సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆవిష్కరించటంపై సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ పప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్‌రెడ్డి తెలంగాణతల్లి ఆత్మను తాకట్టుపెట్టాడని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధేనని హెచ్చరించారు.
ఇదీ చదవండి.. రాజీవ్ విగ్రహాన్ని టచ్‌చేస్తే బీఆర్‌ఎస్‌కే నష్టం: వీహెచ్
Comments
Please login to add a commentAdd a comment