో ఫ్యుయల్ ఫిల్టర్ కూడా సరిచేయనున్నట్లు తెలిపింది. ఫ్యుయల్ ఫిల్టర్ మార్చడానికి 1961 డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను కూడా వెనక్కి పిలుస్తున్నట్లు వెల్లడించింది. వెనక్కి పిలిచే కార్లకు సంబంధించి కంపెనీనే కస్టమర్లను మే 31 నుంచి సంప్రదిస్తుందని ప్రకటనలో తెలిపింది. ఫ్యుయల్ ఫిల్టర్ మార్చడం, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ ఉచితంగానే చేస్తామని తెలిపింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. 0.5 శాతం నష్టాలను నమోదు చేసింది. కాగా ఇటీవల మారుతి తన వివిధ మోడళ్ల కార్లను వెనక్కి పిలిపించింది. అటు ఆల్టో 800 కార్లలో ఎయిర్ బ్యాగ్ సౌకర్యాన్ని కల్పించి సరికొత్తగా ముస్తాబు చేసి అందుబాటు ధరల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
డాక్టర్ రెడ్డీస్ ఆండాన్ సెట్రాన్ ట్యాబ్లెట్ల రీకాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శస్త్రచికిత్సలు మొదలైన వాటిల్లో వాంతుల సమస్యను నివారించేందుకు ఉపయోగించే ఆండాన్సెట్రాన్ ట్యాబ్లెట్ల 50,000 బాటిల్స్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. డిగ్రేడేషన్ ప్రమాణాల్లో వైఫల్యం ఇందుకు కారణమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఒక నివేదికలో పేర్కొంది. తాత్కాలికమైన ప్రతికూల ప్రభావాలు చూపే ఔషధాల కేటగిరీ కిందకి వచ్చే ఈ రీకాల్ మార్చి 30న మొదలైనట్లు వెల్లడించింది. -
4 బ్యాచ్ ల కాంబిఫ్లామ్ ఔషధం రీకాల్
ఇప్పటికే 2 బ్యాచ్‌ల ఔషధాలు వెనక్కి న్యూఢిల్లీ: సనోఫి ఇండియా కంపెనీ కాంబిఫ్లామ్ బ్రాండ్ పెయిన్కిల్లర్కి సంబంధించిన నాలుగు బ్యాచ్‌ల ఔషధాలను రీకాల్ చేస్తోంది. ప్రమాణాలకనుగుణంగా ఈ నాలుగు బ్యాచ్‌ల కాంబిఫ్లామ్ ఔషధాలు లేవని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) పేర్కొనడంతో వీటిని రీకాల్ చేస్తున్నామని సనోఫి కంపెనీ పేర్కొంది. ఈ ఔషధం డిస్‌ఇంటిగ్రేషన్ టైమ్(శరీరంలో విచ్ఛిన్నమయ్యే సమయం) ఎక్కువగా ఉందని సీడీఎస్సీఓ పరీక్షల్లో తేలిందని సనోఫి ప్రతినిధి తెలిపారు. డిస్‌ఇంటిగ్రేషన్ టైమ్ అధికంగా ఉన్నప్పటికీ, ఈ ఔషధం రక్షణ, సామర్థ్యానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన భరోసానిచ్చారు. అయినప్పటికీ, ప్రమాణాలకనుగుణంగా ఈ బ్యాచ్‌ల ఔషధాల్లేవని సీడీఎస్సీఓ పేర్కొనడంతో వీటిని రీకాల్ చేస్తున్నామని, ఇప్పటికే రెండు బ్యాచ్‌ల ఔషధాలను వెనక్కి తీసుకున్నామని వివరించారు. కాగా ఈ నేపథ్యంలో బీఎస్ఈలో సనోఫి ఇండియా షేర్ స్వల్పంగా లాభపడి రూ.4,330 వద్ద ముగిసింది. -
మాకార్లు ఇప్పుడే వాడితే ప్రమాదం.. జాగ్రత్త
మూడు వరుసల సీట్లు ఉండే టెస్లా మోడల్ ఎక్స్ ఎస్యూవీ, 2,700 కార్లను ఆ కంపెనీ ఉపసంహరించుకుంది. లైటింగ్ వ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమవడం, సీట్ల అమరిక కూడా లోపభూయిష్టంగా ఉండి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో తిరిగి వాటిని పునరుద్ధరించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్లో కార్లను ఉపసంహరించుకుంటోంది. లోపాలను సరిచేశాక మళ్లీ వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, మార్చి 26కు ముందు తయారుచేసిన కార్లనే కంపెనీ రీకాల్ చేస్తోంది. కార్లను కొనుగోలు చేసిన వినియోగదారులు స్థానిక సర్వీసు సెంటర్లను ఆశ్రయించి సీట్ బ్యాక్లను మార్పించుకోవాలని కంపెనీ సూచించింది. టెస్లా సర్వీస్ సెంటర్లో ఈ సమస్యలను సరిచేసేంత వరకూ వినియోగదారులు ఈ కార్లను వాడొద్దని తెలిపింది. కాగా, కంపెనీ ఈ మోడల్ కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టేముందే చాలాసార్లు జాప్యం చేసింది. ఆఖరికి 2015 సెప్టెంబర్‌లో ఈ మోడల్‌ను విడుదల చేసింది. -
