VH
-
రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్
సాక్షి,హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశాన్ని21వసెంచరీలోకి తీసుకుపోవడానికి కృషి చేసిన వ్యక్తని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కొనియాడారు. అలాంటి నేత విగ్రహాన్నికూలగొడతామని బీఆర్ఎస్ నేతలు అనడం సరికాదన్నారు.య గాంధీభవన్‌లో మంగళవారం(సెప్టెంబర్16) వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అది బీఆర్ఎస్కు పెద్ద నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.‘దేశం కోసం ప్రాణాలు అర్పించినిన ఫ్యామిలీ గాంధీలది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. విగ్రహాలు కూలుస్తాం లాంటి మాటల వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట తగ్గిపోతుంది. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే సచివాలయంలోనే పెట్టాలి. విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెప్తారు. అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్ఎస్ నేతలు మానుకోవాలి’అని వీహెచ్ హితవు పలికారు. ఇదీ చదవండి.. టచ్ చేసి చూడు.. పొన్నం సవాల్ -
రేవంత్‌రెడ్డిపై వీహెచ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి.. నీస్థాయిని నీవు తగ్గించుకుంటున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీహెచ్.. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారు. అలాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు?. వారిని పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదు. ఆయన తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నారు.’’ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని తాను కలిసి ఇవన్నీ చెబుతామంటే తనకు సమయం ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్లు మన వైపు వస్తున్నారు. కాంగ్రెస్ కేడర్‌కు న్యాయం చేయకుండా మన వారిపై కేసులు పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. బీఆర్ఎస్ హయాంలో తాము ఎక్కడకు వెళ్లినా కేసులు పెట్టారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీటిని ఎత్తివేయాలి. రేవంత్ రెడ్డి ఒకవైపు కాకుండా రెండువైపుల వినాలి. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగవద్దనేది తన ఉద్దేశ్యమని వీహెచ్ అన్నారు. ఇదీ చదవండి: కవిత మేనల్లుడి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు -
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అంబర్‌పేట ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్యంపై సమాచారం అందాల్సి ఉంది. -
ఎంపీగా పోటీ చేసి తీరుతాను: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరుతానని పీసీసీ మాజీ చీఫ్, సీనియర్‌నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సోమవారం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ‘ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను. ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు. పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?. ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా?. నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఎంటి?. ...గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ప్రధాని మోదీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదు. ఏం ఉద్దరించారని సంకల్ప యాత్ర చేస్తున్నారు. రాముడ్ని మేమే పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నేతలు భాష మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్ వెళ్ళాలి. రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు. గుడులు మీ అయ్య జాగీర్లా?’అని వీహెచ్ మండిపడ్డారు. -
నా పేరు వీ హనుమంతరావు కాదంతే.! వీహెచ్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, సంగారెడ్డి: గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో ఓబీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తానంటున్నారు.. నువ్వెందుకు వేస్తావు.. బంగళాఖాతంలో నిన్నే జనం వేస్తారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. పప్పు అన్న మా రాహుల్ పప్పా అయ్యాడు...మీ బాబై కూర్చున్నాడు. ఈ సారి ప్రధాని రాహుల్ అవుతాడు.. లేకుంటే నా పేరు హనుమంతరావు కాదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆదాని, మోదీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు’’ అంటూ వీహెచ్ దుయ్యబట్టారు. ‘‘మా దగ్గర ఉంటే అవినీతి పరులు.. బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులు. త్వరలోనే బీసీ గర్జన పెడుతున్నాం. అందుకు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ ఒప్పుకున్నారు. అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుంది. అగ్రకులాల వాళ్లు ఓబీసీలను అణగదొక్కుతున్నారు. రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని కలిశారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారు. ఫస్ట్ 20 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. నేనెవ్వరికి వ్యతిరేకం కాదు.. మా హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.. ఫైనల్‌గా సోనియా, రాహుల్ గాంధీ మాటా వింటాను’’ అని వీహెచ్ చెప్పారు. చదవండి: టీ కాంగ్రెస్ ఎన్నికల యాక్షన్ ప్లానేంటి? కోమటిరెడ్డి నివాసంలో ఏం జరిగింది? ‘‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నాడు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి సహాయం చేస్తావ్. పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య చిన్న చిన్న గోడవలున్నాయి. సీనియర్ మీద జూనియర్ పెత్తనం చెలాయిస్తా అంటే ఉరుకుంటారా..?. మా పార్టీలో లొల్లి కూడా అంతే’’ అంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు. -
గాంధీ భవన్ వద్ద రచ్చ రచ్చ.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ఇందుకు మరోసారి వేదిక అయ్యింది. సీనియర్ నేత వీ హన్మంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో గాంధీ భవన్ నుంచి వీహెచ్ బయటకు వచ్చేశారు. క్రికెట్ టోర్నమెంట్‌కు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను ఆహ్వానించేందుకు వీహెచ్ గాంధీభవన్‌కు వెళ్లారు. అయితే.. ఆ సమయంలో మహేష్ గౌడ్, వీహెచ్ మధ్య వాగ్వాదం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్‌కు ఠాక్రేను వీహెచ్ ఆహ్వానించగా.. 22వ తేదీన ఇన్‌ఛార్జి షెడ్యూల్ ఖాళీగా లేదని మహేష్ గౌడ్ బదులిచ్చారు. దీంతో ఇన్‌ఛార్జి వస్తానంటే నువ్వెందుకు అభ్యంతరం చెప్తున్నావంటూ వీహెచ్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఆపై బయటకు వచ్చేసిన వీహెచ్.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ‘‘ఈ కార్యక్రమం పీసీసీ ప్రెసిడెంట్ పెట్టలేదని, తాను పెట్టానని మహేష్ గౌడ్ తనతో అన్నాడని, పీసీసీ ప్రెసిడెంట్కే లేని అభ్యంతరం అతనికి ఎందుకని? ఎవరికి వారే ఇక్కడ లీడర్ ఉన్నారంటూ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారాయన. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో వీహెచ్ భేటీ.. బుజ్జగింపులు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ మారతారనే ప్రచారం టీ కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని ఒక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ ప్రకటనతో.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ శనివారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని, అవమానం జరిగే చోట ఉండలేనని కోమటిరెడ్డి, వీహెచ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే.. పాత కాంగ్రెస్ నేతలంతా బయటకు వెళ్తే పార్టీ దెబ్బ తింటుందని వీహెచ్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరి వాళ్లతో ఈ అంశంపై చర్చిస్తానని వీహెచ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం 11 గంటలకు జరగబోయే సీనియర్ల భేటీకి రావాలంటూ రాజగోపాల్‌రెడ్డిని వీహెచ్ కోరినట్లు సమాచారం. ఈ భేటీలో అసంతృప్త సీనియర్లంతా హాజరై.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆహ్వానంపై రాజగోపాల్‌రెడ్డి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ఈమధ్య జరిగిన ఓ ఘటన ఆయన అసంతృప్తికి కారణమైంది. మంత్రి తలసానితో జరిగిన వ్యక్తిగత వ్యాఖ్యలు.. మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు అండగా నిలబడలేదని కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గౌరవం లేని చోట ఉండలేనని, తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానని, నమ్మి తన వెంట వచ్చేవాళ్లు రావొచ్చంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. -
కాంగ్రెస్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్) కరోనా వైరస్ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీహెచ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కాగా ఇటీవలే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వందమందికి దుప్పట్ల పంపిణీ చేశారు. అదే రోజు నుంచి వీహెచ్ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. లాక్డౌన్ కాలంలోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. (రాజాసింగ్‌ను వెంటాడుతున్న కరోనా భయం) ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షలో సైతం వీహెచ్ పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో గడిచిన వారం రోజులుగా ఆయన ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎవరితో కలిసి మెలిగారు అనేదానిపై అధికారులు ఆరా తీసున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, బీగాల గణేష్ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంత చికిత్స పొందుతున్నారు. (ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే) -
నియంతలా వ్యవహరిస్తే పతనమే..!
