
గవర్నర్‌ను రీకాల్ చేయాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఐని మాఫియా అని వ్యాఖ్యానించిన గవర్నర్ నరసింహన్‌ను రీకాల్ చేయాలని రాష్ట్రపతికి లేఖ రాసినట్టుగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యుడికి సమాచారం అందుబాటులోకి తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని మాఫియాగా అభివర్ణించిన నరసింహన్‌కు గవర్నర్ హోదాలో ఉండే అర్హత లేదన్నారు. ఆర్టీఐని అవమానించిన నరసింహన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బన్స ల్ కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకోవడం కేంద్రానికి సిగ్గుచేటన్నారు. సీబీఐ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశారన్నారు.