వీసీ అప్పారావును రీకాల్ చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీ అప్పారావును రీకాల్ చేయడానికి బదులుగా అకడమిక్ కౌన్సిల్ సమావేశం ద్వారా కేంద్రం ఆయనకు నైతిక బలాన్ని చేకూర్చడం పట్ల సీపీఐ నిరసన వ్యక్తం చేసింది. రోహిత్ ఆత్మహత్య తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హెచ్‌సీయూ ఘటనపై సీఎం స్పందిస్తూ అప్పారావును రీకాల్ చేయాల్సిందిగా ప్రధానిని కోరతానని ప్రకటించినట్లు ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గుర్తుచేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పడానికి వీసీ అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
6వేల బిఎమ్‌డబ్ల్యూ కార్లు వెనక్కి
బీజింగ్ : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ కి చైనాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చైనా లో తమ ఇంపోర్టెడ్ మినీ సిరీస్ వాహనాలు భారీ సంఖ్యలో వెనక్కి తీసుకుంటున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సాంకేతిక లోపం కారణంగా 6,109 వాహనాలు రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 8 నుంచి తమ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. ఫ్యూయల్ పంపింగ్ ప్రక్రియలో సమస్య ముందని.. దీని మూలంగా ఇంజీన్ పాడయ్యే అవకాశం ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ నాణ్యత పర్యవేక్షణ, తనిఖీ ల విభాగం ఒక ప్రకటన ఈ విషయాన్ని తెలియజేసింది. గత ఏడాది జూన్ 12 నుంచి నవంబరు19 మధ్య తయారైనవని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. రీకాల్ చేసిన కార్ల సమస్యలను బిఎమ్‌డబ్ల్యూ చైనా ఆటోమోటివ్ ట్రేడింగ్ కంపెనీ ఉచితంగా పరిష్కరించనున్నట్టు తెలిపింది. -
1.5 లక్షల జనరల్ మోటార్స్ వాహనాల రీకాల్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ 2007-14 మధ్యలో తయారైన దాదాపు 1.55 లక్షల వాహనాలను (బీట్, ఎంజాయ్, షెవర్లే స్పార్క్ మోడళ్లతో కలుపుకొని) రీకాల్ చేసింది. రిమోట్ కీలెస్ ఎంట్రీ యాక్సిసరి ఫిటింగ్ సమస్య కారణంగా ఈ కార్లను రీకాల చేస్తున్నామని తెలిపింది. ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగానే ఈ సమస్యను సరిచేస్తామని తెలిపింది. -
లక్షన్నర షెవ్రోలె కార్లు వెనక్కి
ముంబై: ఒకటికాదు రెండు కాదు ఏకంగా 1.5 లక్షల షెవ్రోలె కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు జనరల్ మోటార్స్ సంస్థ సోమవారం ప్రకటించింది. 2007 నుంచి 2014 సంవత్సరాల మధ్య అమ్ముడయిన షెవ్రోలె స్పార్క్, షెవ్రోలె బీట్, షెవ్రోలె ఎంజాయ్ మోడళ్ల బ్యాటరీల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు కార్ల యజమానులకు ప్రత్యేకంగా లేఖలు రాసింది. ప్రస్తుతం ఆయా మోడళ్ల కార్లలో ఉన్న వైరింగ్తో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని, తగిన మార్పులను ఉచితంగా నిర్వహిస్తామని జనరల్ మోటార్స్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. వాహనదారులు సమీపంలోని షెవ్రోలె షో రూమ్ లకు వెళితే రెండు గంటల వ్యవధిలో మరమ్మతు చేసి పంపుతామన్నారు. -
400మంది ఏపీ పోలీసుల రీకాల్
-
400మంది ఏపీ పోలీసులను రీకాల్ చేసిన డీజీపీ