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవర్తన నిజాంను తలపిస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి అన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఆర్టీసీ కార్మికుల ఐకాస, విపక్షనేతల సమావేశం జరిగింది. కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేశాడని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదన్నారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ వ్యవహరిస్తున తీరు దుర్మార్గమరైనదన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మి సొంత ఆస్తులు పెంచుకొనే పనిలో కేసీఆర్ పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎదుర్కొనేందుకు రాజకీయపార్టీలనీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై స్పందించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా విపక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ క్రియాశీలకంగా పాల్గొని, ఆర్టీసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపటి నుంచి సమ్మెను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. 65 నెలల కేసీఆర్ పాలనలో లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని రమణ ఆరోపించారు. 65 నెలల కేసీఆర్ పాలనలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌నేత వీహెచ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే చివరి క్షణం వరకు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
కేసీఆర్ అహంకారం సగం తగ్గింది : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఇంతవరకు బాధితకుటుంబాలను ప్రభుత్వం పరామర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ తన నియోజక వర్గంలో కార్యకర్త చనిపోతే వెళ్లి పాడే మోసిందని గుర్తు చేశారు. మరి, నీకు ఓట్లు వేసిన హజీపూర్ ప్రజలకు నువ్వు ఏం చేశావంటూ కేసీఆర్‌పై వీహెచ్ ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు 26 మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌కు ఎలాంటి బాధ లేదన్నారు. ఫలితాలతో కేసీఆర్‌కు అహంకారం సగం తగ్గిందన్నారు. కేసీఆర్‌కు గర్వం పూర్తిగా తగ్గించాలని తిరుపతి దేవుడిని మొక్కుతున్నానని తెలిపారు. వారం లోపు కేసీఆర్ హజీపూర్కు వెళ్లి అక్కడ బాధితులను ఆదుకోవాలని, లేకపోతే మరోసారి ఆ ఊరికి వెళ్లి రోజంతా దీక్ష చేస్తానని హెచ్చరించారు. -
చంద్రబాబు పతనం ప్రారంభం
రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు ధవళేశ్వరంలో అడ్డుకున్న పోలీసులు నోటీసులు జారీ ధవళేశ్వరం : కాపుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పతనం ప్రారంభమయిందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్‌బ్యారేజ్ మీదుగా రాజమహేంద్రవరం వైపు వెళుతున్న హనుమంతరావును పోలీసులు ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్లో అడ్డుకున్నారు. జిల్లాలో 144సెక్షన్ అమలులో ఉందని, జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వెనుదిరిగి వెళ్లిపోయాలని పోలీసులు సూచించారు. తానేమి పాకిస్థాన్‌కు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వి.హనుమంతరావు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజమహేంద్రవరం దక్షిణ మండల డిఎస్పీ నారాయణరావు హనుమంతరావుతో చర్చించారు. తాను కిర్లంపూడి వెళ్లనని వ్యక్తిగత పనిమీద రాజమహేంద్రవరం వచ్చానని 26న తిరిగి వెళతానని హనుమంతరావు పేర్కొన్నారు. దీంతో ఆయనను ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ బయట తన వాహనంలోనే కూర్చున్న హనుమంతరావు తాను వెనక్కి వెళ్ళేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న ధవళేశ్వరం కాపు సంఘం నాయకులు పెద్దఎత్తున ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలి వచ్చి హనుమంతరావుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హమిని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. 144సెక్షన్లు అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తగదని ఇప్పటికైన చంద్రబాబునాయుడు ముద్రగడ పద్మనాభంతో మాట్లాడి ఇచ్చిన హామిని నెరవేర్చాలన్నారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెనక్కి వెళ్ళేందుకు నిరాకరించడంతో వి.హనుమంతరావును రాజమహేంద్రవరంలోని హోటల్‌కు పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు. ప్రభుత్వ తీరు దారుణం : గిరజాల కాపులను బీసీల్లో చేర్చాలని శాంతియుతంగా చేపట్టనున్న పాదయాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు ) పేర్కొన్నారు. ధవళేశ్వరంలో పోలీసులు అడ్డుకున్న వి.హనుమంతరావును గిరజాల వీర్రాజు(బాబు) కలిశారు. పోలీసులతో ఉద్యమాన్ని అణగతొక్కాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందని గిరజాల వీర్రాజు(బాబు) విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు కాపులు తమ సత్తాను చూపుతారన్నారు. -
ఇంత నిర్లక్ష్యమా?
- చితికి నిప్పంటించకముందే వెళ్లిపోతారా? - మంత్రి, అధికారులపై వీహెచ్ మండిపాటు చండూరు/మునుగోడు: ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి అంత్యక్రియల్లో అధికార పార్టీ నాయకులు, అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ నేత వి.హనుమంత్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇడికుడలో పాల్వాయి పార్థివదేహానికి చితి అంటిం చక ముందే అధికారులు అందరు వెనుదిరగడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చితిని అంటించేందుకు కేవలం ఒక లీటర్ కిరో సిన్ మాత్రమే తేవడం ఏమిటని, స్థానిక తహసీ ల్దార్, సీఐలు ఎక్కడా ఉన్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు మృతిచెందితే ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తారా అని అక్కడ ఉన్న నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారిని నిలదీశారు. అంత్యక్రియలకు హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చితికి నిప్పంటించకముందే ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. -
మీ బ్రేస్‌లెట్‌ను ఇచ్చేయండి: రాహుల్‌గాంధీ
వీహెచ్ తో రాహుల్ సరదా సంభాషణ సంగారెడ్డి: 'జగ్గారెడ్డి గట్టోడు.. మొండోడు.. వన్‌మెన్ షో చేసిండు. కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చుపెట్టుకుని ఏర్పాట్లు చేసిండు..' అంటూ ఎంపీ వి. హనుమంతరావు ప్రజాగర్జన ఏర్పాట్ల గురించి వేదికపై రాహుల్ వద్ద పొగడ్తలు గుప్పించారు. దీంతో ' సభ ఏర్పాట్లకు మీరేం ఇచ్చారు' అని రాహుల్ ప్రశ్నించగా..' నా దగ్గరేముంది ఇచ్చేందుకు..' అని వీహెచ్ బదులిచ్చారు. దీంతో రాహుల్ సరదాగా ..' మీ చేతికి ఉన్న బంగారు బ్రేస్‌లెట్‌ను జగ్గారెడ్డికి ఇచ్చేయండి' అన్నారు. ఈ వ్యాఖ్యలతో జగ్గారెడ్డితో పాటు వీహెచ్, ఉత్తమ్ తదితరులు ఒక్కసారిగా నవ్వేశారు. -
‘అలా చేయడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవటమే’
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్) విమర్శించారు. ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా అధికారంలో ఉన్నవారికి గవర్నర్ భజన చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవడమేనని అన్నారు. ఫిరాయింపుదారులతో ప్రమాణస్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే అసహ్యం వస్తుందని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతుంటే ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని టీపీసీసీని కోరారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తానని వీహెచ్ తెలిపారు. కాగా శనివారం కూడా వీహెచ్ రాజ్‌భవన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'కేసీఆర్.. నీ కొడుకుకు నీతులు చెప్పు'
హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు, మంత్రులకు సీఎం కేసీఆర్ చెబుతున్న నీతులేవో తన కుమారుడు కేటీఆర్‌కు చెబితే బాగుంటుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) వ్యాఖ్యానించారు. మంత్రులు, ఇతర నేతలు అధికారాన్ని తలకెక్కించుకోవద్దని నీతులు చెబుతున్న కేసీఆర్.. దానిని ముందు ఆయన కుమారుడు కేటీఆర్ పాటించేలా చూడాలన్నారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం కుమారుడు, మంత్రి అయినంత మాత్రాన కేటీఆర్ ఏమైనా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడినంత మాత్రాన తనపై కేసులు పెడతారా అని, తాను చేసిన పాపమేమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను తరమికొట్టాలని చెప్పడం సబబు కాదన్నారు. బీసీలకు కొత్త కమిషన్ కోసం తాను 2005 నుంచి పోరాడుతున్నానని.. క్రిమీలేయర్ వల్లనే బీసీలు నష్టపోతున్నారని, దానిని తొలగిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్నిహితుడని, ఆయన చొరవ తీసుకుని క్రిమీలేయర్‌ను ఎత్తివేయించాలన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారితో వీహెచ్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడకుండా పోలీసులు తనను అడ్డుకోవడం, ఆ తర్వాత దారితీసిన పరిణామాల గురించి ఆయన వివరణన ఇచ్చారు. సీనియర్ నాయకుడిగా, మాజీ ఎంపీగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పీకర్ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం. -
నేను కూడా బాహుబలినే: వీహెచ్
హైదరాబాద్: ఎవరు ప్రజలను ఆకర్షిస్తారో వాళ్లే బాహుబలి అని కాంగ్రెస్‌లో చాలా మంది బాహుబలులు ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు వ్యాఖ్యానించారు. నేను కూడా బాహుబలినే అని తెలిపారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. 20 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల కంటే.. కేటీఆర్ ఎక్కువ ధీమాగా మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ మాటలు వేరని.. క్షేత్ర స్థాయిలో జనం సమస్యలు వేరుగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాగే నీటిలో డ్రైనేజి వాటర్ కలిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, అసెంబ్లీ సమావేశాల అనంతరం అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించాలని సూచించారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడికి లేఖ రాస్తానని విహేచ్ తెలిపారు. మోదీ ఉత్తరప్రదేశ్‌కి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు కేంద్రానికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. యూపీలో మాత్రమే రుణమాఫీ చేస్తే పోరాటం తప్పదన్నారు. -
'బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం'
హైదరాబాద్: బీసీలకు అన్యాయం చేసేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కంకణం కట్టుకున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఐఐఎం, ఐఐటీలల్లో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. 60 ఏళ్లు గడిచినా బీసీల రిజర్వేషన్స్ 27 శాతం దాటడం లేదన్నారు. బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ క్రిమిలేయర్ విషయం తేల్చకుండా.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని వెంకయ్య మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కూడా బీసీ ఓట్ల కోసం అప్పుడే రాజకీయాలు మెదలుపెట్టాడని మండిపడ్డారు. కాంగ్రెస్ కూడా మేలుకోవాలని, బీసీలు పార్టీ నుంచి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు. బీసీలను సమీకరించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీసీ రిజర్వేషన్స్ పై న్యాయం జరగదని, రిజర్వేషన్స్ రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ ఉద్దేశమన్నారు. ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ తో బీజేపీ సర్కార్ నడుస్తోందన్నారు. దామోదరం సంజీవయ్య జయంతిని కేసీఆర్ సర్కార్ విస్మరించిందన్నారు. ఒక్క మంత్రి గానీ, అధికారి కానీ సంజీవయ్య జయంతికి రాకపోవడం దారుణమన్నారు. దళితుడైన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని విస్మరించడం.. రాష్ట్రంలోని దళితులను అవమానించడమేనన్నారు. -
'కాపునేతకు బాబు భయపడుతున్నారు'
హైదరాబాద్: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) అన్నారు. ఇక్కడ విలేకరులతో వీహెచ్ మాట్లాడుతూ.. ఆంధ్రాలో ప్రభుత్వ పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తోందని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసనలు తెలియజేసే అవకాశం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ముద్రగడను ఒంటరి చేసి కాపు ఉద్యమాన్ని నీరుగార్చాలని ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వీహెచ్ వ్యాఖ్యానించారు. -
విచ్చలవిడిగా వైన్‌షాపులకు అనుమతి: వీహెచ్
హైదరాబాద్: మద్యం వల్ల యువత పక్కదారి పడుతోందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు(వీహెచ్) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి విచ్చలవిడిగా వైన్‌షాపులకు అనుమతులు ఇస్తోందని ఆరోపించారు. బిహార్‌లో మద్యపాన నిషేధానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ఇది అభినందనీయమన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా మద్య నిషేధం పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ అశం పై అన్ని పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని వీహెచ్ సూచించారు. -
నోట్ల రద్దుపై క్షేత్రస్థాయి పోరు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్లను రద్దు చేసి 50 రోజులు దాటినా పేదలకు కష్టాలు తీరలేదని, ప్రధాని మోదీ వైఫల్యంపై క్షేత్ర స్థాయిలో పోరాడతామని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో వచ్చిన దుష్ఫలి తాలను ప్రజలకు వివరించడానికి ఊరూరా యాత్ర చేయను న్నట్టు వీహెచ్ ప్రకటించారు. నోట్లరద్దుతో ఏదో సాధిస్తామన్న మోదీ చేసిందేమిటో స్పష్టం చేయాలన్నారు. గవర్నర్ తీరు ఆశ్చర్యకరం: గండ్ర పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి పోతున్నదని మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పేదల ఇబ్బందుల గురించి మాట్లాడకుండా సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గవర్నర్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని, నోట్లరద్దుపై మోదీకి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే, కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. -
'కేసీఆర్ పాలన నిజాం పాలనను మరిపిస్తోంది'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు (వీహెచ్) బుధవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా కాకుండా వాస్తు ప్రకారం జరుగుతోందని విమర్శించారు. కేటీఆర్ కోసం గద్వాల్, జనగామ, సిరిసిల్ల జిల్లాలను ఓకే చేశారని వీహెచ్ చెప్పారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను మరిపిస్తోందని వీహెచ్ ఎద్దేవా చేశారు. -
గవర్నర్‌ను రీకాల్ చేయాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఐని మాఫియా అని వ్యాఖ్యానించిన గవర్నర్ నరసింహన్‌ను రీకాల్ చేయాలని రాష్ట్రపతికి లేఖ రాసినట్టుగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యుడికి సమాచారం అందుబాటులోకి తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని మాఫియాగా అభివర్ణించిన నరసింహన్‌కు గవర్నర్ హోదాలో ఉండే అర్హత లేదన్నారు. ఆర్టీఐని అవమానించిన నరసింహన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బన్స ల్ కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకోవడం కేంద్రానికి సిగ్గుచేటన్నారు. సీబీఐ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాశారన్నారు. -
పార్టీని వీడిన నేతల గురించి ఆందోళన వద్దు: వీహెచ్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. పదవీ త్యాగాలకు సిద్ధపడొద్దని జానారెడ్డికి ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నేతల గురించి ఆవేదన చెందొద్దని చెప్పారు. సీఎల్పీ నేతగా జానారెడ్డి తప్పుకుంటే కాంగ్రెస్ కేడర్ స్థైర్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆపదలో ఉన్నందున జానారెడ్డి లీడర్ గా ముందు నిలిచి పార్టీని నిలబెట్టాలని సూచించారు. రెండేళ్ల పాలనలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్ వైఫల్యాలను గ్రామగ్రామాన ఎండగట్టేందుకు కాంగ్రెస్ కేడర్ సిద్ధపడాలని వీహెచ్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్ట కోసం సీఎల్పీ పదవి వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జానారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వీహెచ్ మీడియా సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
