సాక్షి,హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశాన్ని21వసెంచరీలోకి తీసుకుపోవడానికి కృషి చేసిన వ్యక్తని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కొనియాడారు. అలాంటి నేత విగ్రహాన్నికూలగొడతామని బీఆర్‌ఎస్ నేతలు అనడం సరికాదన్నారు.య గాంధీభవన్‌లో మంగళవారం(సెప్టెంబర్16) వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అది బీఆర్‌ఎస్‌కు పెద్ద నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.
‘దేశం కోసం ప్రాణాలు అర్పించినిన ఫ్యామిలీ గాంధీలది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. విగ్రహాలు కూలుస్తాం లాంటి మాటల వల్ల బీఆర్‌ఎస్ ప్రతిష్ట తగ్గిపోతుంది. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే సచివాలయంలోనే పెట్టాలి. విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెప్తారు. అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్‌ఎస్ నేతలు మానుకోవాలి’అని వీహెచ్ హితవు పలికారు.
ఇదీ చదవండి.. టచ్ చేసి చూడు.. పొన్నం సవాల్
Comments
Please login to add a commentAdd a comment