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల మోహరింపుపై డీజీపీ రాముడు వెనక్కి తగ్గారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 400మంది పోలీసులను డీజీపీ బుధవారం ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల క్రితం ఏపీ జిల్లాల నుంచి 400మంది పోలీసులను హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు ఉదంతం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రుల నివాసాల వద్ద భద్రత ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల మోహరింపు రాజ్యాంగ విరుద్ధమంటూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ నిన్న గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాముడు కూడా మంగళవారం గవర్నర్ ను కలిశారు. అనంతరం డీజీపీ పోలీసులను రీకాల్ చేశారు. వారిని తిరిగి వెనక్కి పంపించనున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీఐపీల రక్షణ బాధ్యత తెలంగాణ పోలీసులదేనని, ఇందులో మరో మాటకు ఆస్కారం లేదని అనురాగ్ శర్మ నిన్న స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏపీ సీఎం, మంత్రులకు ఇప్పటివరకూ కొనసాగుతున్న విధంగానే రక్షణ ఏర్పాట్లు ఉంటాయన్నారు. -
33 వేల మారుతీ కార్ల రీకాల్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఆల్టో 800, ఆల్టో కే10 మోడల్లో 33,098 కార్లను రీకాల్ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 8, ఈ ఏడాది ఫిబ్రవరి 18 మధ్య తయారైన కార్లలో కుడి వైపు డోర్ గడియకు సంబంధించి ఉన్న చిన్న లోపాన్ని సవరించడానికి ఈ రీకాల్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. 19,780 ఆల్టో 800 కార్లను, 13,318 ఆల్టో కే10 కార్లను రీకాల్ చేసి, ఈ లోపాన్ని ఉచితంగా సరిచేసి ఇస్తామని తెలియజేసింది. ఈ కార్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు తమ డీలర్లు సమాచారమందిస్తారని తెలిపింది. డీలర్ వర్క్‌షాప్‌లో టెక్నీషియన్స్ ఈ లోపాలను ఉచితంగా సరిచేస్తారని పేర్కొంది. -
కారు ... బేకారు?
ఒకప్పుడు టొయోటా అంటే కారు. కారు అంటే టొయోటా. కానీ నాణ్యతాపరమైన సమస్యలు ఇప్పుడీ జాపనీస్ ఆటోమొబైల్ కంపెనీని చికాకు పెట్టేస్తున్నాయి. నాణ్యతాపరమైన సమస్యల వల్ల ఇప్పుడీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 63.9 లక్షల వాహనాలను వెనక్కు రప్పించేస్తోంది. ఇంజన్ స్టార్టర్లలోని సమస్యల వల్ల అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్ల వల్ల ఆర్ ఏ వీ 4, కరోలా, యారిస్, మాట్రిక్స్, హైలాండర్ వంటి మోడల్స్ సహా మొత్తం 27 మోడల్స్ ను వెనక్కి రప్పిస్తోంది. విండ్ షీల్డ్ వైపర్ మోటార్స్, స్టీరింగ్ కాలమ్ బ్రాకెట్స్, ఇంజన్ స్టార్టర్లు, ఎయిర్ బాగ్స్కి కనెక్ట్ అయిన కేబుల్స్ వల్ల సమస్యలు వస్తున్నాయి. ఎయిర్ బ్యాగ్స్ సమస్యల వల్ల 35 లక్షల వాహనాలు, సీట్ రెయిల్స్ సమస్యల వల్ల 16.7 లక్షల వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. కొద్ది రోజుల క్రితమే జెనరల్ మోటార్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇగ్నిషన్ స్విచ్చ సమస్య వల్ల 26 లక్షల వాహనాలను వెనక్కి రప్పించింది. మొత్తం మీద ఆటో రంగం అష్టకష్టాల్లో ఉంది. -
రాజీనామా అమల్లోకి వస్తే ఉపసంహరణ కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల రాజీనామా ఆమోదం పొందిన తర్వాత.. దాని ఉపసంహరణకు ఇకపై అవకాశం ఉండదు. ఈ మేరకు సబార్డినేట్ సర్వీసుల నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘రాజీనామా అమల్లోకి వచ్చిన తర్వాత ఉపసంహరణకు అనుమతి ఉండదు. అయితే రాజీనామా ఆమోదం పొందినా, అది అమల్లోకి రాకముందే రాజీనామాను ఉపసంహరించుకుంటే, సదరు ఉద్యోగి సర్వీసులో ఉన్నట్లుగానే భావించాలి’ అని పేర్కొంటూ నిబంధనల్లో చేర్చారు -
దిగ్విజయ్ సింగ్‌ను రీకాల్ చేయాలి: అనం వివేకానందరెడ్డి