'చంద్రబాబు వ్యాఖ్యలు గాయపరిచాయి'
ఢిల్లీ: పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందర్నీ గాయపరిచాయని, దీనిపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారని చెప్పడం అమానుషమన్నారు. మన రాష్ట్ర గవర్నర్ తరచు దేవాలయాలకు వెళ్తున్నారు?, దానికి చంద్రబాబు ఏమి చెప్తారని ప్రశ్నించారు. అయ్యప్ప భక్తులను అవమానపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడరని వీహెచ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంప్రదాయాన్ని పాటించాలన్నారు. గతంలో కేశవరావుకు మద్దతిచ్చి రాజ్యసబ ఎన్నికల్లో గెలిపించామని, ఈసారి కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ మద్దతివ్వాలని వీహెచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి ఎన్నికల్లో రాజ్యసభ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఒకవేళ సోనియా అవకాశమిస్తే పోటీకి దిగుతానని వీహెచ్ తెలిపారు. -
జిల్లాల ప్రకటనతో నేతల మధ్య చిచ్చు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పా టు చేస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేతల మధ్య చిచ్చు పెడుతోందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్రకటనలు చేసి, తెలివిగా ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. పాలేరులో కాంగ్రెస్ ఓడిపోయినా 46 వేల ఓట్లు రావడం సంతోషకరమన్నారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరు మార్చాలంటూ లౌకికతత్వానికి భంగం కలిగేలా మాట్లాడిన కేంద్రమంత్రి వీకే సింగ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. దేశానికి నెహ్రూ కుటుంబం చేసిన సేవ, దేశం కోసం వారి కుటుంబం చేసిన త్యాగాన్ని దేశమంతటా ప్రచారం చేస్తానని తెలిపారు. నెహ్రూ కుటుంబాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి జరుగుతున్న కుట్రలను తిప్పికొడతామన్నారు. గతంలో క్రమశిక్షణ చర్యలకు గురైనా ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ఉన్న నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని కోరారు. -
కేసీఆర్ నీ కొడుకును అదుపులో పెట్టుకో: వీహెచ్
ఖమ్మం: 'నీ కొడుకును అదుపులో పెట్టుకో' అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) సూచించారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీహెచ్ విలేకర్లలో మాట్లాడుతూ.... కాంగ్రెస్‌ను బొంద పెడతాం, అడ్రస్ లేకుండా చేస్తామని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయే అని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే మంత్రి కేటీఆర్ లండన్‌కు పరిమితం అయ్యేవాడని ఎద్దేవా చేశారు. పాలేరులో ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే ఉందని వీహెచ్ చెప్పారు. -
'ఆ విషయం కేసీఆర్‌కూ తెలుసు'
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని రాజ్యసభ సభ్యుడు వీహెచ్ తెలిపారు. ఆ విషయం టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ తెలుసునని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలసి వీహెచ్... సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ...మూడు సార్లు రాజ్యసభకు పంపినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ త్యాగాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యామని ఆయన తెలిపారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని వీహెచ్ ఈ సందర్బంగా చెప్పారు. ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్నారు. -
'గవర్నర్ వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు'
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలి వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... గవర్నరు ప్రతీ రోజూ దేవాలయాలకు తిరగడం వల్ల రహదారిపై ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వ్యక్తిగత ఇష్టాలతో వీఐపీలు.... సామాన్యులకు ఆటంకం కలిగించడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీల కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణం చాలా ఆశ్చర్యకరంగా, సామాన్య ప్రజలు నవ్వుకునే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. పంతుళ్లు రాజకీయ పార్టీలకు అనుకూలంగా చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. పంచాంగ శ్రవణం అంటే వర్షాలు పడుతాయా, ప్రజలకు ఏడాది ఎలా ఉంటుందో, భవిష్యత్తులో జరిగే మంచిచెడుల గురించి చెప్పాలని వీహెచ్ సూచించారు. రాజకీయపార్టీల భవిష్యత్తు ఎక్కడైనా పంచాగంలో ఉంటుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురౌతున్న వరుస ఓటములకు కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్తులో పార్టీ పటిష్టత కోసం ఏం చేయాలనే దానిపై లోతుగా చర్చించుకోవాల్సిందేనని వీహెచ్ అభిప్రాయపడ్డారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షునికి, సీఎల్పీ నేతకు, పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్‌సింగ్‌కు లేఖలు రాసినా స్పందన లేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
రోహిత్ మరణంపై కేసీఆర్ స్పందించలేదు
హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీని సస్పెండ్ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి... సస్పెండ్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... వీహెచ్ బుధవారం ట్యాంక్‌బండ్ వద్ద గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. మౌన దీక్ష విరమించిన అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.... రోహిత్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై వీహెచ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ బడుగుల వ్యతిరేకి అని ఈ సందర్భంగా అర్థమైందని అన్నారు. రోహిత్ మరణానికి ఏబీవీపీ, బీజేపీలే కారణమని వీహెచ్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జోక్యం వల్లే హెచ్‌సీయూ విద్యార్థులు సస్పెండ్ అయ్యారని విమర్శించారు. రోహిత్ కులంపై చర్చ అనవసరం అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. బీఫ్ తినడంపై రాజకీయాలు చేస్తున్నాయని ఎంఐఎం, బీజేపీలపై వీహెచ్ నిప్పులు చెరిగారు. -
ట్యాంక్‌బండ్ వద్ద వీహెచ్ మౌన దీక్ష
హైదరాబాద్ : హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ సమీపంలోని భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్ష చేపట్టారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని... అలాగే హెచ్‌సీయూలో సస్పెండ్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా హెచ్‌సీయూలో బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అందులోభాగంగా యూనివర్సిటీలోని అన్ని విభాగాలను విద్యార్థి సంఘాలు మూసివేయిస్తున్నాయి. -
కాంగ్రెస్ పథకాలకు టీఆర్ఎస్ లేబుల్స్
♦ మీట్ ది ప్రెస్‌లో వీహెచ్ ♦ రాష్ట్రంలో మంత్రులకేదీ విలువ ♦ సీఎం కేసీఆరా, కేటీఆరా? ♦ టీఆర్ఎస్కు అభ్యర్థులు ♦ కరువై అరువు తెచ్చుకుంది సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెచ్చిన పథకాలకు, చేసిన అభివృద్ధికి టీఆర్ఎస్ లేబుల్స్ వేసుకుని ప్రచారం చేసుకుంటోందని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పునాదులు వేసిందన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ జర్నలిస్టు యూనియన్ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో నలుగురు మంత్రులున్నా కేటీఆర్ పెత్తనం చెలాయిస్తున్నారని, మంత్రులకు విలువ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరా, కేటీఆరా అని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నదని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆనాడు ప్రతిపక్షనేతతో సహా కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు వ్యతిరేకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా, సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్ల ఓట్లు చాలా కీలకమని, అందుకే టీఆర్ఎస్ కూడా మరోసారి మోసం చేయడానికి కల్లబొల్లి మాటలను చెబుతోందని విమర్శించారు. లంకలో పుట్టినవారంతా రాక్షసులేనని, సెటిలర్లు ద్రోహులని ఆంధ్ర వారి గౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షపాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్షపాత్రలో పీజేఆర్, జానారెడ్డిని పోల్చిచూడలేమన్నారు. ఎవరిశైలిలో వారు వ్యవహరిస్తారని, ఒకరితో మరొకరిని పోల్చిచూడకూడదన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుందని, వ్యూహాత్మకంగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా మేయర్ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువైనారని ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువగా కాంగ్రెస్ నేతలే ఉన్నారని వీహెచ్ చెప్పారు. టీఆర్ఎస్కు అభ్యర్థులు లేక కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి నేతలను అరువు తెచ్చుకుంటోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి ఫెడరేషన్ అధ్యక్షుడు సోమయ్య అధ్యక్షత వహించగా, బసవపున్నయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. -
స్మృతి ఇరానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
-
వీహెచ్ ఇక ఇంటికే... కాంగ్రెస్‌కు నిరాశ
(సాక్షి వెబ్ ప్రత్యేకం) త్వరలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ దశాబ్దన్నర కాలంపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు త్వరలోనే పదవికి దూరం కానున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం పోటీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులకు తీవ్ర నిరాశ ఎదురుకానుంది. కాంగ్రెస్ కు నిరాశే రెండు రాష్ట్రాల్లో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న రాజ్యసభ సభ్యుల్లో ప్రధానంగా కాంగ్రెస్ సభ్యులకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అవకాశాలు కనిపించడం లేదు. ఏపీ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రాతినిథ్యం లేదు. దాంతో జైరాం రమేష్, జేడీ శీలంలకు ఈ రాష్ట్రం నుంచి తిరిగి ఎన్నిక కావడానికి అసలు అవకాశం లేదు. ఇక తెలంగాణ అసెంబ్లీలో కూడా తగిన బలం లేని కారణంగా ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశాలు లేకపోవడంతో వీహెచ్ కూడా ఈసారి పదవికి దూరం కావలసిందే. తెలంగాణ నుంచి వీహెచ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న జైరాం రమేష్, జేడీ శీలం పదవీ కాలం వచ్చే జూన్ నెలాఖరుతో ముగుస్తోంది. వీహెచ్ తో పాటు టీడీపీ నుంచి ఎన్నికై ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ వైపు మొగ్గిన గుండు సుధారాణి పదవీ కాలం కూడా పూర్తవుతోంది. ముచ్చటగా మూడోసారి రాజ్యసభకు అవకాశం లభించిన వీహెచ్ వచ్చే జూన్ 21 తో తన పదవీ కాలం పూర్తవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అది కూడా కాంగ్రెస్ పార్టీలో మూడోసారి రాజ్యసభ అవకాశం దక్కిన అతికొద్ది మందిలో వీహెచ్ ఒకరు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో మూడోసారి రాజ్యసభకు అవకాశం కల్పించదు. సోనియాగాంధీ కుటుంబానికి వీరభక్తుడిగా వీహెచ్ మూడోసారి చిక్కించుకున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం లేదు. తొలిసారి 1992-1998 వరకు, రెండోసారి 2004 - 2010, ప్రస్తుతం మూడోసారి 2010-2016 రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ శాసనసభలో రాజ్యసభ స్థానం గెలుచుకునేంత బలం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ సభలోని మిగిలిన అన్ని పక్షాల మద్దతుతో పోటీ చేయాలన్నా కాంగ్రెస్ వీహెచ్ కు మరో అవకాశం కల్పించడానికి కూడా సిద్ధంగా లేదని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మార్చిలో ఎన్నికలు... ఈ రెండు స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి ఆఖరులోగానీ మార్చి మొదటి వారంలోగానీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగ్గా విభజనానంతరం ప్రస్తుత రాజ్యసభ్యులను ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. ఆ లెక్కన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది, తెలంగాణ నుంచి 7 మంది సభ్యులు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులు, వారి పదవీ కాలం వివరాలు ఆంధ్రప్రదేశ్ లో ...సభ్యులు పదవీ కాలం సుజనా చౌదరి (టీడీపీ) 21 జూన్ 2016 నిర్మలా సీతారామన్ (బీజేపీ) 21 జూన్ 2016 జైరాం రమేష్ (కాంగ్రెస్) 21 జూన్ 2016 జేడీ శీలం (కాంగ్రెస్) 21 జూన్ 2016 కొణిదెల చిరంజీవి (కాంగ్రెస్) 04 ఆగస్ట్ 2018 రేణుకా చౌదరి (కాంగ్రెస్) 02 ఏప్రిల్ 2018 టి.దేవేందర్ గౌడ్ (టీడీపీ) 02 ఏప్రిల్ 2018 ఎం ఏ ఖాన్ (కాంగ్రెస్) 09 ఏప్రిల్ 2020 కె కేశవరావు (టీఆర్ ఎస్) 09 ఏప్రిల్ 2020 టి. సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్) 09 ఏప్రిల్ 2020 తోట సీతారామలక్ష్మి (టీడీపీ) 09 ఏప్రిల్ 2020 తెలంగాణలో... వీ.హనుమంతరావు (కాంగ్రెస్) 21 జూన్ 2016 గుండు సుధారాణి (టీడీపీ - టీఆర్ ఎస్ చేరారు) 21 జూన్ 2016 సీఎం రమేష్ (టీడీపీ) 02 ఏప్రిల్ 2018 రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్) 02 ఏప్రిల్ 2018 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) 02 ఏప్రిల్ 2018 గరికపాటి మోహన్ రావు (టీడీపీ) 09 ఏప్రిల్ 2020 కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) 09 ఏప్రిల్ 2020 -
వీహెచ్‌కు ఫోన్లో మహిళ బెదిరింపులు
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావుకు ఢిల్లీ నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన శనివారం పోలీసుల్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరచొద్దంటూ సంజనా చౌదరి అనే మహిళ ఫోన్లో బెదిరించినట్లు, ఇందిరాగాంధీను చంపించిన సోనియాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ ఆమె ఫోన్లో నిలదీసినట్లు ...వీహెచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీకి ఆయన ఫిర్యాదు చేయడటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'టీడీపీ పని అయిపోయింది'
హైదరాబాద్: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పని అయిపోయిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కలుపుకుని పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని సెటిలర్స్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వీహెచ్ తెలిపారు. -
'బరువు పెరిగి టీఆర్ఎస్ మునుగుతుంది'
హైదరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని నేతలు పార్టీ మారడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి చెందిన నేతల ఫిరాయింపులు, తదితర అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ పెద్దలు సొంత క్యాడర్‌నే తయారుచేసుకోవాలని వీహెచ్ సూచించారు. కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంటే బరువు పెరిగి టీఆర్ఎస్ మునుగుతుందని వ్యాఖ్యానించారు. పార్టీని వీడొద్దని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క పిలుపునివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూచించారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారని, అటువంటి వ్యక్తి పార్టీ మారుతాననడం సరికాదని వీహెచ్ హితవు పలికారు. -
దేశవ్యాప్తంగా పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలను భారతరత్న బి.ఆర్. అంబేద్కర్ అమలు చేశారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) తెలిపారు. అయితే అంబేద్కర్‌కి ఇస్తున్న గౌరవం పూలేకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ... పూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రతిరాష్ట్రంలో పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీహెచ్ విజ్ఞప్తి చేశారు. -
రేవంత్‌కు గవర్నర్ ప్రశంసలా?
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విరుచుకుపడ్డారు. తన పాలనలో అవినీతి లేదన్న గవర్నర్...సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గవర్నర్ ఎందుకు స్పందించడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డికు గవర్నర్ ప్రశంసలా అని వీహెచ్ ఎద్దేవా చేశారు. కాగా రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ ప్రతినిధులతో కలిసి సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రేవంత్ ధైర్యవంతుడంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో తన కుర్చీలాగిన ఘటనను గుర్తు చేస్తూ గవర్నర్ ఈ మాటలు అన్నారు. దీనిపై టీడీపీ నాయకులు గవర్నర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా. రేవంత్ గురించి నాకు బాగా తెలుసంటూ గవర్నర్ వారించారు. -
సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ
సంగారెడ్డి (మెదక్): మెదక్ జిల్లా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సోమవారం భారీర్యాలీ నిర్వహించింది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పీసీసీ కార్యదర్శి కుసమకుమార్, ఇతర కార్యకర్తలు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
పటేల్ ఉద్యమం ఆర్ఎస్ఎస్ కుట్ర : వీహెచ్
హైదరాబాద్: గుజరాత్లో జరుగుతున్న పటేల్ ఉద్యమం ఆర్ఎస్ఎస్ కుట్ర అని రాజ్యసభసభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తోందన్నారు. గుజరాత్లో సంపన్నమైన పటేల్ కులాన్ని బీసీల్లో కలిపితే అంగీకరించబోమని తెలిపారు. ఇలాంటి కుట్రలతో దేశవ్యాప్తంగా అశాంతిని సృష్టించే ఆర్ఎస్ఎస్ కుట్రలను మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని వీహెచ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. -
భయంతోనే కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై నిర్ణయం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సభ పెడితే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడ్డారని ఆ పార్టీ ఎంపీ వీహెచ్ ఆరోపించారు. అందుకే ఉద్యోగ భర్తీపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆదివారం గాంధీభవన్‌లో వీహెచ్ మాట్లాడుతూ... ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చాలని కేసీఆర్‌ను వీహెచ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను నమ్మి నిరుద్యోగ యువత టీఆర్ఎస్కు అధికారం ఇచ్చిందన్నారు. నిరుద్యోగ విద్యార్థులకు చేసే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వీహెచ్ భరోసా ఇచ్చారు. -
పుష్కర ఏర్పాట్లలో రెండు రాష్ట్రాలు విఫలం: విహెచ్
-
బాబు వల్లే పుష్కర మరణాలు
హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ సమ్మెతో నగరం దుర్గంధమవుతున్నా ఎంఐఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పుష్కర ఏర్పాట్లలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రు విఫలమయ్యారని విమర్శించారు. రాజమండ్రి పుష్కర మరణాలకు చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టినంత మాత్రానా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌కు రూ.5 కోట్లతో బస్సు ఎందుకు?
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ...జిల్లాల్లో పర్యటన కోసం 'తెలంగాణ హరిత పథం' పేరుతో రూ.5 కోట్లతో బస్సును కొనుగోలు చేయటాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తప్పుబట్టారు. కేసీఆర్‌కు రూ.5 కోట్లతో బస్సు ఎందుకు...అదే రూ.5 కోట్లను పేదల కోసం ఖర్చు చేయొచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. ఐదు కోట్లతో బస్సును కొనడం ప్రజా దుర్వినియోగమే అని వీహెచ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు ఎవరి నుంచి ప్రాణహాని లేదని, అలాంటప్పుడు అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అని ఆయన విమర్శించారు. వీహెచ్ ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సీనియర్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో పాటు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను ఆయన ఈ సందర్భంగా సోనియాకు వివరించారు. సోనియాతో సమావేశం అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ 'డీఎస్ పచ్చి అవకాశ వాది, ఆయన కాంగ్రెస్‌ను వీడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్‌లో అన్ని పదవులు అనుభవించిన డీఎస్...ఇప్పుడు టీఆర్ఎస్ నేతల అవకాశాలు కొల్లగొట్టేందుకు వెళ్తున్నారన్నారు. -
సోనియాతో వీహెచ్ భేటీ, తాజా పరిస్థితులపై వివరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా పీసీసీ మాజీ చీఫ్ డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అంశంతో పాటు, తాజా పరిస్థితులపై వివరిస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ నయవంచకుడని, కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని, తనకు అన్యాయం చేశారని డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని.. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ఎస్లో చేరతానని ఆయన చెప్పారు. గురువారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. -
కార్యకర్తల సమావేశంలో వీహెచ్‌కు చుక్కెదురు
-
హైదరాబాద్ చుట్టుపక్కల భూములు చూపిస్తాం: వీహెచ్
కరీంనగర్: పేదల ఇళ్ల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. భవిష్యత్ విద్యావసరాల కోసం అవి అవసరమన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఎకరాల భూములు ఉన్నాయని... వాటిని తీసుకోవాలని తెలంగాణ సర్కారుకు సూచించారు. కావాలంటే ఆ భూములను తాము చూపిస్తామన్నారు. వీహెచ్ బుధవారం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి తెలంగాణ అభివృద్ధికి పాటు పడాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. తెలంగాణ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందన్నారు. ఇటీవల తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించదన్నారు. ఇదే విధంగా ప్రజల మద్దతుతో సర్కారు వ్యతిరేక విధానాలను ఎండగడతామని చెప్పారు. -
నరేంద్ర మోదీ దమ్మున్న నేతే అయితే...
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ దమ్మున్న నేతే అయితే అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ను శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధానితో చర్చించడం కాదు... పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్న అండర్ వరల్డ్ డాన్‌ను భారత్‌కు రప్పించాలని మోదీకి సవాల్ విసిరారు. ఆదివారం హైదరాబాద్‌లో వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ.... నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజలందరికి పంచుతానని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీకి వీహెచ్ సూచించారు. -
వంశీ నా చెవిలో దూషించాడు...
హైదరాబాద్ : కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వివాదం మరింత ముదురుతోంది. వీరిద్దరి మధ్య జరిగిన పంచాయితీ ...పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లింది. నిన్న మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వంశీచంద్-విష్ణు నిన్న షుర్షణ పడిన విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరూ హైకమాండ్‌కు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విష్ణు మాట్లాడుతూ వంశీచంద్ తన దగ్గరకు వచ్చి చెవిలో దూషించాడని అన్నారు. మరోవైపు ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఈరోజు మధ్యాహ్నం వంశీచంద్ రెడ్డి నివాసానికి వెళ్లారు. గొడవలు పడవద్దంటూ హితవు పలికారు. అనంతరం వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ తాను విష్ణును దూషించలేదని...దాడి చేసిందే కాకుండా...మళ్లీ తనపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేసింది సీసీ కెమెరా పుటేజ్‌లో తెలుస్తుందన్నారు. -
వంశీ, విష్ణుల మధ్య జరిగింది చిన్న కొట్లాటే!
హైదరాబాద్ : కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య జరిగింది చిన్న కొట్లాట మాత్రమేనని ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఉద్రేకంలో జరిగిన గొడవను ఇద్దరూ మర్చిపోయి పార్టీ కోసం పనిచేయాలని ఆయన శనివారమిక్కడ సూచించారు. బీజేపీ వరుసగా హిందుత్వ అంశాలను చేపడతూ ప్రజలను రెచ్చగొడుతోందని వీహెచ్ ఆరోపించారు. ముస్లింలను హిందువులుగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ అజెండానా? అని ఆయన ప్రశ్నించారు. హిందూ దేశంగా మార్చాలని బీజేపీ ఆలోచిస్తోందని... బీజేపీకి అధికారం ఇచ్చింది అందుకేనా? అంటూ వీహెచ్ మండిపడ్డారు. -
ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే...
శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును తొలగించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైల్ రోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై చర్చించేందుకు వీహెచ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడారు. ఎంఐఎంకు ఎప్పుడో తలాక్ చెప్పేశామని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీతో ఎటువంటి అవగాహన ఉండదని వీహెచ్ స్పష్టం చేశారు. ఒక నేతకు రెండు పదవులు ఇవ్వద్దని పార్టీ అధిష్టానానికి సూచిస్తామని వీహెచ్ వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలిగింపునకు చేపట్టాల్సిన కార్యచరణ కోసం చేపట్టిన ఈ భేటీలో సీనియరు నేతల నుంచి స్పందన కరువైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, జానారెడ్డి, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్‌లు మాత్రమే హాజరయ్యారు. -
ఎన్టీఆర్ పేరు మార్చే ప్రసక్తే లేదు: జైట్లీ
న్యూఢిల్లీ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. దేశీయ టెర్మినల్ పేరు మార్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరే ఉంటుందని, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరే కొనసాగుతుందని ఆయన బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాజీవ్, ఎన్టీఆర్ ఇద్దరూ గౌరవప్రదమైన నేతలేనని అన్నారు. కాగా దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పేరు మార్చడాన్ని తప్పుబట్టిన వారు... రాజీవ్ పేరు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై జైట్లీ పైవిధంగా స్పందించారు. -
సీనియర్లకు 'సభ్యత్వ నమోదు' అప్పగించాలి: వీహెచ్
సికింద్రాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) ఆదివారం హైదరాబాద్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని సీనియర్లకు కూడా ఈ పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యత అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పార్టీ సమావేశాలకు దూరంగా ఉండటం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సీనియర్లంతా పాల్గొనాలని వీహెచ్ సూచించారు. ఆదివారం సికింద్రాబాద్ లోని ఇంపీరియర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి భారీగా నాయకులు తరలివచ్చారు. -
దేశాన్ని కాదు... మీ కేబినెట్‌ను క్లీన్ చేయాలి: వీహెచ్
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీసిపారేశారు. స్వచ్ఛ భారత్ స్లోగన్ కొత్తదేమీ కాదని, గాంధీ నుంచి నెహ్రు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు చేసిన కార్యక్రమమేనని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ ముందుగా తన కేబినెట్‌ను క్లీన్ చేసుకోవాలని, దేశాన్ని దోచుకున్నవారంతా మోదీ కేబినెట్లోనే ఉన్నారన్నారు. స్వచ్ఛ్ భారత్ పేరుతో కొద్దిసేపు సెలబ్రిటీలు ఫోటోలకు ఫోజులిచ్చిన తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. నిరంతరం శ్రమించే కార్మికులను ఆదుకోవాలని వీహెచ్ అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో క్రిమినల్స్, అవినీతిపరులకు అవకాశం ఎలా కల్పించారని వీహెచ్ ప్రశ్నించారు. దేశంలోనే కాదని, ఇతర దేశాల్లోనూ బ్యాంకులకు వందలకోట్లు ఎగవేసిన సుజనా చౌదరికి చంద్రబాబు ఏవిధంగా రికమెండ్ చేశారని ...అందుకు మోదీ ఎలా ఆమోదించారన్నారు. వెనకబడిన వర్గాలకు చెందిన దేవేందర్ గౌడ్, గుండు సుధారాణికి అవకాశం ఇస్తే బాగుండేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. సెటిలర్లు కూడా తెలంగాణలో టీడీపీ ఉండదని డిసైడయ్యారని ఆయన అన్నారు. -
సమాచారమే ఇచ్చారు...ఆహ్వానించలేదు: వీహెచ్
హైదరాబాద్ : టీసీఎల్పీ సమావేశం ఉందని తనకు సమాచారం మాత్రమే ఇచ్చారని, అయితే సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించలేదని రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ వీ హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే కాంగ్రెస్ కేడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. వలసలను కట్టడి చేయటం...పార్టీని బలోపేతం చేయడంపై ప్రస్తుత, మాజీ ఎంపీలను ఈనెల 9వ తేదీన ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్లు వీహెచ్ తెలిపారు. కాగా ఈనెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీసీఎల్పీ భేటీ అయిన విషయం తెలిసిందే. -
నిరసనలకు లిమిటెడ్ కంపెనీయే వెళుతోంది
హైదరాబాద్ : సొంత పార్టీ నేతల వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తనను పిలవటం లేదని ఆయన అన్నారు. కొంతమంది నేతలే లిమిటెడ్‌గా ఏర్పడి నిరసన కార్యక్రమాలకు వెళుతున్నారని వీహెచ్ శుక్రవారమిక్కడ ఆరోపించారు. ఆ కార్యక్రమాలకు లిమిటెడ్ కంపెనీ వాళ్లే వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నిరసన కార్యక్రమాలకు భట్టి విక్రమార్క వంటి నేతలనే పిలవటం లేదన్నారు. తాను కూడా రమ్మని పిలిస్తే పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి పాల్గొంటున్న నిరసన కార్యక్రమాలకు హాజరయ్యేవాడినని వీహెచ్ అన్నారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ ప్రచారానికే పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. -
'విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉంది'
విశాఖతో హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితుల సహాయార్ధం కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తన నెలరోజుల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావును కలిసి చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ తనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఈనెల 18న తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. -
ముజాహిద్దీన్, అల్‌ఖైదా ప్రసంగాలను కూడా...
హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసరాన్ని దురదర్శన్ ప్రసారం చేయటాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోహన్ భగవత్ ప్రసంగాన్ని డీడీలో ఎలా ప్రసారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాన్ని సమాచార శాఖమంత్రి సమర్థించటం సరికాదని వీహెచ్ అన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్, అల్‌ఖైదా నేతల ప్రసంగాలను కూడా డీడీలో ప్రసారం చేయాలంటే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకుంటున్నారా లేక విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా అని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న మత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా మోడీ సర్కార్ వ్యవహరించటం సరికాదని ఆయన అన్నారు. -
కెసిఆర్‌పై మండిపడ్డ వి.హనుమంతరావు
-
టిక్కెట్లు ఇవ్వకపోతే 2019లోనూ నష్టపోతాం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇవ్వకపోతే 2019 ఎన్నికల్లో కూడా నష్టపోతుందని రాజ్యసభ సభ్యుడు, ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఆ వర్గాలు కాంగ్రెస్‌ను నమ్మరని ఆయన సోమవారమిక్కడ అన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్ అంశంపై కాంగ్రెస్ పోరాడాలని వీహెచ్ కోరారు. రంగారెడ్డివ జిల్లా ఇబ్రహింపట్నంలో ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ రెండో రోజు కొనసాగుతోంది. ఈ సమావేశానికి దిగ్విజయ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. పది అంశాలపూ గ్రూప్‌ల వారీగా చర్చ జరుపుతున్నారు. నేతలు సభలో నివేదికలు సమర్పించనున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు తొలిరోజు రగడ జరిగిన విషయం తెలిసిందే. సీనియర్ల వల్లే పార్టీ ఎన్నికల్లో ఓడిందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎందుకు ఓడిపోయారంటే తలదించుకుంటున్నాం
హైదరాబాద్ : కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు వీ హనమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎందుకు ఓడిపోయిరని ఢిల్లీలో అడుగుతుంటే తలదించుకుంటున్నామని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఢిల్లీలో కూర్చుని నాయకుడిని ఎంపిక చేస్తే కుదరదని వీహెచ్ అన్నారు. కొత్త పీపీసీ అధ్యక్షుడిని హైకమాండ్ ఎంపిక చేయకుండా...నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక చేయాలన్నారు. ఇందుకోసం హైకమాండ్ పెద్దలు హైదరాబాద్ వచ్చి సమీక్షలు నిర్వహించాలని వీహెచ్ సూచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి?, వైఫల్యం ఎవరిదనేది తేలాల్సి ఉందన్నారు. అయిదేళ్లలో పార్టీని బతికుంచకుంటే, తెలంగాణ మరో తమిళనాడు అవుతుందని వీహెచ్ అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆంధ్రా నాయకత్వ జోక్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతుందని, అలా అయితే కార్యకర్తలు తిరగబడటం ఖాయమన్నారు. టీఆర్ఎస్ను థీటుగా ఎదుర్కొనే నాయకుడు కావాలని వీహెచ్ అన్నారు. పొన్నాలను తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. -
'ఆర్.కృష్ణయ్య దారి తప్పారు'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీసీ నినాదం మోసపూరితమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి వీహెచ్ ఆరోపించారు. శనివారం వీహెచ్ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం అంటున్న చంద్రబాబు అదే నినాదాన్ని సీమాంధ్రలో ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. సీమాంధ్రలోని బీసీలు టీడీపీకి మద్దతు పలికినా వారికి సీట్లు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దాంతో బీసీలపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటితో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు మాటలతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దారి తప్పారని వీహెచ్ అన్నారు. ఆ విషయాన్ని గ్రహించాలని ఆర్.కృష్ణయ్యకు వీహెచ్ హితవు పలికారు. టీడీపీలో బీసీలకు చంద్రబాబు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వరని ఆయన గుర్తు చేశారు. గత అనుభవాలే అందుకు నిదర్శనమని వీహెచ్ ఆరోపించారు. డబ్బు, పదవులు ఎర వేసి చంద్రబాబు బీసీ నేతలను వాడుకుంటున్నారని విమర్శించారు. -
బీజేపీ నేతపై చేయి చేసుకున్న వీహెచ్
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావుపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అంబర్ పేటలో బీజేపీ నేత క్షీర సాగర్‌పై ఆయన చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కాటేదాన్ పద్మ థియేటర్ వద్ద ఎంఐఎం-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు. -
'జూ.ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే..'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వెనక చంద్రబాబు ఉన్నాడని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే...పవన్ కల్యాణ్‌ను బాబు తెరమీదకు తెచ్చాడని వీహెచ్ అన్నారు. గబ్బర్ సింగ్ పాపులారిటీని చంద్రబాబు వాడుకోవాలని చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం చంద్రబాబు డ్రామాలడాతున్నాడని వీహెచ్ విమర్శించారు. బీసీ నేతలకు న్యాయం చేస్తే ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు ఇతర పార్టీలలోకి ఎందుకు వెళతారని ప్రశ్నించారు. పవన్ సినిమా డైలాంగులతో కాంగ్రెస్ భూస్థాపితం అవదని వీహెచ్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌లోనే బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని వీహెచ్ అన్నారు. తెలంగాణలో బీసీలను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పేర్కొన్నారు. -
గవర్నర్‌ను కలిసి అభినందించా: వీహెచ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సంతకాల పైళ్లను సమీక్షిస్తామన్నందుకు గవర్నర్ నరసింహన్‌కు కలిసి అభినందించినట్లు రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన గవర్నర్‌కు కలిశారు. అనంతరం వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడే బీసీల జపం చేస్తారని విమర్శించారు. సీమాంధ్ర టీడీపీ అధ్యక్ష పదవిని చంద్రబాబు బీసీలకు కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దంటూ ఆయన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. టీఆర్ఎస్ లక్ష్యం తెలంగాణయే అన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీలను పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని వీహెచ్ ప్రశ్నించారు. -
పాలిటిక్స్ లోనూ లవర్స్....అంటున్న వీహెచ్
వాలంటెన్స్ సందర్భంగా ..... పాలిటిక్స్ లో కూడా లవర్స్ ఉన్నారంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. అదేదో మీరూ చూడండి. -
'సీఎం తమ్ముడు టిక్కెట్లు అమ్ముకున్నాడు'
నిజామాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు మరోసారి ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం తమ్ముడు తిరుమలలో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కిరణ్ సోదరుడు, అతని తనయుడికి ఏ హోదాలో వెంకన్న ప్రత్యేక దర్శనం కల్పించారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తామని ఆయన తెలిపారు. పనిలో పనిగా వీహెచ్ ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై మండిపడ్డారు. తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేయటాన్ని ఆయన ఖండించారు. ఎవరు ఆపినా తెలంగాణ ఆగదని హనుమంతరావు అన్నారు. -
భవిష్యత్తులో బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని భవిష్యత్తులో ఏదో ఓ రోజు వెనకబడిన కులస్థులు(బీసీ)లకు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) జోస్యం చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తున్న దశలో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు పదేపదే డిమాండ్ చేయడం సరికాదని ఆయన వాఖ్యానించారు. తమకు హైదరాబాద్, భద్రచలంతో కూడిన తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాని రాయల్ తెలంగాణను తాము ఎప్పటికి ఒప్పుకోనే ప్రసక్తి లేదని వీహెచ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది... ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజన అడ్డుకుంటామని ఆ క్రమంలో అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను వీహెచ్ ఈ సందర్బంగా ఖండించారు. అశోక్ బాబు చేసిన వ్యాఖ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలను ఈ సందర్బంగా వీహెచ్ ప్రశ్నించారు. -
తెలంగాణలోని 15 ఎంపీ స్థానాలు సాధిస్తాం: వీహెచ్
తమ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎవరికైన కఠిన శిక్షలు తప్పవని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం ఆయన చెన్నైలో మాట్లాడుతూ... సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన కొన్ని పార్టీలు యూ టర్న్ తీసుకుంటున్నాయని వీహెచ్ ఆరోపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం దూసుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో తాను సమైక్యవాదినని సీఎం ప్రకటించడం పట్ల వీహెచ్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కిరణ్ ధిక్కరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం కిరణ్‌పై చర్యలు తీసుకుంటుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. -
వీహెచ్‌పై కేసు నమోదు చేయాలి: చెవిరెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతకు భంగం వాటిల్లేలా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రవర్తించారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. ఆయనపై టీటీడీ నిబంధన ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెవిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తిరుమలలో ఎలాంటి రాజకీయ ప్రస్థావన తీసుకురాకూడదనే నిబంధన ఉందని చెవిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు శనివారం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. దైవ దర్శనం అనంతరం ఆయన తిరుమలలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దీంతో ఆగ్రహాం చెందిన సమైక్యవాదులు ఆలిపిరి వద్ద వి.హనుమంతరావు వాహనాన్ని అడ్డుకుని, పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి సమైక్యవాదుల ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అ క్రమంలో పోలీసులకు, సమైక్యవాదుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ లాఠీచార్జీ చేయడంతో సమైక్యవాదులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రుక్తులైన సమైక్యవాదులు ఆదివారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
వీహెచ్ పై దాడిని ఖండించిన శైలజానాథ్
తిరమలలో దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు కారుపై సమైక్యవాదుల దాడిని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ శనివారం హైదరాబాద్‌లో ఖండించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రజలే నాయకులని ఆయన స్ఫష్టం చేశారు. సీమాంధ్రలో పార్టీలకతీతంగా ఉద్యమం జరుగుతుందన్నారు. అయితే ఆ ఉద్యమాన్ని బలోపేతం చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో నూతన పార్టీ ఏర్పాటు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు న్యూఢిల్లీల్లోని అధిష్టానానికి విధేయులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారి ఇలా ఉంటారని శైలజానాథ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. -
దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు: హరీష్
హైదరాబాద్ : అలిపిరిలో కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు వాహనంపై సమైక్యవాదులు చెప్పులు, రాళ్లు విసరటాన్ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. తెలంగాణ వాదులపై దాడి చేస్తే ఎలా కలిసి ఉంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. రాళ్లు, చెప్పులు విసరటం సమైక్యవాదమా అని ఆయన అన్నారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులకు ఉద్యోగ సంఘాలు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓపికకు కూడా సహనం ఉంటుందని, దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవాద్దని హరీష్ రావు హెచ్చరించారు. -
వీహెచ్‌ను అడ్డుకోవడం దారుణం: శంకర్రావు
తెలంగాణ ప్రత్యేక బిల్లు కోసం అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పి.శంకర్రావు శనివారం హైదరాబాద్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమాన్ని వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారో తెలాలని ఆయన స్ఫష్టం చేశారు. అయితే తిరుమలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావును అడ్డుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తెలంగాణ నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని పి.శంకర్రావు ఈ సందర్భంగా సూచించారు.